This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో పీచ్ (మకరంద పండ్లు) తినడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలు (Peach In Pregnancy Benefits & Effects in Telugu)

Pregnancy Best Foods
Written by - Sri Lakshmiచివరిగా నవీకరించబడింది: Jan 11, 2026
గర్భధారణ సమయంలో పీచ్ (మకరంద పండ్లు) తినడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలు (Peach In Pregnancy Benefits & Effects in Telugu)
Read time7 min

ప్రెగ్నెన్సీ అనేది చాలా రకాల కష్టాలతో కూడుకున్న ప్రయాణం. గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఎంచుకోవడం చాలా కష్టతరమైన పనుల్లో ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో ఆశిస్తున్న తల్లి తన డైట్​లో విటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె కేవలం తన కోసం మాత్రమే కాకుండా తనలో పెరుగుతున్న పిండం కోసం కూడా తినాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తినడం మంచిదేనా? అని మనలో ప్రశ్న తలెత్తుతుంది.

పీచెస్ (మకరంద పండ్లు) అనేవి ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్ తో కూడిన పవర్ హౌజ్. వీటిలో ఎక్కువగా కేలరీలు మరియు కొవ్వులు ఉండవు. గర్భిణీ స్త్రీ తన ఆహారంలో వీటిని తీసుకోవడం అద్భుతమైన ఎంపిక. గర్భధారణలో పీచెస్ (మకరంద పండ్లు) తినడం వల్ల మీకు మరియు మీలో పెరుగుతున్న బిడ్డకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని ప్రతీతి. ఒక స్త్రీ తన గర్భధారణ ప్రయాణంలో ఆహారంలో పీచెస్​(మకరంద పండ్లు) చేర్చుకోవాలని సిఫారసు చేయబడింది. ప్రెగ్నెన్సీ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తినవచ్చా అని మీరు ఆలోచిస్తుంటే అవును అనే సమాధానమే వస్తుంది. అయితే పీచెస్​ (మకరంద పండ్లు) ను మితంగా (తక్కువ మోతాదులో) తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో పీచెస్ తినడం వల్ల కలిగే లాభాలు వాటి ప్రయోజనాలు, ప్రభావాల గురించి మొత్తం తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు తమ ప్రెగ్నెన్సీ డైట్​కు పీచెస్ (మకరంద పండ్లు) ఎలా చేర్చుకోవచ్చో కూడా మేము వివరిస్తాం.

గర్భధారణ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తినడం సురక్షితమేనా? (Is it Safe to Eat Peach During Pregnancy in Telugu?)

సాధారణంగా చెప్పాలంటే.. గర్భధారణ సమయంలో పీచెస్(మకరంద పండ్లు) తినడం చాలా సురక్షితం. పీచెస్​ (మకరంద పండ్లు) ప్రొటీన్స్, షుగర్, జింక్ మరియు పెక్టిన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఎవరు ఆహారంలో తీసుకున్నా ఆరోగ్యంగా పరిగణించబడతాయి. పీచెస్ (మకరంద పండ్లు)లో విటమిన్ C కూడా ఉంటుంది. ఇది ఐరన్​ను శోషించుకోవడంతో పాటు పిండం అభివృద్ధి, ఎముకలు మరియు దంతాలు, మృదులాస్థి, కండరాలు మరియు రక్తనాళాల అభివృద్ధికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. పీచెస్ (మకరంద పండ్లు) తీసుకోవడం వల్ల పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలు డెవలప్ కాకుండా ఉంటాయి.

పీచ్​ (మకరంద పండు)లో ఉండే పోషకాల విలువ (Peach Nutritional Value in Telugu)

పోషక విలువల పరంగా చూసుకుంటే పీచెస్ (మకరంద పండ్లు) లో కేలరీలు తక్కువగా ఉంటాయి. చెక్కెర, ఫైబర్, ప్రొటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ A మరియు విటమిన్ C లను గణనీయమైన మోతాదులో కలిగి ఉంటాయి. మరియు తక్కువ సంఖ్యలో కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుని కలిగి ఉంటాయి.

గర్బధారణ సమయంలో పీచ్ (మకరంద పండు) తినడం వలన కలిగే ప్రయోజనాలు (Benefits of Eating Peaches During Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  • ఐరన్​ను శోషించి.. ఎనిమియా (రక్తహీనత) రాకుండా అడ్డుకుంటాయి (Absorption of Iron and Prevention of Anemia):చాలా మంది గర్భిణీ స్త్రీలు తమ గర్భధారణ సమయంలో ఐరన్ లోపానికి గురవుతారు. ఇది రక్తహీనత, అలసట, బలహీనత మొదలయిన వాటికి దారి తీస్తుంది. పీచెస్ (మకరంద పండ్లు)లో విటమిన్ C అధిక మోతాదులో ఉంటుంది. శరీరం ఐరన్​ను శోషించుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచెస్ (మకరంద పండ్లు)లో లభించే విటమిన్ C పిండం యొక్క ఎముకలు, పళ్లు, కండరాలు, మృదులాస్థి మొదలయినవి డెవలప్ అయ్యేందుకు సహాయపడుతుంది.
  • శరీరంలో ద్రవాలు ఉండేలా చూసుకోవడం (Maintaining Bodily Fluids):గర్భధారణ సమయంలో ఆశించే తల్లి తీసుకునే డైట్ ఆమెకు శరీరంలో తగిన మోతాదులో ద్రవాలు ఉండేలా చూసుకోవాలి. అలా సహాయపడే డైట్​నే ఆమె తీసుకోవాలి. పీచెస్ (మకరంద పండ్లు)లో ఉండే పొటాషియం ఇలా చేయడంలో మీకు సహాయం చేస్తుంది. పీచెస్ (మకరంద పండ్లు) నుంచి వచ్చే పొటాషియం వాపులు, తిమ్మిర్లు, ఉబ్బరాన్ని కూడాతగ్గించడంలో సహాయపడుతుంది. పీచెస్ (మకరంద పండ్లు) గర్భిణీ స్త్రీ మూడ్ స్వింగ్స్​ను ఎదుర్కోవడంలో కూడా సహాయపడతాయి. ఆందోళన మరియు నిరాశను ఇవి దూరం చేస్తాయి.
  • జీర్ణక్రియకు సహాయం చేస్తాయి (Aids Digestion ):పీచెస్(మకరంద పండ్లు) లో తగు మొత్తంలో డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీ పేగు కదలికలను నిర్వహించడంలో ముందు వరుసలో ఉంటాయి. పీచెస్ (మకరంద పండ్లు) తీసుకోవడం జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. మరియు మలబద్దకం, ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
  • ప్రీ మెచ్యూర్ (గడువు తేదీ కంటే ముందుగా) నొప్పులను నివారిస్తుంది (Prevents Risk of Premature Contractions):పీచెస్ (మకరంద పండ్లు) మెగ్నీషియం యొక్క గొప్ప మూలం. గర్భిణీ స్త్రీలు మెగ్నీషియం తీసుకోవడం చాలా ముఖ్యం. మహిళ గర్భాశయం అకాల సంకోచాలకు లోనయ్యేందుకు మెగ్నీషియం అనుమతించదు. ఇది మలబద్దకం మరియు తిమ్మిరిని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది.

పైన పేర్కొన్నవే కాకుండా పీచెస్ (మకరంద పండ్లు) ఫోలిక్ యాసిడ్​కు మంచి సోర్స్. వీటిలో బీటా కెరోటిన్ మరియు ఫాస్పరస్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. గర్భవతులు తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా పీచెస్ (మకరంద పండ్లు) సహాయం చేస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం

గర్భిణీ స్త్రీ ఎంత మొత్తంలో పీచ్ పండుని తినాలి? (What amount of Peach should Pregnant Womens Take?)

ఒక మహిళ గర్భవతిగా ఉన్నపుడు తన వీక్లీ డైట్​లో పీచెస్ (మకరంద పండ్లు) చేర్చేకునేందుకు ప్రయత్నించాలి. గర్భిణీ స్త్రీ ప్రతి రోజు 500 గ్రాముల కంటే లేదా రోజుకు రెండు పీచెస్ (మకరంద పండ్లు) కంటే ఎక్కువగా తినకూడదు.

గర్భధారణ సమయంలో పీచ్ ఫ్రూట్ తినడం వలన కలిగే ఫలితాలు (Effect of Eating Peach During Pregnancy in Telugu?)

పీచెస్(మకరంద పండ్లు) తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటి వినియోగం వల్ల కొన్ని రకాల దుష్ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. పీచెస్ (మకరంద పండ్లు)లో షుగర్ ఉంటుంది. కావున షుగర్ ప్రాబ్లంతో బాధపడే వారు పీచెస్​ను తీసుకోవడం తక్కువ చేయాలి. పీచెస్ (మకరంద పండ్లు) రక్తస్రావానికి దారి తీయొచ్చు. అందుకోసమే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతే కాకుండా శరీర అంతర్గత ఉష్ణోగ్రతను కూడా పీచెస్ (మకరంద పండ్లు) పెంచుతాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?

ఉత్తమ పీచ్ ఫ్రూట్స్​ను ఎలా ఎంచుకోవాలి (How to Choose Best Peach Fruit in Telugu?)

ఉత్తమమైన పీచెస్ (మకరంద పండ్లు) ఎలా ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా? మీరు పీచ్​ను (మకరంద పండు) ఎంచుకునేటపుడు అది మీ చేతిలో దృఢంగా ఉన్న ఫీల్ మీకు రావాలి. అదే సమయంలో అది మృదువుగా ఉండాలి. ఆకుపచ్చ రంగులో ఉండే పీచెస్, లేదా ఎక్కువ గాయాలు ఉన్న పండ్లు లేదా మచ్చలు ఉన్న పండ్లను ఎంచుకోవడం మానేయాలి.

మీ గర్భధారణ డైట్​లో పీచ్ ఫ్రూట్​ని ఎలా చేర్చుకోవాలి? (How to Include Peach Fruit During Pregnancy?)

పిచెస్​ను అనేక విధాలుగా గర్భధారణ ఆహారంలో చేర్చవచ్చు. వాటిని జ్యూస్​గా లేక మిల్క్​షేక్​లుగా తయారు చేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్​లో భాగంగా వేరే ఇతర రకాల పండ్లతో కలపవచ్చు. అంతే కాకుండా తృణధాన్యాలతో అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. తినడానికి ముందు పీచ్ ఫ్రూట్​ను బాగా కడగాలని నిర్దారించుకోండి.

Tags:

Peach fruit during pregnancy in telugu, peach fruit juice during pregnancy, can pregnants eat peach fruit in telugu, benefits of peach fruit during pregnancy in telugu, how to add peach fruit to your diet in telugu

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.