

Pregnancy
13 February 2026 న నవీకరించబడింది
ఒక స్త్రీ తన భాగస్వామితో ఎటువంటి గర్భనిరోధకాలు వాడకుండా 12 నెలల పాటు సెక్స్ చేసినా కూడా గర్భం దాల్చకపోతే.. ఆమెకు వంధ్యత్వ సమస్య ఉండే అవకాశం ఉంది. వంధ్యత్వం అనేది మగవారిలో కూడా ఉండవచ్చు. అటువంటి సందర్భంలో వైద్య నిపుణుడితో సమస్య గురించి మాట్లాడి సలహా తీసుకోవడం ఉత్తమం.
కాలం గడిచే కొద్దీ సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ) సమస్య తొలిగిపోతుందనే అపోహను ఎవరూ నమ్మకూడదు. ఇది చాలా తీవ్రమైన సమస్య దీనికి తప్పనిసరిగా వైద్య సహాయం అవసరం. వంధ్యత్వానికి గల కారణాలను గుర్తించేందుకు మరియు చికిత్సకు వివిధ పద్ధతులు ఉన్నాయి. మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స పద్ధతిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.
మహిళల వంధ్యత్వానికి కొన్ని సాధారణ కారకాలు ఈ విధంగా ఉన్నాయి.
1. దెబ్బతిన్న ఫెలోపియన్ ట్యూబ్స్
దెబ్బతిన్న ఫెలోపియన్ ట్యూబ్ అండాలను స్పెర్మ్‌ను కలిసేందుకు అనుమతించదు. అందువల్ల ఎటువంటి గర్భనిరోధకాలు వాడకుండా సెక్స్ చేసినా కానీ స్త్రీ గర్భం దాల్చదు. పెల్విక్ (వెన్నుముక చివరి భాగం) ఏరియా చుట్టూ ఏవైనా గాయాలు లేదా ఆపరేషన్లు అయినా కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ దెబ్బతినొచ్చు. దీని వల్ల కూడా వంధ్యత్వం వచ్చే ప్రమాదం ఉంది.
2. హార్మోన్ల ప్రభావం
హైపర్థైరోయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల రుగ్మతలు మహిళల్లో వంధ్యత్వానికి కారణం అవుతాయి. అదనంగా అధిక మోతాదులో ప్రోలాక్టిన్ కూడా ఒవొల్యూషన్ (అండోత్సర్గము) ను దెబ్బతీస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కూడా సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది.
3. క్యాన్సర్
క్యాన్సర్ చికిత్స చేసేటపుడు కీమోథెరపీ మరియు రేడియేషన్ ఎక్కువగా చేస్తారు. కీమోథెరపీ మరియు రేడియేషన్ రెండు కూడా మహిళల్లో వంధ్యత్వానికి కారణం అవుతాయి.
4. ముందుగా వచ్చే మోనోపాజ్ (రుతుచక్రం ఆగిపోయే క్రమం)
రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేక బాధపడే స్త్రీలకు 40 సంవత్సరాలలోపే మోనోపాజ్ (రుతుచక్రం ఆగిపోవడం) సంభవించవచ్చు. రుతుచక్రం ఆగిపోవడంతో అండాశయాలు పని చేయనందున అది వంధ్యత్వానికి కారణం అవుతుంది.
5. గర్భాశయ సమస్యలు:
గర్భాశయం లేదా గర్భాశయ ట్యూమర్స్ (కణతులు) నిరపాయమైనవి. కానీ ఇవి వంధ్యత్వానికి కారణం కావొచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఫలదీకరణం చెందిన అండాలు గర్భాశయాన్ని చేరుకోలేవు. దాని వల్ల అండోత్సర్గము (ఒవొల్యూషన్) జరగదు.
6. ఎండోమెట్రియాసిస్
గర్భాశయం వెలుపల ఎండోమెట్రియల్ కణజాలాల పెరుగుదల ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భంలో గర్భాశయం మరియు ఫెలోపియన్ ట్యూబ్స్ సక్రమంగా పని చేయవు. ఇది మహిళల్లో వంధ్యత్వానికి దారితీస్తుంది.
వంధ్యత్వ సమయంలో వైద్య సలహా, మరియు అవసరమైన చికిత్సలు తప్పనిసరి. అయినప్పటికీ సంతానోత్పత్తిని మెరుగుపరిచేందుకు మరియు అండం నాణ్యతను మెరుగుపరిచేందుకు డైట్ ప్లాన్ అనేది ఒక తెలివైన చర్య.
మీరు వంధ్యత్వానికి చికిత్స తీసుకుంటున్నపుడు మీ ఫెర్టిలిటీ డైట్ ప్లాన్‌లో ఆరోగ్యకరమైన ఆహారం ఉండే విధంగా చూసుకోవడం అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో అధిక ఫైబర్ ఫుడ్, ఆకుపచ్చని కూరగాయలు, మరియు చేపల వంటి ఆహారాలు సహాయకరంగా ఉంటాయి. పండ్లలో మరీ ముఖ్యంగా సిట్రస్ పండ్లు, రాస్ప్బెర్రీస్ లేదా బ్లాక్ బెర్రీస్ వంటి బెర్రీలు. మీ శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
సాల్మన్, చేపలు, చీజ్, బట్టర్ (వెన్న) మరియు గుడ్డు, మరియు గుడ్డు పచ్చసొన వంటి ఆహారాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ D, ఫోలేట్లు వంటి ముఖ్యమైన పదార్థాలు మీ ఫెర్టిలిటీ డైట్ ప్లాన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఆకుప్చని కూరగాయలలో కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదనంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు వంధ్యత్వ చికిత్సల కోసం వెళ్తున్నపుడు మంచి ఆరోగ్యం మీకు సహాయం చేస్తుంది.
కింద నాలుగు వంధ్యత్వ చికిత్సల గురించి పేర్కొనబడింది.
1. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (కృతిమ పద్ధతిలో వీర్యాన్ని యోని ద్వారా లోనికి పంపించుట)
ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతిలో మీ భాగస్వామి వీర్యాన్ని మీ యోని ద్వారా లోనికి పంపుతారు. ఇది మీ ఒవొల్యూషన్ (అండోత్సర్గం) సమయంలో జరుపుతారు. తద్వారా మీరు గర్భవతి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్రాయుటరైన్ ఇన్సిమినేషన్ పద్ధతిని పోలి ఉంటుంది. ఈ ప్రక్రియలో స్పెర్మ్ అనేది క్యాథెటర్ లోపల ఉంచబడుతుంది. అండాలను వీర్యం కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2. కృతిమ గర్భధారణ:
ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (కృతిమ గర్భధారణ) ప్రక్రియలో మీ అండాలు మీ జీవిత భాగస్వామి స్పెర్మ్(వీర్యం)తో ఫలదీకరణం చెందిచబడతాయి. తర్వాత గర్భం దాల్చడం కోసం మీ గర్భాశయంలో ప్రవేశపెట్టబడతాయి.
3. డోనర్ ఎగ్స్:
ఈ చికిత్స పద్ధతిలో.. మీరు మీకు పుట్టబోయే బిడ్డకు సహజంగా తల్లి కాలేరు. డోనర్ (దాత) అండాలు మీ జీవిత భాగస్వామి స్పెర్మ్ (వీర్యం) తో ఫలదీకరణం చెందించి తర్వాత మీ గర్భాశయంలో ప్రవేశపెట్టబడతాయి.
4. సరోగసీ మాతృత్వం:
సరోగసీ పద్ధతిలో సంబంధం లేని స్త్రీ గర్భంలో బిడ్డ పెరుగుతుంది. అటువంటి సందర్భంలో స్పెర్మ్ మరియు అండాలు ఫలదీకరణం చెందించబడి IVF పద్ధతిలో వేరే మహిళ గర్భంలో ప్రవేశపెట్టబడతాయి.
చివరగా:
సంతానం లేకపోవడం అనేది తీవ్రమైన సమస్య.. ఇది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇన్ఫెర్టిలిటీ (వంధ్యత్వం) సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దని, వీలైనంత త్వరగా.. వైద్య నిపుణుడిని కలవాలని సలహా ఇస్తాం. ఆధునిక వైద్య చికిత్సలు సహాయకారకంగా ఉంటాయి. మీరు చాలా త్వరగా సంతోషం పొందే అవకాశం ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ (వంధ్యత్వం) కోసం రకరకాల చికిత్సలు అందుబాటులోనే ఉన్నాయి.
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips


9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి? (9 Week Ultrasound: What to Expect & What are the Red Signals in Telugu?)

చనుమొన డిశ్చార్జ్‌కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)

గర్భధారణ సమయంలో కేక్ తరచుగా తినడం సురక్షితమేనా?

ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: లక్షణాలు మరియు జాగ్రత్తలు

పసి పిల్లల బట్టలు గాలిలో ఆరబెట్టడం ఎంత వరకు సురక్షితం? (How Safe Is It to Air Dry Baby Clothes in Telugu?)

6-నెలల చెక్-అప్ : టీకాలు మరియు మరిన్ని (The 6 Month Check-up: Vaccinations and More in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |