This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!
Read time5 min

పిల్లల్ని పెంచడంలో బేబీ స్కిన్ కేర్ పాత్ర కూడా కీలకం. పిల్లలు పుట్టిన తర్వాత వారి చర్మంలో అనేక మార్పులు వస్తుంటాయి. నవజాత శిశువు చర్మ సంరక్షణ కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఎలా ఉంచాలి? అన్న వివరాలను ఈ బ్లాగ్‌లో తెలుసుకోండి.

డైపర్ ర్యాష్ రాకుండా చూడండి:

శిశువు డైపర్ ప్రాంతంలో చర్మం కొద్దిగా ఎరుపెక్కినట్టు కనిపిస్తే, అది డైపర్ ర్యాష్ కావొచ్చు. డైపర్ ర్యాషెస్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే:

  1. డైపర్ తయారు చేసిన మెటీరియల్ శిశువు చర్మంపై ప్రభావం చూపడం.
  2. బేబీకి డైపర్ చాలా టైట్‌గా ఉండటం.
  3. డైపర్స్ తరచూ మార్చకపోవడం.

డైపర్ ఏరియాలో గాలి సరఫరా అయ్యేలా ఉంచడంతో పాటు, తరచూ డైపర్స్ మారుస్తుండటం ద్వారా డైపర్ ర్యాషెస్ రాకుండా చూడొచ్చు. తల్లిదండ్రులు క్లాత్ డైపర్స్ తీసుకోవడం మంచి ఆప్షన్. న్యాపీ ర్యాషెస్ రాకుండా చేయడానికి ఆన్‌లైన్‌లో డిస్పోజబుల్ న్యాపీస్ తీసుకోవడం మంచి పరిష్కారమే.

మీకు ఇది కూడా నచ్చుతుంది: వాడిన డైపర్‌లను పారవేయడం ఎలా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

నవజాత శిశువు చర్మానికి పౌడర్ అవసరం లేదు:

నవజాత శిశువుల విషయంలో తల్లిదండ్రులు చేసే సాధారణ పొరపాట్లలో పిల్లలకు టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం కూడా ఒకటి. ఆ పౌడర్ ఎంత మంచి క్వాలిటీ ఉన్నా, అందులోని కొన్ని సన్నటి భాగాలను శిశువు పీల్చే ప్రమాదం ఉంది. అందుకే నవజాత శిశువు చర్మ సంరక్షణ ప్రతీ తల్లిదండ్రులకు చాలా కీలకం.

మీ బేబీని సూర్యుడికి దూరంగా ఉంచండి:

మొదటి ఆరు నెలల్లో నవజాత శిశువులకు నేరుగా సూర్యరశ్మి తాకకుండా చూడాలి. వడదెబ్బ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఒకవేళ పిల్లలకు వడదెబ్బ తగిలినట్టైతే, తల్లిదండ్రులు చల్లని వస్త్రాన్ని శరీరంపై 10 నుంచి 15 నిమిషాల పాటు పెట్టాలి. ఇలా రోజూ కొన్ని సార్లు చేయడం ద్వారా వారి చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

మొటిమలు, వైట్‌హెడ్స్ వస్తే ఏం చేయాలంటే?

నవజాత శిశువు చర్మంపై మొటిమలు లేదా వైట్‌హెడ్స్ సాధారణంగా టీనేజర్లకు కనిపించేవాటికన్నా భిన్నంగా ఉంటాయి. మొటిమలు, వైట్‌హెడ్స్ కనిపిస్తే నవజాత శిశువు చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి.

పొడిబారిన చర్మం విషయంలో జాగ్రత్త:

చాలామంది శిశువులు పొడి చర్మంతో జన్మిస్తారు. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పలు రకాల ప్రొడక్ట్స్, దుస్తుల్లో ఉంటే అలెర్జీ కారకాలకు శిశువు చర్మం ప్రతిస్పందించడం మామూలే. అయితే లోపలి చర్మం ఆరోగ్యంగా, మృదువుగా, తేమగా ఉంటుంది. కొందరు శిశువులు ఆలస్యంగా జన్మించినందున వారి మొహంపై చర్మం పొడిగా ఉంటుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువులలో పొడి చర్మం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

స్నానం కోసం ఉత్తమమైన పద్ధతుల్ని ఫాలో అవండి:

బొడ్డుతాడు ఊడిపోయేవరకు స్పాంజ్‌తో స్నానం లేదా ఇమర్షన్ బాత్ చేయించాలి. ఈ సమయం ఒకటి రెండు వారాలు ఉంటుంది. శిశువును ఎక్కువ సేపు సబ్బు నీళ్లల్లో ఉంచకూడదు. దీని వల్ల బొడ్డుతాడు చుట్టూ ఉండే ప్రాంతంలో చికాకు కలిగి అసౌకర్యానికి కారణం అవుతుంది. నవజాత శిశువు చర్మ సంరక్షణలో ఇది కూడా ముఖ్యమే.

తామర

శిశువుల్లో కనిపించే సాధారణ చర్మ పరిస్థితిలో తామర కూడా ఒకటి. నవజాత శిశువుల్లో తామర, పొడిచర్మం, అలర్జీ లాంటివి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తామరను తగ్గించడం, చర్మాన్ని తేమగా ఉంచడం, చర్మ సమస్యలకు కారణమయ్యే వాటిని తగ్గించడం కోసం కార్టికోస్టిరాయిడ్ క్రీమ్స్, ఆయింట్‌మెంట్స్ ఉపయోగించవచ్చు.

క్రేడల్ క్యాప్ చెమట పట్టించకూడదు

నవజాత శిశువు జన్మించిన మొదటి కొన్ని నెలల్లో క్రేడల్ క్యాప్ ఉండటం సాధారణమే. హానికరం కూడా కాదు. బిడ్డ జన్మించకముందే తల్లి నుంచి బిడ్డకు వెళ్లే హార్మోన్ల వల్ల ఇది సంభవిస్తుందని భావిస్తున్నారు. చర్మంలోని తైల గ్రంథులు చురుగ్గా పనిచేయడానికి, మరింత నూనెను ఉత్పత్తి చేయడానికి కారణం అవుతుంది. క్రేడల్ క్యాప్‌తో మీ శిశువుకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే, మీరు చికిత్స చేయించాల్సిన అవసరం లేదు.

చర్మానికి హాని కలిగించే వాటి నుంచి దూరంగా ఉండండి

నవజాత శిశువు చర్మం చికాకు కలిగించే పదార్థాలు లేదా అలెర్జీకి ప్రతిస్పందించే పదార్థాలను తాకినప్పుడు, డెర్మాటిటిస్ వస్తుంది. శిశువు దుస్తుల్లో ఉపయోగించే మెటీరియల్, ఆవు పాలు, కొన్ని రకాల పండ్లు లాంటివి కారణం కావొచ్చు.

పెరిగే గోళ్లపై దృష్టి పెట్టండి

పెద్దవాళ్ల కన్నా నవజాత శిశువు గోళ్లు వేగంగా పెరుగుతాయి. కనీసం వారానికి ఒకసారైనా వారి గోళ్లు కత్తిరించడాన్ని తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలి. లేకపోతే పెరిగిన గోళ్లు నవజాత శిశువు సున్నిత చర్మాన్ని గాయపరుస్తుంది.

బేబీ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్

యాంటీబయాటిక్ కోర్స్ తర్వాత థ్రష్, ఈస్ట్ డైపర్ ర్యాష్ సాధారణంగా కనిపించే సమస్య. నోటిలో లేదా నాలుకపై తెల్లగా పాలు ఎండినట్టు కనిపించడాన్ని థ్రష్ అంటారు. ఇక ఈస్ట్ డైపర్ ర్యాష్ ఎరుపు రంగులో ఉంటుంది. తరచూ దద్దుర్లు వస్తాయి. అంచుల దగ్గర ఎరుపు రంగు మొటిమల్లా కనిపిస్తాయి. యాంటీ ఈస్ట్ లిక్విడ్ మెడిసిన్‌తో థ్రష్‌కు చికిత్స చేయొచ్చు. ఇక ఈస్ట్ డైపర్ ర్యాష్‌కు యాంటీఫంగల్ క్రీమ్ ఉపయోగించవచ్చు.

హీట్ ర్యాష్ నివారించండి

శిశువుల్లో హీట్ ర్యాష్ అంటే వేడి దద్దుర్లు కనిపించడం కూడా సాధారణంగా కనిపించే సమస్య. చెమట గ్రంథులుగా పనిచేసే రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది. తరచూ వేడిగా లేదా తేమతో కూడిన వాతావరణం వల్ల ఇలా వస్తుంది. వేడి దద్దుర్ల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

  • సబ్బు లేకుండా చల్లని నీటితో స్నానం చేయాలి.
  • బేబీ వైప్స్ ఉపయోగించి దద్దుర్లు వచ్చిన ప్రాంతంలో శుభ్రం చేయాలి.
  • క్లాత్ డైపర్స్ ఉపయోగించాలి.
  • చర్మానికి తేలికగా ఉండే దుస్తుల్ని వేయాలి.

బొడ్డుతాడుపై శ్రద్ధ అవసరం

బొడ్డుతాడు సహజంగా ఊడిపోయేంత వరకు నవజాత శిశువుకు స్పాంజ్ బాత్ చేయించడం మంచిది. బొడ్డుతాడు ఎండిపోయే వరకు స్టంప్‌ను పొడిగా ఉంచాలని చెబుతుంటారు.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.