This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు చేయాలి? (What is Cord Blood Banking and Why Should You Get It Done in Telugu?)

Stem Cell Banking
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు చేయాలి? (What is Cord Blood Banking and Why Should You Get It Done in Telugu?)
Read time10 min

మూలకణాలను (స్టెమ్ సెల్స్‌ను), కార్డ్ బ్లడ్‌ను భద్రపరచుట

మూలకణాలను భద్రపరచటం అంటే అప్పుడే పుట్టిన శిశువుల బొడ్డు దగ్గర రక్తాన్ని సేకరించి నిలువ ఉంచటం ద్వారా మానవ శరీరంలోని విలువైన మూలకణాలను భవిష్యత్ అవసరాలకు, రాబోయే రోజుల్లో అవసరమైన చికిత్సల కోసం భద్రపరచి ఉంచడం అన్నమాట. అలా భద్రపరచి ఉంచిన వాటిని ప్రత్యేకంగా జాగ్రత్త చేసి, క్రొత్త కణాలు తయారయ్యేలా చేస్తారు. ఈ బొడ్డు దగ్గరి మూలకణాలు సహజమైనవి, అత్యంత విలువైనవి. వాటిని అవసరం అయినప్పుడు, రకరకాల కారణాల వల్ల గాని ప్రమాదవశాత్తు గాని పాడైపోయిన కణాలను మార్పిడి చేయడానికి ఉపయోగిస్తారు.

వాటిని శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు అవి ఎక్కడి కణాలు పాడయ్యాయో అక్కడికి చేరుకుని, ఆయా కణాల లక్షణాలను ఏర్పరచుకుని, వాటికి బదులుగా అచ్చంగా అవి చేసే పనిని తాము చేయడం మొదలుపెడతాయి. అలా చేయడం కేవలం మూలకణాలకు మాత్రమే సాధ్యం. శరీరంలోని ఏ ఇతర కణాలకూ ఇలా క్రొత్త కణాలను పుట్టించే శక్తి లేదు. కాబట్టి ఆ మూలకణాలను భద్రపరచి ఉంచడం చాలా అవసరం అనే భావన పెరిగింది. ఆ మూలకణాలను పసిపిల్లలు పుట్టినప్పుడే వారి బొడ్డు తాడు నుంచి సేకరించడం జరుగుతుంది.

ఈ కార్డ్ బ్లడ్‌ను తల్లి గర్భం నుంచి పిల్లను వేరుచేసి, కార్డ్‌ను‌ కోసినప్పుడే ఆ తాడులో ఉంటుంది. వీటిని ఉపయోగించి వైద్యం చేయడం బోన్ మారో చికిత్సకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కణాలను రక్తసంబంధ కణాలు అంటారు. ఇవి అనేక రకాలుగా రూపాంతరం చెంది, వివిధ జబ్బులను నివారించడానికి, రక్త సరఫరా లోపాల నివారణకు, జీవక్రియలో ఏర్పడే రకరకాల జబ్బుల నివారణకు, రోగనిరోధకశక్తిలోని తేడాలను సవరించడానికి ఉపయోగపడతాయి. కార్డ్‌లో నుంచి రక్తాన్ని సేకరించి వివిధ పద్ధతుల్లో జాగ్రత్త చేస్తారు. సరైన పద్ధతిలో దాచబడిన ఈ రక్తం 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే చెడకుండా ఉంటుంది.

ఈ బొడ్డుతాటినుంచి తీసుకున్న మూలకణాలు, బోన్ మారో నుంచి తీసుకున్న కణాలకంటే ఎక్కువ ఉపయోగకారిగా ఉంటాయి. ఈ కణాలను శరీరం వ్యతిరేకించడం కాని, పాడయిపోవడం కాని, ఇన్ఫెక్షన్లు రావడం కాని జరగదు. బోన్ మారో కంటే సమర్థవంతంగా పనిచేస్తాయి. డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఈ కార్డ్ కణాలను క్యాన్సర్ పేషంట్ల ప్రాణాలను కాపాడేందుకు, వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు, కీమోధెరపీ సమయంలో ఉపయోగిస్తుంటారు.

నాభితాడు నుంచి తీసిన మూలకణాల ఆనుకూల్యత (Cord Blood Compatibility)

నాభితాడులోంచి తీసిన రక్తాన్ని భద్రపరచటం అనేది క్రొత్తగా ప్రారంభమైనది కాదు. వేలాది కుటుంబాలు ఇలా మూల కణాలను భద్రపరచటం అనేదాన్ని కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. అంతేకాక ఎంతోమంది అలా భద్రపరచి అవసరమైనప్పుడు ఆరోగ్య సమస్యలనివారణకు ఉపయోగించుకుని, దానివల్ల ఎంతో ఉపయోగాన్ని కూడా పొందారు. ఈ కార్డ్ నుంచి తీయబడిన రక్తం, మూలకణాలు ఆ వ్యక్తికే కాక, కుటుంబంలోని దగ్గర బంధువులు ఎవరికైనా ఉపయోగపడడం అనే ముఖ్యమైన అనుకూలతే ఈ కణాలను భద్రపరచటానికి ముఖ్య కారణం.

ఆ పుట్టిన శిశువు ఆ కార్డ్ నుంచి తీసిన మూలకణాల వల్ల 100 శాతం లబ్ధిని పొందుతారు. ఎందుకంటే అది వారి సొంతం కనుక. ఆ శిశువు తల్లిదండ్రులు కూడా 100 శాతం ఉపయోగించుకోగలుగుతారు. దానికి కారణం వారు ఆ శిశువుకు స్వయంగా సంబంధించినవారు కాబట్టి. శిశువు సహోదరులకు కూడా ఆ కణాలు సుమారుగా 75 శాతం అనుకూలంగా ఉపయోగపడతాయి. శిశువుకు సంబంధించిన తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలకు ఆ కణాలు 25 శాతం ఉపయోగకరంగా ఉంటాయి.

కార్డ్ నుంచి రక్తాన్ని, కణాలను తీసి జాగ్రత్త చేయడం అనేది పూర్తిగా సురక్షితం, నొప్పిలేని, ఏమాత్రం ఇబ్బంది లేని విధానం. దానివల్ల మీకు ఏ విధమైన హానికాని, పురుడు తర్వాత జరిగే కార్యక్రమాల విషయంలో ఏ విధమైన ఆటంకం గాని కలగదు. పిల్లల నుంచి ఆ కార్డ్‌ను కత్తిరించగానే, దానినుంచి రక్తాన్ని విడదీయడం వల్ల, అక్కడ ఒక తాడులాంటిది మాత్రమే మిగులుతుంది. దానిని కత్తిరించి బాగా శుభ్రం చేసిన స్టోరేజి కప్పులో ఉంచి, లేబ్‌కు కాని, మీకు సంబంధించిన హెల్త్ కేర్ వారికి గాని పంపించి, అందులోనుంచి స్టెమ్ సెల్స్‌ను విడదీసి వాటిని సురక్షితంగా, ముందుముందు ఆరోగ్య అవసరాలకు ఉపయోగించడానికి వీలుగా భద్రపరుస్తారు.

ఈ నాభిరక్తం భద్రపరచటానికి అయ్యే ఖరీదు ఎంత? (How much does Cord Blood Banking Cost in Telugu?)

అమెరికాలోను, ఇతర యూరోపియన్ దేశాలలోను ఈ నాభికణాలను దాచే ప్రక్రియ పూర్తిగా ఉచితంగా చేస్తారు. ఎందుకంటే వాటిని వేరే పిల్లలకు, పెద్దవారికి కూడా, అవి అన్ని విధాలుగా సరిపోయినట్టైతే ఉపయోగిస్తారు. అలాగే మనకు, మన కుటుంబం వారికి కావాలన్నా మూలకణాలను పొందే అవకాశం ఉంటుంది.

ఒకవేళ మనకు మాత్రమే ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో మూలకణాలను ఏదైనా ప్ర్రైవేటు బ్యాంకుల్లో దాచుకోవాలంటే మాత్రం దానికి అయ్యే ఖర్చు సుమారు 1500 నుంచి 2500 డాలర్ల వరకు అవుతుంది. ఇదేకాక సుమారు 200 డాలర్ల వరకు ప్రతి ఏడూ సదరు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.

కార్డ్ టిష్యూను భద్రపరచటం (Umbilical Cord Tissue Banking)

ఒకవేళ కార్డ్ టిష్యూను కూడా దాచాలనుకుంటే చాలా ఖర్చు చాలా అవుతుంది. ఈ కార్డ్ టిష్యూ, శిశువుకు తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి, పుట్టేవరకు తల్లినుంచి రక్తం సరఫరా జరిగే సమయంలో సిరలను చాలా జాగ్రత్తగా కాపాడుతూ, ఆ రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది. అలా రక్తాన్ని కాపాడడమే కాకుండా ఆ తాడు ఇంకా ఎన్నోరకాల కణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న కణాలకు, కార్డ్ నుంచి సేకరించిన రక్తంలోని కణాలకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి కార్డ్ టిష్యూలో మీసెంఖైమల్ మూలకణాలు (MSCs) ఉంటే, బొడ్డునుంచి తీసిన రక్తంలో హెమటోపొయిటిక్ మూలకణాలు (HSCs) సమృద్ధిగా ఉంటాయి.

భారతదేశంలో మూలకణాలను భద్రపరచే విధానం (Stem Cell banking in India)

కార్డ్ నుంచి టిష్యూను, రక్తాన్ని భద్రపరచటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి అని, వాపులని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, కణాలను బాగుచేయడానికి ఈ కణాలు ఉపయోగపడతాయని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది. అలా ఆయా లాభాలు ఉండటం వల్ల లక్షలాదిమంది సైంటిస్టులు, డాక్టర్లు ఈ కణజాలాలు భద్రపరచటం అనే ప్రక్రియమీద, దానివల్ల కలిగేమీద చాలా ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూపిస్తున్నారు.

భారతదేశంలో సుమారు రెండువేలకు పైగా ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్లు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. కానీ సరిపడా డబ్బును పెట్టలేని కారణంగా చాలా పబ్లిక్ సంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల ప్రస్తుతం కేవలం ప్రైవేటు బ్యాంకులు, కొన్ని కమ్యూనిటీ బ్యాంకుల్లోనే ఇలా భద్రపరచటానికి వీలు ఉంది. వాటిల్లో కొన్నిపేర్లు క్రింద ఇవ్వబడ్డాయి.

  • కార్డ్ లైఫ్ ఇండియా
  • లైఫ్ సెల్
  • కార్డ్ కేరి ఇండియా
  • నోవాకార్డ్
  • బయోసెల్
  • రిలయన్స్
  • రీ లాబ్స్
  • స్టెమ్ సైట్ ఇండియా

క్రయోవివా ఇండియా లాంటి కొన్ని బ్యాంకులు కూడా ఇలా 50 ఏళ్ళనుంచి, లైఫ్ టైమ్ స్టోరు చేయడానికి ఒక్కసారే డబ్బును కట్టించుకునే విధానాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ మెయింటెనెన్సుకు మళ్ళీ డబ్బు కట్టక్కరలేదు.

భారతదేశంలో కార్డ్ బ్లడ్‌ను భద్రపరచటానికి ఎంత ఖర్చు అవుతుంది? (How Much Does Cord Blood Banking Cost in India in Telugu?)

కార్డ్ బ్లడ్‌ను భద్రపరచటానికి భారతదేశంలో సుమారుగా రూ.50,000 నుంచి రూ.80,000 వరకు ఖర్చు అవుతాయి. ఇలా దాచుకోవడమే కాక, ఇతరులకు ఉపయోగించడానికి ప్రభుత్వ బ్యాంకులకు, లేదా ఏదైనా రీసెర్చి కోసం కూడా డొనేట్ చేసే సౌకర్యం ఉంది. ఒక్క భారతదేశంలోనే ప్రతి ఏడూ సుమారు రెండువేల మంది ఇలా స్టెమ్ సెల్స్‌ భద్రపరచటం జరుగుతోంది.

కార్డ్‌ను దాచే ప్రక్రియను ఎందుకు చెయ్యాలి? (Why Should I Get Cord Blood Banking Done in Telugu?)

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మందికి పైగా ఈ ప్రక్రియను మెడికల్ ప్రొఫెషనల్స్ ద్వారా చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే 2 నుంచి 3 వేల మంది దాకా ఇలాంటి ట్రాన్స్ ప్లాంట్‌లను చేస్తున్నారు. ఇలా భద్రపరచిన కణాలు ఆ శిశువుకు ఆరోగ్య సంరక్షణకు, సీరియస్ ప్రాణాపాయ పరిస్థితుల్లో కాపాడడానికి ఉపయోగపడడమే కాక ఇతరులకు కూడా వారి ఆరోగ్య సంరక్షణకు, అవసరానికి ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియ చాలా సులభమే కాక చాలా తొందరగా అయిపోతుంది కూడా. శిశువు పుట్టిన ఒక్క 15 నిముషాల్లోపే మీ హెల్త్ కేర్ ప్రొవైడరు కాని, పురుడు పోసిన డాక్టరుకాని ఆ కార్డ్‌ను కత్తిరించి, ఒక సిరంజిద్వారా కార్డ్ నుంచి రక్తాన్ని సేకరించి దాన్ని స్టెరైల్ చేసిన బ్యాగ్‌లో వేస్తారు. ముందు ముందు ఉపయోగించడానికి, వైద్య పరిశోధనలకు సుమారు ఒకటిన్నర కప్పుల మూలకణాలను కలిగిఉన్న రక్తాన్ని సేకరిస్తారు.

ఇలా రక్తాన్ని సేకరించడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా, ఇలా కార్డ్ బ్లడ్‌ను భద్రపరచటం అనేది తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలనుంచి, అత్యవసర పరిస్థితుల నుంచి కాపాడే అవకాశం ఉందనే మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇలా భద్రపరచిన రక్తాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునే అవకాశాన్ని ఆయా బ్యాంకులు అందించడం బ్యాంకు వారికి కూడా ఉపయోగకరం. రెండో విషయం ఏమంటే.. కార్డ్ రక్తం ఉపయోగంమీద దశాబ్దాలుగా చాలా పరిశోధనలు జరిగి సుమారు 80 రకాల జబ్బులను ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని నిరూపించబడ్డాయి.

మూడోది ఈ బొడ్డురక్తంతో.. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ లాంటి వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది అని తెలుస్తోంది. ఇంకా ఈ విషయంలో మెడికల్ ప్రొఫెషనల్స్ ద్వారా ఎన్నో పరిశోధనలు చేయబడుతున్నాయి. ఇప్పటిదాకా నివారణ లేని అల్జీమర్స్ వంటి వ్యాధుల నివారణకు కూడా ఈ బొడ్డురక్తం ఉపయోగ పడవచ్చు అనే నమ్మకాన్నికూడా సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ మాత్రమే కాక, ఇలా ఈ రక్తాన్ని భద్రపరచి ఉంచిన బ్యాంకులు ఎవరికి అవసరమైనా సులువుగా ఉపయోగించుకొనేలా అందుబాటులో ఉంటాయి. బోన్ మారో చికిత్స చాలా కష్టతరమైనది. చాలా నొప్పిని కలిగించేది. దానికంటే సులువుగా ఈ మూలకణాలను తీయడం, జాగ్రత్త చేయడం చాలా సులువైన ప్రక్రియ. అంతేకాక.. ఇలా అప్పుడే పుట్టిన బిడ్డనుంచి తీయబడిన రక్తం చాలా పరిశుభ్రంగా ఉండి, వయసు, వేరే వేరే జబ్బులు వంటి వాటితో ఎక్స్‌పోజ్ కాకుండా ఉంటుంది. బోన్ మారో పద్ధతిలో ఇలాంటి పరిశుభ్రతకు ఆస్కారం తక్కువ. అంతేకాక వేరే రకరకాల కారకాలు కూడా ఆ కణాలను ప్రభావితం చేసే అవకాశం ఉండడం వల్ల ఇంత బాగా జబ్బులను తగ్గించలేవు.

కార్డ్ బ్లడ్‌ను నిలవ ఉంచడం అనే ప్రక్రియ హెల్త్ కేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలా విప్లవాత్మకమైన పరిశోధన. దీనివల్ల ఉన్న ఉపయోగాల గురించి ఇంకా భారతదేశంలోను, ఇతర దేశాల్లోను చాలా గుర్తింపు రావాల్సి ఉంది. మేయర్ అభయ, CEO ఇంకా మేనేజింగ్ డైరెక్టరు లైఫ్ సెల్ వారి ప్రకారం ఈ ప్రక్రియ పట్ల, ఇందులోని సులువును గురించి ఇంకా అందరిలోను సరైన అవగాహన రాలేదు. కార్డ్ బ్లడ్ ను దాచే ప్రక్రియకు కావాల్సిన నిధులు చాలా కొన్ని కోట్ల రూపాయలు. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ రంగం తొందరలో వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉండటం వల్ల ఈ ప్రక్రియ మెయింటెనెన్స్ మిగిలినవాటితో పోలిస్తే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ కార్డ్ కణజాలాలను వెలికి తీసి, భద్రపరచి ఉంచి ఉపయోగించడం ద్వారా అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రంగంలో పరిశోధనలు కొనసాగించేలా ఆలోచించడం, సాంకేతికంగా ముందుకు సాగటం, క్లినికల్ ప్రయోగాలు చేయటం అనేది చాలా విలువైన ఆలోచన.

మీకు ఇది కూడా నచ్చుతుంది: అనెన్స్‌ఫాలీ: కారణాలు, లక్షణాలు, ప్రమాదం & చికిత్స

Tags:

Cord Blood Banking in Telugu, What is Cord Blood Banking in telugu, Cord Blood Banking uses in telugu, Importance of Cord Blood Banking in telugu, Why should we get Cord Blood Banking in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.