
ప్రెగ్నెన్సీ సమయంలో, ఆడవారి ఆకలి తీరు మారవచ్చు, కొన్ని ఆహార పదార్థాలని అదే పనిగా తినాలనే కోరిక ఎక్కువగా కలగవచ్చు. కడుపుతో ఉన్న మహిళల వేవిళ్ళు పచ్చి కూరల నుండి ఐస్ క్రీం లేదా ఊరగాయల వరకూ ఏదైనా ఉండవచ్చు. ఈ ఆర్టికల్ ఒక ప్రత్యేక కాయగూర అయిన – ఉల్లిపాయలపై దృష్టిపెడుతుంది. కొంతమంది గర్భవతులైన మహిళలు దీన్ని తింటే ఆకలి పుడుతుంది అని భావిస్తారు. చాలామటుకు కేసులలో, గర్భవతిగా ఉన్న సమయంలో ఉల్లిపాయలని తింటే ఏ హాని జరగదు. అధ్యయనాలలో కూడా గర్భ సమయంలో ఉల్లిపాయలు తినడం మహిళల ఆరోగ్యంపై సానుకూల ప్రభావమే చూపుతుందని తేలింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయలని తినడం వలన కలిగే లాభాలు అలాగే సైడ్ ఎఫెక్టులని ఈ కింది సమాచారం వివరంగా తెలియచేస్తుంది.
తల్లి కాబోతున్న ఆడవారు ఉల్లిపాయలు తినవచ్చు. ఉల్లిపాయలో తల్లి బిడ్డకి మంచి చేసే చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయని తినటం ఆరోగ్యంగా ఉండటానికి మంచి మార్గం, అలాగే గర్భవతిగా ఉన్న మహిళల చర్మం, మనస్సు రెండూ తాజాగా, ఉల్లాసంగా ఉండేలా సాయం చేస్తుంది. ఇవన్నీ ఉన్నా కూడా, కడుపుతో ఉన్నవారు అదనంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మామూలువారిలాగా వారు సప్లిమెంట్లు లేదా మందులు తీసుకోలేరు. ఈ సందర్భంలో, గర్భవతిగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తిని ఉల్లిపాయలు తిని బలపరుచుకోవడం ఉత్తమం.
ఉల్లిపాయ ఆల్లియమ్స్ అనే కుటుంబానికి చెందిన ఒక రకమైన కాయగూర. వీటికి గాఢమైన, ఘాటైన రుచి, వాసన ఉంటాయి. కానీ ఉల్లిపాయలో ఉండే క్యాన్సర్ వ్యతిరేక, కొలెస్ట్రాల్ వ్యతిరేక, యాంటీ ఆక్సిడెంట్, వాపు వ్యతిరేక లక్షణాల కారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు ఇవి తింటే,చాలా ప్రాణాలకి హాని చేసే వ్యాధుల నుండి కాపాడబడతారని తేలింది. USDA దాదాపు 2.5 అంగుళాల వ్యాసం ఉన్న మధ్య సైజు పచ్చి ఉల్లిపాయ (110 గ్రాములు) యొక్క పోషక విలువల డేటాని కింద విధంగా అందిస్తుంది.
ఉల్లిపాయలలో విటమిన్ C తో పాటు, విటమిన్ B6, పొటాషియం, ఫోలేట్ అలాగే మ్యాంగనీస్ లు ఉంటాయి.
గర్భవతిగా ఉన్న మహిళ యొక్క ఆరోగ్యానికి ఉల్లిపాయలు పరిమితంగా తినటం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయలు తినటం వలన కలిగే కొన్ని లాభాలని తెలుసుకోడానికి చదవండి.:
ఉల్లిపాయలలో చాలా ఎక్కువగా ఉండే విటమిన్ C, తల్లి ఇంకా ఆమెలో పెరుగుతున్న బిడ్డని జబ్బుల నుండి రక్షించటంలో సాయపడుతుంది.
ఉల్లిపాయలలో సేంద్రీయ సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ ని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి అలాగే చాలా రకాల క్యాన్సర్ల నుండి, ప్రధానంగా కోలోరెక్టల్ ఇంకా పొట్ట క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి.
ఉల్లిపాయలలో విటమిన్ A,C, అలాగే E మంచి మొత్తాలలో ఉంటాయి. చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యకరంగా కాపాడుకోవటం అనేది ఒక్కరివల్ల సాధ్యం అయ్యే పని కాదు, అందుకని ఈ విటమిన్లు అన్నీ అందులో సాయం చేస్తాయి. ఈ విటమిన్లు అకాలంగా వచ్చే వృద్ధాప్యం నుండి రక్షిస్తాయి అలాగే జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి.
గర్భ సమయంలో పచ్చి ఉల్లిపాయలు తినడం లాభదాయకం ఎందుకంటే అందులో పీచుపదార్థం ఉంటుంది. ఇది జీర్ణప్రక్రియలో సాయపడుతుంది అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో తినడం కూడా సురక్షితమైనది. ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయలు తింటే పొట్టలో వచ్చే పుండ్లు లేదా అల్సర్లు నివారించబడి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ప్రోత్సహించబడి, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, క్వెర్సెటిన్లు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతూ, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటిస్ ప్రభావాలని తగ్గించటంలో సాయంచేస్తాయి. ఉల్లిపాయలలో పీచుపదార్థం ఉంటుంది కాబట్టి గర్భ సమయంలో వచ్చే డయాబెటిస్ మెల్లిటస్ (GDM) ను నయం చేయడానికి సాయపడతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో రక్తంలో చక్కెర స్థాయిల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?
ఉల్లిపాయలో ఉండే ప్రీబయోటిక్ సమ్మేళనాలు మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తాయి. ఉల్లిపాయలో ఉండే ఫోలేట్ కూడా హోమోసిస్టీన్ ఉత్పత్తి అవడాన్ని నిరోధిస్తూ, ప్రసవం అయ్యాక వచ్చే డిప్రెషన్ కు వ్యతిరేకంగా పోరాడటంలో సాయం చేస్తుంది. ఈ హోమోసిస్టీన్ స్థాయిలలో అసమతుల్యత భావోద్వేగాలలో అస్థిరత, మానసిక ఆందోళన, డిప్రెషన్ కి దారితీయవచ్చు.
ఫైటోన్యూట్రియెంట్లు ఇంకా పొటాషియం ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు ప్రెగ్నెన్సీ సమయంలో రక్తపోటుని క్రమబద్ధీకరించటంలో సాయపడవచ్చు, అలా రక్తపోటుతో, దానికి సంబంధించిన పరిణామాలని వచ్చే రిస్కులని తగ్గిస్తుంది.
కడుపుతో ఉన్న మహిళలకి ఉల్లిపాయల వల్ల చాలా లాభాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువ మొత్తాలలో తింటే వచ్చే నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
మరీ అతిగా ఉల్లిపాయలని తినటం వలన వచ్చే అవకాశం ఉన్న నష్టాలు:
గర్భవతిగా ఉన్న మహిళలు ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వలన గుండెల్లో మంట వస్తుంది లేదా కడుపులో అనారోగ్యానికి కూడా కలగవచ్చు.
గర్భవతిగా ఉన్నప్పుడు ఉల్లిపాయని ఎక్కువగా తినడం వలన, సాధారణంగా ఉల్లిపాయల వల్ల అలర్జీ ఉన్న కొంతమంది గర్భవతి మహిళలలో వచ్చే అలర్జీ ప్రతిచర్యే వీరికి కూడా వస్తుంది. కొంతమంది స్త్రీలకి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలని తిన్నాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
కడుపుతో ఉన్నప్పుడు వచ్చే వేవిళ్ళకి కారణమేంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ వివిధ సిద్ధాంతాల ప్రకారం ఇలాంటి ఆకలి రావడానికి హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపాలు, లేదా సామాజికపరంగా అంచనాలు ఇవన్నీ పాత్ర పోషిస్తాయి. దీనివలన కడుపుతో ఉన్న మహిళ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకున్నంతవరకూ, ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయలు తినాలనిపిస్తే వాటి కోసం కట్టడి చేసుకోనక్కర్లేదు.
ఉల్లిపాయలని తినడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమే కాదు, కడుపుతో ఉన్న మహిళలలో పోషకాల స్థాయిలని పెంచటానికి సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం కూడా అని గుర్తించబడింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయలని గర్భవతులు రోజువారీ భోజనంలో భాగంగా తినడం వలన ఆరోగ్య సమస్యలని నివారించవచ్చు, అది వారి మొత్తంమీద జీవించే నాణ్యతని కూడా మెరుగుపరుస్తుంది.
Tags
Onion During Pregnancy in Hindi, Onion During Pregnancy in Tamil, Onion During Pregnancy in English



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |