

Updated on 3 November 2023
మహిళలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రజస్వల తర్వాత ప్రతీ నెలా వచ్చే రుతుక్రమంలో అనేక సమస్యలు అంటే క్రమం తప్పకుండా ఉండటం, విపరీతమైన ప్రవాహం ఉండటం, హార్మోన్ల పరమైన మార్పుల కారణంగా మానసిక స్థితిలో మార్పులు, కడుపు నొప్పి వంటివి వస్తూ ఉంటాయి. హార్మోన్లలో నిరంతర మార్పు అన్నది చాలామంది మహిళలకు సమస్యగా ఉంటుంది. కాలంతో పాటు మహిళలు వాటికి అలవాటు పడుతూ ఉంటారు. అంతే తప్ప వాటికి అద్భుతమైన దీర్ఘకాలిక చికిత్సలేవి లేవు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో, ముఖ్యంగా మొదటిసారి అయినప్పుడు అనేక అనుమానాలు, గందరగోళం ఏర్పడుతూ ఉంటాయి. సొంతంగా ఆలోచించకుండా, ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయగల డాక్టరును గుర్తించడం చాలా ముఖ్యం. అందులో ఒక ప్రశ్న - లోతుగా శుభ్రం చేసుకోవడం. ఈ విషయం గురించి ఉత్పత్తుల తయారీదారులు, ఇంటర్నెట్ వీటికి గురించి విస్తృతంగా చెప్తున్నా చాలా వరకు తప్పుడు సమాచారమే ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో యోనిని శుభ్రంగా ఉంచుకునే విధానాలపై అస్పష్టమైన సమాచారమే కనిపిస్తోంది. మీరు గర్భవతి కాకపోయినప్పటికీ మీ ఆరోగ్యరిత్యా ఇంటిమేట్ హైజిన్ గురించి మీ డాక్టరును సంప్రదించడం మంచిది.
యోని దగ్గర ఉండే సున్నితమైన చర్మం కోసం ఉపయోగించే వాష్ లేదా క్లెన్సర్ ఇది. ఈ ప్రాంతంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉపయోగించే క్లెన్సర్ ఆ అవసరం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినదై ఉండాలి. మార్కెట్‌లో అనేక రకాల ఇంటిమేట్ వాష్ లు దొరుకుతున్నా సహజమైన, హానికారక రసాయనాలు లేనిని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
బెస్ట్ ఇంటిమేట్ వాష్ ఫర్ ఉమెన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్లు ఏంటంటే, అవి సోప్ ఫ్రీగా ఉండాలి. సోప్ వాడితే పొడిదనం ఏర్పడుతుంది. మహిళల జననాంగ ప్రదేశాల్లో పొడిదనం ఉంటే దురద, ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. సున్నితమైన ప్రదేశం కాబట్టి దీర్ఘకాలం పాటు పొడిదనం ఉంటే అది హానికరంగా మారుతుంది. అందులో మాయిశ్చయిరింగ్ ఏజెంట్ ఉండాలి. సున్నితమైన యోని ప్రదేశాన్ని సురక్షితంగా, ఆరోగ్యకరంగా, తడిదనంతో ఉంచేందుకు ఇంటిమేట్ వాష్ ఉత్పత్తుల్లో సహజమైన మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉండాలి. రంగు, సువాసన కోసం కృత్రిమై పదార్థాలకు తావు ఉండరాదు. ఇంటిమేట్ హైజిన్ వాష్ ప్రొడక్ట్స్ అన్ని కూడా లోతుగా శుభ్రం చేసుకునేందుకు, అనవసరమైన బ్యాక్టీరియా, మురికి, చెమట తొలగించేందుకు వీలుగా ఉండాలి.
రోజు స్నానం చేసేటప్పుడు జననాంగ భాగాలను శుభ్రం చేసుకోవడం ఒక మంచి ఆప్షన్. సరైన రీతిలో ఇంటిమేట్ వాష్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. యోనికి సహజంగా ఉండే ఆమ్లత్వం ఇంటిమేట్ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ హానికారక బ్యాక్టీరియా, ఈస్ట్ వంటివి పెరగకుండా నిరోధిస్తుంది. జననాంగ భాగం ప్రత్యేకమైన వాసన వెదజల్లేలా కూడా అది చూస్తుంది. గర్భధారణ సమయంలో మీ జననాంగ భాగాల్లో సరైన pH, ఆమ్లత్వం ఉండేలా చూసేందుకు ఇంటిమేట్ హైజిన్ వాష్ అవసరం. ఇంటిమేట్ వాష్ ఉపయోగించే సమయంలో దాన్ని కొద్ది మొత్తంలో తీసుకొని ముందు, వెనుక రాయండి. ఆ తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వలన ఇంటిమేట్ భాగాలు పరిశుభ్రంగా ఉంటాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఉపయోగించే ప్రతీ ఉత్పత్తిలాగే ఇంటిమేట్ హైజిన్ వాష్‌కు కూడా డాక్టర్ ఆమోదం తప్పకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో బలమైన వాసన, రసాయనాలు లేని సురక్షితమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. రసాయలనాల కారణంగా మంట, ఇన్పెక్షన్ తలెత్తవచ్చు. అధిక పొడిదనం, ఇన్పెక్షన్ మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో అనుకూలంగా ఉండే ఇంటిమేట్ హైజిన్ వాష్ ఎంచుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో జననాంగాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహారం, వ్యాయామం విషయంలో న్యూట్రిషియనిస్ట్ సలహాలు తీసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అవసరం. కాటన్ ప్యాంటీస్ ధరించాలి. షేప్ వేర్ (ఆకారం కోసం వాడేవి) వంటి బిగుతైన (టైట్) దుస్తులను దూరం పెట్టాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్, ర్యాష్ నివారించేందుకు మీ యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మీ యోనిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇంటిమేట్ వాష్‌తో వాష్ చేసిన తర్వాత కూడా మృదువైన టవల్‌తో తుడుచుకోవడం మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఇంటిమేట్ హైజిన్ వాష్ అవసరం
ప్రెగ్నెన్సీ సమయంలో శిశువును జననానికి సిద్ధం చేసేందుకు యోని పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుదల కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు అధికమవుతుంది:
ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకునేందుకు ఇంటిమేట్ వాష్ ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంటమేట్ వాష్ ఎంపిక చేసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు
మైలో కేర్ ఇంటిమేట్ వాష్ లాంటి ఇంటిమేట్ వాష్ వంటివి స్త్రీల జననాంగ ప్రదేశాలను తడిగా, విషకారకాల రహితంగా, చెమట లేకుండా, పరిశుభ్రంగా ఉంచుతాయి. మీ డాక్టర్ ను సంప్రదించి వారి సూచనలు అనుసరించండి. ప్రెగ్నెన్సీ సమయంలో యోని భాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇంటిమేట్ హైజిన్ వాష్‌ను అధిక మోతాదులో ఉపయోగించకండి.
Intimate Wash during pregnancy in telugu, Is intimate wash safe during pregnancy in telugu?, Tips to select intimate wash for pregnants in telugu, How to use intimate wash during pregnancy in telugu, Usage of intimate wash during pregnancy in telugu.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali

গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali

স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali

গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali

গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali

গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |