
సారాంశం


తన బేబీకి డిస్పోజల్ (వాడిపడేసేవి) డైపర్లను ఉపయోగించాలా? లేదా క్లాత్ డైపర్లను ఉపయోగించాలా? అనేది పేరెంట్స్ తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి. డైపర్ ఎలా మార్చాలో దశల వారీగా తెలుసుకోండి. ఈ సలహాలు మీ పనిని మరింత సులభతరం చేస్తాయి.
డిస్పోజల్ డైపర్లు, రీయూజబుల్ డైపర్ల లో ఏది ఎంపిక చేసుకోవాలనేది తల్లిదండ్రుల ఇష్టం. కానీ బిడ్డను కనాలని ప్లాన్ చేసే ముందు డైపర్ ఎలా చేంజ్ చేయాలనే విషయంపై మంచి అవగాహనను కలిగి ఉండాలి. ఇది మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మీరు ఇంతకు ముందెన్నడూ బేబీ డైపర్లను మార్చకపోతే.. ఈ పని కొంచెం కఠినంగా అనిపించొచ్చు. మీరు కొన్ని సార్లు ఈ పనిని చేసిన తర్వాత ఇది నిమిషాల వ్యవధిలో చేసే పని అవుతుంది. మీరు కనుక కొత్త తల్లిదండ్రులు అయితే మీ బిడ్డ మీకు పుష్కలమైన ప్రాక్టీస్ అందజేస్తుంది. సాధారణంగా శిశువులకు రోజుకు 6 నుంచి 10 సార్లు డైపర్ మార్చాల్సి ఉంటుంది. శిశువు మొదటి ఏడాది ముగిసే సరికి 3,000 కంటే ఎక్కువ సార్లు డైపర్లు మార్చాలి. బేబీ డైపర్లను మార్చేందుకు ఎటువంటి పద్ధతులు ఉన్నాయో చదవండి.
మీరు ప్రారంభించే ముందు మీకు అవసరమైనవన్నీ ఉండేలా చూసుకోవాలి. కింది వాటిని మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
1. మీ చేతులను శుభ్రం చేసుకొని.. మీకు కావాల్సిన వస్తువులన్నీ మీకు అందేలా ఉంచుకోండి.
2. మీ బిడ్డను బోర్లా(తలకిందులుగా) పడుకోపెట్టండి.
3. డైపర్ ట్యాబ్స్ విప్పండి. మీ శిశువు చీలమండలను పట్టుకుని నెమ్మదిగా పైకి లేపండి. ఇప్పుడు డైపర్ దిగువ భాగాన్ని పైకి లేపండి. డైపర్‌లో కనుక చాలా మలం ఉన్నట్లయితే డైపర్ ఎగువ భాగాన్ని ఉపయోగించి కింది భాగాన్ని తుడవొచ్చు.
4. డైపర్‌ను శిశువు నుంచి వేరు చేయండి. శిశువుకు అందకుండా అక్కడే పెట్టండి.
5. శిశువును శుభ్రంగా తుడవండి. ఒకవేళ బాలిక అయితే, తుడిచేటపుడు ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ప్రతిసారి ముందు నుంచి వెనకకు తుడవండి. శిశువుకు దద్దుర్లు రాకుండా ఉండేందుకు పరిశుభ్రంగా తుడవండి.
6. డిస్పోజబుల్ క్లీనింగ్ సామగ్రిని పాడైన డైపర్ మీద ఉంచండి.
7. మీ శిశువు దిగువ భాగంలో శుభ్రమైన డైపర్‌ను స్లైడ్ చేయండి. ట్యాబ్‌లను బేబీకి దిగువన ఉండేలా చూసుకోవాలి. ఈ రోజుల్లో చాలా డైపర్లు ముందు భాగంలో రంగు రంగుల గుర్తులను కలిగి ఉంటున్నాయి.
8. కొత్త డైపర్ వేస్తూ దానిని క్లోజ్ చేసే ముందు దద్దుర్ల నివారణ కోసం మీ వైద్యుడు సూచించిన క్రీమ్స్ లేదా ఆయింట్మెంట్స్ పూయండి. ఇలా చేస్తే క్రీమ్ రాయడం వలన అవి కిందపడకుండా ఉంటాయి. లేదంటే అది కొన్ని సార్లు కష్టంగా అనిపించొచ్చు.
9. పిల్లవాడి బొడ్డుపై ఉన్న భాగాన్ని పైకి లాగడం ద్వారా అతడికి కొత్త డైపర్ వేయడం పూర్తి చేయండి. ట్యాబ్‌లను తెరిచి చుట్టూ బిగించండి. మీరు కట్ చేసే న్యూ బార్న్ డైపర్లను ఉపయోగించకపోతే.. బొడ్డు తాడు పడిపోయే వరకు డైపర్‌ను కిందికి మడవండి. ఇలా చేయడం ద్వారా చికాకుకు తగ్గించొచ్చు.
10. ఉపయోగించిన డైపర్‌ను రోల్ చేసి దాని చుట్టూ ట్యాబ్‌లను చుట్టండి. ఆ డైపర్‌ను బ్యాగ్‌లో కానీ, బిన్లో కానీ, చెత్తడబ్బాలో కానీ వేయండి.
11. మీ చేతులు, మీ శిశువు చేతులను శుభ్రం చేయండి. అంతే కాకుండా మీరు డైపర్ చేంజ్ చేసిన ప్రదేశాన్ని కూడా క్లీన్ చేయండి. మీ శిశువు జబ్బుతో ఉన్నపుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాలుష్యాన్ని నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.
మీకూ, మీ బిడ్డకు ఇదంతా తొందర్లోనే అలవాటైపోతుంది. కానీ ఈ కింది టిప్స్ మీకు ఎంతో సహాయకారిగా ఉంటాయి.
మురికిగా మారిన డైపర్‌ను మార్చాలని చాలా మందికి తెలుసు. కానీ కొంత మంది తల్లులు మూత్ర విసర్జన తర్వాత ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్‌ను మార్చకుండా అలాగే ఉంటారు. ఇది చాలా తప్పు. శిశువుకు ఎటువంటి చర్మ సమస్యలు దద్దుర్లు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ పొడిగా ఉంచడం చాలా అవసరం. ఫ్రీ సైజ్ రీయూజబుల్ డైపర్లు బేబీ ఒకసారి చేసిన మూత్రవిసర్జనను మాత్రమే పీల్చుకుంటాయి. కావున ప్రతి మూత్రవిసర్జన తర్వాత మార్చడం అవసరం. చిన్నపిల్లలతో పోల్చుకుంటే అప్పుడే పుట్టిన పిల్లలు చాలా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. కావున ప్రతి 2 గంటలకోసారి మీరు వారికి డైపర్లను చేంజ్ చేయాల్సి ఉంటుంది. డైపర్ ఎక్కువ తడిగా లేకపోతే మీరు దానిని 2 నుంచి 4 గంటల వరకు ఉంచొచ్చు. మీరు మీ బిడ్డకు రోజుకు సగటున 7 నుంచి 10 సార్లు డైపర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది.
డిస్పోజల్ డైపర్ల లాగ ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్లు మార్చే సమయం ఆసన్నమైందని మీకు వివిధ సంకేతాలను అందజేయవు. డైపర్ తడిగా అయితే ఇవి కలర్ చేంజ్ కావు. లేదా డైపర్ మీద చిన్న రంగు మారే గీతను కూడా కలిగి ఉండవు. కానీ మీ బేబీ ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్ ఎప్పుడు చేంజ్ చేయాలో తెలుసుకునేందుకు కింది చిట్కాలు ఉపయోగపడతాయి.
డైపర్ తరచుగా చేంజ్ చేయడాన్ని మీరు ఇష్టపడకపోవచ్చు. కానీ దద్దుర్లు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు డైపర్ చేంజ్ చాలా ముఖ్యమైనది.
పిల్లలకు తరచూ డైపర్లు వేయడం తగ్గించండి. పాత డైపర్ మార్చి కొత్త డైపర్ వేసే మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వండి. పిల్లల స్కిన్ రిలాక్స్ అయ్యేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది.
మయిలో ఎసెన్షియల్ ఫ్రీ సైజ్ రీయూజబుల్ క్లాత్ డైపర్స్ చాలా బాగుంటాయి. ఇవి అన్ని పదార్థాలను ఇట్టే పీల్చుకుంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. మీ శిశువు ఇంటిలో సౌఖ్యంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. ఇవి అడ్జస్ట్ చేసుకునేందుకు తగినవి. స్కిన్ –ఫ్రెండ్లీ, మరియు సులభంగా వాష్ చేయొచ్చు. మీకు ప్రింట్ చేసిన సాలిడ్ కలర్ ఆప్షన్ల ఉన్నవి కూడా దొరుకుతాయి. ఇంతకంటే ఏం అడగగలరు? ఇప్పుడే మయిలో స్టోర్‌ని అన్వేషించండి.
మీ బేబీ స్కిన్‌ను సున్నితంగా చూసుకుంటూ, లీకేజ్ లేకుండా, రోజంతా సౌకర్యంగా ఉంచే డైపర్లు ఇక్కడ ఉన్నాయి.

Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Rash-free | Paediatrician Tested | Dermatologically Tested | Breathable | Expert Approved | No Harsh Bleaching Chemicals | Super-Saver Combo

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |