
సారాంశం


బిడ్డకు జన్మనివ్వడం ప్రతీ మహిళకు వినూత్న అనుభవం. ప్రతీ డెలివరీకి సవాళ్లు ఉంటాయి. ప్రతీ తల్లికి, నవజాత శిశువుకు ఇవి కొత్తగా ఉంటాయి. ప్రసవం, డెలివరీ ప్రతీ మహిళ జీవితాన్ని మార్చేవి. శాశ్వత ప్రభావాన్ని చూపేవి. వెగైనల్ డెలివరీ బిడ్డకు జన్మనివ్వడంలో ఓ సాధారణ ప్రక్రియ. దీన్నే వ్యావహారిక భాషలో నార్మల్ డెలివరీ అంటారు. తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు లేకపోతే బిడ్డను కనడానికి ఇది సురక్షితమైన పద్ధతి.
వెగైనల్ బర్త్ అంటే మహిళ యోని ద్వారా బిడ్డ బయటకు రావడం. ఈ ప్రక్రియలో గర్భాశయం సంకోచిస్తుంది. గర్భాశయ తెరుచుకొని, బిడ్డను యోని ద్వారా బయటకు పంపిస్తుంది. అన్ని జంతువులు వెగైనల్ డెలివరీ ద్వారానే పిల్లల్ని కంటాయి. వెగైనల్ డెలివరీ సమయంలో మహిళ చాలా నొప్పిని, అసౌకర్యాన్ని అనుభవిస్తుంది. యోని నుంచి బిడ్డ తల బయటకు రాగానే ఈ నొప్పి తగ్గుతుంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం వెగైనల్ డెలివరీలు సాధారణం. 2020లో వెగైనల్ డెలివరీల సంఖ్య 20 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం డెలివరీల్లో 80 శాతం వెగైనల్ డెలివరీలే. చాలామంది వైద్యులు వెగైనల్ డెలివరీ చేయించుకోవాలనే సిఫార్సు చేస్తారు. మహిళల్లో ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే సీ-సెక్షన్‌కు పంపిస్తారు.
డెలివరీ పద్ధతి ఎంచుకోవడంలో మహిళలకు ఛాయిస్ ఉంటుంది. తన బిడ్డకు ఎలా జన్మనివ్వాలో మహిళలు నిర్ణయించుకోవచ్చు. యోని ద్వారా బిడ్డ బయటకు రావడం సహజం. అందుకే వెగైనల్ డెలివరీ సాధారణమైన విషయం. దీంతో పాటు మరిన్ని డెలివరీలు కూడా ఉన్నాయి. వీటిలో సీ-సెక్షన్, వెగైనల్ బర్త్ పోస్ట్ సిజేరియన్ డెలివరీ, వ్యాక్యూమ్ ఎక్స్‌ట్రాక్షన్ అని ఉంటాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: తెలుసుకోండి: డెలివరీ అవుతున్నట్లు అనిపించే 3 లక్షణాలు
ప్రసవం ప్రారంభ దశల్లో, శిశువును కప్పి ఉంచే ద్రవంతో నిండిన పొర అయిన ఉమ్మనీరు చీలిపోతుంది. దీన్నే వాటర్ బ్రేకింగ్ అంటారు. సరిగ్గా బిడ్డ పుట్టేముందు ఇది జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో, ఉమ్మనీరు సులభంగా చీలిపోకపోవచ్చు. గర్భాశయం బిగించడం, విడుదల చేయడం, కదలికలు చేయడం లాంటివి జరిగిన తర్వాత, చివరికి శిశువును గర్భాశయం నుంచి బయటకు నెట్టడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. యోనిలోకి తెరుచుకునే శరీరంలోని భాగం గర్భాశయం. ప్రసవ సమయంలో, శిశువును యోని ద్వారా బయటకు నెట్టడానికి వీలుగా వ్యాకోచిస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర కాలం (ప్యూర్పెరియం) దశలు ఏమిటి?
ప్రసవం సమయంలో గర్భాశయం తెరుచుకుంటుంది. 10 సెంటీమీటర్ల వరకు వ్యాకోచిస్తుంది. శిశువు బర్త్ కెనాల్ గుండా, యోని లోంచి బయటకు వస్తుంది. శిశువు బర్త్ కెనాల్ నుంచి యోనివైపు రాగానే, యోని చుట్టూ ఉన్న చర్మం, కండరాలు విస్తరించి, శిశువును బయటకు నెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. చాలా మంది తల్లుల్లో ఈ సమయంలో మండుతుంది. ఇందుకు కారణం శిశువు తల వెళ్లడానికి యోని ప్రాంతం, యోని చుట్టూ ఉండే కణజాలం సాగడమే. గర్భవతి పరిస్థితిని బట్టి వైద్యులు ఎపిసియోటమీని సూచించవచ్చు. అంటే చర్మం, కండరాలు అనుభూతిని కోల్పోతాయి. కాబట్టి ప్రసవ సమయంలో తల్లికి బిగుతుగా, సాగదీస్తున్నట్టుగా లేదా మంటగా అనిపించదు.
నార్మల్ డెలివరీ సమయంలో తల్లులు నొప్పిని, బాధను, ఒత్తిడిని అనుభవించడం సహజమే. బిడ్డ బయటకు రాగానే నొప్పి తగ్గిపోతుంది. ప్రసవం పూర్తి కాగానే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు.
వెగైనల్ బర్త్ డెలివరీల్లో రెండు రకాలు ఉన్నాయి. సహాయం లేని నార్మల్ డెలివరీ లేదా వెగైనల్ డెలివరీ. అసిస్టెడ్ వెగైనల్ డెలివరీ. అసిస్టెడ్ వెజైనల్ డెలివరీలో మహిళకు ఒత్తిడి తగ్గించడానికి మందులు, ఇతర డెలివరీ ప్రక్రియలు ఉంటాయి. మహిళ ఆరోగ్య పరిస్థితి, ఆమెకు ఉన్న సమస్యలపై ఇది ఆధారపడి ఉంటుంది. అత్యవసర వైద్యం లేదా మందులు అవసరం అవుతాయి.
చాలామంది నార్మల్ డెలివరీ కావాలని కోరుకుంటారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. సీ-సెక్షన్‌తో పోలిస్తే నార్మల్ డెలివరీ అయిన మహిళలు సహజంగా, వేగంగా కోలుకుంటారు. సిజేరియన్ డెలివరీ చేయించుకున్న మహిళలకు మాత్రం రికవరీకి సమయం పడుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: నార్మల్ డెలివరీ.. యోనీ ద్వారా సురక్షిత ప్రసవానికి చిట్కాలు
వెగైనల్ బర్త్ డెలివరీ సహజమైన ప్రక్రియ. కోలుకోవడానికి కొంత సమయం అవసరం. ఇతర డెలివరీ పద్ధతులతో పోలిస్తే నార్మల్ డెలివరీ చేయించుకున్న మహిళలు కాస్త త్వరగా కోలుకుంటారు. ఈ రికవరీ కాలాన్ని ప్రసవానంతర కాలంగా పిలుస్తారు. ఇది 6 వారాల నుంచి 8 వారాలు ఉంటుంది. కొందరు మహిళలకు కోలుకోవడానికి కాస్త ఎక్కువ నెలలు పట్టొచ్చు. ఇది వారి మానసిక, శారీరక స్థితి, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
వెగైనల్ బర్త్ డెలివరీ సహజ ప్రక్రియ కాబట్టి, ఆ మహిళ మళ్లీ శృంగారంలో పాల్గొనడానికి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అయితే అసిస్టెడ్ డెలివరీ అయినా అన్‌అసిస్టెడ్ డెలివరీ అయినా, ప్రసవం తర్వాత నాలుగు నుంచి ఆరు వారాలు ఆగాలని వైద్యులు సూచిస్తుంటారు. మహిళ కోలుకోవడానికి, ఇతర సమస్యలు రాకుండా ఉండటానికి ఈ సమయం కావాలి.
Vaginal Delivery in telugu, Benefits of Vaginal Delivery in telugu, how to recover from Vaginal Delivery in telugu, what are the stages of Vaginal Delivery in telugu, Tips to have easy Vaginal Delivery in telugu.
నార్మల్ డెలివరీ తర్వాత మీ శరీరం సహజంగా కోలుకోవడానికి సున్నితమైన, సురక్షితమైన ఉత్పత్తులు మీకు తోడుగా ఉంటాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns




Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Rash-free | Paediatrician Tested | Dermatologically Tested | Breathable | Expert Approved | No Harsh Bleaching Chemicals | Super-Saver Combo



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |