


Breast Changes
2 December 2025 న నవీకరించబడింది
గర్భం యొక్క ప్రారంభ దశలలో మీ రొమ్ములు మారడం అనేది సంకేతంగా కనిపిస్తుంది. మీరు మీ ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ మీరు మీ రొమ్ములలో మార్పులను గమనిస్తారు. మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో మీ శరీరంలో విడుదలయ్యే హార్మోన్లలో మార్పులు వస్తాయి. మీ జీవితంలో ఈ సమయంలో సంభవించే అనేక మార్పులకు ఈ హార్మోన్లు ముఖ్యమని తెలుసుకోండి. మీకు పుట్టిన శిశువుకు చనుబాలివ్వడానికి ఈ హార్మోన్లు మీ రొమ్ములను సిద్ధం చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మీ రొమ్ములు పరిమాణంలో పెద్దవిగా మారుతాయి. అప్పుడు కొంత నొప్పిని అనుభవిస్తారు. మీ చనుమొనలు రంగు కూడా మారతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ మార్పులు చాలా సహజం. ఈ మార్పులు మీకు ఏదైనా అసౌకర్యాన్ని కలిగించినట్లయితే భవిష్యత్‌లో మీరు మంచి అనుభూతిని పొందే అంశాలు ఉన్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కొన్ని సార్లు మీ ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో (1 నుంచి 12 వారాలు) మీ రొమ్ములు మీకు మరింత మృదువుగా అనిపించవచ్చు. జలదరింపును ఫీల్ అవుతారు. మీ చనుమొనలు సాధారణం కంటే ఎక్కువగా పొడుచుకువస్తాయి. తర్వాతి మూడు నెలల ప్రెగ్నెన్సీ సమయంలో మీ రొమ్ముల సైజు పెరగడం, బరువు పెరగడం జరుగుతుంది. మీరు పెద్ద సైజ్ బ్రాను ధరించడం వలన మీరు మరింత సపోర్ట్‌ను పొందొచ్చు. మీరు ప్రెగ్నెన్సీ ప్రారంభ దశల్లో ఉన్నపుడు తక్కువ సున్నితత్వం మరియు తక్కువ జలదరింపును పొందుతారు.
మీ రొమ్ములు మరింత పెద్దగా పెరిగినపుడు మీ చర్మం కింద దాగి ఉన్న సిరలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. చనుమొనల చుట్టూ ఉండే ప్రాంతాన్ని అరోలా అని పిలుస్తారు. అది రంగు మారుతూ పెద్దగా మారుతుంది. అరోలాలో మీరు చిన్న బంప్స్‌ను గమనించొచ్చు. మీరు మీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మీరు ఈ బంప్స్ గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. కొంత మంది స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్ స్ట్రెచ్ మార్క్స్‌ను (స్తనాల వద్ద చర్మపు గుర్తులు) అనుభవిస్తారు. మీరు గర్భం దాల్చిన 16 నుంచి 19వ వారంలోపు మీ చనుమొనల నుంచి పసుపు రంగులో ఉండే స్రావం వస్తుంది. దానిని కోలోస్ట్రమ్ అని పిలుస్తారు. మీ రొమ్ములు పాలివ్వడానికి సిద్ధం అవుతున్నాయనే సంకేతం ఇది. కోలోస్ట్రమ్ను ప్రీ మిల్క్ (ముందస్తు పాలు) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే జీవితంలోని మొదటి కొన్ని రోజులలో శిశువులలో అనారోగ్యాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది.
మీ చనుమొనలు పెద్దవిగా మరియు మరింత సున్నితంగా మారే అవకాశం ఉంది. మీ అరోలా (చనుమొనల చుట్టూ ఉండే ప్రాంతం) రంగుమారడాన్ని గమనించవచ్చు. మీ శరీరానికి రక్తప్రసరణ పెరగడం కూడా ప్రారంభం అవుతుంది. మీలో ఎదుగుతున్న పిండానికి పోషక విలువలు అందించేందుకు ఇది సహాయపడుతుంది. మీ రొమ్ములపై ఉన్న సిరలు నీలం రంగులో పెద్దవిగా మారొచ్చు. దీంతో పాటు మీ రొమ్ముల పరిమాణం నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది. వాటిలో మీరు వాపును గమనించవచ్చు. మీ శరీర హార్మోన్ స్థాయిలను అడ్జస్ట్ చేయడం వలన గర్భందాల్చిన మొదటి వారాల్లోనే ఈ సంకేతాలు అదృశ్యమవుతాయి.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips






అబార్షన్ తర్వాత.. ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఎందుకు కష్టం అవుతుంది?

గర్భధారణ సమయంలో క్వినోవా - ప్రయోజనాలు, మార్గదర్శకాలు | Quinoa During Pregnancy Benefits & Guidelines in Telugu

మహిళల్లో సంతానోత్పత్తిని ఎలా పెంచాలి? అందుకు ఆయుర్వేద మూలికలు ఎలా సాయం చేస్తాయి? | How to Increase Fertility in Women Ayurvedic Herbs in Telugu

స్త్రీ సంతానోత్పత్తి & మగ సంతానోత్పత్తికి అశ్వగంధ ప్రయోజనాలు: ఇది గర్భం దాల్చడానికి ఎలా సహాయపడుతుంది? | Ashwagandha Benefits for Female Fertility & Male Fertility in Telugu

లేట్ ఓవులేషన్: ఇది మీ సంతానోత్పత్తి మరియు గర్భధారణ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది | Late Ovulation in Telugu

చాస్స్ట్ బెర్రీ ప్రయోజనాలు: వంధ్యత్వం, హార్మోన్ల అసమతుల్యత మరియు PMS కోసం మీకు అవసరమైన సహజ నివారణ | Chasteberry Benefits: The Natural Remedy in Telugu

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |