This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుంది?

Baby Care
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుంది?
Read time5 min

ఏ స్త్రీకైనా ప్రెగ్నెన్సీ ఒక సవాలుతో కూడుకున్న అనుభవం. ప్రసవం తర్వాత చాలా కాలం దాని పర్యవసానాలు ఉండవచ్చు. చాలా ఆడవాళ్ళకు ప్రసవం తర్వాత డిప్రెషన్, ఏడుపు, ఆందోళన వంటివి ఉంటాయి. దీనిని సాధారణంగా ప్రసవానంతర డిప్రెషన్ అని అంటారు. ఇది చాలా తీవ్రమైన అనారోగ్యం. అందువల్ల, ప్రసవానంతర డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్న స్త్రీలకు, ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుంది అనేది ముఖ్యమైన ప్రశ్న.

ప్రసవానంతర డిప్రెషన్ అంటే ఏమిటి?

ప్రసవానంతర డిప్రెషన్, ప్రసవం తర్వాత తల్లి అనుభవించే ఒక రకమైన క్లినికల్ డిప్రెషన్. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియవు. మిగతా రకాల డిప్రెషన్ లాగానే, ఇది రకరకాల కారణాల వల్ల రావచ్చు. ప్రసవ సమయంలో.. ముఖ్యమైన జీవిత మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, శరీరంలో జీవసంబంధమైన మార్పుల వంటి సాధారణ కారణాల వల్ల క్లినికల్ డిప్రెషన్ కలగవచ్చు. అయితే ప్రసవానంతర డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచే అంశాలు కొన్ని ఉన్నాయి -

  • ప్రీ-ప్రెగ్నెన్సీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్
  • కుటుంబంలో మానసిక అనారోగ్యం
  • ఒత్తిడితో కూడిన గర్భం
  • సన్నిహితుల నుండి ప్రేమ, సంరక్షణ లేకపోవడం
  • బైపోలార్ డిజార్డర్ చరిత్ర
  • నెలలు నిండకుండానే బిడ్డ పుట్టటం
  • మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం

మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తరువాత వచ్చే ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలి?

ప్రసవానంతర డిప్రెషన్ యొక్క లక్షణాలు ఏమిటి?

ఎవరైనా ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్నారా అనేది లక్షణాల తీవ్రతను బట్టి, ‘అది వారికి ఎంతకాలం ఉంటుంది?’ అనే దానిని బట్టి చెప్పవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రసవానంతర డిప్రెషన్ యొక్క లక్షణాలు -

  • విచారం, ఆందోళనగా ఉన్నట్టు అనిపించటం
  • కారణం లేకుండా ఏడుపు
  • చంచలత్వం, కోపంగా అనిపించటం
  • అతిగా తినడం
  • సక్రమంగా నిద్రపోవడం లేదా నిద్రపోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడం
  • ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా తలనొప్పి, శరీర నొప్పులు
  • ఇంతకు ముందు ఇష్టమైన వాటికి దూరంగా ఉండటం, అంటే ఒంటరితనం
  • తనకు, బిడ్డకు హాని కలిగించే ప్రతికూల ఆలోచనలు
  • అపరాధ భావన, తనకు విలువలేదని అనిపించటం
  • పనిపై దృష్టి కేంద్రీకరించేటప్పుడు, నిర్ణయం తీసుకోవడంలోను సమస్యలు
  • చిన్నారిని, కుటుంబాన్ని చూసుకునేటప్పుడు ఇబ్బందిపడటం.
  • భ్రాంతులు
  • బరువులో కనిపించే మార్పు

ప్రసవానంతర డిప్రెషన్ సాధారణంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ప్రసవానంతర డిప్రెషన్, ప్రసవం తర్వాత వెంటనే మొదలవుతుంది. చాలా మంది స్త్రీలు బేబీ బ్లూస్ ముగిసే వరకు కూడా దానిని గ్రహించలేరు. బేబీ బ్లూస్ అనేది ప్రసవించిన మొదటి కొన్ని వారాలలో ప్రతి స్త్రీకి కలిగే ఆకస్మిక విచారం. ఇది కొత్తగా పిల్లలు పుట్టినవారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి ఉంటుంది. ప్రసవమయ్యాక మొదటి నాలుగు నుండి ఆరు వారాలు ప్రసవానంతర కాలం. ఈ సమయంలో ఎవరికైనా ఈ డిప్రెషన్ కలగవచ్చు. అయితే.. కొన్ని సందర్భాల్లో, ఈ డిప్రెషన్ ప్రెగ్నెన్సీలోనైనా రావచ్చు, లేదా బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం తర్వాత కూడా రావచ్చు. కాబట్టి ప్రసవానంతర కాలం అయిపోయిన తర్వాత ఎవరైనా బాధపడితే.. అది డిప్రెషన్ లక్షణం కావచ్చు.

ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుంది?

ప్రసవానంతర డిప్రెషన్ ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రసవం తర్వాత రెండు వారాల నుండి నుండి 12 నెలల మధ్యకాలంలో స్త్రీలలో కనిపించవచ్చు. 2014లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆడవారిలో డిప్రెషన్ లక్షణాలు కాలక్రమేణా మెరుగుపడతాయి. ఈ సమస్య కనిపించిన 3 నుండి 6 వారాలలోపు పరిష్కరించబడుతుంది. అయితే ఈ అధ్యయనంలో కొంతమందికి ఆరు నెలలు దాటిన తర్వాత కూడా డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ముప్పై నుండి యాభై శాతం మందిలో ప్రసవించిన ఒక సంవత్సరం తర్వాత డిప్రెషన్ కలిగినట్లు తెలిపారు. దీనికి విరుద్ధంగా, బిడ్డ పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత కూడా వారిలో నిస్పృహ లక్షణాలను అనుభవించినట్లు సగం కంటే తక్కువ మంది తెలిపారు. అందువల్ల.. స్త్రీలలో ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేము.

ప్రసవానంతర డిప్రెషన్ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ప్రసవానంతర డిప్రెషన్ ఆడవారి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొంతమందికి ఒంటరితనం కూడా ఉండవచ్చు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) వారు ఇలా తెలిపారు. ఒక భాగస్వామికి డిప్రెషన్ వస్తే, రెండో వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. తమ కుటుంబం, స్నేహితుల నుండి కూడా దూరం కావచ్చు. ఎందుకంటే వారు తమలాగే ప్రవర్తించరు. దురదృష్టవశాత్తూ, ఇది తల్లీబిడ్డల మధ్య సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతరం వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి?

డాక్టర్‌ని కలవడానికి సరైన సమయం ఎప్పుడు?

బేబీ బ్లూస్ తర్వాత ఏదైనా విచారం, డిప్రెషన్ యొక్క ఇతర లక్షణాలు ఉన్నట్లుగా అనిపిస్తే డాక్టర్‌‌ని కలవవలసి ఉంటుంది. ఇది తప్పనిసరిగా చెడ్డ వార్త కాదు. దీనిలో దాచవలసినది ఏమీ లేదు. కానీ వీలైనంత త్వరగా నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా.. దాని కోసం తమను తాము నిందించుకోకూడదు. ప్రసవం తర్వాత డిప్రెషన్ సర్వ సాధారణమని అంగీకరించాలి. త్వరగా కోలుకోవడానికి సహాయం కోరాలి. ప్రసవానంతర డిప్రెషన్ గురించి స్త్రీలు తెలుసుకోవలసినది ఇంతే. ఈ లక్షణాలన్నింటినీ గుర్తుంచుకోండి; వీటిలో ఏదైనా అనుభవంలోకి వస్తే, వెంటనే డాక్టర్‌‌ని కలవవలసి ఉంటుంది.

ప్రసవానంతర డిప్రెషన్ గురించి మరింత తెలుసుకోండి (FAQలు)

1. 2 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలుగుతుందా?

అవును, ప్రసవించిన 2 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలగవచ్చు.

2. 4 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలుగుతుందా?

అవును, ప్రసవించిన 4 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలగవచ్చు. ఎందుకంటే.. ఆడవారిలో కలిగే హార్మోన్ల మార్పుల కారణంగా, వారికి ప్రసవానంతర డిప్రెషన్ అనుభవంలోనికి రావచ్చు.

3. ప్రసవానంతర డిప్రెషన్ సంవత్సరాల తరబడి కొనసాగుతుందా?

అవును, ప్రసవం తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే ప్రసవానంతర డిప్రెషన్ కారణంగా కొన్నిసార్లు స్త్రీలలో చాలా నిస్పృహ లక్షణాలు ఉండవచ్చని అధ్యయనాలు సూచించాయి. కొంతమందిలో నిస్పృహ లక్షణాలను అంచనా వేయడానికి మూడు నుండి ఆరు నెలలు సరిపోకపోవచ్చు.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.