This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణలో 13 ప్రధాన అవోకాడో ప్రయోజనాలు (Top 13 Avocado Benefits for Pregnancy in Telugu)

Pregnancy Best Foods
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణలో 13 ప్రధాన అవోకాడో ప్రయోజనాలు (Top 13 Avocado Benefits for Pregnancy in Telugu)
Read time6 min

గర్భధారణలో అవోకాడో ప్రయోజనాలు (Benefits of Avacado During Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో అవకాడో వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. గర్భధారణ సమయంలో రోజువారీ ఆహారంలో అవకాడోలను ఎందుకు చేర్చుకోవాలో తెలిపే కొన్ని కారణాల జాబితా ఇక్కడ ఉంది.

1. అవకాడోలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి (High in fiber)

పూర్తిగా పండిన అవోకాడో తాకినపుడు మెత్తటి వెన్న లాంటి మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. దీని రుచి కాస్త వగరుగా ఉంటుంది. అనూహ్యమైన విషయమేమిటంటే అవోకాడోలో కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇవి ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పుష్కలంగా నిండుకొని ఉంటాయి. ఇవి నీటిలో కరగని పీచు పదార్థాలను ఎక్కువ మొత్తంలో అందించే అద్భుతమైన వనరు. ఆరోగ్యవంతమైన ప్రేగుల కొరకు అవకాడోలను సరిపడేంత నీటితో తీసుకోవాలి. కరగని పీచు నీటిలో కరిగకుండా.. నీటితో పాటు మిళితమై జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడుతుంటారు కాబట్టి, గర్భధారణ సమయంలో అవకాడో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను విస్మరించలేము.

2. అవకాడోలతో మన పోషక అవసరాలను తీర్చుకోవచ్చు (Nutrient rich)

అవకాడోలు ఫోలేట్, మెగ్నీషియం మరియు విటమిన్ సి అందించే అద్భుత వనరు. కడుపులో ఎదుగుతున్న శిశువు పోషణకు, ఫోలేట్ అవసరం గణనీయంగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల అవోకాడో తల్లీబిడ్డల ఫోలేట్ అవసరాలకు సరిపోతుంది. అవోకాడోలు చాలా డైట్ ప్లాన్‌ల ఆహార అవసరాలకు కూడా బాగా నప్పుతాయి. ఒక అవకాడోలో మొత్తంగా 240 కేలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్లు, 22 గ్రాముల కొవ్వు ఇంకా 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అవకాడోలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది చక్కని బరువు నిర్వహణకు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది.

3. అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది ( Avacado provides healthy fats)

మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ (అసంతృప్త కొవ్వులు) లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు తల్లికి ఇంకా కడుపులో బిడ్డకి ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక పూర్తి అవకాడోలో దాదాపు 15 గ్రాముల మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, 4 గ్రాముల పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఇంకా 3 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులను పొందేందుకు మంచి ఎంపికగా అవుతుంది. గర్భస్థ శిశువుకు వెచ్చదనం ఇంకా శరీర సరైన నిర్మాణానికి ఈ కొవ్వులు అవసరం.

4. అవకాడోలు ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలు నిలుపుకొనేలా మద్దతు ఇస్తాయి (Supports Healthy Blood Pressure)

ముఖ్యంగా 3వ త్రైమాసికం చివరిలో అధిక రక్తపోటు వల్ల తల్లి ఇంకా గర్భస్థ శిశువుల ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అవకాడోలో ఒలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో రక్తపోటును అదుపులో ఉంచుకునేలా దోహదపడే ప్రయోజనాకారిగా అవకాడో ఉపయోగపడుతుంది.

5. అవకాడోలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి (Rich in Powerful Antioxidants)

కణజాల ఆరోగ్యం ఎక్కువ సార్లు రక్తంలోని యాంటీఆక్సిడెంట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కణజాల క్షయాన్ని నివారిస్తాయి. కణజాల క్షయం కాకుండా చూడటమే కాకుండా కొత్త కణాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తాయి. అవకాడోలో లుటీన్ ఉంటుంది. ఇది జీవక్రియకు ఇంకా మెదడు ఆరోగ్యానికి ఉపకరించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. లుటిన్‌తో పాటు, జియాక్సంతిన్, బీటా కెరోటిన్ ఇంకా విటమిన్ సి ఉన్నాయి.

6. అవకాడోలను ఒక సంపూర్ణ ఆహారం అనవచ్చు ( Avocados are a Filling Food)

అవకాడోలు మంచి కొవ్వులందించే గొప్ప వనరు కాబట్టి, ఈ కొవ్వులు, ఏవైనా తినాలనే కోరికలను నియంత్రించడంతో పాటు దానిని సంతృప్తి పరచడంలో సహాయపడతాయి. అవకాడోలు తిన్నప్పుడు పొట్ట నిండిన అనుభూతి కలగడం వల్ల చిరుతిళ్ళకు బదులుగా వీటిని ఎంచుకోవచ్చు.

7. ఇవి జీర్ణక్రియకి దోహదపడతాయి (They help in Digestion)

జీర్ణక్రియలో సహాయపడటమనేది గర్భధారణ సమయంలో అవకాడోస్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. అవి సహజమైన ఫైబర్‌లతో నిండి ఉండటం వల్ల, ప్రేగు కదలికలు మెరుగుపరచడమే కాక జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.

8. అవకాడోలతో మార్నింగ్ సిక్‌నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు (Relieves Morning Sickness)

గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్ మరియు వికారం అసహనాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు ఇది మొదటి త్రైమాసికం కంటే ఎక్కువ కాలం పాటు ఉంటుంది. అవకాడోలు వికారాన్ని నియంత్రిస్తాయి. వాటిలోని పోషకాలు కాబోయే తల్లులను శక్తివంతంగా ఇంకా హైడ్రేట్‌గా ఉంచుతాయి. అవోకాడోతో తీసుకోవడంతో రోజును ప్రారంభించాలి ఇంకా వికారం లక్షణాలను నివారించేంద్కు వాటిని చిన్న భాగాలుగా తీసుకోవాలి.

9. ఇవి రక్తహీనతను నయం చేయగలవు (Capable of Treating Anemia)

మాతృత్వం పొందబోయే తల్లికి ఐరన్ అనేది అత్యంత అవసరమైన సూక్ష్మపోషకం. పెరుగుతున్న శిశువుకి ఇంకా తల్లికి సరిపడినంత ఐరన్ కావాల్సి ఉంటుంది. అవకాడోలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లీబిడ్డల రోజువారీ ఐరన్ అవసరాలకు సరిపోతుంది. అవకాడో ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఐరన్ అందించే సహజ వనరు.

10. కాళ్ళ తిమ్మిర్లు, ఈడ్పులను అవకాడోలు తగ్గిస్తాయి (Eases Leg Cramps)

గర్భధారణ సమయంలో కాళ్లలో తిమ్మిరి లాంటి ఈడ్పులు చాలా సాధారణం. పొటాషియం ఇంకా కాల్షియం స్థాయిలు తక్కువ అవడం వల్ల ఇలా జరుగుతుంది. అవకాడోలు కాళ్లలో ఇలాంటి ఈడ్పులు తిమ్మిర్లను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది అంతేకాక ఆ సమయంలో ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం

11. అవకాడో గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలను మెరుగుపరుస్తుంది (Boosts Fetal Brain Development)

అవకాడోలో ఐరన్ ఇంకా కోలిన్ ఉండటం వల్ల, అవకాడో ప్రయోజనాలు గర్భధారణను మెరుగుపరుస్తుంది. గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

12. గర్భధారణలో వచ్చే మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది (Reduces Risk of Gestational Diabetis)

అవకాడోలో పీచు పదార్థాలు అధికం కావున ఇది చక్కెరల జీవక్రియలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరలను నియంత్రించడమే కాక గర్భధారణలో వచ్చే అవకాశమున్న మధుమేహం ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది

13. గర్భధారణలో తీసుకొనే ఆహారంలో అవకాడోను చేర్చుకొనే సులభమైన పద్ధతులు (Simple Methods to Include Avacados)

గర్భధారణలో అవకాడో వల్ల కలిగే ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మనం దానిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనేది ముఖ్యమైన అంశం. అవోకాడోలను సలాడ్‌లలో, టోస్ట్‌లో లేదా చిరుతిండిగా ఉప్పు ఇంకా మిరియాల పొడితో తీసుకోవచ్చు. ఆహారంతో పాటు వీటిని క్రమం తప్పకుండా ఒక సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో అవకాడో అద్భుత ప్రయోజనాలను అందుకొని ఆనందించవచ్చు.

Tags:

Avocado during pregnancy in telugu, Avocado benefits during pregnancy in telugu, Avocado side effects during pregnancy in telugu, Can pregnants eat Avocado during pregnancy in telugu, Avocado in pregnancy diet in telugu.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.