This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో చియా విత్తనాలు: తీసుకోవడం సురక్షితమేనా? ప్రయోజనాలు & ప్రమాదాలు (Chia Seeds During Pregnancy: Is It Safe? Benefits & Risks in Telugu)

Pregnancy Best Foods
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 28, 2026
గర్భధారణ సమయంలో చియా విత్తనాలు: తీసుకోవడం సురక్షితమేనా? ప్రయోజనాలు & ప్రమాదాలు (Chia Seeds During Pregnancy: Is It Safe? Benefits & Risks in Telugu)
Likes1 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, గర్భధారణ సమయంలో శిశువు మెదడు, ఎముకల వికాసానికి దోహదపడతాయి.
  • గర్భవతులకు చియా గింజలు ఆకలిని తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణ ఇంకా మలబద్ధకం నుండి ఉపశమనం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
  • గర్భిణీ స్త్రీలు రోజుకు 28 గ్రాముల చియా విత్తనాలను మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే డీహైడ్రేషన్, అతిసారం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.
  • గర్భధారణ సమయంలో పోషకాహారానికి ఏది సహాయపడుతుంది? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Compression Stocking Socks - S
Compression Stocking Socks - S
Rating4.5

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకునే వారిలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ ఫుడ్ ఈ చియా విత్తనాలు. ఈ విత్తనాలకు రుచి, వాసన లేనందున, తినే వంటకం ఏదైనా, వాటి పోషక స్థాయిలను పెంచడానికి వాటికివి చేర్చుకోవచ్చు. ఈ చియా విత్తనాలు మధ్య అమెరికాకు చెందినవైనా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటికి ఎంతో డిమాండ్ ఉంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేనప్పటికీ, గర్భిణీ స్త్రీలు వారు తీసుకొనే ఆహారాల గురించి జాగ్రత్త పడాలి. చియా విత్తనాలను ఆహారాలలో చేర్చుకునే ముందు వాటిలోని పోషక విలువలను చదివి అర్థం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో చియా విత్తనాలను తీసుకొనే ముందు ఎదురయ్యే ప్రమాదాలేవనేవి తెలుసుకోవాలి.

గర్భధారణ సమయంలో చియా విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Chia Seeds During Pregnancy in Telugu)

చియా విత్తనాలు మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి, అంతేకాక అవి శిశువు వికాసానికి అవసరమైన వివిధ పోషకాలను కలిగి ఉంటాయి

1. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ - గర్భధారణ సమయంలో శిశువు మెదడు చక్కగా వృద్ధి చెందేందుకు ఇవి దోహదపడతాయి. వీటిలోని కొవ్వు ఆమ్లాలు తల్లులకు డిప్రెషన్ ఇంకా అనాసక్తుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న సముద్ర ఆహారాలు తినలేని గర్భిణీ స్త్రీలు చియా విత్తనాలను వాటికి బదులుగా తీసుకోవచ్చు.

2. కాల్షియం - శిశువులో ఎముకలు ఇంకా దంతాలు సరిగ్గా పెరిగేందుకు కాల్షియం అవసరం. ఒక టేబుల్ స్పూను చియా గింజలలో 75 mg కాల్షియం ఉంటుంది.

3. యాంటీ-ఆక్సిడెంట్లు - చియా గింజలు జింక్, సెలీనియం మరియు మాంగనీస్ వంటి ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి గర్భధారణ సమయమలో ఎదురయ్యే కింద చూపినటువంటి అనేక సమస్యలను ఆపడంలో సహాయపడతాయి

గర్భధారణ సమయంలో మహిళలు చియా సీడ్స్ తీసుకోవడం వారికి ఉపకరిస్తుంది. గర్భవతులు చియా గింజలను వారి ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు

1. ఆకలిని తగ్గిస్తుంది - చియా గింజల్లో పీచుపదార్థాలు ఎక్కువ ఉండటం వలన ఎక్కువ సమయం కడుపు నిండినట్లుండేలా చేస్తుంది. ఇది గర్భధారణలో అతిగా తినాలనే కోరికలను ఇంకా అనవసరంగా కేలరీలను పెంచుకొనే అవసరం రాకుండా చేస్తుంది.

2. రక్తంలో చక్కెర నియంత్రణ - హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల, చాలా మంది గర్భిణీ స్త్రీలకు గర్భధారణ వేళల్లో మధుమేహం పొడచూపుతుంది. చియా గింజలు తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నియంత్రణలోకి తేవడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించుకోవచ్చు.

3. మలబద్ధకం నుండి ఉపశమనం - చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడుతుంటారు. చియా గింజలు అధిక పీచుపదార్థాన్ని కలిగి ఉంటాయి, అవి జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేయడం వల్ల మలబద్ధకాన్ని నివారించడంలో దోహదపడతాయి.

గర్భధారణ సమయంలో చియా విత్తనాల వల్ల కలిగే సమస్యలు (Risks of Eating Chia Seeds During Pregnancy in Telugu)

గర్భివతులు రోజుకు కేవలం 28 గ్రాముల చియా విత్తనాలను మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చియా విత్తనాలను ఎక్కువగా తీసుకొంటే, అది ఈ క్రింద చూపినటువంటి దుష్ప్రభావాలకు దారితీయవచ్చు

1. డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం)

2. అతిసారం

3. చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడం

పాలిచ్చే తల్లులకు కలిగే ప్రయోజనాలు: (Benefits of Chia Seeds for Breast-Feeding Moms in Telugu)

చియా విత్తనాలు ప్రసవం తర్వాత కూడా మేలు చేస్తాయి, ఎందుకంటే అవి పాలిచ్చే తల్లులకు ఎంతగానో ఉపకరిస్తాయి.

1. పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి సజావుగా జరిగేందుకు రోజుకు కనీసం 500 కేలరీలు ఎక్కువ అవసరామౌతాయి. చియా విత్తనాలు కేలరీలు అందించే భాండాగారాలు, ఎందుకంటే 28 గ్రాముల గింజలలో 138 కేలరీలు లభిస్తాయి. ఆరోగ్యవంతంమైన రీతిలో క్యాలరీలు పొందేందుకు ఈ విత్తనాలను తల్లైనా వారి ఆహారంలో చేర్చవచ్చు.

2. చియా గింజల్లో మంచి పోషకాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, అవి తల్లిపాల ద్వారా బిడ్డకు అందించబడతాయి.

3. ఎందరో నిపుణుల చెప్పిన దాని ప్రకారం, చియా గింజలు తల్లి పాలలో DHA పరిమాణాన్ని పెంచడంలో దోహదపడతాయి. శిశువులో మెదడు చక్కగా వృద్ధి చెందడానికి ఇది ఎంతో అవసరం.

మీ ఆహారంలో వీటిని ఎలా చేర్చుకోవచ్చు (How to Include Them in Your Diet)

చియా విత్తనాలకు రుచి ఉండదు, అందువల్ల అదనపు పోషకాల కోసం ఎలాంటి వంటకాలలోనైనా చేర్చుకోవచ్చు. కొంతమంది గర్భవతులు చియా గింజల కనిపించే తీరును ఇష్టపడరు. అటువంటి సందర్భాలలో, వీటిని పొడి చేసి వివిధ వంటకాలలో వాడుకోవచ్చు.

వివిధ రకాల వంటలను వండేటప్పుడు చియా విత్తనాలు లేదా పొడిని వాటికి ఎలా జతచేయవచ్చో ఇక్కడ చూపబడ్డాయి.

1. చిక్కబరిచే పదార్థంగా - చియా గింజలను చిక్కబరిచే పదార్థంగా ఉపయోగించే కార్న్‌ఫ్లోర్‌కు బదులుగా ఉపయోగించవచ్చు. చియా గింజలు నీటిని పీల్చుకుంటాయి కాబట్టి, అవి సూప్‌లు, పప్పులు ఇంకా కూరలు చాలా కాలం పాడవకుండా చేస్తాయి ఇంకా వాటిని చిక్కబరుస్తాయి.

2. జ్యూస్/స్మూతీస్ - చియా గింజలను వివిధ పండ్లు లేదా కూరగాయలతో కలిపి జ్యూస్ లేదా స్మూతీస్ లాంటివి తయారు చేసుకోవచ్చు. కొంతమంది టీ కాచేటప్పుడు చియా గింజల పొడిని కూడా కలుపుతారు, ఎందుకంటే దీనివల్ల టీ రుచిలో ఎలాంటి మార్పు రాదు.

3. గుడ్డుకి ప్రత్యామ్నాయం - ఈ గింజలు గుడ్లకు మంచి ప్రత్యామ్నాయాలు ఇంకా బేకింగ్‌లో గుడ్లకు బదులుగా వీటిని వాడవచ్చు. కుకీలు, బ్రెడ్, కేకులు మరియు రస్క్‌లు వంటి బేకింగ్ వంటకాలలో చియా విత్తనాలు గుడ్లకు బదులుగా వాడితే చక్కగా వాటిలానే పనిచేస్తాయి.

4. అల్పాహారం వంటకాలు - చియా గింజలను తృణధాన్యాలు ఇంకా ఓట్స్ వంటి అల్పాహార వంటకాలకు జోడించడం ఎక్కువగా జరుగుతోంది. ఆరోగ్యకరమైన భారతీయ అల్పాహార వంటకాలు చేసేందుకు చియా గింజల పొడిని చపాతీ పిండి, దోస మరియు ఇడ్లీ పిండి వంటి వాటికి కూడా కలపవచ్చు.

5. మధ్యాహ్న/రాత్రి భోజనాలకు - వంట చేసే సమయంలో బియ్యానికి లేదా క్వినోవాలో చియా గింజలను కలపడం వల్ల వాటి పోషక విలువలను చక్కగా పెంచుకోవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అవిసె గింజలు: గర్భవతులు తినడం సురక్షితమేనా?

సారాంశం (Summary)

గర్భధారణ సమయంలో స్త్రీలకు ఉపయోగపడే మంచి పోషక విలువలను చియా విత్తనాలు కలిగి ఉంటాయి. కానీ అన్ని ఆహారాల లాగానే, వారు తమ ఆరోగ్యానికి హాని జరగకుండా ఉండేందుకు చియా విత్తనాలను మితంగా తీసుకోవాలి. గర్భవతులు గర్భధారణ వేళల్లో, వారి ఆహారంలో కొత్త పదార్థాలను జోడించే ముందు చాలా అప్రమత్తంగా ఉండాలి. చియా విత్తనాలు ఇంకా వాటి ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, మైలో యాప్‌ని దర్శించండి.

గర్భిణీ తల్లులు నమ్మే ఆరోగ్యకరమైన పోషకాహార సహచరులు

మీ గర్భధారణ ప్రయాణంలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించే సురక్షిత ఆహార పదార్థాలు ఇంకా సప్లిమెంట్లు మీకు తోడుగా ఉంటాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Compression Stocking Socks - S

Compression Stocking Socks - S

Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation

460 Moms bought
₹364₹59939% Off
Rating
4.5
(31)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.