
శిశువుకు బర్ప్ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అన్నది తల్లిదండ్రులకు ఎప్పుడూ మిస్టరీగానే ఉంటుంది. కానీ ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకు బర్ప్ చేయడానికి సరైన మార్గాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీరు పలు రకాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. ఒక శిశువుకు పనిచేసిన టెక్నిక్ మిగతా పిల్లలకు కూడా పనిచేస్తుందని ఏమీ ఉండదు. కాబట్టి, కొత్తగా తల్లిదండ్రులైనవారికి సాయపడేందుకు ఈ బ్లాగ్‌లో నవజాత శిశువులకు బర్పింగ్ గురించి వివరించాం. బర్పింగ్ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అనే వివరాలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు చదవండి.
నవజాత శిశువుకు బర్పింగ్ చేయడానికి పలు మార్గాలున్నాయి. శిశువును మీ భుజంపై ఎత్తుకొని లేదా మీ ఒడిలో కూర్చోబెట్టుకొని వారి తలకు సపోర్ట్ ఇవ్వాలి. నవజాత శిశువు తలకు, వెన్నుకు తప్పనిసరిగా సపోర్ట్ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత వారి వీపును నెమ్మదిగా నిమరాలి లేదా తట్టాలి. వాళ్లు బర్ప్ చేసేంత వరకు అంటే త్రేన్పు తీసేంత వరకు చేయాలి. మీరు కొన్ని నిమిషాల పాటు బర్ప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండాలి. నవజాత శిశువులకు బర్ప్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. మీ శిశువు అవసరాన్ని బట్టి ఎప్పుడు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. ఈ టిప్స్ గుర్తుంచుకోండి.
సాధారణంగా పిల్లలకు తల్లి పాలు ఇచ్చిన వెంటనే బర్ప్ చేయడం సరైనది. దీని వల్ల పిల్లలు ఉమ్మివేయడం లేదా గజిబిజిగా ప్రవర్తించడం లాంటివి తగ్గించవచ్చు. ఇంకా తల్లిపాలు ఇచ్చిన వెంటనే నవజాత శిశువుకు బర్పింగ్ చేస్తే పిల్లలు అసౌకర్యంగా ఉండటానికి ఇవి ప్రధాన కారణాలైన కడుపులో గ్యాస్‌ను నివారించడంతో పాటు అజీర్తిని తగ్గిస్తుంది. అయితే.. పిల్లలు ఎక్కువగా గ్యాస్‌తో ఇబ్బందిపడుతున్నట్టైతే మీరు వారికి ఎక్కువసార్లు బర్పింగ్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు నవజాత శిశువుల అవసరాలను గుర్తించి, అందుకు తగ్గట్టుగా బర్పింగ్ చేయాలి. అలాగని మరీ ఎక్కువసార్లు బర్పింగ్ చేయకూడదు. ఎక్కువసార్లు పిల్లల వీపు తట్టడం వల్ల వాళ్లు మరింత ఇబ్బంది పడవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: రాత్రి సమయాల్లో పసి పిల్లలు ఏడుపు ఆపడానికి ఏమి చేయాలి?
నవజాత శిశువుకు బర్ప్ చేయడానికి సరైన పొజిషన్ ఏదన్నదానిపై ఒక్క జవాబు లేదు. పిల్లల్ని భుజంపై ఎత్తుకున్నప్పుడు బర్ప్ చేయడం కొందరు తల్లిదండ్రులకు సులువుగా ఉంటుంది. ఇంకొందరికి శిశువుల్ని ఒడిలో పడుకోబెట్టుకొని బర్పింగ్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. బర్పింగ్ పొజిషన్స్ విషయానికి వస్తే అనేక పద్ధతులు ఉన్నాయి. పిల్లల్ని పైకి ఎత్తుకొని చేయడమే సరైన పొజిషన్‌గా చెప్పొచ్చు. ఆ పొజిషన్‌లో పిల్లలు ఏవైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టైతే మరో పొజిషన్ ప్రయత్నించవచ్చు. అయితే పిల్లలకు బర్ప్ చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
చివరగా, పిల్లలకు సరైన బర్పింగ్ పొజిషన్‌కు సంబంధించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలకు ఏ పొజిషన్ బాగా పనిచేస్తే ఆ పొజిషన్ ఫాలో కావాలి. ఈ విషయం తెలుసుకోవడానికి వేర్వేరు బర్పింగ్ పొజిషన్స్ ప్రయత్నిస్తూ సరైన పొజిషన్ తెలుసుకోవాలి.శిశువు వీపు నిమరకపోతే ఏమవుతుంది? శిశువుకు బర్పింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటే, మరో పొజిషన్ ప్రయత్నించాలి. ఇలా వేర్వేరు పొజిషన్స్ ప్రయత్నించవచ్చు. పిల్లలకు కావాల్సినంత బర్పింగ్ చేయడం అవసరం. మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటగా కొందరు పిల్లలకు ఎక్కువసార్లు బర్ప్ చేయాల్సి రావొచ్చు. అంటే పాలు తాగిన ప్రతీసారి బర్ప్ చేయాలన్నమాట.
ఆ తర్వాత, మీరు వేర్వేరు పొజిషన్స్ ప్రయత్నించాలి. ముందుగా చెప్పినట్టు, కొందరు పిల్లలు నిటారుగా ఉన్న పొజిషన్‌లో త్వరగా త్రేన్పు తీయొచ్చు. ఇంకొందరు పడుకొని ఉన్నప్పుడు త్వరగా బర్ప్ చేయొచ్చు. చివరగా, మీ పిల్లలు బర్ప్ చేయకపోతే అంటే త్రేన్పు తీయకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొందరు నవజాత శిశువులకు త్రేన్పు తీయాల్సిన అవసరం రాకపోవచ్చు. మీ శిశువు సంతోషంగా ఉంటూ, బరువు పెరుగుతూ ఉన్నన్ని రోజులు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు నవజాత శిశువుకు బర్పింగ్ విషయమై ఏవైనా సందేహాలు ఉంటే పీడియాట్రీషియన్‌ను సంప్రదించి మీ సందేహాలు తీర్చుకోవాలి.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |