hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Food Cravings arrow
  • గర్భధారణ సమయంలో చికెన్ తినడం సురక్షితమా, కాదా? arrow

In this Article

    గర్భధారణ సమయంలో చికెన్ తినడం సురక్షితమా, కాదా?

    Food Cravings

    గర్భధారణ సమయంలో చికెన్ తినడం సురక్షితమా, కాదా?

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    చికెన్ అనేది రుచికరమైన ఆహారం. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గర్భవతిగా ఉన్న స్త్రీ తనకోసం మరియు తన కడుపులో ఉన్న బిడ్డ కోసం తింటున్నందున అధిక మొత్తంలో ప్రొటీన్ అవసరం. చికెన్ ప్రెగ్నెన్సీకి మంచిదా? కాదా? అని ఆలోచిస్తున్నారా? సాధారణంగా గర్భధారణ సమయంలో చికెన్ వంటి పౌల్ట్రీ వస్తువులను తీసుకోవడం మంచిదే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే.. బాగా క్లీన్ చేసి కడిగిన చికెన్​, బాగా వండిన, వేడివేడిగా ఉన్న చికెన్​నే తినాలి. గర్భధారణ సమయంలో చికెన్ గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో చికెన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు ఏవైనా ఉంటే అవి కూడా తెలుసుకుందాం.

    గర్భధారణ సమయంలో చికెన్ తినడం సురక్షితమేనా?

    గర్భవతిగా ఉన్నపుడు చికెన్ మంచిదనడంలో ఎటువంటి సందేహం లేదు. చికెన్​లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఆశించే తల్లులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఒక సింగిల్ సర్వింగ్ లీన్ చికెన్​(100గ్రాములు)లో 3.5 డెయిలీ సర్వింగ్స్ ప్రొటీన్ ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే.. చాలా సార్లు చికెన్​ను వేడిగా వడ్డించకపోవచ్చు. లేదా సరిగ్గా ఉడికించి వండకపోవచ్చు. గర్భధారణ సమయంలో ఇటువంటి చికెన్ తీసుకోవడం సమస్యగా మారుతుంది. ఎందుకంటే వండని లేదా పచ్చి చికెన్​లో హానికరమైన బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది.

    వండని లేదా పచ్చి చికెన్​ను తినడం వల్ల మాంసం అనేది సాల్మొనెల్లాకు వాహకంగా పని చేయొచ్చు. ఇది గర్భిణీ స్త్రీకి ఉబ్బరం, వాంతులు, వికారం, తిమ్మిర్లు, జ్వరం మరియు తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ప్రభావం అధికంగా ఉన్న సందర్భంలో ఇది గర్భస్రావానికి కూడా దారి తీయొచ్చు. అందుకోసమే చికెన్​ను కనీసం 71 డిగ్రీల వరకైనా ఉడికించాలి. ప్రత్యేకించి చికెన్​లో ఉండే మందభాగాలను తప్పకుండా ఎక్కువగా ఉడికించాలి. ఇలా చేయడం వల్ల చికెన్​లో ఉన్న హానికర బ్యాక్టీరియా లేదా కీటకాలు తొలగిపోతాయి. ఇప్పుడు గర్భిణీ స్త్రీ తినడం చాలా మంచిది.

    ఫ్రిడ్జ్​లో ఉన్న రాత్రి మిగిలిపోయిన చికెన్ సంగతేంటి? ఒకసారి వండిన తర్వాత చికెన్​ను 24 గంటల వరకు ఫ్రిడ్జ్​లో ఉంచవచ్చు. మీరు గర్భవతిగా ఉన్నపుడు చికెన్ తినే ముందు చికెన్ వేడిగా ఉన్నా కానీ మరోసారి పొయ్యి మీద పెట్టి వేడిచేయాలి. చికెన్​ మీద ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఇలా చేయడం వల్ల చనిపోతుంది. ప్రస్తుతం మరియు ఆ తర్వాత గర్భవతిగా ఉన్నపుడు చికెన్ తినడాన్ని సురక్షితం చేస్తుంది. గర్భధారణ సమయంలో డెలిస్ (ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఉండే స్టోర్) నుంచి ప్రాసెస్ చేయబడిన మాంసాలు తినొచ్చా? అని ఆశ్చర్యపోతున్నారా.. డెలి కౌంటర్లలో (స్టోర్లలో) ప్రాసెస్ చేసిన కోడి మాంసం ముక్కలుగా ఉంటుంది. ఇక్కడ మరో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ ఆహారాల మీద కూడా సాల్మోనియా, లిస్టెరియా ఉండే ప్రమాదం ఉంది. కావున మీరు గర్భవతిగా ఉన్నపుడు ఇటువంటి ముక్కలను తీసుకోకపోవడమే ఉత్తమం. ఆ ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో మీరు సరిగ్గా చెప్పలేరు. మీరు ప్రాసెస్ చేసిన కోడి మాంసాన్ని తినకుండా ఉండలేకపోతే.. చికెన్ బాగా ఉడికిందని నిర్దారించుకోండి. వేడి వేడిదే తినేందుకు ప్రయత్నించండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: 7 వారాల గర్భధారణ సమయంలో మీ ఆహారములో చేర్చాల్సిన ముఖ్యమైన 5 ఆహార పదార్థాలు

    గర్భధారణ సమయంలో చికెన్ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

    • చికెన్ తినడం శరీరానికి మంచిదే అయినా కానీ.. కొన్ని సందర్భాలలో ఇది హానికరం కూడా కావొచ్చు. గర్భధారణ సమయంలో శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసమే పచ్చి లేదా వండని చికెన్​ను పూర్తిగా తినడం మానేయాలి. పచ్చి లేదా వండని చికెన్ మీద సాల్మొనెల్లా లేదా లిస్టెరియా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి మాంసాన్ని తిన్నపుడు శరీరంలో ఆహారం విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంటుంది.
    • వండని లేదా పచ్చి చికెన్ తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రమాదాలలో.. వాంతులు, వికారం, కడుపు లేదా పొత్తి కడుపు ప్రాంతంలో తిమ్మిర్లు, జ్వరం, విరేచనాలు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో బ్యాక్టీరియా ఉన్న ఉడికించని చికెన్ తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీకి గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

    గర్భధారణలో చికెన్ వల్ల కలిగే ప్రయోజనాలు

    1. గర్భధారణ సమయంలో చికెన్ తినాలని సిఫారసు చేయబడింది. ఎందుకంటే ఇందులో లీన్ ప్రొటీన్(తక్కువ మోతాదులో సంతృప్త కొవ్వులు ఉండే ప్రొటీన్), చాలా పోషకవిలువలు మినరల్స్ మరియు విటమిన్స్​ను కలిగి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లీన్ చికెన్ (కొవ్వు తక్కువగా ఉండేది) తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకించి దీనిని బాగా ఉడికించి... వేడిగా వడ్డిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. శరీరం కండరాలను అభివృద్ధి చేసేందుకు చికెన్ సహాయపడుతుంది. చికెన్​లో ఉండే విటమిన్లు శరీరంలో కొత్త కణాల పెరుగుదలకు చాలా అవసరం.
    2. చికెన్ అనేది ప్రొటీన్​ను మాత్రమే కలిగి ఉండడం కాకుండా.. లీన్ చికెన్ ఐరన్, జింక్​ను కూడా కలిగి ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. దీనిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి, గర్భధారణ సమయంలో సరైన బరువును మెయింటేన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి కూడా చికెన్ తినమని సిఫారసు చేయబడింది. ఇది శిశువుకు కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తుంది. మరియు గర్భం లోపల శిశువు ఆరోగ్యకరంగా డెవలప్ అయ్యేందుకు ఇది దారి తీస్తుంది.
    3. లీన్ చికెన్​లో కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఒమేగా-6 మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటుంది. ఇది కోలిన్ విటమిన్​కు మూలంగా ఉంటుంది. పిల్లల ప్రారంభసంవత్సరాల్లో వారి మెదడు మరియు జ్ఞాపకశక్తి పనితీరును అభివృద్ధి చేయడంలో చికెన్ సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, అదే విధంగా విటమిన్ A, థయమిన్, మరియు సెలేనియంను చికెన్ కలిగి ఉంటుంది.
    4. చికెన్​లో ఉండే ఇతర పోషకాలలో కాల్షియం, ఫోలేట్, ఐరన్, B12, A, C, E, D, K విటమిన్లు, మెగ్నీషియం, ప్రొటీన్, నియాసిన్, పొటాషియం, పాస్పరస్, థయమిన్, జింక్, రైబోఫ్లావిన్, సోడియం మొదలయినవి ఉన్నాయి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.