


Baby Care
3 November 2023 న నవీకరించబడింది
పేరెంట్‌హుడ్ అనేది అదో అందమైన ఫీలింగ్. ఇది కేవలం ఆనందాలను మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా తెస్తుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న మార్పు కూడా తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.
పిల్లలు పెరిగేటపుడు వారిలో తరుచుగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. వారి ప్రాణాధారాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నందువల్ల వారి శ్వాసరేటు సాధారణం కంటే ఎక్కువగా ఉండొచ్చు. వారు శ్వాసక్రియల మధ్య లాంగ్ గ్యాప్స్ తీసుకోవచ్చు. అంతే కాకుండా శబ్దాలు కూడా చేయొచ్చు. కానీ పిల్లల శ్వాసకోశ వ్యవస్థ పెద్దవారికంటే భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అప్పుడే పుట్టిన శిశువులు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా శ్వాసను తీసుకోవచ్చు. వారు పుట్టినపుడు శ్వాస తీసుకునే మార్గంలో అమ్నియోటిక్ ద్రవం మరియు మెకోనియం కలిగి ఉంటారు. పిల్లల బ్రీతింగ్ సైకిల్స్ చాలా చిన్నవి. పిల్లలు మరియు పెద్దల శ్వాస అలవాట్లలో కొన్ని తేడాలు ఉండడం సాధారణం.
ఏది ఏమైనా తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన పిల్లల మీద అదనపు శ్రద్ధను వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి దానికి పరిష్కారం కనుక్కునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఒక వేళ మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే నిర్ధారించుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరం.
క్రమరహితంగా శ్వాసతీసుకోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక మరింత ఒత్తిడికి గురవుతారు.
మీ పిల్లల శ్వాస విషయంలో మీరు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలను ఇక్కడ పొందుపరిచాం.
మీ శిశువుకు సంబందించి శ్వాసకోశ అలవాట్లను గమనించండి. వాటి గురించి తెలుసుకోండి, తద్వారా ఏదైనా సమస్య ఉంటే గుర్తించవచ్చు.
మీ శిశువు శ్వాస తీసుకునే విధానాన్ని రికార్డ్ చేయండి. మరియు దానిని వైద్యుడికి చూపించండి. అతడి అభిప్రాయాన్ని తీసుకోండి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఇప్పుడు ఆన్లైన్ అపాయంట్మెంట్స్, ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. అనవరస ప్రయాణాల నుంచి మిమ్మల్ని ఇవి కాపాడుతాయి.
ఒక ప్రముఖ study ప్రకారం మీ బేబీ ఎల్లప్పుడూ వెల్లకిలానే పడుకోవాలి. ఇలా చేయడం వలన ఆకస్మిక మరణ సిండ్రోమ్ (SIDS) ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. మీ శిశువుకు శ్వాసకోస సమస్య ఉండి.. సరిగ్గా నిద్రపోకపోతే, ఆ సమస్య పరిష్కారానికి మార్గం కనుక్కోవాలని వైద్యుడిని సంప్రదించండి. అంతే కాకుండా వారి ఊయలలను వాలుపై ఉంచడం సురక్షితం కాదు.
ఫిజియోలాజికల్ సీరమ్ డ్రాప్స్. ఇవి ఫార్మసీల్లో లభిస్తాయి. మందంపాటి శ్లేష్మాన్ని నయం చేయడంలో ఇది సహాయపడుతుంది.
కొన్ని సార్లు శిశువులు డిస్ట్రబ్ అయినపుడు లేదా ఎక్కువ వేడిని అనుభవించినపుడు వారి శ్వాసక్రియ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మీ బిడ్డకు సరైన విధంగా శ్వాస అందేలా మీరు దుస్తులు వేయాలి.
చిన్నపిల్లలు పెద్దవారి కంటే వేగంగా ఊపిరి పీల్చుకుంటారు. వారు శ్వాస తీసుకునేటపుడు అసాధారణ శబ్దాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వైద్య పరిస్థితుల కారణంగా పిల్లలు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడడం చాలా అరుదు. మీ శిశువుకు శ్వాసకోస సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలి. మీ శిశువు సాధారణ శ్వాస అలవాట్లను తెలుసుకోండి. ఏవైనా సమస్యలను గుర్తిస్తే వైద్యుడిని సంప్రదించండి.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu

మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |