
సారాంశం




తల్లి కావాలని ఆశించే వ్యక్తిగా, గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహారాలు తింటే ఉత్తమ పోషకాలు అందుతాయోనని అనుకుంటున్నారా? గర్భం అనేది స్త్రీ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని కలిగించే కాలం. అటువంటి సమయంలో తాను తినే తిండి విషయంలో ఎటువంటి రిస్క్ కూడా తీసుకోకూడదు. కావున కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఏమి జరుగుతుందనే విషయంలో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు, నిజానిజాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మెంతులు లేదా మేతిని తమ గర్భధారణ సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది గర్భధారణ ప్రయాణంలో కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. కావున దీనిని నివారించాలని ప్రాచీనకాలం నుంచి సూచిస్తూ వస్తున్నారు. ప్రకృతి వైద్యులు మరియు వైద్యులు మెంతుల గురించి మాట్లాడుతూ.. ఇది బలమైన మూలిక. ఇది స్త్రీ శరీరంలో సంకోచాలను ప్రేరేపిస్తుంది. ఇది ముందస్తు డెలివరీకి లేదా గర్భస్రావానికి కూడా దారి తీయొచ్చు. కావున మెంతులను గర్భధారణ సమయంలో తీసుకోకుండా ఉండాలని మేము సూచిస్తాం. ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే మెంతి ఆకులు, లేదా మెంతి పరాటాను కూడా ఈ సమయంలో తినడం మంచిది కాదు.
గర్భధారణ సమయంలో మెంతులను మీరు తీసుకుంటే ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉంది. మీరు గర్భధారణ సమయంలో మేతి పరాట లేదా మేతి ఆకులను తినొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? అవి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీ పీరియడ్‌ను ప్రేరేపించేందుకు మెంతులు లేదా మేతి పరాట తినమని మీ ఇంట్లోని పెద్దలు చెప్పడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మెంతి గింజల నుంచి వచ్చే జ్యూస్ తాగడం వల్ల లేదా మెంతి టీని తాగడం వల్ల కూడా కొందరిలో పీరియడ్స్ ప్రేరేపించబడతాయి. కానీ గర్భధారణ సమయానికి వచ్చే సరికి మెంతులు తీసుకోవడం అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం మానేస్తారు. ఎందుకంటే గర్భవతులు మెంతులను తీసుకోవడం వలన తీవ్రమైన పురిటి నొప్పులు అప్పుడప్పుడూ గర్భస్రావాలు కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. మెంతులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన నెలలు నిండకుండానే ప్రసవం, లేదా గర్భస్రావాలు తలెత్తాయని చాలా మంది మహిళలు పేర్కొంటున్నారు. మెంతులను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిండంలో పుట్టుకతో వచ్చే లోపాలు, నవజాత శిశువుల లోపాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు కూడా సంభవిస్తాయి. మెంతులను తీసుకోవడం వలన పునరుత్పత్తి విషపూరితం అవడం, పిండంలో కూడా సమస్యలు వస్తాయి. గర్భధారణ సమయంలో మెంతులు లేదా మేతిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం తగ్గించాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి?
కేవలం తక్కువ మోతాదులో మెంతిని తీసుకున్నపుడు మాత్రమే గర్భధారణ సమయంలో ఇది సురక్షితం. గర్భధారణ సమయంలో మెంతిని తినడం వలన గర్భవతులకు దుష్ర్పభావాలు కలగవచ్చు. తరచుగా వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. గర్భధారణ సమయంలో మెంతులు లేదా మెంతికూరను ఎక్కువగా తీసుకోవడం వలన పుట్టే బిడ్డ వైకల్యంతో జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెంతులను ఉపయోగించడం వల్ల తల్లి కావాలని ఆశిస్తున్న స్త్రీలో సంకోచాలు కూడా వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో ఎక్కువగా మెంతిగింజలను తినడం వలన పుట్టబోయే శిశువులో ఒక రకమైన శరీర దుర్వాసన వస్తుందని చాలా మంది చెబుతారు.
మెంతి గింజలను తీసుకోవడం వల్ల తలెత్తే పురిటి నొప్పులు దుష్ప్రభావంగా ఉంటాయి. కానీ కొంత మంది స్త్రీలలో ఎవరికైతే లేబర్‌ను ప్రేరేపించాల్సి వస్తుందో అటువంటి వారికి మెంతి గింజలు తినడం వలన ప్రయోజనం కలుగుతుంది. చాలా ఏళ్లుగా మెంతులు గర్భవతిగా ఉన్న మహిళలకు సంకోచాల ద్వారా లేబర్‌ను ప్రేరేపించడం మాత్రమే కాకుండా లేబర్ నొప్పిని తగ్గించేందుకు మరియు ఉపశమనానికి కూడా ఉపయోగించబడుతున్నాయి. గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం వలన స్త్రీలకు లేబర్ ప్రాసెస్ చాలా తేలికగా పూర్తవుతుంది.
మీరు గర్భవతిగా ఉన్నపుడు మెంతిని వినియోగించకుండా ఉండమని వైద్యులు మరియు ప్రకృతి వైద్యులు సూచిస్తారు. గర్భధారణ సమయంలో మెంతి గింజలను లేబర్‌ను ప్రేరేపించేందుకు, అవి పురిటి నొప్పులకు కారణం అవుతాయి. అది మాత్రమే కాకుండా మెంతులు తీసుకోవడం వల్ల గర్భస్రావం, అకాల ప్రసవం జరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గర్భధారణ సమయంలో మెంతికి దూరంగా ఉండాలని స్త్రీలు సలహా ఇస్తారు. ఏదేమైనా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాత చాలా అరుదుగా కొద్ది మొత్తంలో మాత్రమే మెంతులు తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భధారణలో ఉన్నపుడు సాధారణంగా 37వ వారం తర్వాత మాత్రమే మెంతులను తీసుకుంటారు. ఎందుకంటే మెంతి గింజలు లేబర్‌ను ప్రేరేపించి పురిటి నొప్పులకు కారణం అవుతాయి. ఈ కారణం చేత మహిళలు తమ గర్భధారణ ప్రారంభదశలో వీటిని తీసుకోవద్దని సలహా ఇస్తారు. మెంతి గింజలు పాలిచ్చే తల్లులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తిని పెంచుతాయని అందరూ విశ్వసిస్తారు. కావున శిశువు జన్మించిన తర్వాత తమ పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు మహిళలు మెంతి ఆకులు, మెంతి గింజలు, మెంతి పరాటాను తీసుకుంటూ ఉంటారు.
సాధారణంగా గర్భధారణ సమయంలో మెంతి ఆకులు, గింజలు లేదా మెంతి టీని కూడా తీసుకోవద్దని సూచిస్తారు. ఎందుకంటే తల్లి కావాలని ఆశించే స్త్రీలలో ఇది లేబర్‌ను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. మెంతులు బలమైన మూలికా లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి స్త్రీలలో గర్భస్రావాలు, నొప్పులు(సంకోచాలు), అకాల ప్రసవానికి దారి తీస్తాయి. గర్భధారణ సమయంలో మెంతి టీ మాత్రమే కాకుండా మెంతి పరాట కూడా తీసుకోకుండా ఉండడం మంచిది.
మీ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో సురక్షితమైన పోషణ మరియు మీ బిడ్డ ఆరోగ్యకరమైన అభివృద్ధికి తోడ్పడే ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each




Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress




MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Organic Aloe Vera (300 ml)
Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience







This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |