


Baby Sleep Management
3 November 2023 న నవీకరించబడింది
బేబీ క్యారీ నెస్ట్ లో పడుకున్నప్పుడు పిల్లలు ప్రశాంతమైన నిద్రను పొందవచ్చనేది నిజం. అలాంటి బ్యాగులు కేవలం సౌకర్యాన్ని మాత్రమే కాకుండా వెచ్చదనం మరియు హాయిని కూడా అందిస్తాయి. కాబట్టి, మీరు బేబీ స్లీపింగ్ బ్యాగు కొనడం గురించి కొంచెం చింతిస్తుంటే, మీరు అస్సలు కంగారు పడనక్కర్లేదు. నిజానికి స్లీపింగ్ బ్యాగ్‌లు చాలా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేదా మీ బిడ్డను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువెళుతున్నప్పుడు మరింత ఉపయోగకరం.
బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లో వారు పడుకున్నప్పుడు వారి మొహంపై ఏ బట్టలు లేదా గుడ్డ పడకుండా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. అదేకాదు, క్యారీ నెస్ట్ లో ఉన్నప్పుడు మీ బిడ్డ ప్రవర్తనను కూడా నిశితంగా గమనించండి. ఈ విధంగా, మీ బిడ్డ శరీరం స్లీపింగ్ బ్యాగులో వెచ్చబడుతున్నప్పుడు లేదా బిడ్డకి అసౌకర్యంగా అనిపిస్తే సులువుగా గుర్తించవచ్చు.
ఈ బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లు పడుకున్నప్పుడు ఎదురయ్యే వేర్వేరు మరణాల కారకాలని నిరోధించడంలో సహాయపడతాయి. ఆవిధంగా, పసిపిల్లల స్లీపింగ్ బ్యాగ్ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్‌ను (ఆకస్మికంగా శిశువుల మరణ సిండ్రోమ్-SIDS) నివారించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, స్లీపింగ్ బ్యాగ్ మంచం, రెయిలింగ్ ల మధ్య మీ బిడ్డ శరీరంలో ఏ అవయవం ఇరుక్కుపోని విధంగా డిజైన్ చేయబడింది.
ఒకవేళ మీ బిడ్డ రాత్రిపూట చలికి ఊరికే లేస్తూ ఉంటే, ఇక మీరు బేబీ స్లీపింగ్ క్యారీ బ్యాగ్‌ని ఇవాళే కొనటం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది! మీ బిడ్డ ఆ ప్రొడక్ట్ తో రోజులో ఎప్పుడైనా హాయిగా పడుకోవచ్చు. కానీ, ఈ అత్యంత లాభదాయకమైన ప్రొడక్ట్ ని కొనేముందు మీరు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవటం ముఖ్యం.
స్లీపింగ్ బ్యాగుకి సంబంధించిన మంచి విషయాలలో ఒకటి అది మీ బిడ్డ నిద్రపోయే సమయాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అలా, మీరు మీ బిడ్డ క్యారీ నెస్ట్ కి అతికొద్ది సమయంలోనే అలవాటు పడిపోయి నిద్రపోవటం చూస్తారు. ఈ ప్రొడక్ట్ ప్రత్యేకంగా మీరు వేర్వేరు ప్రాంతాలకి ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఈకాలంలో అనేక ఆన్‌లైన్ స్టోర్‌లు బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లను చవకగా కొనగలిగే ధరకే అందిస్తున్నాయి.
మీ బిడ్డ పుట్టిన వెంటనే వారిని స్లీపింగ్ బ్యాగులో పడుకోనివ్వచ్చు. మామూలుగా అయితే, దాన్ని వాడి ఆస్వాదించటానికి ఖఛ్చితమైన సమయ పరిమితి ఏమీ లేదు. చిన్నపిల్లలు వారి అమ్మ దుప్పట్లో దాక్కొని, సురక్షితంగా ఉండటానికి ఇష్టపడతారు అనేది నిజం. అందుకని, మీ బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చేసరికి, మీరు స్లీపింగ్ బ్యాగుని నిద్రపుచ్చడానికి సిద్ధం చేసుకోవచ్చు.
చాలామంది పసిబిడ్డలు వారి ఉయ్యాలల్లో ఈ మార్పు ప్రక్రియని ఎనిమిది వారాల వయస్సులో పొందుతారు. నిజానికి బేబీ స్లీపింగ్ బ్యాగ్‌ని బోర్లా పడటం వంటి అనేక లక్షణాలు చూపిస్తున్న పిల్లలు ముందుగానే వాడటం ప్రారంభించవచ్చు. పసిపిల్లలు లేవగానే తమ చుట్టుపక్కల చూసి ఆశ్చర్యంగా ప్రవర్తించడం సర్వసాధారణమైన విషయం! స్లీపింగ్ బ్యాగ్‌ని వాడటం వలన గాఢంగా నిద్రపోయి ఆనందంగా నిద్రలేస్తారు! అదీకాక చంటిపిల్లలకి చలికాలంలో చాలా ఎక్కువ చలి వేస్తుంది. అందుకని స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకునే ముందే ఒక మందపాటి దుప్పటిలాంటిది పెట్టేస్తే మంచిది.
పసిపిల్లలని మోసే బేబీ క్యారీ నెస్టు ఖచ్చితంగా చాలా సాయం చేస్తుంది. కానీ మీరు దాన్ని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలని పరీక్షించి ఆ తర్వాతే ఏది కొనాలో నిర్ధారించుకోండి. మీరు చెక్ చేయవలసిన మొదటి విషయాల్లో ఒకటి స్లీపింగ్ క్యారీ బ్యాగ్ మీ బిడ్డ పరిమాణానికి సరిగ్గా సరిపోతుందో లేదో చూడటం. చాలా లూజుగా ఉండే బేబీ నెస్ట్ స్లీపింగ్ బ్యాగ్ మీ బిడ్డ ముఖాన్ని కప్పేయవచ్చు. అలాగే చాలా బిగుతుగా ఉండే క్యారీ బ్యాగ్ అసౌకర్యంగా మారవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం మీ బిడ్డకి అలవాటు అయ్యేవరకూ ఇవన్నీ నెమ్మదిగా పరిచయం చేయండి. మీ బిడ్డని దోమతెర ఉన్న బేబీ స్లీపింగ్ బ్యాగులో ఎక్కువసేపు ఉంచటం కష్టతరం కావచ్చు. అందుకనే, మీరు నెమ్మదిగా మొదలుపెట్టి, మీ బిడ్డ సౌకర్యంగా కదలగలుగుతోందా లేదా అని గుర్తించవలసి ఉంటుందని సూచిస్తున్నాం. ఈ విధంగా, మీ బిడ్డ స్లీపింగ్ క్యారీ బ్యాగ్‌కి అలవాటు పడటానికి సాయపడవచ్చు.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |