


Diapering
3 November 2023 న నవీకరించబడింది
తల్లిదండ్రులు తమ పిల్లలకు వాడిన డైపర్లను ఎలా పారవేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాడిన డైపర్లను పారవేయడం కాస్త చిక్కైన పనే. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వీయ పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఆలోచించాలి. పసిపిల్లలు రోజుకు సుమారుగా పదిసార్లు మూత్ర విసర్జన చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు సగటున రోజుకు 8 నుంచి 10 డైపర్లను తమ పిల్లలకు వాడుతున్నారు. పిల్లలకు వాడిన డైపర్లను ఎలా పారవేయాలి? అనే విషయంలో తల్లిదండ్రులకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యావరణహితంగా డైపర్లను పారేయడం గురించి సందేహం ఉంటుంది. కొంత మంది తల్లిదండ్రులు క్లాత్ డైపర్లను వాడుతుంటారు. వారికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి. శిశువులకు డైపర్లు వినియోగించే తల్లిదండ్రులు పారవేయడానికి వీలుగా, పర్యావరణానికి హాని కలిగించని విధంగా మంచి ఎంపిక చేసుకోవాలి. చిన్నారులకు వాడిన డైపర్లను పర్యావరణానికి హాని కలిగించకుండా ఏ విధంగా పారవేయాలి అనే విషయంపై ఇది ఓ గైడ్‌గా మీకు ఉపయోగపడుతుంది.
మనకు అందుబాటులో ఎన్నో రకాలైన డైపర్లు ఉన్నాయి. వాటిని పారవేయడానికి కూడా వేరువేరు పద్ధతులు అనుసరించాలి. బట్టలతో తయారు చేసిన డైపర్లను తమ పిల్లలకు వాడేవారు వాటిని శుభ్రపరచుకుని మళ్ళీ వాడవచ్చు. లేదా డస్ట్ బిన్‌లో పారేయొచ్చు. కానీ డిస్పోజబుల్ డైపర్స్ వాడే వారు వాటిని సరిగ్గా మడిచి చెత్తబుట్టలో పడేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు వాడుతున్న డైపర్లు పర్యావరణానికి హాని కలిగించని పెయిల్ డిజైన్‌తో రూపొందించిన డైపర్స్ తీసుకోవాలి. ఈ తరహా డైపర్స్ క్రిమి కీటకాలను దూరంగా ఉంచడంతో పాటు, దుర్వాసనల్ని తగ్గిస్తాయి. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా, సురక్షితంగా పారెయ్యడానికి ఓ మార్గం ఉంది. వాడిన డైపర్లను చుట్టి ప్రైవేట్ సెప్టిక్ లేదా పబ్లిక్ మురుగు నీటిలో పారవేయడం ద్వారా సూక్ష్మ క్రిమి కీటకాలు రాకుండా, కలుషితం చేయకుండా ఉండవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసి పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? అందుకోసం కొన్ని టిప్స్!
వాడిన డైపర్లను సరైన పద్ధతిలో ఏ విధంగా పారవేయడానికి ఈ కింద ఐదు సూచనలు గుర్తుంచుకోండి.
మొదటి దశలో డైపర్లలోని ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు బాత్‌రూమ్‌లోనే పడేయాలి. పరిసరాల పరిశుభ్రతను పాటించినట్లు అవుతుంది. ఎటువంటి దుర్వాసన రాకుండా నివారించవచ్చు.
ఒకవేళ డైపర్లను పారవేయాల్సి వస్తే వాటిని బిగుతుగా ఉండే సంచిలో చుట్టి పాడేయడం వల్ల డైపర్‌లోని మలినాలు బయటికి రాకుండా ఉంటాయి. అందులోని ద్రవ, ఘన పదార్థాలు బయటకు రావు. అలాగే దుర్వాసనలు రాకుండా, కాలుష్యం కాకుండా చేయవచ్చు.
ఇంట్లోకి సూక్ష్మ క్రిమి కీటకాలు, దుర్వాసనలు రాకుండా ఉండేందుకు డైపర్లను గాలి దూరని కంటైనర్లలో భద్రపరచుకోవాలి. ఒకవేళ బట్టతో తయారు చేసిన డైపర్లు వాడుతున్నట్టైతే, వాడే ముందు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతే వాడాలి. డైపర్లను స్టోర్ చేయడానికి తల్లిదండ్రులు ఈ కింది కంటైనర్లను ఉపయోగించవచ్చు:
ఇంట్లో అయినా, బయట ఎక్కడైనా వాడిన డైపర్లను మిగతా చెత్తతో పాటు పారెయ్యకుండా.. వాటికోసం నిర్దేశించిన డబ్బాలలో మాత్రమే వీటిని పాడేయడం మంచిది. పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది. పరిసరాలలో క్రిమి కీటకాలు దుర్వాసనలు రాకుండా నివారించవచ్చు.
రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన డిస్పోజబుల్ డైపర్లను ఎంచుకోవడం లాంటి గ్రీన్ ఆల్టర్నేటీవ్స్ చూడండి. రీసైక్లింగ్ ల్యాండ్‌ఫిల్‌లోకి వెళ్లే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం తల్లిదండ్రులు డైపర్లను సరైన పద్ధతిలో, సురక్షితంగా పారవెయ్యడం అవసరం. పైన చెప్పిన పద్ధతుల్ని పాటించడం ద్వారా.. తల్లిదండ్రులు పర్యావరణానికి మేలు చేయొచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: Cloth Diapering Myths: క్లాత్ డైపరింగ్ అపోహలు!
డైపర్లు బాధ్యతాయుతంగా పారవేయడం చాలా అవసరం. లేకపోతే ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతుంది. డైపర్లను, బేబీ వైప్స్‌ని బాధ్యతాయుతంగా పారెయ్యడం ద్వారా ఇన్ఫెక్షన్లను, వ్యాధులను తగ్గించవచ్చు. డైపర్లను సరిగ్గా పారెయ్యకపోతే ఈ కింద వివరించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది:
డైపర్లను కాల్చడం వల్ల మానవులకు, పర్యావరణానికి హాని కలిగించే విష వాయువులను విడుదల చేస్తుంది. డైపర్‌లను కాల్చడం వల్ల విషపూరిత రసాయనాలు గాలిలోకి విడుదలవుతాయి. మంటలు వ్యాపిస్తాయి. ఇవి నియంత్రించలేని స్థాయికి వెళ్లొచ్చు. అందువల్ల.. డైపర్‌లను బాధ్యతాయుతంగా పారవేయడం, కంపోస్టింగ్ లేదా రీసైక్లింగ్ వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించడం చాలా అవసరం. చివరగా.. పర్యావరణ ప్రమాదాలను తగ్గించడానికి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డైపర్‌లను సరిగ్గా పారవేయడం చాలా అవసరం. ఈ ఆర్టికల్‌లో వివరించిన దశలను అనుసరించి, తల్లిదండ్రులు తమ పిల్లల డైపర్‌లను సురక్షితంగా, బాధ్యతాయుతంగా పారవేయాలి.
Tags:
disposable diapers in telugu, diaper disposing in telugu, how dispose diapers in telugu, can be diapers through away in telugu, diapers dust bin in telugu, dispose diapers in telugu.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |