This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your ovulation on mylo app

మేధో వైకల్యం : దీనికి అర్థమేమిటి? కారణాలు & చికిత్సల గురించి తెలుసుకోండి.

Brain Development
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మేధో వైకల్యం : దీనికి అర్థమేమిటి? కారణాలు & చికిత్సల గురించి తెలుసుకోండి.
Read time5 min

ఒక వ్యక్తి తన సంభాషణ, సామాజిక, స్వీయ-సంరక్షణ నైపుణ్యాల వంటి అభిజ్ఞా పనితీరులో నిర్దిష్ట పరిమితులను కలిగి ఉంటే, వారికి మేధో వైకల్యం (ఐడి) ఉందని చెప్పవచ్చు. మేధో వైకల్యం అనేది రోజువారీ కార్యకలాపాలు, ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తుంది. మేధో వైకల్యాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు:

1. మేధో పనితీరు:- ఈ పరిస్థితిలో, నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం, ఇంకా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలను ఎదుర్కుంటారు.

2. అనుకూల పనితీరు:- ఈ పరిస్థితిలో, వ్యక్తులతో సంభాషించగల సామర్థ్యం, వ్యక్తిగత సంరక్షణను నిర్వహించడం, స్నేహం చేయడం, నియమాలను అనుసరించడం లేదా నిత్యజీవితంలో పనులను పూర్తి చేయడంలో సమస్యలను ఎదుర్కుంటారు.

మేధో వైకల్యం బారిన పడటానికి గల కారణాలు ఏమిటి?

మేధో వైకల్యాన్ని మెంటల్ రిటార్డేషన్ అని కూడా అంటారు. చాలా సందర్భాలలో, అభివృద్ధి చెందే దశలో ఈ సమస్య బారిన పడతారు. కొన్నిసార్లు, దీనికి కారణం తెలియదు. మేధో వైకల్యానికి సాధారణ కారణాలు; వ్యాధి, మెదడుకు గాయం లేదా కణితులు లేదా హార్మోన్ల అసమతుల్యత లాంటి ఏదైనా మెదడు వ్యాధి వంటివి. మేధో వైకల్యానికి దారితీసే అత్యంత సాధారణ పరిస్థితులు:-

  • మానసిక క్షీణత
  • ఫ్రాగిల్ X సిండ్రోమ్
  • ఫెనిల్కెటోనురియా
  • ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్

కొంతమందికి పుట్టుకకు ముందు ఈ పరిస్థితులు ఉండవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో, పిల్లలకు తగిన వయస్సు వచ్చే వరకు లక్షణాలు కనిపించవు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది?

మేధో వైకల్యానికి కారణమేమిటి?

మేధో వైకల్యానికి అత్యంత సాధారణ కారణాలు:-

  • జన్యుపరమైన సమస్యలు:- ఇవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి. జన్యువులు లేదా క్రోమోజోమ్‌ల కలయికలో అంతరాయం ఏర్పడినప్పుడు, నిర్దిష్ట పరిస్థితి లేదా వ్యాధికి దారితీసి జన్యుపరమైన సమస్యలు ఏర్పడతాయి. మెంటల్ రిటార్డేషన్‌కు దారితీసే అత్యంత సాధారణ జన్యుపరమైన రుగ్మతలు మానసిక క్షీణత, ఫ్రాగిల్ X సిండ్రోమ్, క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్, ఇంకా ఫెనిల్కెటోనురియా.
  • ఇన్ఫెక్షన్‌లు లేదా వ్యాధులు:- కోరింత దగ్గు, మెనింజైటిస్, మీజిల్స్ వంటి వ్యాధులు మేధో వైకల్యాలను కలిగిస్తాయి. క్వాషియోర్కర్ లేదా మరాస్మస్‌తో సహా పోషకాహార లోపం కూడా మేధో వైకల్యాలకు దారితీస్తుంది. పాదరసం లేదా సీసం వంటి విషపదార్థాలకు ఎక్కువగా గురికావడం కూడా మెంటల్ రిటార్డేషన్‌కు దారితీస్తుంది.
  • గర్భధారణలో సమస్యలు:- రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్‌లు లేదా గర్భవతిగా ఉన్న స్త్రీ మద్యం సేవించడం వల్ల పిండం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇది మేధో వైకల్యాలకు దారితీసి, ఎదుగుదల మందగించవచ్చు. అలాగే, గర్భధారణ సమయంలో లేదా బిడ్డ ప్రసవ సమయంలో భయాందోళనకు గురికావడం లేదా డెలివరీ సమయంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం కూడా పిల్లల మెదడు పెరుగుదలలో సమస్యలకు దారితీయవచ్చు.

మేధో వైకల్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి?

మేధో వైకల్యాన్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు:- తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన, అత్యంత తీవ్రమైన

  • తేలికపాటి:- పిల్లలు పాఠశాలకు వెళ్లే వయస్సు వచ్చే వరకు ఈ లక్షణాలు కనిపించవు. తర్వాత, నెమ్మదిగా అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం వంటి విద్య సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. తేలికపాటి మేధో వైకల్యాలు ఉన్న పిల్లలు వ్యక్తిగత సంరక్షణ విధులను నిర్వహించగలరు, ఇంకా తమ గురించి స్వయంగా శ్రద్ద తీసుకోగలరు. వారు కొత్త విషయాలను నెమ్మదిగా నేర్చుకుంటున్నారు కాబట్టి, వారికి అనుకూల పర్యవేక్షణ, ఇంకా సపోర్ట్ అవసరం కావచ్చు. తేలికపాటి మేధోవైకల్యం ఉన్న పిల్లల్లో 50-69 మధ్యలో ఐక్యూ ఉంటుంది.
  • మధ్యస్థ:- మేధో వైకల్యం మధ్యస్థంగా ఉన్న పిల్లలకు సంభాషించడానికి కష్టంగా ఉంటుంది, ఇంకా స్నేహితులను చేసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇలాంటి పిల్లలకు స్వీయ-సంరక్షణ పనులను అభ్యసించడం కూడా కష్టంగా ఉంది, కాబట్టి పర్యవేక్షణ అవసరం. మితమైన మేధో వైకల్యం ఉన్న వ్యక్తుల IQ 35 మరియు 49 మధ్య ఉంటుంది.
  • తీవ్రమైన:- తీవ్రమైన వైకల్యం ఉన్న పిల్లలు సరిగా నడవలేరు. వారికి నడవడం, సంభాషించడం లేదా స్వీయ సంరక్షణ కష్టంగా ఉంటుంది. తీవ్రమైన మేధో వైకల్యం ఉన్న పిల్లల IQ స్థాయి 20 మరియు 34 మధ్య ఉంటుంది.
  • అత్యంత తీవ్రమైన:- అత్యంత తీవ్ర మేధో వైకల్యం ఉన్న పిల్లలు అస్థిరత, నియంత్రణ లేని లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే సైగల ద్వారా సంభాషిస్తారు. అలాంటి పిల్లలకు నిరంతర సహాయం, మద్దతు అవసరం.

చికిత్స

మేధో వైకల్యం అనేది జీవితకాల సమస్య. దీనికి శాశ్వత నివారణ లేదు. అయితే ముందస్తు రోగ నిర్ధారణ, తగిన చర్యల ద్వారా స్వీయ-సంరక్షణను నిర్వహించడానికి సహాయపడవచ్చు. మేధో వైకల్యం ఉన్న వ్యక్తులకు నిరంతరం మద్దతు, సంరక్షణ అందించాలి. అంతర్లీన కారణం లేదా జన్యుపరమైన పరిస్థితి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. దీనికి ప్రారంభ దశలోనే చికిత్సను అందించడానికి నిర్దిష్ట వ్యవధిలో వ్యాధి నిర్ధారణ చేయాలి. ఈ సందర్భాలలో అనేక రకాల సేవలు, ఇంకా సహకారం అందించవచ్చు, అవి:-

  • ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ, ఇంకా తగిన చర్యలు తీసుకోవడం
  • రోగి బలాలు, అవసరాలను గుర్తించడం
  • కుటుంబానికి సంబంధించిన అవగాహన
  • కమ్యూనికేషన్ లేదా వొకేషనల్ ప్రోగ్రామ్‌లు
  • ప్రత్యేక అభ్యాస కేంద్రాలు

కుటుంబం, సమాజం నుండి సరైన మద్దతుతో, మేధో వైకల్యాలు ఉన్న వ్యక్తులు గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. అలాగే సమాజంలో ఉత్పాదక పాత్రను పోషిస్తారు.

మేధో వైకల్యాలు ఎంత ప్రబలంగా ఉన్నాయి?

తక్కువ ఆదాయ దేశాలలో మేధో వైకల్యం తరచుగా కనిపిస్తుంది. ఇంకా పేద ప్రజలలో ఇది సర్వసాధారణం. తక్కువ ఆదాయ దేశాల్లో ప్రతి 1,000 మందిలో 16 మందికి మేధోపరమైన వైకల్యం ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 1-3 శాతం, అంటే 200 కోట్ల మంది వ్యక్తులకు మేధో వైకల్యం ఉంది.

తల్లిదండ్రులకు సలహా

మేధో వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ కింది వాటి గురించి తెలుసుకోవాలి:

  • వ్యాధి గురించి అవగాహన.
  • మీ బిడ్డకు సరైన సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • సహనంతో ఉండండి. మేధో వైకల్యం ఉన్న పిల్లలు నెమ్మదిగా నేర్చుకుంటారు.
  • మేధో వైకల్యాలు ఉన్న ఇతర పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించండి.
  • మీ పిల్లల కోసం ప్రత్యేక విద్యా సంస్థలను తెలుసుకోండి.
  • మీ పిల్లలకు సామాజిక లేదా క్రీడా కార్యకలాపాలలో అవకాశాల కోసం చూడండి.
  • మీ పిల్లల అవసరాలు, ఇంకా బలాల గురించి స్వయంగా అవగాహన చేసుకోండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.