

Baby Care
3 November 2023 న నవీకరించబడింది
బ్రోన్కియెలైటస్, బ్రోన్కైటిస్ వైద్యపరంగా భిన్నమైన పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. అయితే.. ఈ రెండింటి మధ్య కొన్ని కారణాలు, లక్షణాల ఒకేలా ఉన్నాయి. కొన్నిసార్లు చికిత్సా విధానాలు కూడా ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు వీటి మధ్య సారూప్యతల్ని చూస్తే.. ఈ రెండు రకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నవారిలో మంటను కలిగించడం, ఊపిరితిత్తుల్లోని వివిధ భాగాలను ప్రభావితం చేయడం లాంటి లక్షణాలు ఒకేలా ఉంటాయి. బ్రోన్కైటిస్, బ్రోన్కియెలైటస్ మధ్య ప్రధాన తేడా గమనిస్తే బ్రోన్కైటిస్ సోకినవారిలో శ్వాసనాళాల్లోకి వెళ్లే వాయుమార్గాల్లో వాపు వస్తుంది. కానీ బ్రోన్కియెలైటస్‌లో శ్వాసనాళాల నుంచి విడిపోయే చిన్న వాయుమార్గాల్లో వాపు ఉంటుంది. దీన్ని బ్రోన్కియోల్స్ అని అంటారు. ఇవి ఏ వయస్సులో అయినా సంభవించే సాధారణ అంటువ్యాధులు.
బ్రోన్కైటిస్ వస్తే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి ఇది న్యుమోనియా లాంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారి తీస్తుంది. అందుకే బ్రోన్కైటిస్‌ను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలను తరచూ ఎదుర్కొంటున్నవారు అప్రమత్తంగా ఉండాలి. తరచూ బ్రోన్కైటిస్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి సత్వర చికిత్స అవసరం.
మరోవైపు.. చాలా కేసుల్లో బ్రోన్కియెలైటస్ ఉన్నవారిలో లక్షణాలు కాస్త తక్కువగా ఉంటాయి. సులువుగా చికిత్స చేయొచ్చు. సాధారణ జలుబులాగానే ఈ లక్షణాలు ఉంటాయి. ఒకవేళ.. బ్రోన్కియెలైటస్ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్టైతే, చికిత్స అందించాలి. చికిత్స చేయకపోతే శ్వాసలో గురక వస్తుంది. జీవన నాణ్యతను తగ్గిస్తుంది. యుక్తవయస్సు వచ్చే వరకు ఈ సమస్య ఉండవచ్చు. అయితే తీవ్రమైన కేసుల్లో చికిత్స అందించకపోతే ఈ పరిస్థితి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న చాలామంది పిల్లలు 3 నుంచి 5 రోజుల్లో ఇంట్లోనే కోలుకోవచ్చు. లేదా ఆస్పత్రిలో చేరితే 5 రోజుల తర్వాత కోలుకోవచ్చు. కొందరికి సాధారణ పరిస్థితి రావడానికి వారం రోజులు కూడా పట్టొచ్చు.
బ్రోన్కియెలైటస్, బ్రోన్కైటిస్ మధ్య తేడాలను స్పష్టంగా చెప్పడం కష్టం. ఎందుకంటే వాటి లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ ఇవి సోకే ప్రాంతం వేరుగా ఉంటుంది. ఇదొక్కటే బ్రోన్కైటిస్, బ్రోన్కియెలైటస్ మధ్య ప్రధాన తేడాగా చెప్పుకోవచ్చు. ఈ రెండు పరిస్థితుల్లో తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాల తీవ్రతకు మారొచ్చు.
బ్రోన్కైటిస్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
దగ్గు మూడు వారాల కన్నా ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండటం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బ్రోన్కైటిస్ తీవ్రమైన లక్షణాలు ఇవే:
బ్రోన్కియెలైటస్ లక్షణాలు ఇవే:
బ్రోన్కైటిస్, బ్రోన్కియెలైటస్ రావడానికి కారణాలు.
అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. బ్రోన్కియెలైటస్ తరచుగా చిన్న పిల్లలలో వస్తుంది. సాధారణంగా వైరల్, శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ అత్యంత సాధారణ అంటువ్యాధి ఏజెంట్ ఉండటం వల్ల బ్రోన్కియెలైటస్ వస్తుంది. ఇది సంవత్సరంలో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. కానీ చలికాలంలో ఎక్కువగా వస్తుంది.
సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. బ్రోన్కైటిస్ రావడానికి వైరస్‌లు సాధారణ కారణం. కొన్ని కేసుల్లో సాధారణ జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా యాక్యూట్ బ్రోన్కైటిస్ రావడానికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బ్రోన్కైటిస్‌కు దారితీయవచ్చు.
మరోవైపు క్రోనిక్ బ్రోన్కైటిస్, తరచుగా ధూమపానం, బయోమాస్ ఇంధన పొగ లేదా వాయు కాలుష్యం వంటి పర్యావరణ ఉద్దీపనలకు గురికావడం లాంటి వాటి వల్ల వస్తుంది. ఇది దీర్ఘకాల పరిస్థితి.
బ్రోన్కైటిస్, బ్రోన్కియెలైటస్ లాంటి శ్వాసకోశ అంటువ్యాధులకు కొన్నిసార్లు లక్షణాలు ఒకేలా ఉంటాయి. దీనివల్ల రోగనిర్ధారణ క్లిష్టతరం అవుతుంది. ఈ కారణంగా.. రోగనిర్ధారణలో భాగంగా కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర ఊపిరితిత్తుల సమస్యలా కావా అని గమనిస్తారు. వైద్యులు సాధారణంగా సదరు వ్యక్తి ఆరోగ్య చరిత్రను పరిశీలించి, లక్షణాలను గమనించి బ్రోన్కైటిస్, బ్రోన్కియెలైటస్ వ్యాధుల్ని నిర్థారిస్తారు. ఆక్సిజన్ లెవెల్స్‌ను కొలవడం, ఛాతీలోని శబ్దాలను గమనించడం లాంటి ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. కొన్ని కేసుల్లో ఇన్ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఇతర బ్లడ్ టెస్టులు, ఛాతీ ఎక్స్‌రే లాంటివి అవసరం.
బ్రోన్కియెలైటస్‌ను నిర్ధారించడానికి వైద్యులు నాసోఫారింజియల్ స్వాబ్ టెస్ట్ ద్వారా శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్‌ను గుర్తిస్తారు. బ్రోన్కియెలైటస్ ఇన్ఫెక్షన్ రావడానికి ఈ వైరస్ ప్రధాన కారణం. బ్రోన్కైటిస్, బ్రోన్కియెలైటస్ మధ్య ప్రధానమైన తేడా కూడా ఇదే.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
బ్రోన్కియెలైటస్, బ్రోన్కైటిస్‌కు సహాయక సంరక్షణ అవసరం. సహాయక సంరక్షణ లక్షణాలను నిర్వహించడం, ఉపశమనం చేయడంపై దృష్టి పెడతారు. సాధారణంగా ఇంట్లో చికిత్స సరిపోతుంది. రెండు పరిస్థితులు సాధారణంగా సమస్యలు లేకుండా పరిష్కరించవచ్చు. ఈ కింది చికిత్సలు ఉపయోగపడతాయి.
బ్రోన్కియెలైటస్ లక్షణాలకు ఈ కింది విధంగా చికిత్స ఇవ్వొచ్చు.
బ్రోన్కైటిస్ లక్షణాలు ఉన్నవారికి ఈ విధంగా చికిత్స ఇవ్వొచ్చు:
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |