This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

చర్మంపై మొటిమలు రావడానికి 3 ప్రధానమైన కారణాలు

Pimples and Acne
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
చర్మంపై మొటిమలు రావడానికి 3 ప్రధానమైన కారణాలు
Likes3 Likes|
Read time5 min

మొటిమల్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు సహజమైన చిట్కాలను పాటిస్తే, మరికొందరు ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ అంటే బయట షాపుల్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అయితే వేర్వేరు చికిత్సా పద్ధతుల్ని ఎంచుకునే ముందు అసలు మొటిమలు రావడానికి గల కారణాలేంటో తెలుసుకోవడం అవసరం. ఈ బ్లాగ్‌లో మొటిమలకు గల ప్రధాన కారణాలు, మొటిమల్ని వేగంగా ఎలా తగ్గించుకోవాలి? అన్న వివరాలు తెలుసుకోండి.

మొటిమలు అంటే ఏంటీ?

మొటిమలు అన్ని రకాల వయస్సువారిని ప్రభావితం చేసే సాధారణ చర్మ సమస్య. ఇవి కనిపించే తీరును బట్టి మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర మచ్చలుగా వర్గీకరిస్తారు. కామన్‌గా ఇవి టీనేజర్లలో ఎక్కువగా కనిపించినా, ప్రతీ ఒక్కరికీ ఈ మొటిమల సమస్య తప్పదు.

మొటిమలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. జన్యుపరంగా, హార్మోన్లు, ఆహారపు అలవాట్లు, పలురకాల మందులు ఉపయోగించడం లాంటివి ప్రధాన కారణాలు. మొటిమల్లో రకాలు ప్రధానంగా నాలుగు ఉంటాయి:

1. బ్లాక్‌హెడ్స్: ఇవి చిన్నగా, నలుపు రంగులో గడ్డలుగా ఉంటాయి. చర్మం రంధ్రాలు మూసుకుపోయి ఆక్సిజన్‌తో ప్రభావితం చెంది నల్లగా మారి బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.

2. వైట్‌హెడ్స్: ఇవి తెల్లగా, చిన్నగా ఉంటాయి. రంధ్రం మూసుకుపోయి బ్యాక్టీరియా ప్రభావంతో చెందడం వల్ల ఇవి ఏర్పడతాయి.

3. పాపుల్స్: ఇవి కూడా చిన్నగా, ఎర్రగా ఉంటాయి. మంటగా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు.

4. పస్టుల్స్: ఇవి పెద్దగా ఉంటాయి. చీము నిండి ఉంటుంది. సాధారణంగా ఎర్రగా, మంటగా అనిపిస్తాయి.

ఎవరికైనా మొటిమల్ని ఎదుర్కోవడం సవాలే. అయితే చాలావరకు చికిత్సలు మొటిమల్ని తగ్గించి, మొటిమల కారణంగా ఏర్పడే మచ్చల్ని తొలగిస్తాయి.

మొటిమలకు 3 ప్రధానమైన కారణాలు

ఏ వయస్సువారినైనా సాధారణంగా వేధించే చర్మ సమస్యే మొటిమలు. ఇవి ఏర్పడటానికి కారణాలు అనేకం. అయితే మొటిమలు రావడానికి ప్రధానంగా ఉండే మూడు కారణాల గురించి తెలుసుకోండి.

1. సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం

మొటిమలకు మొదటి కారణం సెబమ్ ఉత్పత్తి. చర్మాన్ని తేమగా ఉంచడానికి సాయపడే జిడ్డులాంటి ద్రవమే సెబమ్. అయితే సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల రంధ్రాలకు అడ్డుపడుతుంది. బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుంది. ఫలితంగా మొటిమలు ఏర్పడతాయి.

2. కొన్నిరకాల కాస్మెటిక్స్ ప్రభావం

మొటిమలకు రెండో కారణం కాస్మెటిక్స్ ప్రభావం ఉండటం. చాలావరకు కాస్మెటిక్స్, చర్మరక్షణ ఉత్పత్తులు మొటిమలకు దారితీస్తాయి. అవి చర్మంపై రంధ్రాలను మూసుకుపోయేలా చేసి, చర్మానికి ఇబ్బంది కలిగిస్తాయి. దీంతో చర్మం ఎర్రగా, వాపుగా మారుతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. తరచూ మొటిమలకు గురయ్యే చర్మం ఉన్నవారు, నాన్ కమెడోజనిక్, హానికరమైన కెమికల్స్ లేని ఉత్పత్తుల్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం.

3. హార్మోన్ల అసమతుల్యత

ఇక మొటిమలకు మూడో ప్రధాన కారణం హార్మేన్ల అసమతుల్యత. టీనేజర్లు, యువతీయువకుల్లో మొటిమలు ఎక్కువగా కనిపించడానికి కారణం ఆ వయస్సులో వారి హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉండటమే. హార్మోన్ల అసమతుల్యత కారణంగా అధికంగా జిడ్డు ఉత్పత్తి అయి, మొటిమలకు దారితీస్తుంది.

అధ్యయనం ప్రకారం ఆహారపు అలవాట్లు కూడా మొటిమలకు కారణం. ఎక్కువ కొవ్వు, చక్కెర పదార్థాలు తీసుకునేవారిలో మొటిమలు మళ్లీ మళ్లీ వస్తాయని తేలింది. అందుకే, మొటిమల బారినపడేవారు యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటే సమతుల్య ఆహారపు అలవాట్ల అలవర్చుకోవాలి.

మొటిమల చికిత్సకు ఉన్న మార్గాలు

మొటిమలకు, మొటిమల మచ్చలకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది మొటిమల రకం, తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మరి సాధారణంగా మొటిమలకు ఉన్న చికిత్సల గురించి తెలుసుకోండి:

1. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్

చిన్నచిన్న మొటిమలు తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే బెంజాయిల్ పెరాక్సైడ్, సలిసిలిక్ యాసిడ్ లాంటి మందులు ఉపయోగించవచ్చు. ఇవి పూడుకుపోయిన రంధ్రాలు తెరుచుకునేలా చేయడంతో పాటు మంటను తగ్గిస్తాయి.

2. ఓరల్ యాంటీబయాటిక్స్

మొటిమలు మధ్యస్తం నుంచి తీవ్రంగా ఉంటే ఓరల్ యాంటీబయాటిక్స్ వాడమని సూచిస్తారు. యాంటీబయాటిక్స్ మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపడంతో పాటు మంటను తగ్గిస్తాయి.

3. నాన్ సర్జికల్ చికిత్సలు

మొటిమల చికిత్సలో పలు రకాల నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లేజర్ థెరపీ, కెమికల్ పీల్స్, లైట్ థెరపీ లాంటివి.

మొటిమలను త్వరగా ఎలా వదిలించుకోవాలి?

మొటిమల్ని వదిలించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి బెంజాయిల్ పెరాక్సైడ్, సలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్‌తో ఉన్న మెడిసిన్ ఉపయోగించడం. బెంజాయిల్ పెరాక్సైడ్ మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. సలిసిలిక్ యాసిడ్ మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంలో సాయపడుతుంది.

ఇక మొటిమల్ని తగ్గించడానికి ఉపయోగపడే మరో మెడిసిన్ రెటినాయిడ్ క్రీమ్. విటమిన్ ఏ డెరివేటీవ్స్ ఉండే రెటినాయిడ్స్‌ చర్మకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. రంధ్రాలను క్లియర్ చేయడంతో పాటు, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది.

మొటిమలు వేగంగా తగ్గాలనుకుంటే మృదువుగా ఉండే క్లీన్సర్ ఉపయోగించాలి. చర్మాన్ని గట్టిగా రుద్దడాన్ని తగ్గించాలి. చర్మాన్ని శుభ్రపర్చిన తర్వాత తేమగా ఉండేలా చూసుకోవాలి.

ఈ సింపుల్ టిప్స్ ఫాలో కావడం ద్వారా, మొటిమల్ని త్వరగా వదిలించుకోవడంతో పాటు, మొటిమల వల్ల వచ్చే మచ్చల్ని తగ్గించుకోవచ్చు.

ముగింపు

మొటిమలు అన్ని వయస్సుల వారిని వేధించే సర్వసాధారణ చర్మ సమస్య. జిడ్డు, మృతకణాల వల్ల మొటిమలు ఏర్పడతాయి. చర్మ రంధ్రాలు పూడుకుపోయి, బ్యాక్టీరియా పెరిగి, మంటకు కారణం అవుతాయి. మొటిమలు ఏర్పడటానికి హార్మోన్ల ప్రభావం, మందులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లాంటి కారణాలు ఉన్నాయి. మొటిమల సమస్య మరీ ఎక్కువగా ఉంటే చర్మ సంరక్షణ నిపుణుల్ని లేదా డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాలి. వారు మొటిమలకు గల కారణాలు గుర్తించి, వాటిని తగ్గించడానికి ఏం చేయాలో చెప్పడంతో పాటు, భవిష్యత్తులో మొటిమలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారు

Tea Tree Face Wash with Neem & Glycolic Acid - 100 gm

Tea Tree Face Wash with Neem & Glycolic Acid - 100 gm

Cleanses, Exfoliates & Fights Acne | Removes Blackheads & Whiteheads

29153 Moms bought
₹199₹24920% Off
Rating
4.2
(288)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.