


Pregnancy
24 January 2026 న నవీకరించబడింది
గర్భవతి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలను కలిగి ఉన్నపుడు మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) సంభవిస్తాయి. ఉదాహరణకు.. కవలలతో గర్భాన్ని కలిగి ఉన్నారంటే మీరు ఒకేసారి మీ కడుపులో ఇద్దరు పిల్లలను మోస్తున్నారని అర్థం. ట్రిప్లెట్స్ అంటే ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం. మీరు ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలను కూడా ఒకేసారి కనేందుకు వీలుంటుంది. మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) సింగిల్టన్ గర్భం కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. (కడుపులో ఒకే శిశువును మోయడం).
మహిళ రుతుచక్రం సమయంలో ఆమె అండాశయం ఒకటి కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వీర్యం ఒకటి కంటే ఎక్కువ అండాలను ఫలదీకరణం చేస్తే గర్భాశయం లోపల అనేక పిండాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా పుట్టిన శిశువులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శారీరక తేడాలు ఉంటాయి. ఒక ఫలదీకరణ గుడ్డు ఒకటి కంటే ఎక్కువ అండాలుగా విభజించబడినపుడు ఒకేలా ఉన్న కవలలు పుడతారు. ఒకేలా ఉన్న కవలలు పుట్టే సంఖ్య ఫ్రెటర్నల్ కవలలు పుట్టే సంఖ్య కంటే చాలా తక్కువగా ఉంటుంది.
ఒకేలా ఉన్న కవలలు లేదా ముగ్గురు పిల్లల మధ్య జన్యుపదార్థం భాగస్వామ్యం చేయబడుతుంది. అందుకే వారు ఒకే లింగంతో జన్మిస్తారు. అండం అనేది వీర్యం ద్వారా ఫలదీకరణం చెందినపుడే పుట్టబోయే బిడ్డ లింగం నిర్దారించబడుతుంది. వీర్యకణాలు X మరియు Y అనే రెండు రకాల క్రోమోజోములను కలిగి ఉంటాయి. తల్లికి చెందిన X క్రోమోజోములు అండంలో ఉంటాయి. XX (ఆడ) కాంబినేషన్ రూపాంతరం చెందినపుడు ఆడవారు జన్మిస్తారు. అండం నుంచి X-క్యారియర్ వీర్యం నుంచి కూడా X-క్యారియర్. వీర్యకణాలు Y క్రోమోజోమును కలిగి ఉండి అండం ఫలదీకరణం చెందినపుడు అది జెనెటికల్గా ఐడెంటికల్ అండాలుగా విడిపోతుంది. పుట్టబోయే బిడ్డ లింగం అనేది క్రోమోజోముల ఆధారంగా నిర్ణయించబడుతుంది.
సంతానోత్పత్తి మందులు అండోత్సర్గాన్ని ప్రేరేపించినపుడు అండాశయాలు ఎక్కువగా అండాలను విడుదల చేస్తాయి. ఇది మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) కు దారి తీస్తుంది. (ఉదాహరణ: కవలలు, ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టడం వంటివి). ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా ఒకటి కంటే ఎక్కువ పిండాలను గర్భాశయంలో అమర్చినట్లయితే మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ సాధ్యమవుతాయి. ఫలదీకరణం చెందిన అండం బదిలీ తర్వాత విభజించబడితే ఒకేలా ఉన్న కవలలు లేదా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశాలు ఉంటాయి. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలకు ఒకే రుతుచక్రంలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్లే వయసు మీద పడిన మహిళలకు యుక్త వయసు ఉన్న మహిళల కంటే ఎక్కువగా మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంది.
గత కొన్ని సంవత్సరాలలో ఇలా ఎక్కువ జననాలు సంభవించాయి. ఎందుకంటే ఎక్కువ మంది జంటలు తాము గర్భం దాల్చేందుకు IVF వంటి సంతానోత్పత్తి ప్రక్రియలు మరియు మందులను ఉపయోగిస్తున్నారు.
మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ (బహుళ గర్భాలు) ఉన్న స్త్రీలకు ఉదయం పూట నలతగా అనిపించవచ్చు. మరియు సింగిల్టన్ ప్రెగ్నెన్సీ (కడుపులో ఒకే బిడ్డను మోస్తున్న స్త్రీ) కలిగి ఉన్న స్త్రీల కంటే రొమ్ములు నొప్పిగా అనిపించవచ్చు. వారు త్వరగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటే చాలా సందర్భాల్లో అల్ట్రీసౌండ్లో తెలిసిపోతుంది.
ఈ కింది సమస్యలు వచ్చే అవకాశం ఉంది:
మీరు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే.. మీకు C-సెక్షన్ అవసరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీ కడుపులో ఒక బిడ్డ ఉన్నా కానీ ప్రసవానికి కొన్ని సార్లు C-సెక్షన్ అనేది అత్యంత సురక్షితం. శిశువులు గర్భంలో ఉన్న ప్రతి సారి తమ తలను కిందికే కలిగి ఉండరు. కానీ ఇది పుట్టుకకు ఉత్తమ పొజిషన్. యోని ద్వారా మీ శిశువు జననానికి ఏవైనా సమస్యలు వచ్చినపుడు లేదా మీ శిశువుకు ఏదైనా ప్రమాదం కలుగుతుందని తెలిసినపుడు C-సెక్షన్ కూడా నిర్వహించబడవచ్చు. మీ గడువు తేదీకి ముందే డాక్టర్ లేదా నర్స్ మిమ్మల్ని తనిఖీ చేస్తారు. మీ ప్రసవానికి గల ఉత్తమ మార్గాన్ని గురించి చర్చిస్తారు.
ఆరోగ్యకరమైన ఆహారం తినడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, తరచూ వైద్యుడి వద్దకు వెళ్లడం వల్ల మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్ కలిగి ఉన్నట్లయితే.. మీరు ఎక్కువ పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది. తగినంత ప్రొటీన్ మరియు తగిన మోతాదులో ద్రవాలను తీసుకోవడం అవసరం. పిండం సరిగ్గా అభివృద్ధి చెందేందుకు మీరు అదనపు కేలరీలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కడుపులో శిశువును మోస్తున్నపుడు 300 కేలరీలను అదనంగా తీసుకోవాలనేది ఎప్పటి నుంచో ఉన్న నియమం. మీరు కనుక మల్టీపుల్ ప్రెగ్నెన్సీలను కలిగి ఉంటే.. ప్రతి రోజు 600 కేలరీలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గర్భవతిగా ఉన్నపుడు ఎంత తినాలి మరియు ఏమి తినాలనే దాని గురించి మీ వైద్యుడు లేదా మంత్రసానితో మాట్లాడి సలహా తీసుకోవాలి.
గర్భధారణ సమయం మొత్తం మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెయింటేన్ చేసేందుకు తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం ఉత్తమం. మీరు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వబోతుంటే స్విమ్మింగ్, వాకింగ్, ప్రినేటల్ యోగా వంటివి చేయొచ్చు. ఇవి తక్కువ ప్రభావాన్ని చూపించే వ్యాయామాలు. మీరు గర్భవతిగా ఉన్నపుడు చురుగ్గా ఉండడం మంచిదే అయినప్పటికీ, మీరు ఎటువంటి నియమాలు పాటించాలో మీ వైద్యునితో గానీ మీ మంత్రసానితో కానీ మాట్లాడాలి.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips






ప్రసూతి ప్రయోజనానికి ఎవరు అర్హులు? (Who Is Eligible For Maternity Benefit in Telugu?)

టే సాక్స్ వ్యాధి: కారణాలు, లక్షణాలు, ప్రమాదాలు & చికిత్స

గర్భం దాల్చినప్పుడు కీలక పాత్ర పోషించే మాయ (ప్లాసెంటా) ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

తల్లిపాలు ఇస్తున్నప్పుడు స్త్రీ గర్భం దాల్చవచ్చా?

మీ నవజాత శిశువును వారి తోబుట్టువులకు పరిచయం చేయడం (Introducing Your New Born to Older Siblings in Telugu)

భారతదేశంలో సరైన కార్డ్ సెల్ బ్యాంకులని ఎలా ఎంచుకోవాలి

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |