This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్లాసెంటా: అసలు ప్లాసెంటా అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? (Placenta: What is Placenta and How Does it Work in Telugu?)

Placental Abruption
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
ప్లాసెంటా: అసలు ప్లాసెంటా అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?  (Placenta: What is Placenta and How Does it Work in Telugu?)
Likes6 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ప్లాసెంటా లేదా గర్భస్థ మావి అనేది గర్భధారణ సమయంలో గర్భాశయంలో ఏర్పడే తాత్కాలిక అవయవం, ఇది శిశువుకు ఆక్సిజన్, పోషకాలు అందిస్తూ వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది.
  • తల్లి వయస్సు, ఊబకాయం, అధిక రక్తపోటు, ఆల్కహాల్, సిగరెట్లు, డ్రగ్స్, పొత్తికడుపు గాయం, ఇన్ఫెక్షన్స్ లాంటివన్నీ ప్లాసెంటా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
  • ప్లాసెంటా ప్రివియా, ప్లాసెంటల్ అబ్రప్షన్, ప్లాసెంటల్ అక్రెటా లాంటివి సాధారణ ప్లాసెంటల్ సమస్యలు. రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి వంటివి ముఖ్య లక్షణాలు.
  • ఆరోగ్యకరమైన గర్భధారణకు ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3

గర్భవతి కావడం ప్రతీ మహిళకు ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. అంతే సవాలుగా కూడా ఉంటుంది. మహిళ గర్భవతి అయినప్పుడు, గర్భాశయం లోపల పెరుగుతున్న పిండానికి అనుగుణంగా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. కొన్ని అవయవాలు విస్తరిస్తూ ఉంటాయి. నిజానికి, ఈ సమయంలో, మహిళ శరీరంలో ఓ కొత్త అవయవం ఏర్పడుతుంది. దాన్నే ప్లాసెంటా అంటారు. ప్లాసెంటాను గర్భస్థ మావిగా పిలుస్తారు. కొందరు దీన్ని మాయ అని కూడా అంటారు. గర్భస్థ మావి పనితీరుతో పాటు, ప్లాసెంటాతో సంబంధం ఉన్న కొన్ని సమస్యలు, ఈ సమస్యల్ని నివారించి ఆరోగ్యకరంగా గర్భధారణను కొనసాగించడానికి గల మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్లాసెంటా అంటే ఏంటీ? (What is Placenta in Telugu?)

మహిళ గర్భవతి అయినప్పుడు గర్భాశయంలో గర్భస్థ మావి ఏర్పడుతుంది. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుకు కావాల్సిన ఆక్సిజన్, పోషకాలు ఇవ్వడంతో పాటు, అదే సమయంలో శిశువు శరీరం నుంచి వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ అవయవం బొడ్డుతాడు గోడ, గర్భాశయాన్ని కలుపుతూ తయారవుతుంది. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయంలోని ఎండోమెట్రియంలో లేదా లైనింగ్‌లో అమరినప్పుడు ఏర్పడే తాత్కాలిక అవయవం ఇది. కడుపులో శిశువు పెరుగుతున్న కొద్దీ ప్లాసెంటా కూడా పెరుగుతుంది. శిశువు జన్మించిన తర్వాత ఖాళీ అవుతుంది.

ప్లాసెంటా ఏం చేస్తుంది? (What Does Placenta Do?)

ప్లాసెంటా చేసే ప్రధాన పని విషయానికి వస్తే ఇది తల్లి రక్తం నుంచి శిశువు రక్తంలోకి ఆక్సిజన్‌తో పాటు పోషకాలను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు శిశువు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను ప్లాసెంటా తొలగిస్తుంది. శిశువు బొడ్డుతాడుకు ప్లాసెంటా కనెక్ట్ అయి ఉంటుంది. బొడ్డుతాడులో రెండు ధమనులు, ఒక సిర ఉంటాయి. వీటిలో ధమనులు ఆక్సిజన్ లేని రక్తాన్ని శిశువు నుంచి మావికి తీసుకెళ్తాయి. సిర ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని ప్లాసెంటా నుంచి శిశువు శరీరంలోకి తీసుకెళ్తుంది.

ప్లాసెంటా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? (Factors That Influences Placenta's Health in Telugu?)

మహిళ గర్భాశయంలో పెరిగే ముఖ్యమైన అవయవం ప్లాసెంటా. పెరుగుతున్న పిండానికి కావాల్సిన పోషకాలను, ఆక్సిజన్‌ను అందిస్తుంది. ప్లాసెంటా ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, ఆమె తీసుకునే ఆహారం, టాక్సిన్స్ లేదా ఇన్ఫెక్షన్లకు గురి కావడం లాంటివన్నీ గర్భస్థ మావిపై ప్రభావం చూపిస్తాయి. గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఇవే:

  • తల్లి వయస్సు: 40 ఏళ్లు దాటిన తర్వాత గర్భవతి అయ్యే మహిళల్లో, ప్లాసెంటా పనితీరు కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.
  • ఊబకాయం: గర్భవతి అయినప్పుడు స్థూలకాయంతో ఉండటం కూడా ప్లాసెంటాపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సమయంలో గర్భస్థ మావి గర్భాశయంలోని కొంత భాగాన్ని లేదా మొత్తం భాగాన్ని కవర్ చేయొచ్చు. ఈ పరిస్థితి ప్రసవ సమయంలో రక్తస్రావానికి కారణం కావడంతో పాటు, ఇతర సమస్యలకు దారితీస్తుంది.
  • అధిక రక్త పోటు: హై బీపీ అంటే అధిక రక్తపోటు ఉండటం కూడా ప్లాసెంటాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
  • పదార్థాల వినియోగం: ఆల్కహాల్, సిగరెట్లు, డ్రగ్స్ లాంటి విషపదార్థాలు కూడా మాయకు హాని కలిగించేవే. ఇవన్నీ గర్భస్థ శిశువు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించేవే.
  • పొత్తి కడుపు గాయం: అకస్మాత్తుగా పొత్తి కడుపు గాయపడితే ప్లాసెంటా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే, గర్భవతులు ఏవైనా బరువులు మోయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • ఇన్ఫెక్షన్స్: ఇన్ఫెక్షన్స్ కూడా ప్లాసెంటల్ సమస్యల్లో సాధారణమైనది. జికా వైరస్ లేదా సైటోమెగలో వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ప్లాసెంటాను దెబ్బ తీస్తుంది. ఫలితంగా శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలు తలెత్తొచ్చు.

ప్లాసెంటా విషయంలో సాధారణంగా వచ్చే సమస్యలేంటి? (Most Common Placental Problems in Telugu)

ప్లాసెంటల్ సమస్యలు మూడో ట్రమిస్టర్‌లో సర్వసాధారణం. ఈ సమయంలో మాయ వేగంగా పెరుగుతుండటమే కారణం.

  • ప్లాసెంటా ప్రివియా అనే సాధారణ సమస్య వస్తుంది. గర్భస్థ మావి పాక్షికంగా లేదా పూర్తిగా గర్భాశయాన్ని కప్పేస్తుంది.
  • ప్లాసెంటల్ అబ్రప్షన్ మరో తీవ్రమైన సమస్య. గర్భాశయ గోడ నుంచి మాయ చిరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
  • ప్లాసెంటల్ అక్రెటా అనేది మరో తీవ్రమైన పరిస్థితి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా మాయ గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కొని ఉంటుంది. దీని వల్ల తీవ్రమైన రక్తస్రావం, ఇతర సమస్యలు వస్తాయి.

ప్లాసెంటల్ సమస్యలకు గల లక్షణాలు ఏంటి? (Symptoms of Placental Problems in Telugu)

గర్భధారణ సమయంలో పలురకాల ప్లాసెంటల్ సమస్యలు వస్తాయి. వీటికి సాధారణ లక్షణం బ్లీడింగ్ కావడం. గర్భధారణ సమయంలో ఎప్పుడైనా రక్తస్రావం కొద్దిగా కనిపించడం దగ్గర్నుంచి తీవ్రంగా కావడం వరకు ఉంటుంది. ఇతర లక్షణాల విషయానికి వస్తే గర్భంలోని శిశువు కదలికలు తక్కువగా ఉండటం, పొత్తికడుపు లేదా ఉదరంలో నొప్పి, సంకోచాలు లాంటివి ఉంటాయి. ఎవరికైనా ఈ లక్షణాల ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

ప్లాసెంటల్ సమస్యల రిస్కును ఎలా తగ్గించాలి? (How to Reduce Placental Problem Risk in Telugu)

ప్లాసెంటా ఓ సంక్లిష్ట అవయవం. గర్భధారణ సమయంలో పిండానికి సపోర్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. తల్లికి, బిడ్డకు మధ్య పోషకాలు, వ్యర్థపదార్థాల మార్పిడికి ఉపయోగపడుతుంది. కడుపులోని శిశువు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

గర్భస్థ మావి సరిగ్గా ఏర్పడనప్పుడు ప్లాసెంటల్ సమస్యలు రావొచ్చు. లేదా గర్భాశయ గోడ నుంచి వేరుచేయబడినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తల్లికి, బిడ్డకు అనారోగ్యం రావడానికి కారణం అవుతాయి.

ప్లాసెంటల్ సమస్యల్ని తగ్గించడానికి పలు అంశాలను గుర్తుంచుకోవాలి:

  • గర్భధారణ సమయంలో తల్లికి కావాల్సిన పోషకాలన్నీ అందేటట్టు చూడాలి.
  • పొగాకు, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి విషపదార్థాలు తీసుకోకూడదు.
  • రక్తపోటు లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల్ని నియంత్రించాలి.
  • ప్రసవం సాఫీగా, ఆరోగ్యకరంగా సాగేందుకు లమాజ్ లాంటి ప్రసవ తరగతుల్లో చేరాలి.
  • ప్లాసెంటల్ సమస్యలకు సంబంధించిన సంకేతాలు, లక్షణాలను తెలుసుకుని అవగాహన పెంచుకుంటే, అవసరమైతే వెంటనే వైద్య సాయం పొందడానికి అవకాశం ఉంటుంది.

ముగింపు (Conclusion)

చివరగా, తల్లి గర్భంలో శిశువు అబివృద్ధికి పనిచేసే ముఖ్యమైన అవయవం ప్లాసెంటా అని తెలుసుకున్నాం. అంతేకాదు, ప్లాసెంటా ఎలా పనిచేస్తుంది? ఆరోగ్యకరమైన గర్భధారణకు అది ఎలా ఉపయోగపడుతుంది? అన్న ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకున్నాం. ప్లాసెంటా పనితీరును ప్రభావితం చేసే, దెబ్బతీసే అనేక అంశాలు ఉన్నాయి. అందుకే ముందుజాగ్రత్త చర్యల్ని తీసుకోవడం ద్వారా, ఆ సమస్యల్ని నివారించవచ్చు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు, పాటించాల్సిన టిప్స్ గురించి తెలుసుకొని ఆరోగ్యకరమైన ప్రసవం పొందడానికి మైలో ఫ్యామిలీ వెబ్‌సైట్ ఫాలో అవండి.

Tags:

Placental Problem in telugu, Placental Problem during pregnancy in telugu, cure to Placental Problem in telugu, risks of Placental Problem in telugu, Symptoms of Placental Problem in telugu.

ప్రతి కాబోయే అమ్మ కోసం నమ్మకమైన సహాయం

ఆరోగ్యకరమైన ప్లాసెంటా, బలమైన గర్భధారణ కోసం పోషకాలతో నిండిన ఉత్పత్తులు మీ ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3662 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.