hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమేనా? (Is It Safe To Eat Papaya During Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమేనా? (Is It Safe To Eat Papaya During Pregnancy in Telugu?)

    Pregnancy Best Foods

    గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమేనా? (Is It Safe To Eat Papaya During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డకు తగినన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకవాలి. గర్భిణీ స్త్రీ తినాల్సినవి మరియు శిశువు భద్రత కోసం ఆమె దూరంగా ఉండాల్సిన ఆహారాలు కొన్ని ఉంటాయి. ఇక్కడే బొప్పాయి పండు గురించిన ఒక మూఢ నమ్మకం వస్తుంది. గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు.

    గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమేనా? ( Is Eating Papaya Safe During Pregnancy in Telugu?)

    బొప్పాయి పండు పూర్తిగా పండినపుడు గర్భిణీ స్త్రీలు తిన్నా కానీ ఎటువంటి సమస్యలు రావు. అది వారికి పూర్తిగా సురక్షితమైనది. కానీ గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే అందులో లేటెక్స్(రబ్బరు చెట్ల నుంచి వచ్చే పదార్థం) ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. పచ్చి బొప్పాయిని గుర్తించడం చాలా సులభం. ఇది చూసేందుకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంతే కాకుండా సగం పండిన బొప్పాయిని కూడా నివారించాలి. బొప్పాయి పండు అనేది శరీరంలో అదనంగా వేడిని ప్రేరేపిస్తుందని అంతా నమ్ముతారు. కావున దానిని గర్భధారణ సమయంలో తినకూడదని చెబుతారు. కానీ బొప్పాయి పండు గర్భస్రావానికి కారణమయ్యే రీతిలో లేదా ముందుగా ప్రసవం అయ్యేలా శరీరంలో వేడిని ప్రేరేపిస్తుందని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. స్త్రీకి పీరియడ్స్ రానపుడు బొప్పాయి తినడం వల్ల పీరియడ్స్ వస్తాయనే అపోహ కూడా ఉంది.

    బొప్పాయి పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పండు అని గుర్తుంచుకోవాలి. కావున ఒక స్త్రీకి బొప్పాయి పండు తినాలని ఉంటే.. వారు ఎటువంటి చింత లేకుండా బొప్పాయిపండుని తినొచ్చు. బొప్పాయి పండు తిన్నపుడు జీర్ణక్రియలో ఏదైనా అసౌకర్యం తలెత్తితే లేదాయోని ప్రాంతంలో ఊహించని రక్తస్రావం జరిగితే బొప్పాయి తినడం మానేయాలి. అంతే కాకుండా గర్భధారణ సమయంలో బొప్పాయిని తినేటపుడు జాగ్రత్త వహించాలి. దానిని ఎక్కువ మోతాదులో తినకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది పేగు కదలికలను తీవ్రతరం చేస్తుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?

    పండిన బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (What Are the Benefits of Eating Ripe Papaya in Telugu?)

    గర్భధారణ సమయంలో బొప్పాయిని తినడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం పండిన బొప్పాయిని తిన్నపుడు మాత్రమే ఈ లాభాలుంటాయని, పచ్చిబొప్పాయిని తింటే ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

    • బొప్పాయిలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, బెటా కెరోటిన్, మరియు పొటాషియం వంటి అనేక పోషకాలు మరియు మినరల్స్ ఉన్నాయి. ఈ విటమిన్లు తల్లి మరియు బిడ్డ యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. గర్భధారణ సమయంలో వచ్చే ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.
    • గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం ద్వారా మార్నింగ్ సిక్​నెస్ మరియు వికారం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందొచ్చు.
    • బొప్పాయిలో ఉండే విటమిన్లు తల్లిలో ఉండే అల్సర్లు మరియు చర్మ సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తాయి.
    • పండిన బొప్పాయిలో ఉండే ఫైబర్స్ గర్భిణీ స్త్రీలో ఉండే జీర్ణసమస్యలను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గర్భధారణ సమయంలో స్త్రీకి చిన్నపాటి మలబద్దకం సమస్య ఉంటే కొన్ని పండిన బొప్పాయి పండ్లను తిని ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. మలబద్దకం అనేది తీవ్రంగా ఉంటే ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం అవసరం.
    • బొప్పాయిలో ఉండే ఫోలిక్ యాసిడ్ పెరుగుతున్న శిశువు నరాల అభివృద్ధికి అవసరం.
    • గర్భధారణ సమయంలో గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది. వాటిని నివారించేందుకు బొప్పాయిని హోం రెమెడీగా కూడా ఉపయోగించొచ్చు.
    • గర్భధారణ సమయంలో స్త్రీ ఏదైనా వైరల్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే.. తన రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకుని ఆ వైరల్ వ్యాధితో పోరాడేందుకు ఆమె బొప్పాయి పండు తినాలని నమ్ముతారు. ఇటువంటి సందర్భంలో మన శరీరంలో ఉండే ప్లేట్​లెట్ల సంఖ్యను పెంచేందుకు బొప్పాయి సహాయపడుతుంది. కానీ దీనికి ఎటువంటి శాస్త్రీయ మద్దతు లేదు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అజీర్ణానికి గల 5 కారణాలు

    బొప్పాయిలో ఉండే రబ్బరు పాలు(రబ్బరు చెట్ల నుంచి వచ్చే పదార్థం) ఎందుకు తినకూడదు (Why Papaya Latex Should Not Be Consumed)?

    • గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయిలో ఉండే లాటెక్స్ (రబ్బరు చెట్ల నుంచే వచ్చే తెల్లటి పదార్థం)కు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు లాటెక్స్ ఎందుకు తినకూడదంటే..
    • ముందస్తు ప్రసవానికి దారి తీసే గర్భాశయ సంకోచాలు కలిగేలా బొప్పాయిలో ఉండే లాటెక్స్ (తెల్లటి పదార్థం) ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా పీరియడ్స్ వచ్చినపుడు అసాధారణ స్థాయిలో రక్తస్రావానికి ఇది దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో గర్భస్రావానికి కారణం అవుతుంది.
    • పచ్చి బొప్పాయిలో పాపైన్ కూడా ఉంటుంది. ఇది గర్భవతి శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ కోసం మిస్టేక్ చేసేలా చేస్తుంది. ఇది ప్రసవాన్ని ప్రేరేపించే హార్మోన్. అంతే కాకుండా పచ్చిబొప్పాయిలో పెప్సిన్​తో కూడిన పాపైన్ పిండం అభివృద్ధిని ఆపుతుంది. పిండం పెరుగదలకు మద్దతు ఇచ్చే గర్భాశయంలోని పొరలను కూడా ఈ రసాయనాలు బలహీనపరుస్తాయి. గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతాయి. ఈ దుష్ప్రభావాలు మాత్రమే కాకుండా పాపైన్ ఇంప్లాంటేషన్​ (కొత్త జీవి ఏర్పడడం) కు అంతరాయం కలిగిస్తుంది. పిండానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
    • పచ్చిబొప్పాయిలో ఉండే రసాయనాలు వాస్కులర్ ప్రెజర్​ను పెంచి అంతర్గత రక్తస్రావాన్ని ప్రేరేపిస్తాయి. ప్లాసెంటాలో రక్తస్రావానికి కూడా దారితీస్తుంది. హానికరమైన ఇన్ఫెక్షన్​కు గురిచేయడం ద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తుంది.
    • పచ్చి బొప్పాయి తింటే కూడా నెలలు నిండకముందే శిశువు పుట్టేందుకు కారణం అవుతుంది. డెలివరీ తర్వాత కూడా పుట్టిన శిశువులలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది.
    • పచ్చిబొప్పాయిలో ఉండే లాటెక్స్ (తెల్లటి పదార్థం) సాధారణంగా అలెర్జీని కలిగిస్తుంది. ఇది శరీరంలో ప్రమాదకరమైన ప్రతి చర్యలను కలిగిస్తుంది.
    • కుప్తంగా చెప్పాలంటే.. పండిన బొప్పాయిని తినడం వలన గర్భిణీ స్త్రీలకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముట్టుకుంటే మృదువుగా ఉండి, పసుపు రంగులో ఉన్న బొప్పాయిని ఎల్లప్పుడూ తినాలి. బొప్పాయి ఆకులు, విత్తనాలను అస్సలుకే తినకూడదు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాయాలు మరియు నల్లటి మచ్చలు ఉన్న బొప్పాయిపండ్లకు దూరంగా ఉండాలి.

    Tags

    Papaya during pregnancy in Telugu, Papaya benefits during pregnancy in telugu, Side effects of eating Papaya during pregnancy in telugu, Papaya nutritional benefits during pregnancy in telugu, precautions to take while eating Papaya during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.