This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your ovulation on mylo app

డెలివరీ తర్వాత రుతుచక్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

Getting Pregnant
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
డెలివరీ తర్వాత రుతుచక్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
Likes1 Likes|
Read time6 min

ప్రెగ్నన్సీ అనేది ఎటువంటి జంటల జీవితంలో అయినా అద్భుతమైన విషయం. కానీ ఈ సమయంలో చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి? కొత్తగా తల్లయిన వారిలో ఎక్కువ మందికి వచ్చే ప్రశ్న “ప్రసవం తర్వాత నా రుతుచక్రం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందని?” ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడం చాలా కష్టం అవుతుంది. ఇది సరైన ప్రశ్నే. ప్రసవం తర్వాత పీరియడ్స్ గురించి ప్రతీ విషయాన్ని మేము ఈ బ్లాగ్​లో వివరించాం.

గర్భధారణ తర్వాత నా రుతుచక్రం తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

సాధారణంగా గర్భధారణ తర్వాత పీరియడ్స్​ తిరిగి ప్రారంభం అయ్యేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. తల్లి రొమ్ము పాలివ్వకపోతే.. వారి చక్రాలు అనేవి తొందరగానే సాధారణ స్థితికి వస్తాయి. చాలా మంది స్త్రీలు తమ మొదటి పీరియడ్ ముందుగానే ఒవొల్యూట్(అండోత్సర్గం) చేస్తారు. కాబట్టి చాలా మంది ప్రసవం తర్వాత మొదటి పీరియడ్ కంటే ముందుగానే గర్భవతి అయ్యే అవకాశం ఉంటుంది.

నేను మళ్లీ ఎప్పుడు గర్భవతిని అవుతాను?

ఈ విషయం వయస్సు, ఆరోగ్యం, వారు తల్లిపాలు ఇస్తున్నారా? అనే అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజులకే ప్రసవానంతర పీరియడ్స్ ప్రారంభం అవుతాయి. ఈ ప్రక్రియ మొదలు కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. డెలివరీ తర్వాత వెంటనే మళ్లీ గర్భవతి కావాలని ఎవరైనా ఆశపడితే ఈ విషయం గురించి వారి వైద్యసహాయకుడితో మాట్లాడాలని సిఫారసు చేయబడింది.

గర్భధారణ తర్వాత వచ్చే నా మొదటి పీరియడ్ ఎలా ఉంటుంది?

ఎవరైనా యోని ద్వారా జన్మనిస్తే ప్రసవం తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల లోపు వారి ప్రసవానంతర మొదటి పీరియడ్ వస్తుంది. మీకు కనుక C-సెక్షన్ (సిజేరియన్) అయితే పీరియడ్ రావడానికి మరింత ఎక్కువ అంటే 10 నుంచి 16 వారాల సమయం పడుతుంది. ప్రసవం తర్వాత మొదటి పీరియడ్ గర్భధారణకు ముందు వచ్చే పీరియడ్స్ కంటే ఎక్కువ తీవ్రతతో కూడి ఉంటుంది. ఎందుకంటే శరీరం గర్భాశయంలోని పొర (ఎండోమెట్రియం) మాత్రమే కాకుండా గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు రక్తం మరియు కణజాలాలను కూడా తొలగిస్తుంది.

నా పీరియడ్ రొమ్ముపాలను ప్రభావితం చేస్తుందా?

స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన కొన్ని వారాల తర్వాత ప్రసవం తర్వాత మొదటి పీరియడ్ వస్తుంది. అయినప్పటికీ వారు రొమ్ము పాలు ఇస్తున్నట్లయితే ఎక్కువ సమయం పట్టవచ్చు. బ్రెస్ట్​ఫీడింగ్ అనేది ఒవొల్యూషన్ (అండోత్సర్గము) ను అణచివేయడం వల్ల పీరియడ్ రావడం ఆలస్యం కావొచ్చు. స్త్రీ కనుక పుట్టిన శిశువుకు రొమ్ము పాలు ఇవ్వకపోతే.. ప్రసవం తర్వాత 4 నుంచి 6 వారాల్లోపే పీరియడ్ రావొచ్చు. రొమ్ముపాలు ఇస్తున్నపుడు పీరియడ్స్ వస్తే పీరియడ్స్ రొమ్ము పాల సరఫరాకు ఆటంకం కలిగిస్తాయి. ఎవరైనా పీరియడ్​లో ఉన్నపుడు వారి శరీరం రక్తం మరియు కణజాలంతో కూడిన గర్భాశయ పొరను తొలగిస్తుంది. ఈ ప్రక్రియ హార్మోన్ల మార్పులకు కారణం అవుతుంది. పాల ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది. పీరియడ్స్ ప్రారంభం అయ్యే ముందు రొమ్ములు బరువుగా అనిపిస్తాయి. పీరియడ్స్ మొదలయిన తర్వాత కాస్త తేలికగా అనిపిస్తాయి.

ప్రసవం తర్వాత నా పీరియడ్స్ ఎలా భిన్నంగా ఉంటాయి?

ప్రసవానంతరం పీరియడ్స్ భిన్నంగా ఉండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మునుపటి కంటే కఠినంగా ఉండడం, ఎందుకంటే గర్భధారణ సమయంలో మన శరీరం ఎక్కువ ప్రొజెస్టిరాన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గర్భాశయ లైనింగ్​ను థిక్​గా మారుస్తుంది. మరో తేడా మునుపటి కంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. గర్భధారణ సమయంలో శరీరం ఎక్కువ ఈస్ట్రోజెన్​ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది సైకిల్​లెంగ్త్​ను పెంచుతుంది. చివరగా.. మహిళలు సాధారణం కంటే ఎక్కువ తిమ్మిర్లను కూడా అనుభవించొచ్చు. ఎందుకంటే గర్భధారణ సమయంలో శరీరం ఎక్కువ మోతాదులో రిలాక్సిన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెల్విస్​ (వెన్నముక చివరి భాగం) లోని లిగమెంట్స్​ను (జాయింట్​) లూజ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల శిశువు ఈజీగా దాని గుండా పాస్ అవుతుంది.

డెలివరీ అయిన తర్వాత వచ్చిన మొదటి పీరియడ్ నుంచి నేను ఏం ఆశించాలి?

డెలివరీ తర్వాత పీరియడ్స్ చాలా నెలల పాటు రుతుక్రమం సక్రమంగా ఉండకపోవడం సహజం. శరీరం కొత్త హర్మోన్ స్థాయిలకు సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. తల్లిపాలను ఇస్తున్న కొంత మంది స్త్రీలకు పీరియడ్స్ రాకపోవచ్చు. డెలివరీ తర్వాత పీరియడ్ వస్తే అది ఇదివరకు వచ్చిన దానికి భిన్నంగా ఉండవచ్చు. ప్రసవానంతర తర్వాత రక్తస్రావం మునుపటి కంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. అది కఠినంగా ఉండవచ్చు. లేదా తేలికగా ఉండవచ్చు. మీకు పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ లేదా బ్లీడింగ్ కూడా ఉండవచ్చు.

ప్రసవం తర్వాత నేను ఎటువంటి లక్షణాలను గమనించాలి?

డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎప్పుడు మొదలవుతాయి? అనే ప్రశ్నకు మేము ఇప్పటికే సమాధానం ఇచ్చాం. మీరు గమనించాల్సిన ప్రసవానంతర లక్షణాల గురించి మేము చర్చిస్తాం.

1. రక్తస్రావం: ప్రసవం తర్వాత ఆరువారాల వరకు యోని దగ్గర రక్తస్రావం కావడం సహజం. దీనిని లోచియా అని పిలుస్తారు. ఇది సాధారణంగా ఫుల్ పీరియడ్​లా ఉంటుంది. లోచియా అనేది మొదట తేజోవంతమైన ఎరుపు రంగు ​లో ప్రారంభం అవుతుంది. తర్వాత నెమ్మదిగా ఇది గులాబీ లేదా గోధుమ రంగులోకి మారుతుంది.

2. తిమ్మిర్లు: ప్రసవం తర్వాత కొద్ది రోజుల వరకు స్త్రీలకు తమ గర్భాశయం తిమ్మిరిగా ఉంటుంది. పొట్ట అనేది గర్భధారణకు ముందు పరిమాణానికి మారుతుంది కాబట్టి ఈ తిమ్మిర్లు వస్తాయి. ఈ తిమ్మిర్లు సర్వసాధారణం. ఇవి తేలికపాటివి. పెయిన్ కిల్లర్స్ అయిన ఇబూప్రోఫెన్, పారాసిటమాల్ వంటి ఓవర్ ది కౌంటర్ (డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేనివి) మందులతో ఉపశమనం పొందొచ్చు.

3. కారడం (డిశ్చార్జ్): బిడ్డకు జన్మనిచ్చిన ఆరువారాల వరకు యోని డిశ్చార్జ్ పెరగడం అనేది సర్వసాధారణం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 9 వారాల ప్రెగ్నెన్సీలో బ్రౌన్ డిశ్చార్జ్ - ఇది సాధారణమా?

బ్రెస్ట్ ఫీడింగ్ (రొమ్ము పాలివ్వడం) వల్ల నా పీరియడ్స్ ప్రభావితం అవుతాయా?

డెలివరీ తర్వాత స్త్రీ రుతుచక్రం మారడం సర్వసాధారణం. ఒక స్త్రీ నుంచి బిడ్డ తల్లిపాలు తాగుతున్న సమయంలో పీరియడ్స్ ఆగిపోవడం కూడా సర్వసాధారణమే. ఎందుకంటే రొమ్ముపాలు ఉత్పత్తి చేసేందుకు శరీరానికి సంకేతాలు ఇచ్చే ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఒవొల్యూషన్(అండోత్సర్గం)ను అణచి వేస్తుంది. ఒక స్త్రీ రొమ్ము పాలు ఇస్తున్నట్లయితే (ఆ శిశువు ఆమె రొమ్ము పాల నుంచే పోషకాలను పొందుతున్నాడని అర్థం) ఆ సమయంలో ఆమెకు పీరియడ్స్ రావు. మీకు ఈ బ్లాగ్ సహాయకరంగా అనిపిస్తే.. పేరెంటింగ్, బేబీ కేర్, లైఫ్​స్టైల్ బ్లాగ్స్ కోసం వెంటనే Mylo Family వెబ్​సైట్​ని సందర్శించండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.