
ప్రెగ్నన్సీ అనేది మహిళ శరీరంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఇందులో కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంటి చిట్కాలు మరియు నేచురల్ విధానాలు ఈ సమయంలో సహాయపడతాయి. మహిళలు వారి ఇబ్బందులకు పరిష్కారాన్ని కనుగొనేందుకు వంట గదిలోని సామగ్రిపై ఓ లుక్కేయొచ్చు. అందులో మొదటి వరుసలో ఉండేవి సోంపు గింజల వంటి తరచూ ఉపయోగించే పదార్థాలు. గర్భవతి గర్భధారణ సమయంలో సోంపు తినేందుకు వెనకడుగు వేస్తే దిగువ కథనం సోంపు గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరిస్తుంది. మరింత తెలుసుకునేందుకు మరింత చదవండి.
యూరోప్‌లో మొట్టమొదట కనుక్కోబడిన హెర్బ్ (సుగంధ ద్రవ్యం) సోంపు విత్తనాలు. ఈ సోంపు విత్తనాలు మంచి రుచి, సువాసనను కలిగి ఉంటాయి. ఈ గింజలు లేతగా ఉన్నపుడు ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉంటాయి. చివరికి వచ్చేసరికి డల్ గ్రే రంగులోకి మారిపోతాయి. ఈ మొక్క మెత్తటి ఆకులను కలిగి ఉంటుంది. ఇది పార్స్లీ కుటుంబానికి చెందినది. సోంపు మొక్క వంటశాలలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వివిధ రకాల చికిత్సా పద్ధతులకు ప్రసిద్ధిగాంచినది. ఇండియాలో సాధారణంగా దీనిని "సోంపు" అని పిలుస్తారు. దీనిని వంటలలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా చాలా మంది దీనిని మౌత్ ఫ్రెష్నర్గా కూడా ఉపయోగిస్తారు. ఇది దంత నొప్పి మరియు చిగుళ్ల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది జీర్ణక్రియను ప్రోత్సహించడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
USDA(యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) తెలిపిన దాని ప్రకారం.. ఒక కప్పు (87g) సోంపు గింజలలో పోషకాలు ఈ కింది విధంగా ఉంటాయి.
సోంపు గింజలు నేచురల్ ఎమ్మెనాగోగ్ (మెనుస్ట్రువల్ ఫ్లోను పెంచే మందులు). గర్భవతిగా ఉన్నపుడు స్త్రీలు వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎమ్మెనాగోగ్ అంటే మెనుస్ట్రువల్ ఫ్లోను పెంచేవి అని అర్థం. గర్భధారణలో ఈ విత్తనాలను ఆహారం చుట్టూ ఒక టీ స్పూన్ మోతాదులో చల్లుకోవచ్చు. తన ఆరోగ్య అవసరాల మీద ఆధారపడి.. గర్భిణీ స్త్రీ ఎంత మోతాదులో సోంపును తీసుకోవచ్చో వైద్యుడిని సంప్రదించవచ్చు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు సోంపు గింజలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో సోంపు గింజలను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి. సోంపు గింజలు అనేవి గర్భధారణ సమయంలో ఆకలిని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో మార్నింగ్ సిక్‌నెస్ ను మేనేజ్ చేసి గ్యాస్ మరియు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సోంపు గింజలలో ఉండే యాంటీ ఫాటులెన్స్ ప్రభావం వలన డయజెస్టివ్ ట్రాక్ట్ మజిల్స్ విశ్రాంతి తీసుకుంటాయి. ఇది పిత్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. అజీర్ణం కారణంగా వచ్చే తిమ్మిర్లను తక్కువ చేస్తుంది. గర్భధారణ సమయంలో ఉబ్బరం నుంచి ఉపశమనం పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో సోంపు తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం మరియు గ్యాస్ కారణంగా తమ ఆకలిని కోల్పోతున్నామని చాలా మంది గర్భవతులు ఫిర్యాదు చేస్తారు. సోంపు గింజల వంటి నేచురల్ కార్మినేటివ్స్(ఉబ్బరాన్ని తగ్గించే మందులు) ఇంటెన్సినల్ గ్యాసెస్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఫలితంగా గర్భధారణ సమయంలో సోంపు గింజలను తీసుకోవడం అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణసంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఆకలిని పునరుద్ధరిస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో గ్యాస్ & ఉబ్బరం సమస్యలతో డీల్ చేయడం
గర్భధారణ సమయంలో సోంపు గింజలు తీసుకోవడం వలన కలిగే నష్టాల గురించి ఈ కింద చర్చించబడింది.
రక్తం గడ్డకట్టే సామర్థ్యం సోంపు గింజల ద్వారా ప్రభావితం అవుతుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. కావున ఎవరైనా రక్తస్రావం సమస్యతో బాధపడుతూ ఉంటే.. మరీ ముఖ్యంగా గాయాలు మరియు రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటే గర్భధారణ సమయంలో సోంపు గింజలను తినకపోవడమే ఉత్తమం. గర్భధారణ సమయంలో సోంపు గింజలను తినడం వలన చర్మం పొడిబారి సున్నితత్వం పెరుగుతుంది. సున్నిత చర్మం కలిగి ఉన్న గర్భవతులు సోంపు గింజలకు దూరంగా ఉండాలి.
సోంపు యాంటీస్పామోడిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గర్భాశయాన్ని ఉత్తేజపరిచే ప్రారంభ సంకోచాలకు కారణం అవుతుంది. గర్భధారణలో ఉన్నపుడు సోంపును మితంగా తీసుకోవడం వలన పిండంకు ఎటువంటి హాని జరగదు. ఇది ఎటువంటి ముందస్తు సంకోచాలకు కారణం కాకుండా ఉంటుంది. చాలా మంది బేబీ ఫెయిర్‌గా పుట్టేందుకు గర్భవతిగా ఉన్నపుడు సోంపు గింజలను తింటారు. కానీ సోంపు గింజలు తినడం వలన బేబీ ఫెయిర్‌గా పుడుతుందని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?
గర్భవతిగా ఉన్నపుడు సోంపు గింజలు తినడం సురక్షితమే అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవు. అయితే ఈ సీడ్స్ తల్లికి మరియు పుట్టబోయే బిడ్డకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగించవు. ఇవి గర్భవతులు తక్కువ ఉబ్బరం, గ్యాసీగా అనిపించినపుడు సహాయం చేస్తాయి.
వైద్యుడిని సంప్రదించిన తర్వాత గర్భిణీ స్త్రీలు సోంపు గింజలను గర్భవతులు తినేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. సోంపు గింజలు సువాసన, ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. భోజన సమయంలో వాటిని సువాసన పదార్థంగా పని చేస్తాయి. అంతే కాకుండా ఆహారానికి సున్నితమైన రుచిని అందిస్తాయి. అదనంగా గర్భిణీ స్త్రీలు వీటిని టీలో కూడా ఉపయోగించొచ్చు. భోజనం తర్వాత పచ్చి వాటిని (ఎలా ఉంటాయో అలా.. ) కూడా తినొచ్చు. మీ ప్రెగ్నెన్సీ డైట్లో సోంపును చేర్చే ముందు మీ వైద్యుడిని లేదా న్యూట్రీషియనిస్ట్ను సంప్రదించడం అవసరం.
ఇండియాలో భోజనం చేసిన తర్వాత తరచుగా సోంపు గింజలను తింటారు. ఎందుకంటే అవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అయినా కానీ గర్భిణీ స్త్రీలలో సోంపు గింజలు తిరిగి రుతుచక్రాన్ని ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి. వీటి వలన యోని రక్తస్రావం జరిగి ఫలితంగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. వీటిని పొదుపుగా తినడం చాలా ముఖ్యం. వైద్యుడు కనుక వీటిని తినొద్దని సిఫారసు చేస్తే పూర్తిగా వీటిని తినకుండా ఉండడం మంచిది. గర్భధారణ సమయంలో సోంపు గింజలు మీకు సురక్షితంగా ఉన్నాయో? లేదో? తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించండి. తినాలని అనుకున్నపుడు కేవలం వైద్య సలహాను మాత్రమే పాటించండి.
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |