This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీ బిడ్డ రాత్రంతా పడుకునేలా సాయపడే 10 పసిపిల్లల నిద్ర చిట్కాలు (10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night in Telugu)

Baby Sleep Management
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
మీ బిడ్డ రాత్రంతా పడుకునేలా సాయపడే 10 పసిపిల్లల నిద్ర చిట్కాలు (10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night in Telugu)
Likes31 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • అప్పుడే పుట్టిన పసిపిల్లలు రోజుకు 16-20 గంటలు నిద్రపోవాలి, కానీ చాలాసార్లు ఆకలితో మెలకువ వస్తుంది, కాబట్టి రాత్రంతా పడుకోవడానికి కొంత సమయం పడుతుంది.
  • రాత్రివేళ పడుకునే దినచర్యని ఏర్పరచడం, లైట్లని డిమ్ చేయడం, శబ్దాలని తగ్గించడం, ఉత్తేజితం చేసే పనులకి దూరంగా ఉండడం బిడ్డకి నిద్ర సమయం అని సిగ్నల్ ఇస్తాయి.
  • దృఢమైన పరుపుతో సౌకర్యవంతమైన క్రిబ్, బేబీ స్లీపింగ్ బ్యాగ్, అవసరం అయితే వైట్ నాయిస్ ఉపయోగించడం పసిబిడ్డ గాఢంగా రాత్రంతా నిద్రపోవడానికి సాయపడతాయి.
  • మీ బిడ్డ నిద్రకి ఏ ఉత్పత్తులు సాయపడతాయి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Buddy Ultra-Light Baby Stroller - Blue
Buddy Ultra-Light Baby Stroller - Blue
Rating4.7

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా అమ్మానాన్నలైన వారిని వేధించేది నిద్రలేని రాత్రులు. అప్పుడే పుట్టిన పసిపిల్లలని నిద్రపుచ్చడం చాలా కష్టం. నిపుణులు అప్పుడే పుట్టిన పిల్లలు రోజుకు 16-20 గంటలు నిద్రపోవాలని అంటున్నారు, కానీ పసిపిల్లలకి చాలాసార్లు మెలకువ వచ్చేస్తుంది, ప్రధానంగా వారు ఆకలితో లేస్తారు.

అది బిడ్డని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కొందరు మంచంపైకి ఎక్కగానే వెంటనే పడుకుంటారు, అయితే మరికొంతమంది పిల్లలు గాఢంగా పడుకోలేరు, వారితో ఇంకాస్త శ్రమ పడుతుంది. కానీ సహనంగా ఇంకా ప్రాక్టీసుతో, మీరు మీ బిడ్డ రాత్రంతా పడుకునేలా సాయం చేయవచ్చు. కొత్తగా అమ్మానాన్నలైన వారందరూ అనుసరించాల్సిన 10 టిప్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1. రాత్రివేళ పడుకునే దినచర్యని ఏర్పరచండి (Establish a bedtime routine)

రోజూ ఒకే టైములో పడుకునే దినచర్య పసిబిడ్డకి అది పడుకునే సమయం అని సిగ్నల్ అందిస్తుంది. ఈ దినచర్యలో స్నానం చేయించడం, కథ చదివి వినిపించడం లేదా లాలీపాట పాడడం వంటివి ఉండవచ్చు.పసిపిల్లలు రాత్రంతా లేవకుండా నిద్రపోయేలా చేయడానికి ఒక రొటీన్ సహాయపడుతుంది. కానీ ఏదైనా అలవాట్లలాగానే, పడుకునే రొటీన్ ఏర్పడటానికి కూడా సమయం పడుతుంది, కాబట్టి ఓపికగా ఇంకా రోజూ ప్రయత్నిస్తూ ఉండండి.

2. ఇంకా మేల్కొనే ఉన్నా నిద్రమత్తులో ఉండే బిడ్డని పడుకోబెట్టండి (Put the baby to bed drowsy but awake)

మీ బిడ్డను చేతుల్లో ఉయ్యాలలూపుతూ పడుకునేలా చేసి, ఆ తర్వాత వారిని మంచంపై పడుకోబెట్టాలని మీకు అన్పించవచ్చు, కానీ అది వారికి సొంతంగా పడుకోవడం ఎలానో నేర్చుకోవడం కష్టతరం చేస్తుంది. దానిబదులు, వారు నిద్రమత్తులో ఉండి పూర్తిగా పడుకోకుండా ఉన్నప్పుడే బేబీ పడుకునే బెడ్‌పై పడుకోబెట్టండి. అప్పుడు వారికి స్వంతంగా ఎలా తననితాను శాంతపర్చుకుంటూ స్వతంత్రంగా నిద్రపోవడం ఎలాగో తెలుస్తుంది.

3. సాయంత్రం పూట నుండి లైట్లని డిమ్ చేయండి (Keep the lights low in the evening)

రోజు ముగియడంతో, పసిపిల్లలకి అది పడుకునే సమయం అని తెలియడానికి ఇంట్లో లైట్లను డిమ్ చేయడం మొదలుపెట్టండి. పడకగదిని కూడా చీకటిగా చేయడం నిద్రకు మరింత అనుకూలిస్తుంది. అలాగే, పూర్తిగా చీకటిగా ఉండకుండా ఉండటానికి గదిలో రాత్రి లైట్లను ఉపయోగించి చూడండి.

4. సాయంత్రం పూట నుండి శబ్దాలని కూడా తగ్గించండి (Keep noise to a minimum in the evening)

పెద్దవాళ్లలాగానే, పసిపిల్లలు కూడా నిశ్శబ్ద వాతావరణంలో మెరుగ్గా నిద్రపోతారు. అందుకని లైట్లలాగానే, చీకటి పడుతున్నప్పుడు ఇంట్లో కూడా చప్పుళ్లని తగ్గించడానికి ప్రయత్నించండి.

5. పడుకునే సమయం ముందు ఉత్తేజితం చేసే పనులకి దూరంగా ఉండండి (Avoid stimulating activities before bedtime)

దీని అర్థం పడుకునే సమయానికి ముందు ఇంట్లో అందరూ టీవీ, ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లకి దూరంగా ఉండాలి లేదా కఠినంగా, హింసాత్మకంగా వ్యవహరించకూడదు. దానిబదులుగా, బేబీని శాంతపరిచి తను పడుకునే మంచంపై పడుకోబెట్టే ముందు కథలు చదివి వినిపించడం లేదా పసిపిల్లల యోగా వంటి సాయపడే పనులు ఎంచుకుని చేయండి.

6. పసిబిడ్డ పడుకునే వాతావరణం సౌకర్యంగా ఉందో లేదో చెక్ చేయండి (Make sure the baby's sleeping environment is comfortable)

దృఢమైన పరుపు అలాగే శుభ్రమైన బెడ్షీట్‌లతో తయారుచేసిన సౌకర్యవంతమైన క్రిబ్ లేదా బాసినెట్ పసిపిల్లలకి అనువైనది. గది యొక్క ఉష్ణోగ్రత కూడా 68 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వద్ద చల్లగా ఉంచాలి. పసిపిల్లల స్లీపింగ్ బ్యాగ్‌లను కూడా ఉపయోగించవచ్చు, ఇవి పసిపిల్లలు మరియు పసిబిడ్డల కోసం పాపులర్ అవుతున్న నిద్ర దుస్తుల ఆప్షన్ అని చెప్పవచ్చు. వాటిల్లో వదులుగా ఉండే దుప్పట్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి ఇంకా మీ బిడ్డ రాత్రంతా వెచ్చగా మరియు హాయిగా ఉండేలా సాయం చేస్తాయి. బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లలో అనేక రకాలు మరియు శైలులు అందుబాటులో ఉంటాయి. మీరు మీ బిడ్డ బరువు అలాగే ఎత్తుకు తగినదాన్ని ఎంచుకోవచ్చు.

7. ఒకవేళ అవసరం అయితే వైట్ నాయిస్ ను ఉపయోగించండి (Use white noise if needed)

ఒకవేళ మీ బిడ్డ గాఢంగా పడుకోలేకపోతుంటే, వైట్ నాయిస్ వారు మెరుగ్గా పడుకోవడానికి సాయపడవచ్చు. మార్కెట్లో అనేక రకాల వైట్ నాయిస్ మెషిన్లు లభిస్తాయి. లేదా మీ గదిలో ఫ్యానుని వేయండి. శబ్దాలు ఏవైనా వస్తుంటే పసిపిల్లలు నిద్రపోగలరు. అది ఫ్యాను కావచ్చు, శ్రావ్యమైన సంగీతం కావచ్చు, గడియార శబ్దం కావచ్చు లేదా బేబీ స్లీప్ మ్యూజిక్ అంటే పసిపిల్లలని నిద్రపుచ్చే సంగీతం కావచ్చు. ఇంటర్నెట్ నిండా బేబీ స్లీప్ మ్యూజిక్ నిండి ఉంటుంది.

8. రాత్రిపూట పాలు పట్టే సమయాలని క్రమబద్ధీకరించండి (Keep feedings regular during the night)

మీ బిడ్డ రాత్రంతా లేవకుండా పడుకుంటున్నట్లయితే, వారిని పాల కోసం నిద్ర లేపాల్సిన అవసరం లేదు. కానీ, ఒకవేళ వారు మేల్కొని లేదా ఏడుస్తూ ఉంటే, రాత్రిపూట పాలు ఇస్తే వారు తిరిగి నిద్రపోవడానికి సాయపడవచ్చు.

9. బిడ్డ ఏడవగానే ఓదార్చడానికి తొందరపడకండి (Don't rush in when the baby cries)

మీ పాప లేదా బాబు ఏడ్చిన ప్రతిసారీ వారి వద్దకు వెళ్ళి లాలించాలని వెంటనే అన్పించవచ్చు, కానీ ఇది వారి నిద్రకు భంగం కలిగించి మళ్ళీ శాంతపడటాన్ని కష్టతరం చేస్తుంది. వారు కేవలం ఆకలితో ఉంటే లేదా డైపరుని మార్చాల్సిన అవసరం ఉన్నట్లయితే మాత్రమే, వారిని ఒక నిమిషం పాటు ఎత్తుకోండి. దాదాపుగా వారంతట వారే పడుకుండిపోతారు.

10. సహనంతో ఉండండి (Be patient)

పిల్లలకి రాత్రంతా లేవకుండా ఎలా నిద్రపోవాలో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. పసిబిడ్డ మేల్కొని ఏడ్చే రాత్రులు ఎన్నో ఉంటాయి, కానీ సహనంగా, నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉంటే వారికి అలవాటు అవుతుంది.

ముగింపు (Conclusion)

అప్పుడే పుట్టిన పిల్లలు రోజులో పగటిపూట ఇంకా రాత్రిపూటలలో అధికభాగం నిద్రపోతారని అలాగే మొదటి నెలలో, పిల్లలు 16 గంటలు నిద్రపోవడం సాధారణమని, తినడానికి మాత్రమే నిద్ర లేస్తారని పీడియాట్రిక్స్ సొసైటీ తెలుపుతోంది. పడుకునే గంటల సంఖ్య నెమ్మదిగా తగ్గుతుంది. పుట్టిన మొదటి రోజుల నుండి, వాళ్ళకి రాత్రి సమయం పడుకోటానికి అని అలాగే వారి క్రిబ్లోకి చేరగానే పడుకోవాలని ఈ విధంగా అలవాటు చేసుకోవాలి.

Tags:

Baby sleeping tips in Telugu, How to get your baby to sleep peacefully at night In Telugu, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In English, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In Hindi, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In Tamil, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In Bengali

కొత్త అమ్మలు నమ్మే పసిపిల్లల నిద్ర సహాయకాలు

మీ బిడ్డ హాయిగా, సురక్షితంగా రాత్రంతా నిద్రపోవడానికి తోడ్పడే సౌకర్యవంతమైన నిద్ర ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Buddy Ultra-Light Baby Stroller - Blue

Buddy Ultra-Light Baby Stroller - Blue

Baby Pram for Toddlers & Kids | 3 Point Safety Harness | 360° Front Wheel Swivel| Umbrella Fold

264 Moms bought
₹4046₹579530% Off
Rating
4.7
(15)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.