
పిల్లలను ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంచేందుకు తల్లిదండ్రులు చేయాల్సిందంతా చేస్తారు. కొత్త తల్లిదండ్రులు క్రమంగా వారి పిల్లల అవసరాలు ఏంటి? ఎటువంటి విషయాలతో వారి పిల్లలు సంతోషంగా ఉంటారనే విషయాలను తెలుసుకుంటారు. ఇంట్లో ఉన్నపుడు ఇది ఒక చిన్న విషయం. కానీ వారు తమ చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసినపుడు ఇది సవాలుతో కూడుకున్న విషయం. చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నపుడు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు జాగ్రత్తగా ప్రణాళిక రచించాలి. నేటి రోజుల్లో అనేక బేబీ కేర్ ఉత్పత్తులు తల్లిదండ్రులకు శ్రమ లేకుండా చేస్తున్నాయి. ఇందులో డిస్పోజబుల్ డైపర్స్ చాలా అవసరం. కానీ అవి శిశువుకు సురక్షితమేనా? ఈ ఆర్టికల్ ఈ బేబీ కేర్ ప్రొడక్ట్‌ను గురించి మరింత నిశితంగా పరిశీలిస్తుంది.
ప్రయాణాల్లో శిశువులకు డిస్పోజబుల్ డైపర్లు వాడడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని చాలా సులభంగా వాడేందుకు మరియు స్టోర్ చేసేందుకు వీలుంటుంది. అంతే కాకుండా వాటిని పారేయడం (డిస్పోజ్) చేయడం కూడా తేలిక. డిస్పోజబుల్ డైపర్స్ డైపర్ రాషెస్ (దద్దుర్లు) రాకుండా నివారించడంలో కూడా సహాయపడతాయి. ఎందుకంటే క్లాత్ డైపర్స్‌తో పోల్చుకుంటే వీటిలో లీక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డిస్పోజబుల్ డైపర్స్‌లో తేమను గ్రహించే పదార్థాలు ఉంటాయి. ఇవి శిశువును 12 గంటల వరకు పొడిగా ఉంచుతాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వీటిని వాడిన తర్వాత కడగాల్సిన అవసరం లేదు, వాడిన తర్వాత బయటపడేయొచ్చు అనే వాస్తవం డిస్పోజబుల్ డైపర్లను డేకేర్ మరియు బేబీ సిటర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.
మొదట డిస్పోజబుల్ డైపర్ల ఖరీదు చాలా ఎక్కువ. ఇవి తల్లిదండ్రుల జేబుకు చిల్లు పెట్టడం ఖాయం. ఇక రెండో విషయం ఏమిటంటే.. ఇవి బయోడీగ్రేడబుల్ (బ్యాక్టీరియాతో నాశనం చేసేవి) లేదా రీసైక్లబుల్ కానీ వ్యర్థాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. కొంత మంది తల్లిదండ్రులు డిస్పోజబుల్ న్యాపీలు మరియు డైపర్స్ కంటే క్లాత్ డైపర్స్ శిశువుకు మరింత సౌకర్యంగా ఉంటాయిని నమ్ముతారు. శిశువుల కోసం ఉపయోగించే డిస్పోజబుల్ డైపర్లలో వాడే రసాయనాల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి.
ప్రయాణాలు చేసేటపుడు డిస్పోజబుల్ డైపర్స్ భద్రతపై ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. కానీ పరిగణలోనికి తీసుకోవాల్సిన కొన్ని ప్రమాదాలు మాత్రం ఉన్నాయి. డిస్పోజబుల్ డైపర్స్ శిశువులకు హాని చేసే కొన్ని రకాల రసాయనాలను కలిగి ఉండొచ్చు. ఇవి మీ చిన్నారి ఆరోగ్యానికి ప్రమాదం చేకూరుస్తాయి. దద్దుర్లు, చికాకు వంటి వాటిని కలిగిస్తాయి. డిస్పోజబుల్ డైపర్ల భద్రత గురించి ఎవరైనా ఆందోళన చెందుతుంటే.. వారు వీటికి బదులుగా క్లాత్ డైపర్స్‌ను వాడొచ్చు. పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండేందుకు డైపర్లను సరైన విధంగా పారేయడం (డిస్పోజ్ చేయడం) చాలా అవసరం. సరైన విధంగా డిస్పోజ్ చేయని డైపర్ల కారణంగా వ్యాధులు వ్యాపిస్తాయి. అంతే కాకుండా అవి కీటకాలు మరియు ఎలుకలను కూడా ఆకర్షిస్తాయి.
డిస్పోజబుల్ డైపర్ల విషయానికి వస్తే శిశువు సైజ్ (పరిమాణం) బట్టి శరీర బరువును బట్టి సరైన సైజ్ (పరిమాణం) ఉన్న డైపర్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా డిస్పోజబుల్ డైపర్లు వివిధ సైజెస్ (పరిమాణాల్లో) వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డకు సరిపోయే దాన్ని ఎంచుకోవచ్చు. కొనుగోలు చేసే ముందు ప్యాక్‌పై ఉన్న సైజింగ్ చార్ట్‌ను తనిఖీ చేయడం మంచిది.
ఒక జంట ఎనిమిది వారాల కంటే తక్కువ వయసున్న శిశువుతో ప్రయాణిస్తుంటే వారు డిస్పోజబుల్ డైపర్లకు బదులు గుడ్డ డైపర్లను ఉపయోగించాలని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువులు రోజంతా అనేక సార్లు మలం, లేదా మూత్రవిసర్జన చేస్తారు. అలాంటి సమయంలో ఎక్కువ సంఖ్యలో డిస్పోజబుల్ డైపర్స్ అవసరం అవుతాయి. ఇది మరీ ఖరీదుగా మారే అవకాశం ఉంటుంది.
శిశువు డైపర్‌ను ఎంత తరచుగా మార్చినప్పటికీ కొత్త డైపర్ వేసే ముందు ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉండేలా చూడడం చాలా ముఖ్యం. ఎటువంటి లీక్స్, ఎరుపుదనం, చికాకు లేదని ప్రతి సారి చెక్ చేయడం చాలా అవసరం. ఒక వ్యక్తి తమ శిశువుకు డిస్పోజబుల్ డైపర్ వాడుతున్నాడా? లేక క్లాత్ (బట్ట) డైపర్ వాడుతున్నాడా? అనే విషయంతో సంబంధం లేకుండా ఇది ఉంటుంది. పిల్లలు అనుభవించే అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు డైపర్ సైజ్ రాష్ క్రీమ్‌ను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణంలో ఉన్నపుడు బేబీకి తరచూ డైపర్ మార్చడం అనేది చాలా మంచిది. (థంబ్ రూల్= సైన్స్‌తో సంబంధం లేని ఒక నియమం)
చాలా విషల్లాగానే పిల్లలకు డిస్పోజబుల్ డైపర్లు ఉపయోగించడం వలన లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. తల్లిదండ్రులు డిస్పోజబుల్ డైపర్లు వాడాలని నిర్ణయించుకుంటే.. ఏదైనా ప్రమాద సమయంలో ఉపయోగించేందుకు వారు అదనపు డైపర్స్‌ను తీసుకెళ్లాలి. వాటిని తరచుగా మార్చాలి. అంతే కాకుండా బాధ్యతాయుతంగా బయట పడేయాలి. చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ప్రయాణంలో ఉన్నపుడు వారు తమ బిడ్డకు డిస్పోజబుల్ డైపర్లు వాడాలనుకుంటున్నారా? లేదా అనేది తల్లిదండ్రుల ఇష్టం. వారు వారి సౌలభ్యం, జీవనశైలి, స్థోమత వంటి వివిధ కారణాల ఆధారంగా ఎంచుకోవచ్చు.
శిశువు సంరక్షణ మరియు బాల్యంలో పిల్లలను ఎలా చూసుకోవాలనే దాని గురించి మరిన్ని చిట్కాల కోసం మయిలో స్టోర్‌లో అనేక బ్లాగ్స్‌ను అన్వేషించండి. ప్రసవానంతర పిల్లల సంరక్షణ మాత్రమే కాకుండా గర్భవతులుగా ఉన్న తల్లులు మూడు త్రైమాసికాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా మసులుకోవాలి అనే విషయాల కోసం ఇది ఒక రిపోసిటరీ (గైడ్, స్టోర్ రూమ్) లాంటిది.
Schwartz KL, Keystone JS. Protection of Travelers.(2018) Principles and Practice of Pediatric Infectious Diseases.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |