This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మహిళలకి సంబంధించిన టాప్ 10 ఆరోగ్య సమస్యలు (Top 10 Health Issues Related To Women in Telugu)

Women Specific Issues
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Dec 21, 2025
మహిళలకి సంబంధించిన టాప్ 10 ఆరోగ్య సమస్యలు (Top 10 Health Issues Related To Women in Telugu)
Read time7 min

మగవారు అలాగే ఆడవారు ఇద్దరిపై ప్రభావం చూపించే చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కానీ, స్త్రీలలో కొన్ని విభిన్నంగా, సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా.. జబ్బులు అనేవి మగవారు, ఆడవారిపై వేర్వేరు రకాలుగా ప్రభావం చూపిస్తాయి. మగవారిలో అంత తీవ్రంగా రాని జబ్బు ఆడవారి విషయంలో ప్రాణాంతకంగా మారవచ్చు.

ఈ స్థితికి సంబంధించిన మరొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే చాలామటుకు ప్రత్యేకించి మహిళల ఆరోగ్య సమస్యలు మామూలుగా గమనించబడవు ఇంకా పరీక్ష కూడా చేయబడవు. స్త్రీలలో వచ్చే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు రొమ్ము క్యాన్సర్, మెనోపాజ్, స్ట్రోక్ అలాగే గర్భం దాల్చటం. మహిళల యొక్క టాప్ 10 ఆరోగ్య సమస్యల గురించి పూర్తిగా తెలుసుకోడానికి మీరు ఈ ఆర్టికల్ని చదవడం కొనసాగించండి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: థైరాయిడ్ క్యాన్సర్ | స్త్రీలలో లక్షణాలు మరియు కారణాలు

టాప్ 10 మహిళల ఆరోగ్య సమస్యలు (Top 10 Women’s Health Issues in Telugu)

1. స్ట్రోక్ (Stroke)

మగవారితో పోలిస్తే దాదాపు ప్రతి ఏడాది స్ట్రోక్ దాదాపుగా 56,000 మంది ఆడవారిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా రెండు రకాల స్ట్రోక్‌లు ఉంటాయి. మొదటిది హెమోరాజిక్ స్ట్రోక్, రెండవది ఇస్కీమిక్ స్ట్రోక్. స్ట్రోక్‌కి సంబంధించి కొన్ని అత్యంత సాధారణ లక్షణాలలో తీవ్రంగా తిమ్మిరిపట్టడం ఇంకా మాట్లాడటం కష్టంగా ఉండటంలాంటివి ఉంటాయి.

2. మధుమేహం (Diabetes)

డయాబెటిస్ మగవారితోపాటు ఆడవారిలో కూడా సాధారణంగా వస్తుంది. మహిళలకి డయాబెటిస్ ఉంటే వివిధ గుండె జబ్బులకి గురయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, మధుమేహం ఉంటే డయాబెటిస్‌కి సంబంధించిన డిప్రెషన్, గుడ్డితనం అలాగే ఊహించని కిడ్నీ వ్యాధుల వంటి సమస్యలు కూడా వారు అనుభవించవచ్చు. డయాబెటిస్‌కి అన్నిటికన్నా మంచి చికిత్స అంటే సమతుల ఆహారం, నోటి ద్వారా వేసుకునే మందులు అలాగే లెక్కలేనన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఉంటాయి. మీకు డయాబెటిస్ ఉన్నదని ఖఛ్చితంగా తెలిస్తే, అది కూడా ప్రెగ్నెన్సీ దశలో తెలిస్తే, గర్భం దాల్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అంతేకాకుండా, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్ (గెస్టేషనల్ డయాబెటిస్) మీ బిడ్డపై ప్రభావం చూపదని నిర్ధారించుకోవడానికి మీకు చాలా రకాల పరీక్షలు, అనుక్షణం పర్యవేక్షణ కూడా అవసరం కావచ్చు. మీరు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాల్సి రావచ్చు. ఒకవేళ మీరు సిగరెట్ తాగే వారైతే, దాన్ని పూర్తిగా వదిలించుకోడానికి ఇదే బెస్ట్ సమయం!

3. గుండె జబ్బు (Heart Disease)

USలో నలుగురు ఆడవారిలో ఒకరు గుండెజబ్బు కారణంగా మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావటానికి కొన్ని కారణాలు ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్, పొగతాగటం, ఇంకా అధిక రక్తపోటు. చాలామంది మగవారిలో గుండె జబ్బులు రావటం మామూలు విషయమని భావిస్తారు. కానీ, చాలా గణాంకాల ప్రకారం మగవారు, ఆడవారు ఇద్దరూ ఈ జబ్బుతో సమానంగా ప్రభావితమవుతున్నారు.

4. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer)

ఈ క్యాన్సర్ రకం సాధారణంగా స్తనాలలో పాలనాళాల వరుస లేదా లైనింగ్‌పై వస్తుంది. దీన్ని గుర్తించకపోతే మరింత విస్తరిస్తుంది. తీవ్రమైన సమస్యలని కలిగిస్తుంది. అంతేకాదు, రొమ్ము క్యాన్సర్ స్త్రీలలో సాధారణంగా వస్తుంది. మొదట్లో స్తనంలో ముట్టుకుంటే చాలా నొప్పిగా అన్పించే గడ్డలు పెరుగుతాయి. మీ డాక్టరు సాయంతో స్తనాల పరీక్షని చేయించుకుంటే మంచిది. స్తనాలలో కన్పించే కొన్ని గడ్డలు సాధారణంగా హానికరమైనవి కాకపోవచ్చు.

5. అండాశయ మరియు గర్భాశయ క్యాన్సర్లు (Ovarian As Well As Cervical Cancer)

సర్వికల్ లేదా గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయం యొక్క కింద భాగంలో వచ్చే క్యాన్సర్, అదే అండాశయ లేదా ఒవేరియన్ క్యాన్సర్ ఫాలోపియన్ నాళాలలో వస్తుంది. నొప్పి ఒకే విధంగా ఉన్నప్పటికీ, గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు డిశ్చార్జి ఇంకా బాధాకరమైన సెక్స్ అనుభవాలకి దగ్గరగా ఉంటాయి. అదే అండాశయ క్యాన్సర్ విషయానికొస్తే, లక్షణాలు చాలా అస్పష్టంగా ఉండవచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ని గుర్తించడానికి పాప్ స్మియర్ పరీక్షకి వెళ్తారు. కానీ పాప్ స్మియర్ పరీక్ష అండాశయ క్యాన్సర్‌ని గుర్తించడంలో సాయపడకపోవచ్చు.

6. మహిళల జననాంగాల ఆరోగ్యం (Gynecological Health)

మీ నెలవారీ పిరియడ్ సమయంలో లేదా గర్భవతిగా ఉన్నప్పుడు కాకుండా మిగతా సమయాల్లో రక్తస్రావం లేదా తరచుగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తే, మీరు లోపల ఏదో జననేంద్రియ లేదా గైనలాజికల్ సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు. వివిధ రకాల వెజైనా సమస్యలు కూడా లైంగిక వ్యాధులు (STDs) లేదా యోని మార్గ క్యాన్సర్‌ను సూచిస్తాయి. అలాంటి జబ్బులని గుర్తించకుండా వదిలేస్తే, అవి తీవ్రమై సంతానలేమి ఇంకా కిడ్నీల పనితీరు వైఫల్యానికి దారితీయవచ్చు.

7. ప్రెగ్నెన్సీ సమస్యలు (Pregnancy Issues)

ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి తీవ్రమవుతాయి. అంతేకాదు, ఇవి మీ బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలలో కొన్ని డయాబెటిస్, డిప్రెషన్ అలాగే ఆస్తమా మొదలైనవి. వీటిని తొందరగా గుర్తించకపోతే, మీ బిడ్డపై ప్రభావం చూపించవచ్చు. అదృష్టం కొద్దీ, చాలామటుకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలకి చికిత్స చేయగలరు; కానీ, ఈ కేసులో ముందుగా గుర్తించటం మేటి నివారణ చర్య అని చెప్పవచ్చు!

8. ఆటోఇమ్యూన్ వ్యాధులు (Autoimmune Diseases)

ఆటోఇమ్యూన్ వ్యాధులంటే బయటి వైరస్ వంటి సూక్ష్మజీవులతో పోరాడే మన శరీర కణాల మీదనే మన కణాలు దాడి చేయడం వలన వచ్చే జబ్బులు. ఈ లోపం పెరుగుతూ ఉన్నప్పుడు, మీకు తేలికపాటి జ్వరం, అలసట, చర్మ సమస్యలు ఇంకా వర్టిగో వంటి చాలా తీవ్రమైన లక్షణాలు రావచ్చు. చక్కెరలు, కొవ్వు పదార్థాలని తినడం తగ్గించడం, త్వరగా జబ్బులని గుర్తించడం అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి కొన్ని పద్ధతులు ఈ జబ్బుల లక్షణాలని అదుపులో ఉంచడంలో సాయపడతాయి.

9. ఆస్టియోపోరోసిస్ (Osteoporosis)

ఈ జబ్బులో ఎముకలు ఎంత బలహీనంగా మారతాయి అంటే అవి నిజానికి విరిగిపోతాయి కూడా. ఆస్టియోపోరోసిస్ లేదా బోలు ఎముకల వ్యాధి రావడానికి వయస్సు, మద్యపానం, వ్యాయామం లేని జీవనశైలి, వంశపారంపర్యత, మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులు, లేదా సిగరెట్ తాగటం ఇవన్నీ కారణం కావచ్చు. ఆస్టియోపోరోసిస్‌కి ఎలాంటి చికిత్స లేదు. అలాగే దీని లక్షణాలు లేదా తీవ్ర స్థితులని నివారించడానికి మీ డాక్టరు మీదనే ఆధారపడవలసి వస్తుంది. మీ డాక్టర్ మీకు సప్లిమెంట్లు లేదా ప్రిస్క్రిప్షన్ మందులు కూడా రాయవచ్చు.

10. డిప్రెషన్ మరియు మానసిక ఆందోళన (Depression As Well As Anxiety)

స్త్రీలకి హార్మోన్లలో హెచ్చుతగ్గులు వచ్చి అవి మానసిక ఆందోళన లేదా డిప్రెషన్‌కి కూడా దారితీయవచ్చు. అంతేకాకుండా, నెలవారీ పిరియడ్స్ ముందుగా వచ్చే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం సమయంలో కూడా మీకు లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. మీరు ఈ మధ్యనే బిడ్డకి జన్మనిచ్చినట్లయితే, ‘బేబీ బ్లూస్’ అనే సాధారణ డిప్రెషన్‌ని కూడా అనుభవించవచ్చు.

నిజం చెప్పాలంటే, ఈ సమయంలో అన్నివేళలా అలసట, బాధపడటం, అలాగే భావోద్వేగాలలో మార్పులు కూడా సాధారణమైన విషయమే. కానీ, ఒకవేళ సాయం అవసరం అనిపిస్తే, మీరు ప్రెగ్నెన్సీ సహాయ గ్రూపులలో చేరవచ్చు లేదా డాక్టరుని సంప్రదించవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తరువాత వచ్చే ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలి?

చివరిమాట (Conclusion)

ఆడవారిలో ఈ ఆరోగ్య సమస్యలన్నిటికీ చికిత్స చేయడానికి మేటి మార్గం ముందుగానే గుర్తించడం ఇంకా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. మీరు ఈ సమస్యలని ఎలా పరిష్కరించుకోవచ్చో లేదా ఇలా నివారణ అంటూ లేని తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో అనేవాటి గురించి మరింత తెలుసుకోవడానికి మీ డాక్టరుని సంప్రదించి తెలుసుకోవచ్చు. అలాగే మీ డాక్టరుతో క్రమం తప్పకుండా ఫాలో-అప్ అపాయిమెంట్లకి వెళ్తూ ఉండేలా చూసుకోండి!

మీకు ఈ మహిళల సమస్యలు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని అన్పిస్తే, డాక్టరుని సంప్రదించటం లేదా మీ మనస్థితికి దగ్గరలో ఉన్న వ్యక్తుల గ్రూపులలో చేరటం మంచిది. ఇవి మీ మానసిక ఒత్తిడి తగ్గించి, నెమ్మదిగా ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి సాయపడతాయి!

Tags:

Depression in telugu, Anxiety in telugu, Thyroid cancer in telugu, Women specific health issues in telugu.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.