This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీరు మీ బిడ్డ చిగుళ్లను ఫింగర్ టూత్ బ్రష్‌తోనే శుభ్రపరచాలా (Should You Clean Your Baby's Gums With A Finger Toothbrush in Telugu) ?

Teething
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మీరు మీ బిడ్డ చిగుళ్లను ఫింగర్ టూత్ బ్రష్‌తోనే శుభ్రపరచాలా (Should You Clean Your Baby's Gums With A Finger Toothbrush in Telugu) ?
Read time5 min

తల్లికి, తన బిడ్డ చిరునవ్వు కన్నా అమూల్యమైనది ఇంకేది ఉండదు అనడంలో సందేహం అవసరం లేదు. నిజానికి, ఇప్పటికే మీ బిడ్డ ఎంతో ముద్దులొలికేలా ఉందని మీకు తెలుసు; మీ బిడ్డకు మొదటి పన్ను వచ్చిన తర్వాత తను ఎంత అందంగా కనిపిస్తుందో ఊహించుకోవచ్చు. బిడ్డ ఎదిగే తొలి దశలో, వారి విషయంలో చక్కటి నోటి పరిశుభ్రత పద్ధతులను పాటించాలనేది మీకు చాలా ముఖ్యం. ఇది మొదట్లో కష్టతరంగా అనిపించినప్పటికీ, మీ బిడ్డ ఖచ్చితంగా దానిని ఆచరించగలదు! ఈ కధనంలో, మీ బిడ్డ ఎదిగే చిగుళ్లను ఫింగర్ టూత్ బ్రష్‌తో శుభ్రం చేయడం అంత ముఖ్యమా కాదా అనే దాని గురించి మీరు తెలుసుకుంటారు.

మీ బిడ్డకు పళ్లు వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలు ఏమిటి (What Are Some Of The Teething Symptoms Your Baby May Experience in Telugu) ?

పళ్లు వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

1. నోటి నుండి లాలాజలం నియంత్రణ లేకుండా కారడం

2. నిరంతరం తమ చేతులను నోటి దగ్గరగా పెట్టుకోవడం.

3. వివిధ వస్తువులను కొరికేందుకు ప్రయత్నించడం.

4. వారి ఆకలిలో లేదా తినే విధానంలో మార్పు రావడం

5. లేత చిగుళ్ళలో పెరుగుదల.

మీ బిడ్డకు మంచి దంత పరిశుభ్రతా పద్ధతులను ఎప్పుడు నేర్పించాలి (When Should You Teach Your Baby Good Dental Practices in Telugu) ?

మీరు మీ బిడ్డకు మంచి దంత పరిశుభ్రతా పద్ధతులను ఎంత త్వరగా నేర్పించడం మొదలుపెడితే అంత మంచిదని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవడం ఎంతో అవసరం. ప్రారంభ దశలలో, ఏ విధమైన చిగుళ్ల వ్యాధి లేదా దంత క్షయం కలగకుండా నివారించేందుకు తల్లిదండ్రులు వారి శిశువు నోటి పరిశుభ్రతా విధానంలో కొన్ని దశలను చేర్చవచ్చు.

మీ శిశువు మంచి దంత పరిశుభ్రతను పాటించడం ప్రారంభించినప్పుడు, వారి చిరునవ్వు వారి దంతాల వలె ప్రకాశవంతంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. అంతే కాకుండా, ఎదిగే ఈ దశలో పళ్లు తోముకోవడం వల్ల సాధారణంగా వచ్చే దంతక్షయాన్ని రాకుండా ముందుగానే నివారించవచ్చు.

మీరు ఫింగర్ టూత్ బ్రష్‌ని ఉపయోగించి మీ శిశువు పళ్ళు ఇంకా చిగుళ్ళను బ్రష్ చేయడం అవసరమా (Is It Important For You To Brush Your Baby’s Teeth And Gums Using A Finger Toothbrush in Telugu) ?

కొత్త దంతాలు పెరుగుతున్నాయని మీరు గమనించినప్పుడు, మీ బిడ్డ పాలపళ్లు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగేందుకు మీరు ఫింగర్ టూత్ బ్రష్‌ను ఉపయోగించాలని తెలుసుకోవాలి. అందువలన, ఈ విధంగా బ్రష్ చేయడం వల్ల, చిగుళ్ల వరుసపై హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా చేయవచ్చు. నిజానికి, మీరు మీ బిడ్డ రోజువారీ నోటి పరిశుభ్రతా పనులలో ముందుగా మీ ఫింగర్ టూత్ బ్రష్ లేదా బేబీ ఫింగర్ టూత్ బ్రష్‌ని పరిచయం చేయవలసి ఉంటుందని తెలుసుకోవాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు

మీ శిశువు చిగుళ్ళపై మీరు ఫింగర్ టూత్ బ్రష్‌ను ఎలా ఉపయోగించవచ్చు (How Can You Use A Finger Toothbrush For Your Baby’s Gums in Telugu)?

మీ శిశువు చిగుళ్ళ విషయానికి వస్తే, మీరు ఫింగర్ టూత్ బ్రష్ లేదా మృదువైన గుడ్డను శుభ్రపరిచేందుకు ఉపయోగించవచ్చు. అలా కాకుండా, మీ శిశువు నోటి నుండి ఆహారపు ఆనవాళ్లను తొలగించేటప్పుడు మీరు వీలైనంత సున్నితంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈ విధంగా చేయడం వల్ల, మీరు మీ పిల్లల నోటిలో బ్యాక్టీరియా ఏర్పడకుండా, అవి పెరగకుండా నిరోధించగలరు.

మీరు వెచ్చని నీటిలో మీ వేలిని తడిపి, నెమ్మదిగా మీ శిశువు చిగుళ్ళపై గుండ్రంగా కదిలిస్తూ రుద్దడంతో ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు దంతాలను తోమాలనుకున్నప్పుడు, బ్రష్ బ్రిసిల్స్‌ని మృదువుగా ఇంకా సున్నితంగా చేసేందుకు గోరువెచ్చని నీటిలో ఫింగర్ టూత్ బ్రష్‌ బ్రిసిల్స్‌ని కాసేపు ఉంచడం ఎంతో ముఖ్యం. మీరు కొద్దిపాటి టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తుంటే, బ్రష్ చేసిన తర్వాత దానిని ఉమ్మివేయమని మీ బిడ్డను ప్రోత్సహించాలి! టూత్‌పేస్ట్‌ను ఎక్కువగా మింగేయడం వల్ల కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.

ఫింగర్ టూత్ బ్రష్ కాకుండా, మీ శిశువు దంతాలను శుభ్రపరచడానికి ఇంకా ఏవి ఉపయోగించవచ్చు (Apart From A Finger Toothbrush, What Else Can You Use To Clean Your Baby’s Teeth in Telugu)?

పిల్లల ఫింగర్ టూత్ బ్రష్ కాకుండా, మీరు చల్లని శుభ్రమైన బట్టను కూడా అందుకు ఉపయోగించవచ్చు. మీరు ఫ్రీజర్‌లో మృదువైన గుడ్డను ఉంచవచ్చు, తర్వాత దానిని బిడ్డకు నమలాడానికి ఇవ్వవచ్చు. అంతేకాకుండా, మీరు మీ శిశువు చిగుళ్ళకు అతుక్కొని ఉన్న ఆహారపు ముక్కలను తొలగించడానికి వాష్‌క్లాత్‌ను కూడా ఉపయోగించవచ్చు. వాష్‌క్లాత్‌తో మసాజ్ చేయడం వల్ల నోటిలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఒత్తిడి పాయింట్లకి తగిన ఉపశమనం లభించవచ్చు.

మీ శిశువుకు పళ్లు వచ్చే ముందు పళ్ల తీపు కలుగుతున్నట్లయితే, వారికి చైల్డ్ టీథర్ లేదా టీథర్ బొమ్మలు (పళ్ళు వచ్చే సమయంలో శిశువు కొరికేందుకు రూపొందించబడిన బొమ్మ వస్తువు) ఇవ్వాలి. మీ బిడ్డకు ఇలాంటి కొన్ని బొమ్మలు ఇవ్వడం వల్ల వారి దంతాల నొప్పిని తగ్గించుకోవచ్చు. నేడు, అనేక ఆన్‌లైన్ స్టోర్‌లలో బేబీ టూత్ బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి, ఇవి టీథర్‌లుగా కూడా పనిచేస్తాయి.

Tags:

Finger tooth brush for your baby in telugu, Brushing for your baby in telugu, How can you make your baby brush properly in telugu, Tips for your baby to start brushing in telugu, Should You Clean Your Baby's Gums With A Finger Toothbrush in English, Should You Clean Your Baby's Gums With A Finger Toothbrush in Tamil, Should You Clean Your Baby's Gums With A Finger Toothbrush in Bengali, Should You Clean Your Baby's Gums With A Finger Toothbrush in Hindi.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.