hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • పైలనైడిల్ సిస్ట్ అంటే ఏమిటి? కారణాలు, చికిత్స & లక్షణాలు arrow

In this Article

    పైలనైడిల్ సిస్ట్ అంటే ఏమిటి? కారణాలు, చికిత్స & లక్షణాలు

    Pregnancy

    పైలనైడిల్ సిస్ట్ అంటే ఏమిటి? కారణాలు, చికిత్స & లక్షణాలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    పైలనైడిల్ సిస్ట్ అనేది సాధారణంగా వెంట్రుకలు ఇంకా చర్మ సంబంధ వ్యర్థాలను తనలో కలిగి ఉండే చర్మ వైపరీత్యం. హెయిర్ పైలనైడిల్ సిస్ట్ అనేది దాదాపు అన్నివేళల తుంటి ఎముక దగ్గర, పిరుదుల చీలిక పైనుండే ఉబ్బెతు వైపు కనిపిస్తుంది.

    అసలు ఈ పైలనైడిల్ సిస్ట్ అంటే ఏమిటి?

    వెంట్రుకలు చర్మం లోపలివైపుకి చొచ్చుకొనిపోయి, కుచించుకొని పోయినపుడు పైలనైడిల్ సిస్ట్‌లు ఏర్పడతాయి. పైలనైడిల్ సిస్ట్ ఏర్పడినప్పుడు, చీము వల్ల పైలనైడిల్ సిస్ట్ నొప్పి స్థాయి తరచుగా ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఈ వెంట్రుకలను పైలనైడిల్ సిస్ట్‌ని శస్త్రచికిత్స చేసి తొలగించవచ్చు లేదా చిన్న గాటు పెట్టి కూడా తొలగించవచ్చు. పైలనైడిల్ సిస్ట్‌లు యువకులలో చాలా తరచుగా కనిపిస్తాయి ఇంకా ఇవి పునరావృతమయ్యే అవకాశం కూడా ఉంది. ట్రక్ డ్రైవర్లు వంటి వృత్తిలో ఎక్కువ కాలం కూర్చునే వారికి పైలనైడిల్ సిస్ట్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    పైలనైడిల్ సిస్ట్‌కి కారణాలు

    పైలనైడిల్ సిస్ట్‌లకి నిర్దిష్ట కారణం ఏమిటో తెలియదు. అయినప్పటికీ పైలనైడిల్ సిస్ట్‌లలో ఎక్కువ భాగం బాహ్య చర్మం లోపలి వైపుకి ప్రవేశించే వదులుగా ఉండే వెంట్రుకల వల్ల ఇవి ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది. పైలనైడిల్ సిస్ట్‌లు పుట్టుకతో వచ్చినవి (వాటితోనే పుట్టినట్లుగా) అని ఒకప్పుడు భావించేవారు. అవి ఎదుగుదల ప్రారంభదశలో ఉండకూడని ప్రదేశంలో ఉన్న పిండ కణాల నుండి లేదా పదేపదే గాయం కావడం వల్ల (దీనిని జీప్ డ్రైవర్ ట్రామా అంటారు) ఇవి ఏర్పడతాయి. వెంట్రుకలు ఇంకా అవశేష పదార్థాల (మృత చర్మ కణాలు ఇంకా బాక్టీరియా) చిన్న పోగులుగా పిరుదుల పైనున్న చీలికలో చర్మ రంధ్రాలలో అతుక్కుపోతాయి ఇంకా పైలనైడిల్ సైనస్ సిస్ట్ అని పిలువబడే "సైనస్" లేదా తిత్తిని సృష్టిస్తాయి, ఇది చీముగడ్డలా మారుతుంది. ఈ చీము పుండు చర్మం క్రింద పెరుగుతుంది (సబ్కటానియస్‌గా), ఇంకా కణజాలానికి గాయపు మచ్చగా మారుస్తుంది. అది మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లకు గురికావచ్చు.

    రాపిడి ఇంకా ఒత్తిడి - చర్మంపై చర్మం రుద్దుకపోవడం, బిగుతుగా ఉన్న బట్టలు, బైక్ నడపడం, ఎక్కువసేపు కూర్చోవడం లేదా ఇలాంటి పరిస్థితుల వల్ల - వెంట్రుకలను చర్మంలోకి నెట్టడం జరుగుతుంది. శరీరం ఇలా లోనికి చొచ్చుకువచ్చిన వ్రెంటుకలను పరాయి పదార్థాలుగా భావించి శరీర రక్షణ కొరకు ఈ వెంట్రుకల చుట్టూ ఒక తిత్తిని ఏర్పరుస్తుంది. కొంతమంది శిశువులు వెన్నెముక చివర త్రికాస్థి ప్రదేశంలో బొడిపె (సాక్రాల్ డింపుల్‌)తో పుడతారు. ఇది పిరుదు మడత పైన ఉబ్బుగా ఉంటుంది. సాక్రాల్ డింపుల్ ఎర్రబడినట్లు కనబడితే అప్పుడు పైలనైడిల్ సిస్ట్ ఏర్పడవచ్చు.

    పైలనైడిల్ సిస్ట్ లక్షణాలు

    పైలనైడిల్ సిస్ట్ సోకకపోతే ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. సిస్ట్ ఏర్పడినపుడు గుర్తించే సంకేతాలు, ఇంకా లక్షణాలు:

    Article continues below advertisment

    • జ్వరం
    • పిరుదుల పైభాగంలో అసౌకర్యంగా ఉండటం
    • వీపు కింది భాగంలో నొప్పి
    • వాపు
    • ఎరుపు
    • పైలనైడిల్ సిస్ట్ చిట్లి రక్తం లేదా చీము కారడం
    • దుర్వాసన.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు

    పైలనైడిల్ సిస్ట్ చికిత్సలు

    మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పైలనైడిల్ సిస్ట్‌లు ఉన్నట్లు నిర్ధారణ జరిగినట్లయితే వైద్యులు మీకు తగిన వ్యక్తిగత చికిత్స విధానాలను అందిస్తారు. మీకున్న లక్షణాల తీవ్రతను బట్టి, శస్త్రచికిత్స ద్వారా పైలనైడిల్ సిస్ట్ తొలగింపు అవసరం అవ్వవచ్చు లేదా అవసరం ఉండకపోవచ్చు. పైలనైడిల్ సిస్ట్ చికిత్సలోని శస్త్రచికిత్సకు వివిధ ప్రత్యామ్నాయ ఎంపికలు కూడా ఉన్నాయి. వీటిలో:

    సిస్ట్‌లోని చీము నిర్మూలన

    వైద్యులు తమ క్లినిక్‌లలో ఈ శస్త్రచికిత్స చేయవచ్చు. చిన్న కోత (కట్) పెట్టి వ్యాధిగ్రస్త తిత్తి తెరవబడుతుంది. ఇంకా పూర్తిగా విగిరిపోయేల చేయబడుతుంది.

    ఇంజెక్షన్లు

    ఇంజెక్షన్లు (ఫినాల్, ఒక ఆమ్ల రసాయనం) తేలికపాటి నుండి మితమైన పైలనైడిల్ సిస్ట్‌లను నయం చేయగలవు మరియు నిరోధించగలవు.

    యాంటీబయాటిక్స్

    పైలనైడిల్ సిస్ట్ చర్మం యొక్క వాపును యాంటీబయాటిక్స్ నయం చేయగలవు. అయితే, యాంటీబయాటిక్స్ మాత్రమే పైలనైడిల్ సిస్ట్‌లను నయం చేయలేవు.

    Article continues below advertisment

    లేజర్ చికిత్స

    లేజర్ ట్రీట్‌మెంట్, ఇది అంతర్లీనంగా అభివృద్ధి చెంది పైలనైడిల్ సిస్ట్‌ల పునరావృతతను ప్రేరేపించే వెంట్రుకలను తొలగించడంలో సహాయపడుతుంది. చికిత్స కోసం వేచి ఉండే సమయంలో, రోగులు నొప్పి కలిగించే ప్రదేశంలో వెచ్చని కాపడం పెట్టడం వల్ల, సిస్ట్ కారణంగా కలిగే అసౌకర్యం నుండి ఉపశమనం పొందవచ్చు లేదా గాలితో కూడిన సీటు లేదా పరుపును ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు.

    పైలనైడిల్ సిస్ట్ శస్త్రచికిత్స

    పైలనైడిల్ సిస్ట్‌లో గాయపూరితమైన కణజాలం లేదా దీర్ఘకాలిక సైనస్ నాళం కనుగొనబడిందని అనుకుందాం. ఆ సందర్భంలో, రోగి సిస్ట్ నుండి చీముని తొలగించడానికి ఎక్సిషన్ లేదా పైలనైడిల్ సిస్ట్ సర్జరీ అవసరమవుతుంది. పైలనైడిల్ సిస్టెక్టమీ ద్వారా సైనస్ నాళాలతో పాటు పైలనైడిల్ సిస్ట్‌ల తొలగింపుకి కూడా సహాయపడుతుంది. గాయాన్ని గాజుగుడ్డతో ప్యాక్ చేయవచ్చు లేదా కుట్లువేసి మూసి వేయవచ్చు. చీలిక లిఫ్ట్/మోడిఫైడ్ కారిడాకిస్ చికిత్స లోతైన కణజాలాన్ని కాక దెబ్బతిన్న చర్మాన్ని మాత్రమే తొలగిస్తుంది, ఇంకా మెరుగైన వైద్యం కోసం కోత ఒక ప్రక్కవైపుకే చేయబడుతుంది.

    పైలనైడిల్ సిస్ట్ సర్జరీ ఇతర రకాలలో లింబెర్గ్ ఫ్లాప్, Z-ప్లాస్టీ మరియు రొటేటింగ్ ఫ్లాప్ వంటి మరింత తగిన పరిమాణాలలో కణజాలాన్ని తొలగించే ఫ్లాప్ చికిత్సలు ఉన్నాయి. ఎవరైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెల్యులైటిస్ లేదా సెప్సిస్) లేదా రోగనిరోధక శక్తి లేమి (HIV/AIDS, క్యాన్సర్ కీమోథెరపీ, స్టెరాయిడ్ చికిత్స లేదా ఇతర రోగనిరోధకత పనితనాన్ని-మార్చే మందులు) తో బాధపడుతున్నారని అనుకుందాం. ఆ సందర్భంలో, రోగి పైలనైడిల్ సిస్ట్ యాంటీబయాటిక్స్ చికిత్స కోసం ఒక సాధారణ సిఫార్సును పొందే అవకాశం ఉండవచ్చు ఇంకా ఆసుపత్రిలో చేరే అవసరం రావచ్చు. పైలనైడిల్ సిస్ట్ ఇన్ఫెక్షన్ల కోసం తరచుగా సిఫార్సు చేయబడిన యాంటీబయాటిక్స్‌లో మెట్రోనిడాజోల్ ఒకటి. ఇది క్రిములు పెరగకుండా నిరోధించడం ద్వారా చీము తగ్గించడంలో సహాయపడుతుంది. శస్త్రచికిత్సకు ముందు రోగి మెట్రోనిడాజోల్‌ను నోటి ద్వారా లేదా నరానికి ఇవ్వడం ద్వారా తీసుకోవచ్చు.

    పైలనైడిల్ సిస్ట్ నుండి కోలుకోవడం

    కోత తెరుచుకొని ఉందా లేదా మూసివేయబడిందా అనే దానిపై ఆధారపడి పైలనైడిల్ సిస్ట్ సర్జరీ తరువాత కోలుకొనే కాలంలో మార్పు ఉంటుంది. ఒక బహిరంగ కోత వల్ల గాయపడిన కణజాలం (కణజాలం తొలగించబడి, బోలుగా తయారవుతుంది ఇంకా శరీరం లోపల నుండి నయం అవుతుంది) నయం కావడానికి ఎనిమిది వారాల సమయం పడుతుంది. కోత కుట్లువేసి మూసివేయబడితే (డాక్టర్ చేత కుట్లువేయబడినది)చాలా వేగంగా కోలుకోవడం ఉంటుంది, కానీ తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది, ఇది అందించే వైద్యాన్ని పొడిగించవచ్చు. క్లెఫ్ట్ లిఫ్ట్/మోడిఫైడ్ కారిడాకిస్ చికిత్స నాలుగు వారాల కోలుకొనే వ్యవధిని కలిగి ఉంటుంది. సాధారణంగా, చికిత్స తరువాత కలిగే మంట ఆరు రోజుల వరకు కొనసాగుతుంది, అయితే కొత్త కణజాల అభివృద్ధికి రెండు నెలల కాలం పడుతుంది. సర్జరీ అవసరం లేని స్వభావం గల పైలనైడిల్ సిస్ట్ చికిత్సలు సిస్ట్ చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే సహాయపడతాయి మరియు లక్షణాలు పొడచూపకుండా లేదా అరుదుగా ఉంటాయి. సరైన పరిశుభ్రతను పాటించాలి, ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలి. మంచి భంగిమలో కూర్చోవాలి. ఇంకా సిస్ట్ తీవ్రతరం కాకుండా ఉంచెందుకు కోకిక్స్ కుషన్ ఉపయోగించాలి.

    ముగింపు

    పైలనైడిల్ సిస్ట్‌కి రోగ నిర్ధారణ సాధారణంగా అనుకూలమైనది మరియు శస్త్రచికిత్సతో సిస్ట్‌ని సాధారణంగా నయం చేయవచ్చు. దురదృష్టవశాత్తూ, గాయపడిన కణజాలం లేదా సైనస్ అభివృద్ధి చెందితే గడ్డలు ఏర్పడటం పునరావృతం అయ్యే అవకాశం ఉంది.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.