This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

చంటి పిల్లలకు మసాజ్ చేయడానికి ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనె ఎందుకు వాడాలి?

Baby Care
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
చంటి పిల్లలకు మసాజ్ చేయడానికి ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనె ఎందుకు వాడాలి?
Read time8 min

కొబ్బరి నూనెలో అనేక ఔషధ గుణాలతోపాటు చికిత్సా గుణాలున్నాయి. అందువల్ల చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లల చర్మానికి కొబ్బరి నూనెతో మర్దనా చేయడానికి ఇష్టపడతారు. అంతే కాకుండా, నెలలు నిండకుండా పుట్టిన చిన్నారుల ఆహారంలో కూడా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. ఇది అటువంటి చిన్నారులకు కొవ్వును అందించే ప్రాధమిక పదార్థంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇంకా చదవండి. ఆరోగ్యవంతులైన పిల్లలకు, కొబ్బరి నూనె చర్మం మీద, జుట్టు మీద మాత్రమే రాస్తారు. మీరు మీ చిన్నారి ఆహారంలో కొబ్బరి నూనె వేయాలనుకుంటే, మీ శిశువైద్యుని సంప్రదించడం మంచిది. ఈ రోజుల్లో ఎన్నో కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, నాణ్యతలో రాజీ పడకుండా మీరు ఉత్తమమైన దానిని ఎంచుకున్నారో లేదో చూసుకోవాలి.

బేబీ మసాజ్ కోసం కొబ్బరి నూనె ఎందుకు మంచిది?

బేబీ మసాజ్ అనేది మీకు, మీ చిన్నారికి మధ్య జరిగే ప్రేమపూర్వకమైన, సున్నితమైన సంభాషణ. ఇది మీ చిన్నారి యొక్క మానసిక, భావోద్వేగ, శారీరక ఆరోగ్యంపై చాలా అద్భుతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ మీ చిన్నారికి మసాజ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే.. ఏ నూనెను ఉపయోగించాలనేది ప్రశ్న. మీ చిన్నారి యొక్క సున్నితమైన చర్మం కోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం కష్టం. చర్మానికి ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనె మీ చిన్నారికి అద్భుతమైన మసాజ్ ఆయిల్‌గా పరిగణించబడుతుంది. ఇది సహజ పదార్ధాలతో తయారు చేయబడింది. ఇది మీ చిన్నారి యొక్క సున్నితమైన చర్మానికి చాల బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంకా భరోసా ఇవ్వడానికి, మీ చిన్నారికి మసాజ్ చేసేటప్పుడు కొబ్బరి నూనె వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ మీ కోసం ఇచ్చాము:

మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?

మీ చిన్నారికి ఎక్స్‌ట్రా వర్జిన్‌‌‌ కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. ఎక్స్‌ట్రా‌ వర్జిన్ కొబ్బరి నూనె తక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. అందువల్ల ఇది మీ చిన్నారి యొక్క సున్నితమైన చర్మానికి సరైన ఎంపిక అవుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సహజ పదార్ధాలతో తయారు చేయబడినది. ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు చాలా సమృద్ధిగా కలిగి ఉన్నది.

2. ఇది మృదువుగా ఉండి, మీ చిన్నారి యొక్క చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ నూనె సాంద్రత తక్కువ కనుక చర్మంలో త్వరగా కలిసిపోతుంది. దీనిలోని పోషకాలు ప్రత్యేకమైన సమతుల్యత కలిగి ఉండి, మీ చిన్నారి చర్మాన్ని మెరుగుపరుస్తాయి.

3. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ జెర్మ్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తామర, పొడి చర్మం, క్రెడిల్ క్యాప్, డైపర్ ర్యాష్ వంటి ఎన్నో వివిధ చర్మ రోగాలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.

4. ఇది చంటిపిల్లలకు వచ్చే పొక్కులకు చికిత్సలో సహాయపడుతుంది. దురద, చికాకు నుండి కూడా ఉపశమనం ఇస్తుంది. మీరు దోమల కాటుకు చికిత్స చేయడానికి కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు.

5. ఎక్స్‌ట్రా వర్జిన్, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె కూడా మీ చిన్నారి జుట్టుకు పోషణను అందించడంలో సహాయపడుతుంది. మీ చిన్నారి జుట్టు పెరుగుదలను పెంచుతుంది. మీ చిన్నారికి ప్రతిరోజూ ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. మీ చిన్నారి చర్మం, జుట్టు కోసం ఈ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం?

కోల్డ్-ప్రెస్డ్ కొబ్బరి నూనెను ఉపయోగించి ఉపశమనం పొందగల చర్మం, జుట్టు పరిస్థితులు

1. క్రెడిల్ క్యాప్:

ఎంతో మంది చిన్నారులకు పుట్టిన మొదట్లో కొన్ని వారాలలో చాలా ప్రభావితం చేసే పరిస్థితి తలపైన పొడిగా ఉండటం. మీ చిన్నారి తలలో చుండ్రులా ఉండే పొరలు ఉండవచ్చు. తలలోపలి చర్మం కూడా బాగా ఎర్రబడినట్లు అనిపించవచ్చు. మంచి నాణ్యమైన కొబ్బరి నూనెతో మీ చిన్నారి తలకు మసాజ్ చేయడం వల్ల మీ చిన్నారి ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు మీ చిన్నారి తలపై సుమారు 20 నిమిషాల పాటు నూనె మర్దనా చేయవచ్చు. మీ చిన్నారి తలపై ఉన్న పొరలను తొలగించడానికి మృదువైన దువ్వెన ఉపయోగించండి. ఆ తర్వాత మీ పిల్లల తలని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

2. తామర:

చర్మం చాలా పొడిగా మారవచ్చు. చివరికి మీ చిన్నారి చర్మంపైన దురద లేదా పొట్టులా కూడా వస్తుంది. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, తామరకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు స్నానం చేసే సమయానికి ముందు లేదా మీ చిన్నారి స్నానం చేసిన తర్వాత కూడా మీ చిన్నారి చర్మంపై కొబ్బరి నూనె రాయవచ్చు. నిద్రపోయే సమయానికి ముందు మంచి నాణ్యమైన కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల మీ చిన్నారి చర్మానికి అవసరమైన ఎక్స్‌ట్రా తేమను అందించవచ్చు! రెగ్యులర్ మసాజ్‌తో, తామర లక్షణాలు తగ్గటం ఖాయం.

3. డైపర్ రాష్:

ఇది చిన్నారులు, పసిబిడ్డలలో సాధారణంగా ఉండే ఇన్‌ఫ్లమేటరీ డెర్మటైటిస్. డైపర్ రాష్‌ కోసం మినరల్ ఆయిల్ కంటే కొబ్బరి నూనెను సుమారు 8 వారాల పాటు అప్లై చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే, కొబ్బరి నూనెను ఎంచుకునే ముందు డాక్టర్‌తో మాట్లాడండి. చాలా మంది చర్మవ్యాధి నిపుణులు సాధారణంగా మీ చిన్నారి డైపర్‌ని మార్చిన తర్వాత కొబ్బరి నూనెను రాయడం మంచిదని చెప్తారు. కొబ్బరి నూనెలో కొవ్వులు ఉంటాయి. ఇవి ఎమోలియెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు డైపర్ రాష్‌కు సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. పదేపదే డైపర్ రాష్‌ రాకుండా చూస్తాయి. మీ చిన్నారి గజ్జలలో కూడా కొబ్బరి నూనెను మసాజ్ చేసేలా చూసుకోండి.

4. పెదవులు పగలటం:

మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత కారణంగా చిన్నారి పెదవులపై సున్నితమైన చర్మం పొడిబారడానికి చాలా అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో పగిలిన పెదవులలో చివరికి నొప్పిగా లేదా దురదగా ఉండవచ్చు. పగిలిన పెదవులు ఇబ్బందికరమైన సమస్యగా మారవచ్చు కాబట్టి మీ చిన్నారికి తల్లిపాలు పట్టడం కూడా కష్టమవుతుంది. గానుగలో తయారైన కొబ్బరి నూనెను మీ చిన్నారి పెదవులకు అప్లై చేయడం వల్ల మరింత పొడిబారకుండా నిరోధించవచ్చు. మీ చిన్నారి పెదవులకు నూనె రాసేటప్పుడు మీరు చాలా సున్నితంగా రాయటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా ఒత్తిడి కలిగించడం వల్ల అసౌకర్యం, నొప్పి కలుగుతాయి.

5. క్యాండిడా:

ఇది ప్రధానంగా నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. మీ చిన్నారి నోటి లోపల తెల్లగా ఉండే పాచెస్ ఉన్నాయేమో చూడండి. కడిగినా కూడా ఈ ప్యాచ్‌లు పోకపోతుంటే.. మీ చిన్నారి నోటిలో కాండిడా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. మీరు ఈ రకమైన ఇన్ఫెక్షన్ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించే ముందు మీరు పీడియాట్రిషియన్‌తో మాట్లాడటం మంచిది.

6. బిరుసు జుట్టు:

దిండుపైన లేదా మంచంపైన తరచుగా పడుకోబెట్టడం వల్ల మీ చిన్నారి జుట్టు నిరంతరం రాపిడికి గురవుతుంది కాబట్టి, అది గజిబిజిగా అయిపోవచ్చు. అంతే కాకుండా, మీ చిన్నారి జుట్టు నుండి అధిక తేమ కోల్పోవడం కూడా చిరిగిన జుట్టుకు కారణం కావచ్చు. గానుగలో తయారైన కొబ్బరి నూనెను మీ చిన్నారి జుట్టుకు అప్లై చేయడం వల్ల కండిషనింగ్‌లో సహాయపడుతుంది అలాగే మూలాలు బలంగా ఉంటాయి. అందువల్ల, జుట్టు కోసం కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ చిన్నారి జుట్టు యొక్క కుదుళ్ళలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. చివరికి చాలా అవసరమైన పోషణను అందిస్తుంది.

7. బాడీ లోషన్:

కొబ్బరినూనెలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు పెద్దలకు, పిల్లలకు అద్భుతమైన బాడీ లోషన్‌గా చేస్తాయి. మీరు కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని మీ చిన్నారి చర్మంపై లోషన్‌లా రాసుకోవచ్చు. పొడి, దురద ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా రాయండి. మీరు మళ్ళీ స్నానం చేయించే వరకు మీ చిన్నారి శరీరంపై అది అలానే వదిలివేయవచ్చు.

8. బర్న్స్, గడ్డలు కోసం లేపనం:

కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను అవసరమైనప్పుడు అప్లై చేయడం వల్ల గాయాలు వేగంగా మానుతాయి. మీ చిన్నారికి కీటకాల కాట్లు, కోతలు లేదా కాలిన గాయాలు ఉంటే, వాటిపై కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా, గానుగలో తయారైన కొబ్బరి నూనెను లేపనంలా ఉపయోగించే ముందు పిల్లల డాక్టర్‌తో మాట్లాడటం మంచిదని మా సలహా.

ముగింపు

గానుగలో తయారైన కొబ్బరి నూనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీకు, మీ బిడ్డకు ఆరోగ్యకరమైన చర్మాన్ని, జుట్టును అందించగలదు. కొన్ని రకాల చర్మాలకు గానుగలో తయారైన కొబ్బరి నూనె అనుకూలంగా ఉండకపోవచ్చు. అందువల్ల, మీ శరీరంపై ఏదైనా కొబ్బరి నూనె ఉత్పత్తులను ఉపయోగించడం మొదలుపెట్టే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించడం మీకు చాలా అవసరం. మీ చిన్నారి చర్మం ఆకర్షణీయంగా ఉంచడానికి, మీరు గానుగలో తయారైన కొబ్బరి నూనెను, ప్రత్యేకించి పసిపిల్లల చర్మానికి సరిపోయే నూనెను తీసుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు దానిని ఎంచుకునే ముందు మీరు పిల్లల డాక్టర్‌ని కూడా సంప్రదించవచ్చు.

Coconut Oil - 200 ml

Coconut Oil - 200 ml

Reduces Dandruff | Strengthens Hair | Soothes Baby's Rashes

46684 Moms bought
₹289₹34917% Off
Rating
4.8
(742)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.