This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

​​​​​​​9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి? (9 Week Ultrasound: What to Expect & What are the Red Signals in Telugu?)

Scans & Tests
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Feb 12, 2026
​​​​​​​9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి? (9 Week Ultrasound: What to Expect & What are the Red Signals in Telugu?)
Likes62 Likes|
Read time6 min

గర్భధారణ 9వ వారంలో కొన్ని ఉత్సాహమైన విషయాలు జరగడం ప్రారంభించాలి. మీరు మీ రెండవ త్రైమాసికంలో ప్రవేశించడానికి కొన్ని వారాలు మాత్రమే ఉంటాయి. 9 వారాల అల్ట్రాసౌండ్ సమయంలో గర్భిణీ శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. మీ పిండం ఇప్పుడు శిశువు. 9వ వారం చివరలో మీ పిండం దాదాపు 3.1 సెంటీమీటర్లు (గత వారం కంటే రెండు రెట్లు!) పెరుగుతూ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే మీ శిశువు యొక్క జననేంద్రియాలు ఇప్పుడిప్పుడే ఆకృతి పొందడం ప్రారంభం అవుతున్న ఈ సమయంలో శిశువు యొక్క లింగం గురించి ఇంకా ఏమీ చెప్పలేరు. ఈ సమయంలో మీ పిల్లల గుండెలో నాలుగు గదులు ఉంటాయి. గుండె పెద్దవారి కంటే రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది.

జరాయువు పోషకాహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే అభివృద్ధి చెందుతున్న శిశువు నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించగలదు. అదనంగా, ఇది ఇప్పుడు హార్మోన్ల సృష్టికి తోడ్పాటు అందిస్తుంది. ఇది దీని చాలా ముఖ్యమైన విధి. మీరు కొంత బరువు పెరగడాన్ని గమనించి ఉండొచ్చు. ముఖ్యంగా ఉదర భాగంలో. మీరు 9 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి కారణం చాలా వరకు నీరు శరీరంలో పెరగడం.ఇంకా మీరు చాాలా అలసిపోతుంటారు. ఎందుకంటే, మీ శక్తి నిల్వలు మొత్తం ప్లాసెంటా ఏర్పడటానికి, శిశువు ఎదుగుదలకు నిరంతరం తోడ్పడుతుంటాయి. మీ జీవక్రియ రేటు మరియు హార్మోన్ స్థాయి పెరుగుదల కారణంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. మీ అలసట స్థాయి, ఉదయపు వికారము తీవ్రంగా అనిపిస్తే మీ ప్రైమరీ కేర్ డాక్టర్ లేదా నర్సును సంప్రదించండి. మీ గుండెల్లో మంట లేదా అజీర్తి చేస్తే, చక్కెర రహిత బబుల్ గమ్ నమలడం మీకు కొంత సాయపడుతుంది.

మీరు గమనించాల్సిన లక్షణాలు మరియు హెచ్చరికల సంకేతాలు! (Symptoms and Red Alerts to Observe in Ultrasound Report in Telugu)

మీ 9 వారాల గర్భవతి అల్ట్రాసౌండ్ రిపోర్టులో నుండి మీరు ఆశించగలిగేవి.

యోని నుంచి రక్తస్రావం (Vaginal Blood Discharge)

యోని నుంచి రక్తస్రావం కావడం అసాధారణమేమీ కాదు. రక్తస్రావం కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కానీ చాలా సందర్భాల్లో అది ఆగిపోయే ముందు ప్రకాశవంతమైన ఎరుపు నుంచి ముదురు ఎరుపు రంగు, గోధుమ రంగులోకి మారుతుంది. అయితే రక్తస్రావం వారం పాటు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.

వాంతులు ఎక్కువగా అనిపించడం మరియు కడుపులో తిప్పినట్టు ఉండటం (Vomitings and Nausea)

గర్భం ప్రారంభ దశలో మీకు రక్తస్రావం, కడుపులో అసౌకర్యంగా ఉంటే, మీకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిరాకు పడటం, అలసట, రొమ్ము నొప్పి, వికారం, గుండెల్లో మంట లేదా మలబద్ధకం వంటి తేలికపాటి లక్షణాలు సాధారణం. అయితే విపరీతమైన వికారం అనిపిస్తే మీరు వైద్యుడిన సంప్రదించండి.

మీరు ఎప్పుడు వైద్య సేవలకు వెళ్లాలి? (When to Meet Doctor?)

మీ గర్భం తొలి త్రైమాసికంలో మీకు ఈ క్రింది లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి:

  1. బాధాకరమైన నొప్పి మరియు రక్తస్రావం
  2. గర్భాశయం నుంచి స్రావాలు (సాధారణం కంటే ఎక్కువ)
  3. యోని నుంచి దుర్వాసన
  4. 100.4 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువ జ్వరం ఉంటే..
  5. మూత్రవిసర్జన సమయంలో మంట లేదా అసౌకర్యం అనిపించడం.
  6. పొత్తికడుపు లేదా కటి ప్రాంతంలో నొప్పి
  7. ఆందోళన లేదా నిరాశకు సంబంధించిన సంకేతాలు
  8. అధికంగా బరువు తగ్గడం
  9. రోజుకు కనీసం మూడు సార్లు వాంతులు, ఆహారం లేదా పానీయాలను వుంచుకోలేక పోవడం.
  10. తరచుగా తలనొప్పి రావడం.

మీరు 9 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి ఊహించాలి: (What to Expect When you are 9 Weeks Pregnant?)

  1. గర్భధారణ ప్రారంభంలో లక్షణాల తీవ్రత దాదాపు అత్యధికంగా ఉంటుంది.
  2. అధికంగా ఆహారం తీసుకోవాలనే కోరికలు కలగవచ్చు. మీ భావోద్వేగాలు అదుపులో ఉండకపోవచ్చు.
  3. మీ శిశువు చక్కగా అభివృద్ధి చెందుతుంటుది: ఈ దశలో అవయవాలు, కాళ్లు, కనురెప్పలు, చెవులు పెరుగుతాయి.
  4. మీ స్తనాలు నిండుగా మారుతుంటాయి. మీ చనుమొనలు ముదురు రంగులోకి మారుతుంటాయి.

ఒకరు కన్నా ఎక్కువ మంది పిల్లలను మోస్తున్న కొందరు గర్భిణీలు, ఒక బిడ్డను మోస్తున్న మహిళల కంటే తీవ్రమైన గర్భధారణ లక్షణాలు కలిగి ఉంటారు. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో తీవ్రమైన వికారం మరియు వాంతులు వచ్చి డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. మీ శరీరానికి అవసరమైన పోషకాలు మరియు ద్రవాలు తీసుకోకుండా అడ్డుకోవచ్చు. పైగా ఈ సమయంలోనే అభివృద్ధి చెందుతున్న శిశువుకు సరిపోయేలా గర్భాశయం పెరుగుతుంటుంది. మీ గర్భం ఉత్పత్తి చేసే హార్మోన్లు మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. తద్వారా మీరు ఎక్కువ పోషకాలను తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీకు ఎక్కువ ఉబ్బరం మరియు మలబద్ధకం అనిపించవచ్చు.

మీరు పొగ త్రాగేవారైనా లేదా నికోటిన్ ఉన్న ఏదైనా వస్తువులను ఉపయోగించేవారైనా, మీరు మానుకునేందుకు ప్రయత్నించండి. గర్భధారణ సమయంలో ధూమపానం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వీటిలో కిందివి ఉన్నాయి:

  1. గర్భస్రావం
  2. తక్కువ బరువుతో లేదా ముందుగా పుట్టడం
  3. ఊహించని శిశు మరణ సిండ్రోమ్ (SIDS)
  4. రక్తం గడ్డకట్టే ప్రమాదం
  5. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, పెదవి లేదా అంగిలి చీలడం వంటివి సంభవించడం

దానికి తోడుగా, ఈ కింది విషయాలను కూడా తప్పకుండా పాటించేలా చూసుకోవాలి.

1. తక్కువగా ఉడికించిన మాంసం, చేపలు లేదా గుడ్లు తీసుకోకుండా ఉండండి.

2. స్వోర్డ్ ఫిష్, షార్క్ మరియు కింగ్ మేకెరెల్ వంటి పాదరసం అధికంగా ఉండే చేపలకు దూరంగా ఉండండి.

3. తినడానికి ముందు పండ్లు మరియు కూరగాయలు శుభ్రపరుచుకోవాలి.

4. మీ కటింగ్ బోర్డులు, ప్లేట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.

5. అన్ని విటమిన్లు తీసుకునేలా జాగ్రత్త వహించండి.

6. మద్యం సేవించొద్దు.

ముగింపు (Conclusion)

8వ వారంతో పోలిస్తే 9వ వారంలో గర్భం కాస్త భిన్నంగా అనిపించే అవకాశం ఉంది. మీ బిడ్డ చిన్నగా ఉన్నప్పటికీ, దాదాపు పెరిగి అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి, మీ కోసం మరియు మీ బిడ్డ కోసం ఉత్సాహంగా ఉంటూ అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇదే.

Tags:

9 Week Ultrasound in telugu, Need of 9 Week Ultrasound in telugu, what to expect in 9 Week Ultrasound report in telugu, Red alerts to observe in 9 Week Ultrasound report in telugu, meet doctor after 9 Week Ultrasound test in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.