hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Sex During Pregnancy arrow
  • మూడో త్రైమాసికంలో సెక్స్​లో పాల్గొనడం సురక్షితమేనా మరియు దాని పర్యావసనాలు ఏమిటి? arrow

In this Article

    మూడో త్రైమాసికంలో సెక్స్​లో పాల్గొనడం సురక్షితమేనా మరియు దాని పర్యావసనాలు ఏమిటి?

    Sex During Pregnancy

    మూడో త్రైమాసికంలో సెక్స్​లో పాల్గొనడం సురక్షితమేనా మరియు దాని పర్యావసనాలు ఏమిటి?

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    ఈ సమయంలో సెక్స్ చేయడం వల్ల మీకు లేదా మీకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా హాని కలుగుతుందా?

    పిండం మూడవ త్రైమాసికంలో ఉండగా సెక్స్ వలన ఎటువంటి హాని లేదు. అమ్నియోటిక్ శాక్ మీ బిడ్డని రక్షిస్తూ ఎటువంటి హాని జరగకుండా చూస్తుంది. అదనంగా మీ శిశువు గర్భాశయం చుట్టూ ఉన్న మ్యూకస్ ప్లగ్ ద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించబడుతుంది. మీరు మరియు మీ భాగస్వామి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    ప్రెగ్నెన్సీ సమయంలోని మొదటి మూడు నెలల్లో సెక్స్ మంచిదా? లేదా కాదా?

    అటువంటిదేం లేదు. ఇది మంచిదే. కానీ మూడో త్రైమాసికంలో అనేక కారణాల వల్ల గర్భిణి మహిళలకు సెక్స్ సాధ్యం కాదు. చివరి త్రైమాసికంలో శిశువు తల కిందకి జారిపోతుంది. కావున ఈ సమయంలో సెక్స్ చేయడం వలన ఒత్తిడి మరియు నొప్పి కలుగుతుంది.

    మీరు ప్రసవాన్ని ప్రేరేపించేందుకు సెక్స్ సమయంలో ఇద్దరు భాగస్వాములు విడుదల చేసే హార్మోన్ల వల్ల కలిగే సంకోచాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక మహిళకు ముందస్తుగా డెలివరీ అయిన చరిత్ర ఉంటే తాను చివరి త్రైమాసికంలో సెక్స్​లో పాల్గొనకూడదు.

    ఉద్వేగం చివరి మూడు నెలల్లో బ్రాక్ట్సన్ హిక్స్ సంకోచాలకు కారణం కావచ్చు. ఈ సంకోచాల కారణంగా మీ కడుపు మరియు బేబీ బంప్ ధృడంగా పెరుగుతాయి. ఈ తాత్కాలిక పరిస్థితి మీకు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించదు.

    మీకు సరైన సెక్స్ పొజిషన్లు

    మీ ప్రెగ్నెన్సీ మూడో త్రైమాసికంలో మీరు కొన్ని పొజిషన్లను అమలు చేయడం సవాలుగా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ మూడో త్రైమాసికంలో సురక్షితంగా మరియు ఎంజాయ్ చేస్తూ సెక్స్ చేసేందుకు ఇక్కడ వివిధ రకాల సెక్స్ భంగిమలు ఉన్నాయి.

    Article continues below advertisment

    స్పూన్ పొజిషన్లో డెవలప్ అవుతున్న మీ పొట్ట సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. మీరు మీ వైపుకు పడుకుని ఉంటారు. మీ భాగస్వామి వెనకాల నుంచి వస్తాడు.

    మీరు ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నపుడు మీ పార్ట్​నర్ మీద పడుకోవడం చాలా హాయినిస్తుంది. మీ బాడీ కూల్ అవుతుంది. మీరు ఇష్టం ఉన్న విధంగా టెంపోను సెట్ చేసుకోవచ్చు. మీ భాగస్వామి మీకు మరీ దగ్గరగా రాకుండా చూసుకోండి.

    మూడో త్రైమాసికం తర్వాత మంచం చివర్లో (అంచున) పడుకోవడం కూడా బాగానే ఉంటుంది. మీ పాదాలను నేలకు ఆనించి మంచం అంచున పడుకోండి. మీ పార్ట్​నర్ మీలో ఎలా చొచ్చుకుపోతారనేది అతడి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీ భాగస్వామి మీరు కోరుకున్న వేగాన్ని అందుకున్నపుడు మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

    మీరు ఓరల్ సెక్స్ లేదా పరస్పర హస్తప్రయోగాన్ని కోరుకుంటే పెనాట్రేషన్ (లోతుగా పురుషాంగాన్ని చొప్పించే చర్య) అవసరం లేదు.

    ఈ సెక్సువల్ పొజిషన్లను దూరం పెట్టండి

    మీ వీపుపై పడుకోవాల్సిన అవసరం ఉన్న మిషనరీ స్థానం తప్ప, గర్భం యొక్క ఏ దశలోనూ ఏ భంగిమ కూడా సహజంగా ప్రమాదకరం కాదు. అయితే మీరు ఎంచుకున్న స్థానంతో సంబంధం లేకుండా మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి. డీప్ పెనట్రేషన్​ను(లోతుగా పురుషాంగాన్ని చొప్పించే చర్య) నివారించండి. అది మీకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. రక్త స్రావం కూడా జరగవచ్చు.

    Article continues below advertisment

    ఓరల్ సెక్స్ సమయంలో మీ భాగస్వామి నోటితో యోనిలోకి గాలిని నెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల రక్తనాళం బ్లాక్ చేయబడవచ్చు. ఇది మీకు మీకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.