This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu
Likes1 Likes|
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో కొబ్బరి తీసుకోవడం మంచిదే. కొబ్బరిలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండి శిశువు ఆరోగ్యకర అభివృద్ధికి సాయపడతాయి.
  • కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్, వికారం, ఉదయపు అలసటను తగ్గిస్తాయి. లేత కొబ్బరిలోని పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది, యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • కొబ్బరి తింటే బిడ్డ అందంగా పుడుతుందని, జుట్టు ఒత్తుగా వస్తుందని, తల పెద్దగా అవుతుందని ఉండే అపోహలు నిజం కావు. శిశువు లక్షణాలు జన్యువులపై ఆధారపడతాయి.
  • గర్భధారణ సమయంలో సరైన పోషణ కోసం ఏం ఎంచుకోవాలి? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Rating4.5

ఒక మహిళ తల్లి కావడంతో ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఆ ఉత్సాహం ఎంత ఉంటుందో సందేహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు అని ఆహారం విషయంలో కాబోయే తల్లులకు అన్నీ సందేహాలే. కొబ్బరి విషయంలోనూ పలు సందేహాలు ఉంటాయి. కొబ్బరిని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తీసుకోవడం గురించి సందేహాలు ఉన్నట్టైతే అనేక అంశాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది.

గర్భధారణ సమయంలో కొబ్బరి తినడం మంచిదా? (Is Coconut Good In Pregnancy in Telugu)

మానవుడి జీవితంలో ప్రతీ దశలో తీసుకోవాల్సిన పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి, కడుపులో బిడ్డ అభివృద్ధికి కావాల్సిన మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివాటిలో కొబ్బరి కూడా ఒకటి. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలకు నెలవు కొబ్బరి. గర్భవతులు పండ్లు, కూరగాయలు కలిపి తీసుకుంటే కీలకమైన పోషకాలు లభిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం విషయానికి వస్తే, కొబ్బరి ఏ రకంగా తీసుకున్నా అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు సమతుల్యంగా కొబ్బరిని తీసుకోవాలి.

గర్భధారణ సమయంలో కొబ్బరి తినడం వల్ల ప్రయోజనాలు (Benefits Of Coconut In Pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం మంచిదే. అయితే సమతుల్యంగా తీసుకుంటే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

  • లేత కొబ్బరిలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి ఇవన్నీ అవసరం కూడా.
  • కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో మంచి కొవ్వు పెరగడానికి కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. కడుపులోని శిశువు అబివృద్ధికీ మేలు చేస్తుంది.
  • కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగలో తీసిన కొబ్బరి నూనెతో ఎంతో మేలు కలుగుతుంది. వేడి చేయడం లాంటి ప్రక్రియలు ఉపయోగించరు కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె శరీరానికి మేలు చేస్తుంది. చర్మరక్షణకు ఉపయోగపడుతుంది. గర్భవతులకు దురద, చర్మంపై చారల్ని తగ్గిస్తుంది. ఇక కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్, విటమిన్ ఇ గర్భధారణ సమయంలో చర్మాన్ని సహజంగా సంరక్షించుకోవడానికి ఉపయోగపడతాయి.
  • గర్భవతిగా ఉన్నప్పుడు లేత కొబ్బరి తినడం వల్ల మూత్ర మార్గంలో అంటువ్యాధులు, ఉదయాన్నే అలసటగా అనిపించడం, పాదాల వాపు లాంటివి తగ్గుతాయి.
  • లేత కొబ్బరిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు సాయపడతాయి.
  • పచ్చి కొబ్బరిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎక్కువగా ఉండే మలబద్ధక సమస్యను నివారించడానికి లేతకొబ్బరి ఉపయోగపడుతుంది.
  • గర్భధారణ సమయంలో కొబ్బరి తీసుకోవడం వల్ల నవజాత శిశువుకు తల్లిపాలు సమృద్ధిగా లభిస్తాయి. తల్లిపాలల్లో ఉండాల్సిన లారిక్ యాసిడ్ కొబ్బరి ద్వారా పొందవచ్చు.
  • ఇక కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. వికారాన్ని ఎదుర్కోవడానికి కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. రక్తం పరిమాణాన్ని కూడా నియంత్రిస్తుంది.
  • కొబ్బరి నీళ్లల్లో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. గర్భవతులకు ఉదయం పూట ఉండే అలసటను కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి. ఉదయం వేళ అలసట కారణంగా కోల్పోయే కీలక పోషకాలను అందించి, వారిని రీహైడ్రేట్ చేసేందుకు కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి.
  • గర్భవతులు రక్తహీనతతో బాధపడుతుంటారు. అది ఆ తల్లితో పాటు, బిడ్డకు కూడా హానికర పరిస్థితి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తీసుకోవడం వల్ల రక్తహీనత పైనా పోరాడవచ్చు.

గర్భధారణ సమయంలో కొబ్బరి తినడంపై గల అపోహలు (Myths About Coconut Eating During Pregnancy in Telugu)

అయితే కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలపై కావాల్సినంత సమాచారం లేకపోవడం, వాళ్లూ, వీళ్లూ చెప్పే మాటలు వినడం వల్ల అనేక అపోహలు కలుగుతున్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రభావాలపై అనేక అపోహలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

1. కొబ్బరి తింటే బిడ్డ అందంగా పుడుతుంది (Consuming coconut can make the baby fair)

గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తీసుకుంటే బిడ్డ అందంగా పుడుతుందని నమ్ముతుంటారు. ఇది వాస్తవం కాదు. శిశువు యొక్క రంగు జన్యువులపై ఆధారపడి ఉంటుంది తప్ప, తల్లి ఏమి తింటుందనే దానిపై కాదన్న విషయం గుర్తుంచుకోండి.

2. కొబ్బరి నీళ్లు తాగితే బిడ్డ జుట్టు ఒత్తుగా, బలంగా వస్తుంది (Coconut water will make the baby's hair thick and strong)

నవజాత శిశువు భౌతిక లక్షణాలను పోషకాహారం, జన్యువులు నిర్ణయిస్తాయి. అంతే తప్ప కేవలం ఒకే ఆహారంపై జుట్టు ఆకృతి లేదా బలం ఆధారపడి ఉండదు. అది జన్యువులను మార్చదు.

3. ఎసిడిటీకి కొబ్బరి నీళ్లు కారణం (Coconut water can cause acidity)

కొబ్బరి నీళ్లు తాగితే ఎసిడిటీ వస్తుందన్న అపోహ ఉంది. కానీ ఎసిడిటీకి కొబ్బరి నీళ్లు కారణం కాదు. గర్భధారణ సమయంలో ఎసిడిటీకి ఇతర కారణాలు ఉంటాయి.

4. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తింటే, కడుపులోని బిడ్డ తల కొబ్బరికాయలా పెద్దగా ఉంటుంది (Consuming coconut during pregnancy makes the baby's head as big as the coconut's)

ఇది హాస్యాస్పదం. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దీనికి ఎలాంటి వివరణ అవసరం లేదు. కొబ్బరికాయ మాత్రమే కాదు. ఏ పండు లేదా కూరగాయ శిశువు తల పెద్దగా పెరగడానికి ఉపయోగపడదు. అదే నిజమనుకుంటే మరి పుచ్చకాయ తింటే శిశువు తల అంత పెద్దగా అవుతుందా? ఇది ఓ అపోహ మాత్రమే.

5. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు మంచి డ్రింక్ (Coconut water is the best drink during pregnancy)

ముందుగా చెప్పినట్టు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా జీవితంలో ఏదైనా దశలో ఉన్నప్పుడు ఆ దశకు కావాల్సిన పోషకాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వేర్వేరు ఆహార పదార్థాల ద్వారా వస్తాయి. కొబ్బరి నీళ్లు పోషకాలను అందించేవే. ఇది మంచి హెల్తీ డ్రింక్ కూడా. అయితే ఇతర ఆహార పదార్థాల లాగానే మితంగా తీసుకోవడం మంచిది. అంతే తప్ప కొబ్బరి నీళ్లు మనం రోజూ తాగే మంచినీళ్లకు ప్రత్యామ్నాయం కాదు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: చలికాలంలో మీ బిడ్డకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలా?

గుర్తుంచుకోవాల్సిన అంశాలు (Takeaway)

గర్భవతి కావడం, ఆ తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదించడం మహిళ జీవితంలో గుర్తుండిపోయే సమయం. మంచి పోషకాలు ఉన్న ఆహారం, మంచి వాతావరణం తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మితంగా తీసుకోవడం అవసరం. కొబ్బరి మాత్రమే కాదు ఏ ఆహారాన్ని కూడా అతిగా తీసుకోకూడదు. డైట్‌లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఉండాలి. గర్భవతి శరీరం ఇచ్చే సూచనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

References

1. Yong JW, Ge L, Ng YF, Tan SN. (2009). The chemical composition and biological properties of coconut (Cocos nucifera L.) water. Molecules.

2. Gunasekaran R, Shaker MR, Mohd-Zin SW, Abdullah A, Ahmad-Annuar A, Abdul-Aziz NM. (2017). Maternal intake of dietary virgin coconut oil modifies essential fatty acids and causes low body weight and spiky fur in mice. BMC Complement Altern Med.

Tags

Coconut good in pregnancy in Telugu, What are the benefits of coconut in pregnancy in Telugu, What are the myths about coconut during pregnancy in Telugu, Coconut in Pregnancy: Benefits & Myths in English, Coconut in Pregnancy: Benefits & Myths in Hindi, Coconut in Pregnancy: Benefits & Myths in Tamil, Coconut in Pregnancy: Benefits & Myths in Bengali

గర్భిణీ తల్లుల ఆరోగ్యానికి నమ్మకమైన తోడు

మీ గర్భధారణ ప్రయాణంలో సమతుల్య పోషణ, చర్మ సంరక్షణ కోసం సహజమైన, సురక్షితమైన ఉత్పత్తులు మీకు తోడుగా ఉంటాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Made with Natural Ingredients | Tightens Skin | Prevents New and Fades Old Stretch Marks |

118753 Moms bought
₹611₹84828% Off
Rating
4.5
(607)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.