This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

ప్రసవానంతరం వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి?

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Feb 6, 2026
ప్రసవానంతరం వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి?
Read time5 min

కొత్తగా తల్లైనవారు గర్భధారణ నుండి ప్రసవం వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రసవం అనంతరం కొన్ని విషయాలలో పొరపాట్లు జరగడం పరిపాటి. ఏవైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్యలైతే ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకొని నయం చేసుకోవచ్చు, కానీ పెద్ద ఆరోగ్య సమస్యలైతే అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుంది. సమస్యలేదైనా తదనుగుణంగా జాగ్రతపడేందుకు తల్లులు తెలుసుకోవాల్సిన అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ప్రసవం తర్వాత కొత్తగా తల్లైనవారు ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల జాబితాపై ఈ బ్లాగ్ దృష్టి సారిస్తుంది.

1. అధిక రక్తస్రావం

ప్రసవానంతర రక్తస్రావం, గర్భాశయంలోని అటోనీ(ఆక్సిటోసిన్ విడుదలకు ప్రతిస్పందనగా జరిగే గర్భాశయ సంకోచాలు) వలన సంభవిస్తుంది. ఇది సాధారణంగా ప్రసవించిన మహిళల్లో సంభవిస్తుంది. ఇందులో గర్భాశయం సరిగ్గా ముడుచుకోక పోవడం కారణంగా రక్తస్రావం ఆగదు. ప్రసవానంతర అటోనీ వల్ల రక్తస్రావం అధికం కావచ్చు ఇంకా దీనివల్ల శరీరానికి అవసమైనంత రక్తాన్ని ఉత్పత్తి కావడం జరగకపోవచ్చు. ఈ రకమైన రక్తస్రావం క్రమంగా రక్తహీనతకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిలో శరీరానికి తగినంత ఎర్ర రక్త కణాల సరఫరా తగ్గిపోతుంది. రక్తహీనత ఉన్న స్త్రీలకి అలసటగా ఇంకా బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇంకా వారు తమ రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. రక్తహీనతకు సరైన చికిత్స చేయకపోతే, అది అనేక ఇతర సమస్యలకు దారితీయవచ్చు.

2. ఇన్ఫెక్షన్ లేదా సెప్సిస్

సెప్సిస్ అనేది సిజేరియన్ ద్వారా లేదా సాధారణ ప్రసవం తర్వాత సంభవించే ఒక ఆరోగ్య సంబంధ సమస్య. ఇది గర్భాశయ ముఖద్వారం నుండి రక్తప్రవాహంలోకి బ్యాక్టీరియా సంక్రమణం జరగడం వల్ల సంభవిస్తుంది. ఇందువల్ల శరీరం మొత్తం వాపు రావడం జరుగుతుంది. శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడే క్రమంలో కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అయితే ఈ రసాయనాలు కొన్నిసార్లు శరీర కణజాలానికి హాని చేస్తాయి. దీనివల్ల రక్తపోటు పడిపోతుంది ఇంకా రక్త నాళాలు శరీరంలోకి ద్రవాన్ని వదులుతాయి. ఇది ప్రసవానంతర కాలంలో ఎదురయ్యే అత్యంత ప్రాణాంతక సమస్యలలో ఒకటి, అంతేకాదు సెప్సిస్‌తో సంబంధం ఉన్న మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.

3. ప్రసవానంతర డిప్రెషన్ & నిస్పృహ

ప్రసవానంతర డిప్రెషన్ అనేది కాన్పు తరువాత సంభవించే ఒక రకమైన నిరాశ లాంటిది. ఇది డెలివరీ తర్వాత 5% నుండి 20% మంది స్త్రీలలో కనిపిస్తుంది. ప్రసవానంతర డిప్రెషన్ వయస్సు, జాతి, ఆదాయం, విద్య, సంస్కృతి లేదా వైవాహిక స్థితి వంటి వాటితో సంబంధం లేకుండా స్త్రీలందరిని ప్రభావితం చేయవచ్చు. ప్రసవానంతర డిప్రెషన్ ఇంకా నిస్పృహ అనేది ప్రసవానంతర మానసిక రుగ్మతల అతిసాధారణ రూపాలు. ఈ సందర్భాలలో, మహిళలకు తీవ్ర విచారం, నిస్సహాయత, చిరాకు ఇంకా మానసిక కల్లోలాలూ ఉంటాయి. వారికి తమ భాగస్వామి పట్ల ఆసక్తి తగ్గవచ్చు ఇంకా శిశువుకు హాని కలిగించాలనే తలంపు కూడా రావచ్చు. ప్రసవానంతర మానసిక రుగ్మతలు అనేవి వాస్తవమే అయినా అవి సర్వసాధారణాలు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 విషయాలు

4. స్ట్రోక్

స్ట్రోక్ అంటే మెదడుకు జరిగే రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి మెదడు పనితీరు అకస్మాత్తుగా ఆగిపోవడం. గర్భిణీ స్త్రీలలో, స్ట్రోక్ అనేది ప్రసవానంతరం తలెత్తే ఒక సమస్య. గర్భధారణ సమయంలో లేదా ప్రసవానంతరం స్ట్రోక్‌ రాగల సాధారణ కారణాలు గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఇంకా రక్తం గడ్డకట్టడం వంటివి. రక్తం గడ్డకట్టడమనేది సాధారణంగా గర్భధారణలో కనిపిస్తుంది, కానీ ప్రసవం తర్వాత కూడా ఇలా జరగవచ్చు. ప్రసవానంతర కాలంలో ఇంకా డెలివరీ తర్వాత చాలా వారాల వరకు స్ట్రోక్ బారినపడే అవకాశం పెరుగుతుంది ఉంటుంది.

5. కార్డియోమయోపతి ఇంకా గుండె జబ్బులు

కార్డియోమయోపతి గర్భధారణ సమయంలో రాగల సమస్యలలో ఒకటి. ఇది తల్లి శరీరంలోని హార్మోన్ల మార్పులు ఇంకా కడుపులో పెరుగుతున్న శిశువుకు ఆక్సిజన్ ఆవశ్యకత వల్ల ప్రేరేపించబడుతుంది. కొన్ని సందర్భాల్లో.. కొన్నిరకాల మందులు లేదా అంటువ్యాధులు కూడా ఇందుకు దోహదపడేవి కావచ్చు. ఈ పరిస్థితి సర్వసాధారణమే కాక మహిళల్లో గుండె జబ్బులకు ప్రధాన కారణం కూడా ఇదే. ఈ వ్యాధి వల్ల గుండె గట్టిగా మారుతుంది ఇంకా కండరాలు మందంగా మారతాయి. దీని వలన శరీరానికి రక్తాన్ని సరఫరా చేయడం గుండెకు కష్టతరం అవుతుంది. ఇది గుండె వైఫల్యానికి దారితీయడమే కాక మరణానికి కూడా కారణం కావచ్చు.

6. పల్మనరీ ఎంబోలిజం

పల్మనరీ ఎంబోలిజం అనేది సాధారణంగా కాళ్ళలో రక్తం గడ్డకట్టడం వల్ల సంభవిస్తుంది. అది రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు ప్రయాణిస్తుంది. ఆసుపత్రిలో చేరి ఉన్న వారిలో, శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో లేదా చాలాకాలం మంచాన పడినవారిలో కాళ్ల లోపలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడతాయి. ఎవరైనా నిద్ర నుండి గభాలున లేచినప్పుడు రక్తం ఒక్కసారిగా కాళ్ళ సిరలలో చేరుతుంది. ఇలా ఒక్కసారిగా వచ్చిచేరిన రక్తంలో చిన్న చిన్న రక్తపుగడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలు సాధారణంగా శరీర సహజసిద్ధ ప్రక్రియ వల్ల కరిగిపోతాయి. అలా కాకుండా ఆ రక్తపుగడ్డ విచ్ఛిన్నమైనపుడు, అది రక్తం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రయాణించవచ్చు. అక్కడ అది ఊపిరితిత్తులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రసవానంతర సమస్య ఇంకా ఇది ప్రసవం అయిన 30 రోజులలోపు ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు తరచుగా అంతకు ముందున్న అనారోగ్యాలను సూచిస్తాయి. చివరగా.. రక్తపోటు, మధుమేహం, ఊబకాయం ఇంకా గుండె సంబంధిత వ్యాధులు వంటి కొన్ని ముందస్తు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలాంటి అనారోగ్యాలు లేనివారి కంటే ప్రసవానంతర సమస్యలు రాగాల ప్రమాదం కొత్తగా తల్లైనా వారికి ఉంటుంది. మొత్తానికి, ప్రసవానంతర సమస్యలు తల్లీ బిడ్డపై ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయి. మీరు సిద్ధంగా ఉండటం కోసం ఆ సమయంలో తలెత్తే సాధారణ సమస్యల పట్ల అవగాహన ఉండతామనేది ఎంతో ముఖ్యం.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.