
పుట్టిన పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక రక్షణ అవసరం. నవజాత శిశువులు జన్మించిన మొదటి వారాల్లో చర్మం పొలుసులుగా మారడం సాధారణమే. నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా కావడానికి ప్రధాన కారణాలు తెలుసుకోవడంతో పాటు, తల్లిదండ్రులు వారి పిల్లలు ఈ అసౌకర్యం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండి.
నవజాత శిశువుల్లో పొలుసులు రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. సూర్యకాంతి, గాలి, చల్లని వాతావరణం లాంటి పలు కారణాల వల్ల ఇలా జరగవచ్చు. లేదా కొన్ని రసాయనాలు, పలు రకాల మందులకు ప్రతిచర్యగా ఇలా జరగవచ్చు. ఇది తామర లేదా సోరియాసిస్ లాంటి తీవ్రమైన పరిస్థితులకు లక్షణం కూడా కావొచ్చు. నవజాత శిశువుల్లో చర్మంపై పొట్టు కనిపిస్తే కారణాన్ని గుర్తించి, సరైన చికిత్స అందించేందుకు వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యం. నవజాత శిశువుల్లో పొలుసులు రావడానికి వెర్నిక్స్ కేసియోసా, తామర, ఇచ్థియోసిస్ లాంటి కారణాలు కావొచ్చు. ఈ పరిస్థితి వల్ల చర్మం పొడిగా మారి చికాకుకు కారణం అవుతుంది. అయితే దీని వల్ల పెద్దగా హానిలేకపోయినా, పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది. శిశువు చర్మం పొలుసులుగా మారుతుంటే పీడియాట్రీషియన్‌ను కలవడం తప్పనిసరి. నవజాత శిశువుల చర్మం పొట్టులా మారడానికి సాధారణ కారణాలివే.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువులలో పొడి చర్మం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?
నవజాత శిశువుల చర్మాన్ని కప్పి ఉంచే మైనపు పదార్థమే వెర్నిక్స్ కేసియోసా. ఇది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం తేమగా ఉంచడంలో సాయపడుతుంది. నవజాత శిశువుల్లో చర్మం పొలుసులుగా మారడానికి వెర్నిక్స్ కేసియోసా కారణం కావొచ్చు. ఎందుకంటే ఈ మైనపు పదార్థం రంధ్రాలను మూసివేస్తుంది.
నెలలు పూర్తిగా నిండిన తర్వాత డెలివరీ కావడం కూడా చర్మంపై పొట్టు రావడానికి కారణం. ఎందుకంటే వెర్నిక్స్ కేసియోసా పూర్తిగా శిశువు చర్మం పీల్చేసుకుంటుంది. రక్షణగా ఉండే పొరను పూర్తిగా పోవడంతో చర్మం పొడిబారుతుంది. ఇది కాస్తా నవజాత శిశువుల చర్మంపై పొట్టు రావడానికి కారణం అవుతుంది.
తామర వస్తే చర్మం పొడిగా, దురదగా, చికాకుగా మారుతుంది. అలర్జీ, జన్యుపరమైన కారణాలతో పాటు చర్మానికి చికాకు కలిగించే వాటి వల్ల తామర వస్తుంది. తామర వల్ల నవజాత శిశువుల చర్మం పొట్టుగా రాలుతుంది. చర్మం పొడిబారి, చికాకుపుట్టిస్తుంది.
ఇచ్థియోసిస్ వల్ల చర్మం పొడిగా, పొలుసులుగా మారుతుంది. జన్యుపరమైన కారణాలతో పాటు, పర్యావరణ కారకాలు, డీహైడ్రేషన్ లాంటి వాటి వల్ల ఈ సమస్య వస్తుంది. నవజాత శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది. వారికి ఇచ్థియోసిస్ వల్ల చర్మం పొడిబారి పొలుసులతో మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్యల వల్ల చర్మం పొట్టులుగా మారుతుంది. ముఖ్యంగా చర్మం తేమకు, వేడికి గురైనప్పుడు ఈ సమస్య వస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!
నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా మారడం అనేది పిల్లలు పుట్టిన మొదటి కొన్నివారాల్లో సహజంగా వస్తుంది. దీనివల్ల హాని ఉండదు. అయితే శిశువు చర్మంపై పొలుసులు చూడటం ఆందోళన కలిగించినా, కొన్ని మార్పులతో ఈ పరిస్థితిని నిరోధించవచ్చు.
నవజాత శిశువుకు ఎక్కువ స్నానం చేయించడాన్ని తగ్గించండి. ఎక్కువ సేపు నీళ్లల్లో ఉంటే శిశువు లేత చర్మం పొడిగా మారుతుంది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేయించాలి.
వేడి నీళ్లలో స్నానం చేయిస్తే చర్మం పొట్టుగా రాలిపోవడానికి కారణం కావొచ్చు. వేడి నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, శిశువుల లేత చర్మం సులువుగా ఊడిపోతుంది. వేడి నీటికి బదులు గోరువెచ్చని నీటితో పిల్లలకు స్నానం చేయించాలి.
శిశువుకు స్నానం చేయించిన తర్వాత నాన్ కమెడోజెనిక్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. శిశువు చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత హైపోఅల్లర్జెనిక్ బేబీ లోషన్ లేదా క్రీమ్ అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా, పొలుసులుగా మారకుండా ఉపయోగపడుతుంది.
డీహైడ్రేషన్ వల్ల కూడా చర్మం పొడిగా, పొలుసులుగా మారుతుంది. ఫలితంగా చర్మం పొట్టులా ఊడిపోతుంది. అందుకే నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా ఊడిపోకుండా చూసేందుకు హైడ్రేట్‌గా ఉంచడం తప్పనిసరి.
తీవ్రమైన ఉష్ణోగ్రతలకు శిశువుల్ని దూరంగా ఉంచండి. వేడి, చల్లని వాతావరణాలు మీ శిశువు చర్మాన్ని పొడిగా మార్చేస్తుంది. అందుకే ఇంట్లో టెంపరేచర్ కూడా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. చల్లని గాలులు పిల్లల చర్మాన్ని మరింత ఎక్కువ పొట్టుగా మారేలా చేస్తాయి.
మైల్డ్ బేబీ సోప్, వెచ్చని నీటితో మీ శిశువుకు స్నానం చేయించండి. స్క్రబ్బింగ్ చేయకూడదు. కఠినమైన క్లీన్సర్స్ ఉపయోగించకూడదు. వాటి వల్ల మీ శిశువు చర్మానికి చికాకు కలిగి చర్మం పొట్టులా రాలిపోయేందుకు కారణం అవుతుంది.
బ్రీథబుల్ క్లాత్ అంటే గాలి సరఫరా అయ్యే మెటీరియల్‌తో కుట్టిన దుస్తులనే మీ శిశువుకు వేయండి. కాటన్ లాంటి సహజమైన వస్త్రాలను తీసుకోండి. చర్మం పొడిగా ఉండేందుకు, పొట్టులా మారకుండా ఉపయోగపడుతుంది. డైపర్ ర్యాషెస్‌ను నివారించేందుకు క్లాత్ డైపర్స్, బేబీ వైప్స్ ఉపయోగించండి. ఆ ప్రాంతంలో చర్మం పొలుసులు కాకుండా ఉంటుంది.
మీ శిశువు గదిలో తేమ ఉండేందుకు హ్యుమిడిఫయర్ ఉపయోగించండి. గాలికి తేమను జోడించడం వల్ల మీ పిల్లల చర్మం పొడిబారి, పొలుసులు కాకుండా చూస్తుంది.
నవజాత శిశువుల చర్మం లేతగా ఉంటుంది కాబట్టి, నేరుగా సూర్యరశ్మి తగిలి అత్యంత హానికరం కావొచ్చు. శిశువు చర్మం పొలుసులా కాకుండా చూసేందుకు సూర్యరశ్మి నేరుగా తాకకుండా చూడండి. మీకు మీ పిల్లల చర్మం గురించి ఆందోళన ఉన్నట్టైతే డాక్టర్‌ను లేదా పీడియాట్రీషియన్‌ను సంప్రదించండి. చర్మం పొట్టుగా మారడానికి గల కారణాలను గుర్తించి, సరైన చికిత్స అందిస్తారు.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |