

Getting Pregnant
1 February 2026 న నవీకరించబడింది
బ్రోన్కియెక్టాసిస్ ఊపిరితిత్తుల్లోని (వాయుమార్గాలు) గొట్టాలు దెబ్బతినే పరిస్థితి. సంచులు విస్తరించడానికి లేదా ఉబ్బడానికి కారణమవుతుంది. ఊపిరితిత్తుల్లోని శ్లేష్మాన్ని తొలగించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. చీము, శ్లేష్మంతో ఎక్కువగా దగ్గు రావడం బ్రోన్కియెక్టాసిస్ ప్రధాన లక్షణం. బ్రోన్కియెక్టాసిస్ నివారించడం కష్టం. కానీ చికిత్సతో మేనేజ్ చేయవచ్చు.
బ్రోన్కియెక్టాసిస్ ఊపిరితిత్తుల వ్యాధి. శ్వాసనాళాలు అంటే ఊపిరితిత్తులకు ప్రవేశించే గొట్టాలు విస్తరించి, దెబ్బతింటాయి. దెబ్బతిన్న వాయుమార్గాలు శ్లేష్మం క్లియర్ చేయలేవు. శ్లేష్మ పొరలో బాక్టీరియా పెరిగిపోయి, మరింత వాపు రావడానికి కారణమవుతుంది. ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. శరీరానికి సోకిన శ్లేష్మాన్ని బయటకు పంపడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన దగ్గు వస్తుంది. ఊపిరితిత్తులలోకి ప్రవేశించే గొట్టాలు (వాయుమార్గాలు లేదా శ్వాసనాళాలు) వ్యాధి నుంచి రక్షించడానికి ఒక క్యాప్‌గా ఉంటాయి. కొన్నిసార్లు తాపాన్ని కలిగించే లాలాజలం ఈ రక్షణల్లో ఒకటి. శ్లేష్మం బయటకు వెళ్లకపోతే వాయుమార్గాలకు దీర్ఘకాలంలో తీవ్రమైన నష్టం తప్పదు.
సాధారణంగా గాలి పీల్చేటప్పుడు శ్లేష్మంలోని ఏవైనా హానికరమైన కణాలు ఉంటే, అవి శ్వాసనాళాల్లో చిక్కుకుంటాయి. అప్పుడు లక్షలాది చిన్న వెంట్రుకల లాంటి సిలియా ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మాన్ని కడగడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం తరంగాల లాంటి కదలిక కలిగిస్తుంది. దీన్నే మ్యూకోసిలియరీ క్లియరెన్స్ అంటారు. ఎవరైనా దగ్గినప్పుడు లేదా శ్లేష్మం మింగినప్పుడు, ఈ వ్యవస్థలో కొంత భాగం పనిచేయదు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఏర్పడిన సమయంలో చిక్కుకున్న అణువులు, కడుపులోని ఆమ్లం ద్వారా విచ్ఛిన్నమవుతాయి. సిలియా దెబ్బతిన్న లేదా శ్వాసనాళాల్లో శ్లేష్మం నిరోధించబడిన సందర్భంలో ఇలా జరుగుతుంది. బాక్టీరియా శ్లేష్మంలో చిక్కుకుపోయి మరింత పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే నష్టం బ్రోన్కియెక్టాసిస్‌ను మరింత దిగజారుస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
బ్రోన్కియెక్టాసిస్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:
కొన్నిసార్లు బ్రోన్కియెక్టాసిస్‌కు గల కారణాలపై వాటి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఈ లక్షణాలు మధ్యస్తంగా ఉండవచ్చు. ఒక్కోసారి ఆకస్మికంగా మంటలు పుట్టినట్టు ఉండవచ్చు. ఫలితంగా ఇది తీవ్రతరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బ్రోన్కియెక్టాసిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. బ్రోన్కియెక్టాసిస్‌ను తీవ్రతరం చేసే లక్షణాలు ఇవే.
బ్రోన్కియెక్టాసిస్ ప్రధానంగా రెండు కేటగిరీల్లో ఉంటాయి. వాటిని సిస్టిక్, నాన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు.
సిస్టిక్ ఫైబ్రోసిస్ (CF) రోగుల ఊపిరితిత్తుల్లో మందంగా శ్లేష్మం పేరుకుపోయి, పల్మనరీ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే జన్యుపరమైన పరిస్థితి. బ్రోన్కియెక్టాసిస్ లాగానే ప్రతీసారి మంటగా అనిపించి, ఇన్ఫెక్షన్ పెరుగుతూ, శ్వాసనాళాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు ఆ రోగుల్లో బ్రోన్కియెక్టాసిస్ లక్షణాలు బయటపడతాయి.
సిస్టిక్ ఫైబ్రోసిస్ కాకుండా రోగుల్లో బ్రోన్కియెక్టాసిస్ ఏర్పడుతుంది. ఉదాహరణకు ఏ రోగికైనా COPD అంటే క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నా, సిలియా దెబ్బతిన్నా (ఊపిరితిత్తుల్లోని శ్లేష్మాన్ని క్లియర్ చేయడంలో సహాయపడే బ్రోన్చియల్ ట్యూబ్ లోపల చిన్న వెంట్రుకలు లాంటి నిర్మాణాలు), ఆస్తమా ఉన్నా, లేదా బలహీనమైన కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు కలిగి ఉన్నా, ఇవన్నీ సహజంగా శ్లేష్మం బయటకు వెళ్లకుండా నిరోధించబడతాయి.
1. సిండ్రికల్ లేదా ట్యూబ్యులర్.
2. వరికోస్
3. సిస్టిక్
ఊపిరితిత్తులను దెబ్బతీసే పరిస్థితి లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే లక్షణాలు ఉన్న రోగులు సులువుగా బ్రోన్కైటిస్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులకు ఉదాహరణలు ఇవే:
బ్రోన్కియెక్టాసిస్ సాధారణమైన వ్యాధి. తరచుగా నిర్లక్ష్యం చేయబడిన వ్యాధి కూడా. అమెరికా, యూరప్‌లో ఎపిడెమియోలాజికల్ డేటాలో ఎక్కువ భాగం గుర్తించవచ్చు. తక్కువ, మధ్యస్తంగా ఆదాయం ఉన్న దేశాల్లో ఇలాంటి కేసులు చాలా తక్కువ. ఇందుకు కారణం రిపోర్ట్ చేయకపోవడం లేదా నిర్థారించకపోవడం కావచ్చు. భారతదేశంలో క్షయవ్యాధి మునుపటి చరిత్ర ఉండటం, బ్రోన్కియెక్టాసిస్ ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
బ్రోంకోడైలేటర్ థెరపీ మంటను తగ్గించి బాక్టీరియాను చంపడానికి, శ్లేష్మం బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. బ్రోన్కియెక్టాసిస్ చికిత్సల్లో ప్రధానంగా ఇవి ఉన్నాయి.
ఊపిరితిత్తుల్లో శ్లేష్మం, దగ్గుతోతో బ్రోన్కియెక్టాసిస్ లక్షణాలు, బ్రోన్కైటిస్ లాగానే ఉంటాయి. కానీ బ్రోన్కియెక్టాసిస్ శ్వాసనాళాల శాశ్వత విస్తరణకు కారణమవుతుంది. బ్రోన్కైటిస్ తాత్కాలిక ఇన్ఫెక్షన్. దీనివల్ల శాశ్వత నష్టం ఉండదు. బ్రోన్కియెక్టాసిస్ వర్సెస్ బ్రోన్కైటిస్ అనే చర్చ చాలా కాలంగా ఉంది. కొన్నిసార్లు ఒక దాని బదులు ఇంకొకటని పొరబడుతుంటారు కూడా. కానీ వాటి ప్రభావాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అందుకే బ్రోన్కియెక్టాసిస్ వర్సెస్ బ్రోన్కైటిస్ అనే అంశంపై మరింత పరిశోధనలు జరగడం అవసరం. బ్రోన్కియెక్టాసిస్ చికిత్స చేయించుకోవాలనుకునేవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు

గర్భధారణ సమయంలో కిందకి వంగడం ఎప్పుడు ఆపాలి? (When To Stop Bending During Pregnancy in Telugu?)

ప్రెగ్నెన్సీ 6వ నెలకు ఆరోగ్యకరమైన డైట్ మరియు మీల్ ప్లాన్ (Diet and Meal Plan for 6 Month Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో చిలగడదుంప: ప్రయోజనాలు, ప్రమాదాలు & దుష్ప్రభావాలు | Benefits & Risks of Sweet Potato During Pregnancy in Telugu

తల్లైన కొత్తలో గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు (Top 5 Things Every New Mother Should Keep in Mind in Telugu)

గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |