
సారాంశం




త్వరలో తల్లి కాబోయే వారు చాలా మంది "నేను గర్భధారణ సమయంలో పనసపండు తినొచ్చా?" అని తమని తాము ప్రశ్నించుకుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం అవును. గర్భధారణ సమయంలో ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్ల వంటి పోషకాహారం తినడం ఎల్లప్పుడూ మంచిదే. సమతుల ఆహారం పుట్టబోయే బిడ్డకు సరైన పోషకాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తల్లిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు తినకుండా ఉండాల్సిన కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. మరో పక్క పనసపండులో అనేక పోషకాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో పనసపండు ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దాని వల్ల కలిగే ప్రమాదాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా అవగాహన కలిగి ఉండడం మంచిదే కదా.
పనసపండులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మంచి మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఒక కప్పు పరిమాణంలో ఉన్న పనసపండులో 155 కేలరీలు ఉంటాయి. ఇదే సమయంలో కొవ్వు నుంచి కేవలం 5 కేలరీలు మాత్రమే లభిస్తాయి. కేలరీల కోసం ఇది చాలా ఆరోగ్యకరమైనది. పనసపండు ఈ కింది విటమిన్లకు మంచి మూలం.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పనసపండులో కేవలం కొద్ది మోతాదులో మాత్రమే సాట్యురేటెడ్ ఫ్యాట్ (అనారోగ్యకరమైన కొవ్వు) మరియు కొలెస్ట్రాల్ (రక్తనాళాల్లో పేరుకుపోయేది) ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, జీవక్రియ కోసం అవసరమైన ఫైబర్స్ అధిక మోతాదులో ఉంటాయి.
చాలా మంది మహిళలు కొంత మంది వైద్యులు కూడా గర్భధారణ సమయంలో స్త్రీలు పనసపండు తినొద్దని సూచిస్తారు. పనసపండు వల్ల కలిగే ప్రయోజనాలను నిరూపించేందుకు తగినంత డేటా అందుబాటులో లేదు. గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల గర్భస్రావం అవుతుందని కొంత మంది మహిళలు నమ్ముతారు. కానీ అది నిజం కాదు. పనసపండుని తగినంత మొత్తంలో తినడం వల్ల తల్లికి లేదా బిడ్డకు ఎటువంటి హాని కలగదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?
గర్భవతిగా ఉన్నపుడు పనసపండు తినడం అనారోగ్యకరమైనది కానప్పటికీ దీనితో కొన్ని ప్రమాదాలు ముడి పడి ఉన్నాయి.
గర్భవతిగా ఉన్న మొదటి త్రైమాసికంలో పచ్చి పనసపండు తినడం మూడో త్రైమాసికంలో అధికంగా తీసుకోవడం వలన బహుశా అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. అయినప్పటికీ గర్భధారణ సమయంలో పనసపండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పనసపండుని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో పొట్ట మీద ఏర్పడే కడుపు పూతల వంటి వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
పనసపండు జింక్, కాల్షియం, బెటా-కెరోటిన్, ఐరన్‌ను అందిస్తుంది. ఇవి కడుపులో ఉన్న శిశువు పెరుగుదలకు ఉపయోగపడతాయి.
పనసపండు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయం చేస్తాయి.
పనసపండు వంటి శక్తివంతమైన పండ్లు మరియు కూరగాయలు తినడం వల్ల శక్తి లభించి అలసట దూరం అవుతుంది.
ప్రతి రోజు తీసుకోవాల్సిన ఫైబర్ కంటెంట్‌లో దాదాపు 10 శాతం ఫైబర్ కంటెంట్ పనసపండు ద్వారా లభిస్తుంది. అధిక ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగు కదలికలు మరింత సమర్థవంతంగా ఉంటాయి
పనసపండు గింజలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిల్లో ప్రోటీన్ మరియు మానసిక ఒత్తిడిని తగ్గించే అనేక రకాల మినరల్స్ ఉన్నాయి.
సాధారణంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు విటమిన్ C చాలా అవసరం. మరీ ముఖ్యంగా గర్భవతిగా ఉన్నపుడు ఇది ఇంకా అవసరం. పనసపండులో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పనసపండు గింజల వలన త్వరలో తల్లి కాబోయే స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
పనసపండు వలన గర్భిణీ స్త్రీకి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఇవి భద్రతకు హామీ ఇవ్వలేవు.
పనసపండుని అనేక రకాలుగా తినొచ్చు. పచ్చిగా ఉండే కాయ, లేదా పండిన పండు, అంతే కాకుండా దీనిని కూరగాయగా కూర కూడా వండుకోవచ్చు. గర్భవతిగా ఉన్నపుడు పనసపండు చిప్స్ తక్కువ మోతాదులో తినాలి. ముక్కలుగా చేసిన పనసపండు మీద కొబ్బరి తురుమును వేసుకొని కూడా తినొచ్చు.
పనసపండుని కొనుగోలు చేసేటపుడు తాజాగా మరియు బరువుగా ఉండేది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే దానిని ఎంచుకోవాలి. గర్భధారణ సమయంలో పనసపండుని తక్కువ మోతాదులో తీసుకుంటే.. దాని ప్రయోజనాలను పొందొచ్చు. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీద అవగాహన కలిగి ఉండాలి.
Jackfruit during pregnancy in telugu, Jackfruit benefits during pregnancy in telugu, Jackfruit side effects during pregnancy in telugu, can pregnants eat Jackfruit during pregnancy in telugu, Jackfruit in pregnancy in telugu.
మీ గర్భధారణ ప్రయాణంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించే ఉత్పత్తులు మీకు సహాయపడతాయి.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress




Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each




MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Organic Aloe Vera (300 ml)
Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |