This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

ప్రసవానంతర రక్తస్రావం ఎలా ఉంటుంది? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

Written by - Nayana MukkamalaLast updated: Nov 3, 2023
ప్రసవానంతర రక్తస్రావం ఎలా ఉంటుంది? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
Read time6 min

ప్రసవానంతర రక్తస్రావం (PPH) అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. బిడ్డ పుట్టిన తర్వాత యోని నుంచి రక్తస్రావం జరిగే పరిస్థితిని ప్రసవానంతర రక్తస్రావం అని పిలుస్తారు. ఇది వ్యక్తి మరణానికి కూడా దారితీస్తుంది. ప్రసవానంతర రక్తస్రావం (PPH) అనేది బిడ్డ పుట్టిన తర్వాత కానీ.. ప్రసవం జరిగిన 84 రోజుల తర్వాత కానీ సంభవిస్తుంది. మొదటి దశలోనే గుర్తించడం వలన ప్రాణాలను కాపాడొచ్చు.

ప్రసవానంతర రక్తస్రావం అంటే ఏమిటి?

ప్రసవం తర్వాత ఏ రూపంలోనైనా యోని నుంచి రక్తస్రావం జరగడం సాధారణం. అయితే రక్తస్రావం మొత్తం 32 ఔన్సుల కంటే ఎక్కువగా ఉంటే దానిని ప్రసవానంతర రక్తస్రావం అని అంటారు. ప్రసవానంతర రక్తస్రావం(PPH) తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారి తీస్తుంది. త్వరగా గుర్తించి.. చికిత్స చేయడం వలన ఏదైనా ఫలితం కనిపిస్తుంది.

ప్రసవానంతర రక్తస్రావంలో ఉన్న వివిధ రకాలు ఏమిటి?

రక్తస్రావం జరిగినపుడు ప్రసవానంతర రక్తస్రావం రెండు రకాలుగా ఉంటుంది.

  • డెలివరీ తర్వాత మొదటి 24 గంటలలో – ప్రాథమిక PPH.
  • డెలివరీ అయిన 24 గంటల తర్వాత మరియు 12 వారాల వరకు- సెకండరీ PPH

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఎలా ఆపాలి?

ప్రసవానంతర రక్తస్రావం లక్షణాలు ఏమిటి?

ప్రసవానంతర రక్తస్రావం తరచుగా డెలివరీ తర్వాత వచ్చే పీరియడ్ ద్వారా కన్యూఫిజ్ అవుతుంది. అసాధారణ రక్తస్రావాన్ని కనుక అనుభవిస్తే వైద్యుడిని సంప్రదించండి

ప్రసవానంతర రక్తస్రావం (PPH) కామన్ లక్షణాలు:

  • ఆగకుండా రక్తస్రావం కావడం
  • బీపీ తగ్గిపోవడం
  • హృదయ స్పందనల రేటు పెరగడం
  • ఎర్రరక్తకణాల సంఖ్యలో తగ్గుదల
  • యోని చుట్టూ వాపు మరియు నొప్పి

ప్రసవానంతర రక్తస్రావానికి గల కారణం ఏమిటి?

ప్రసవ సమయంలో శిశువును బయటకు నెట్టివేయబడిన తర్వాత మూడో సంకోచం ఉంటుంది. ఈ దశలో గర్భాశయ సంకోచం తిరిగి ప్రారంభం అవుతుంది. ప్లాసెంటాను బయటకు నెట్టేస్తుంది. ఈ సంకోచం రక్తనాళాలపై ఒత్తిడి తెస్తుంది. ఈ ఒత్తిడి తగినంత లేనపుడు అది రక్తస్రావానికి కారణం అవుతుంది. రక్తస్రావం కావడానికి ఇతర కారణాలు:

  • గర్భంలో కొంత ప్లాసెంటా మిగిలి ఉన్నపుడు
  • యోనిలో చీలికలు (లాసరేషన్స్)
  • గర్భాశయ చీలిక
  • యోని పక్కనే ఉన్న ప్రదేశాల్లోకి రక్తస్రావం. దీనిని హెమటోమా అని పిలుస్తారు.
  • రక్తస్రావ లోపాలు

PPH(ప్రసవానంతర రక్తస్రావం) ఎలా నిర్దారించబడుతుంది?

హెల్త్​కేర్ వర్కర్లు ముందుగా మీ ఆరోగ్య చరిత్రను రివ్యూ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ పరీక్షలు చేస్తారు. వ్యాధిని నిర్దారించడంలో ల్యాబ్ పరీక్షలు సహాయం చేస్తాయి. కొన్ని రకాల ల్యాబ్ పరీక్షలు

  • కోల్పోయిన రక్తపరిమాణం
  • బీపీ మరియు పల్స్ కొలత
  • RBC(రెడ్ బ్లడ్ సెల్స్) సంఖ్య
  • రక్తం గడ్డకట్టే కారకాలను తనిఖీ చేయడం

ప్రసవానంతర రక్తస్రావానికి చికిత్స?

రక్తస్రావానికి గల కారణాన్ని కనుగొని రక్తస్రావాన్ని ఆపడం లక్ష్యం. ఇందుకోసం కింది చికిత్సలు ఉన్నాయి.

  • గర్భాశయ సంకోచం (నొప్పులు) పెంచేందుకు మెడిసిన్ లేదా మసాజ్
  • గర్భాశయం నుంచి ప్లాసెంటా (మావి) ముక్కలను తొలగించడం
  • యోని మరియు గర్భాశయం చుట్టూ ఏవైనా గాయలున్నాయో చూడండి
  • బ్లీడింగ్ వెసెల్ పై ఒత్తిడి తెచ్చేందుకు బలూనింగ్ లేదా ఫోలీ కాథెటర్ పేర్కొన్నవి లేకుంటే శుభ్రమైన స్పాంజ్ లేదా కాటన్ అయినా గర్భాశయంలో ప్యాక్ చేయవచ్చు.
  • రక్తస్రావం ఎందుకు అవుతుందో తెలుసుకునేందుకు కడుపుని ఓపెన్ చేయండి.
  • ప్రత్యేక జెల్ ఉపయోగించడం, గ్లూ
  • షాక్​ను నియంత్రించేందుకు IV ఫ్లూయడ్స్, బ్లడ్ ప్రొడక్టులు, రక్తం ఇవ్వబడుతుంది.

ప్రసవానంతర రక్తస్రావం చికిత్స కోసం మందులు

గర్భాశయం సంకోచించేందుకు (నొప్పులు వచ్చేందుకు) మందులు ఇస్తారు. రక్తస్రావం కోసం తగినంత సంకోచం లేనపుడు ఇది ఇవ్వబడుతుంది. ఇందుకోసం సాధారణ ఔషధం.. ఆక్సిటోసిన్, మిథైలెర్గోనోవిన్, మరియు ప్రోస్టాగ్లాండిన్స్

దీని వల్ల ఎవరు ప్రభావితం అవుతారు?

ప్లాసెంటాలో సమస్యలు ఉన్న స్త్రీలకు ప్రసవానంతర రక్తస్రావం (PPH) వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేందుకు కొన్ని ఇతర కారణాలు..

  • అనేక సంఖ్యలో గర్భాలు
  • కవలలు లేదా ముగ్గురు పిల్లలు
  • పెద్ద (లార్జ్​) శిశువు జన్మించడం
  • ఎక్కువ అమ్నియోటిక్ ద్రవాన్ని కలిగి ఉండడం
  • ఊబకాయం (ఒబేసిటీ)
  • ఇన్ఫెక్షన్
  • ఎక్కువ సమయం ప్రసవం

మీరు ప్రసవానంతర రక్తస్రావం నుంచి ఎలా కోలుకుంటారు?

రికవరీ అయ్యే విధానం ప్రతి ఒక్కరిలో వేర్వేరుగా ఉంటుంది. రికవరీ అనేది సంభవించిన రక్తస్రావం (రక్తనష్టం) మీద ఆధారపడి ఉంటుంది. మీరు కోలుకున్న తర్వాత కింది వాటిని చేస్తూ మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
  • విశ్రాంతి
  • ఎక్కువగా నీరు తీసుకోవడం
  • డాక్టర్ సిఫారసు చేసిన ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం

ప్రసవానంతర రక్తస్రావం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?

ప్రసవానంతర రక్తస్రావం (PPH) వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, వేగంగా శ్వాస తీసుకోవడం, రక్తప్రవాహం తగ్గడం, వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇది షాక్​కు కారణం అవుతుంది. దీనికి చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించొచ్చు.

ప్రసవానంతర రక్తస్రావాన్ని నిరోధించేందుకు ఏమి చేయాలి?

గర్భధారణకు ముందే ప్రమాద కారకాలను గుర్తించడం ఉత్తమం. వ్యక్తులు తమ పూర్తి వైద్య చరిత్రను వైద్యుడితో పంచుకోవాలి. రొటీన్ మందులు కూడా ప్రాణాలను రక్షించగలవు.

ప్రసవానంతర రక్తస్రావం ఎంత కామన్?

100 మంది స్త్రీల గ్రూపులో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ ప్రసవానంతర రక్తస్రావాన్ని ఎదుర్కొంటారు.

ప్రసవానంతర రక్తస్రావం తర్వాత మీరు మరో బిడ్డను పొందగలరా?

అవును. ప్రసవానంతర రక్తస్రావం (PPH) మళ్లీ సంభవించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రసవానికి ముందు పూర్తి మెడికల్ హిస్టరీని వైద్యుడితో పంచుకోవాలి.

ప్రసవ సమయంలో ప్రసవానంతర రక్తస్రావం (PPH) ఎలా నిరోధించవచ్చు?

ఎమర్జెన్సీ కేర్ అందుబాటులో ఉన్నపుడు అడ్మిట్ అయి ఉండడం మంచిది. తొందరగా కేర్ (ఎర్లీ కేర్) అనేది ప్రాణాలను కాపాడుతుంది. మరియు త్వరగా కోలుకునేందుకు సహాయం చేస్తుంది.

ప్రసవానంతర రక్తస్రావం మరణానికి దారి తీస్తుందా?

అవును.. ఇది చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతకం అవుతుంది. వ్యక్తులు చాలా త్వరగా రక్తాన్ని కోల్పోతారు. BP వేగంగా పడిపోయేందుకు ఇది దోహదం చేస్తుంది. దీనిని షాక్ అని పిలుస్తారు. ఇది మరణానికి దారి తీస్తుంది.

ప్రసవానంతర రక్తస్రావం(PPH) అనేది క్లిష్టమైన పరిస్థితి. దీనికి తక్షణ చికిత్స అవసరం. తీవ్రమైన రక్తస్రావం సంభవించినపుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లక్షణాలను తప్పుగా అర్థం చేసుకున్నా సరే. సారీ చెప్పడం కంటే సురక్షితంగా ఉండడం మంచిది. మైకము, మూర్చ, అస్పష్టమైన దృష్టి వంటి ఇతర సంకేతాలు ఉంటాయి. తొందరగా వ్యాధిని గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు దక్కుతాయి. ఇప్పటికే ఎప్పుడైనా ప్రసవానంతర రక్తస్రావం (PPH)తో బాధపడ్డారా? అనే విషయం వైద్యుడికి తెలపాలి. మీ గురించి ఫుల్ మెడికల్ హిస్టరీని వైద్యుడికి అందించడం ఉత్తమం.

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.