This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్‌-150 తీసుకోవడం సురక్షితమేనా? (Is It Safe To Take Ecosprin 150 In Pregnancy in Telugu?)

Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్‌-150 తీసుకోవడం సురక్షితమేనా? (Is It Safe To Take Ecosprin 150 In Pregnancy in Telugu?)
Likes2 Likes|
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ఎకోస్ప్రిన్ 150 అనేది రక్తాన్ని పలుచబరిచే యాంటీ ప్లేట్‌లెట్ ఔషధం, ఇది గుండెపోటు, స్ట్రోక్‌లు, ఛాతీ నొప్పి నివారణకు ఇంకా రక్తం గడ్డకట్టడాన్ని ఆపేందుకు ఉపయోగించబడుతుంది.
  • తక్కువ మోతాదు ఎకోస్ప్రిన్ గతంలో గర్భస్రావాలు, ప్రీఎక్లాంప్సియా లేదా రక్తం గడ్డకట్టే రుగ్మతలున్న గర్భిణీలకు ప్లాసెంటాకు రక్త ప్రవాహం మెరుగుపరిచేందుకు సూచించవచ్చు.
  • మూడవ త్రైమాసికంలో అధిక మోతాదు ఎకోస్ప్రిన్ నెలలు నిండని పుట్టుక, తక్కువ బరువు, ఉమ్మ నీరు తగ్గడం, శిశువు కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది.
  • గర్భధారణ ఆరోగ్యానికి సహాయపడే ఉత్పత్తులు ఏమిటి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

ఎకోస్ప్రిన్ 150 టాబ్లెట్ అనేది గుండెపోటు, స్ట్రోక్‌లు మరియు ఛాతీ నొప్పిని ఎదుర్కొనేందుకు ఇంకా నిలువరించడానికి వాడే యాంటీ ప్లేట్‌లెట్ మందు. ఇది మీ రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి ఉపయోగించబడుతుంది. ఇంకా ఇది గుండె రక్షణ కోసం సాధారణంగా ఉపయోగించే ఒక ఔషధం. ఇది నొప్పికి చికిత్స చేయడానికి ఇంకా జ్వరం లేదా ఇంకోరకంగా నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. నొప్పి, జ్వరం, వాపు లేదా రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే శరీరంలో ఉత్పత్తి అయ్యే సమ్మేళనాలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది.

ఈ ఉత్పత్తి పరిచయం (Product Introduction)

ఎకోస్ప్రిన్ 150 (Ecosprin 150) మాత్రలను ఆహారంతో పాటు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. లేకపోతే, అవి కడుపు నొప్పికి కారణం అవవచ్చు. సిఫార్సు చేయబడిన మోతాదుని మీరు ఎందుకోసం తీసుకుంటున్నారో ఇంకా అది ఆ లక్షణాల నివారణకు ఎంతవరకు సహాయపడుతుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వైద్యుని సలహా ప్రకారం దీనిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. ఈ మందు చూపే అత్యంత సాధారణ దుష్ప్రభావాలు గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం ఇంకా వాంతులు. ఈ దుష్ప్రభావాలు తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ విషయంగా ఆందోళన పడుతుంటే వాటిని తగ్గించే లేదా నివారించే మార్గాల గురించి వైద్యుడిని సంప్రదించాలి. ఈ ఔషధం కొన్నిసార్లు మీకు సులభంగా రక్తస్రావం అయ్యేలా చేయవచ్చు.

రక్తం సరిగ్గా గడ్డకట్టనప్పుడు లేదా కడుపు లేదా ప్రేగులలో పుండు లేదా రక్తస్రావం ఉన్నట్లయితే, దానిని తీసుకునే ముందు, వైద్యుడిని సంప్రదించాలి. అలాగే.. కాలేయం లేదా మూత్రపిండాలతో సమస్యలుంటే, అధిక రక్తపోటు లేదా ఉబ్బసం ఉన్నట్లయితే వైద్యుడికి తెలియజేయాలి. దీనితో పాటు ఏవైనా ఇతర ఔషధాలను తీసుకుంటూవుంటే, వైద్యుడికి తెలియజేయాలి, ఎందుకంటే వాటిపై ఈ ఔషధం ప్రభావం చూపవచ్చు లేదా అవి ప్రభావితం కావచ్చు. బాలింతలు ఇంకా గర్భిణీ స్త్రీలు చికిత్సకు ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇది సాధారణంగా గర్భధారణ చివరి త్రైమాసికంలో ఇంకా తల్లి పాలుపట్టే సమాయలలో సిఫార్సు చేయబడదు. ఈ ఔషధాన్ని తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించకూడదు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ గర్భధారణ సమయంలో ఎకోస్రిన్ 75 ను ఎప్పుడు తీసుకోవాలి?

ఎకోస్ప్రిన్ మాత్రల ఉపయోగాలు (Uses Of Ecosprin Tablet in Telugu)

  • గుండె సంబంధిత ఛాతీ నొప్పి (ఆంజినా) నివారణకు
  • గుండెపోటు చికిత్స ఇంకా నివారణకు
  • స్ట్రోక్ చికిత్స మరియు నివారణకు
  • జ్వరం ఇంకా నొప్పి వాపు చికిత్సకు

ఎకోస్ప్రిన్ మాత్రల ప్రయోజనాలు (Benefits Of Ecosprin Tablet in Telugu)

  1. ఆంజినా నివారణ: ఎకోస్ప్రిన్ 150 టాబ్లెట్ రక్తాన్ని పలుచబరుస్తుంది ఇంకా దీనిని రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడానికి తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇది ప్లేట్‌లెట్స్ ఒకదానికొకటి అంటుకోకుండా నిరోధిస్తుంది. తద్వారా ప్రమాదకరమైన రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ లేదా రక్తనాళాల ఇతర అడ్డంకులను నివారించడానికి సహాయపడుతుంది. నివారణ ప్రభావాన్ని కలిగి ఉండటానికి.. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది డాక్టర్లచే క్రమం తప్పకుండా సూచించబడే అవకాశం ఉంది.
  2. గుండెపోటుకు చికిత్స ఇంకా నివారణ: ఎకోస్ప్రిన్ 150 టాబ్లెట్ రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది, తద్వారా భవిష్యత్తులో గుండెపోటు లేదా స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెద్ద మోతాదులో తీసుకుంటే, ఇది గుండెపోటు లేదా రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడమే కాకుండా అది విస్తరించకుండా నిరోధించి గుండెకు రక్త సరఫరాలో అవాంతరాలు లేకుండా చేస్తుంది.

ఎకోస్ప్రిన్ దుష్ప్రభావాలు (Side Effects Of Ecosprin in Telugu)

శరీరం ఔషధానికి అలవాటు అయ్యే క్రమంలో చాలామటుకు దుష్ప్రభావాలు కాలక్రమేణా అదృశ్యమవుతాయి. దీనికి తీవ్రమైన వైద్య పర్యవేక్షన అవసరం ఉండకపోవచ్చు. లక్షణాలు అలాగే కొనసాగితే అవి ఆందోళన కలిగిస్తుంటే.. ఈ క్రింది లక్షణాలు ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి

  • గుండెల్లో మంట
  • కడుపులో లేదా ప్రేగులలో తీవ్రమైన రక్తస్రావం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • కడుపు నొప్పి
  • వాంతులు
  • చర్మంపై దద్దుర్లు

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ వాడకం (Ecosprin During Pregnancy in Telugu)

ఎకోస్ప్రిన్ రక్తాన్ని పలుచగా చేసే ఔషదం. ప్రతిరోజూ ఎకోస్ప్రిన్‌ని తక్కువ మోతాదులో తీసుకోవడం గతంలో గర్భస్రావాలు అయిన వారికి గర్భధారణ ఫలితాలను మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. ఇది ప్లాసెంటా(మాయ)కు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ఇది ప్రీఎక్లాంప్సియా (గర్భిణీలలో అధిక రక్తపోటు), యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్‌ తలెత్తకుండా సహాయపడుతుంది. ఈ రెండు పరిస్థితులు గర్భధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే.. అన్ని పరీక్షల నివేదికలతో ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోకండి.

ఈ మందు వినియోగం వల్ల మానవ పిండం ప్రమాదానికి గురికావొచ్చనే రుజువు ఉన్నందున గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితం కాదని కూడా కొన్ని అధ్యయనాలు తెలుపుతన్నాయి. ఇది రేయెస్ సిండ్రోమ్‌కు (పిల్లలు మరియు యుక్తవయస్కులలో సాధారణమైన అరుదైనది కానీ తీవ్రమైన పరిస్థితి, మెదడు మరియు కాలేయంలో వాపుకు కారణమవుతుంది) కూడా కారణమవుతుంది. గర్భదారణ చివరి త్రైమాసికంలో పిండానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున ఎకోస్ప్రిన్ 75 సిఫార్సు చేయబడదు. ఎకోస్ప్రిన్ సాధారణంగా గర్భధారణ సమయంలో ఒకవేళ ఏదేని ఆరోగ్య సంబంధ పరిస్థితులు ఉంటే తప్ప సిఫార్సు చేయబడదు. అయితే, గర్భధారణ సమయంలో తక్కువ మోతాదు ఎకోస్ప్రిన్ 60-100 మిల్లీగ్రాములు హానికరం కాదు ఇంకా పునరావృతమయ్యే గర్భస్రావాలు, రక్తం గడ్డకట్టే రుగ్మతలు మరియు ప్రీక్లాంప్సియా చరిత్ర కలిగిన గర్భిణీ స్త్రీలకు ఇది సూచించబడవచ్చు.

ఏమైతేనేమీ.. అధిక మోతాదులో ఎకోస్ప్రిన్ గర్భ దశల ఆధారంగా కొన్ని ప్రమాదాలను కలిగిస్తుంది. మొదటి త్రైమాసికంలో, అధిక మోతాదులో వాడటం వల్ల గర్భధారణ నష్టం ఇంకా పుట్టుకతో వచ్చే వైకల్యాలు కలగవచ్చనే ఆందోళన రేకెత్తిస్తుంది. మూడవ త్రైమాసికంలో దీని వల్ల మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి.. నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, మృతశిశువు పుట్టడం వంటి వాటివల్ల బిడ్డను కోల్పోవడం జరుగుతుంది. మీ అవసరాలకనుగుణంగా, డాక్టర్ ఎకోస్ప్రిన్‌ని ఉపయోగించమని సిఫారసు చేయవచ్చు లేదా సిఫారసు చేయకపోవచ్చు. ఇది పుట్టబోయే బిడ్డలలో కిడ్నీ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది శిశువును చుట్టుముట్టి ఉండే అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మ నీరు) తగ్గిపోయేలా చేస్తుంది ఇంకా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఎకోస్ప్రిన్‌ అనేది ఔషధాల NSAID తరగతికి చెందినది కాబట్టి 29 వారాల గర్భధారణ తర్వాత ఇది శిశువుకు హాని కలిగిస్తుంది కావున దీనిని తీసుకోరాదు.

ఎకోస్ప్రిన్‌ మాత్రలను ఎలా ఉపయోగించాలి (How To Use Ecosprin Tablet in Telugu)

డాక్టర్ సలహా మేరకు, సూచించిన మోతాదులోనే ఈ ఔషధం తీసుకోవాలి. మాత్రలను నమలడం, పొడి చేయడం లేదా విరగ్గొట్టడం చేయకుండా పూర్తిగా ఒకేసారిగా వేసుకోవాలి. దీనిని ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఎకోస్ప్రిన్ 150 తీసుకోనే మోతాదు ఇంకా ఎన్నిసార్లు అనేది క్రింది కారకాలపై ఆధారపడి ఉంటుంది:

  • రోగి వయస్సు
  • రోగి ఆరోగ్యం
  • రోగి కాలేయం ఇంకా మూత్రపిండాల పరిస్థితి
  • డాక్టర్ సిఫార్సు చేసిన మందులు ఇంకా ఏవైనా ఇతర సప్లిమెంట్లు తీసుకునేటప్పుడు

ఎకోస్ప్రిన్‌ 150ని వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు (Precautions While Using Ecosprin 150 in Telugu)

ఈ క్రింది వాటితో సహా ఎకోస్ప్రిన్‌ 150ని ఉపయోగించే ముందు మీ వైద్య మరియు ఆరోగ్య చరిత్ర గురించి మీ వైద్యుడికి తెలియజేయాలి:

  • నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు)ల వల్ల అలెర్జీ
  • ఏదైనా రక్తం గడ్డకట్టే రుగ్మత
  • గతంలో అజీర్ణ సంబంధ చరిత్ర ఉన్నట్లయితే
  • తీవ్రమైన గుండె, మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి
  • పోట్టలో అల్సర్ ఉండటం
  • ఎకోస్ప్రిన్ 150ని తీసుకొనే వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, చర్మంపై దురద లేదా వాపు ఉండవచ్చు.

ముగింపు (Conclusion)

ఎకోస్ప్రిన్‌ 150 టాబ్లెట్ భవిష్యత్తులో గుండెపోటు మరియు రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే స్ట్రోక్‌లను నివారించడంలో సహాయపడవచ్చు. తక్కువ మోతాదులు కనీస దుష్ప్రభావాలు కలిగివుండి గుండెపోటును నివారించడంలో దోహదపడతాయి. కడుపు నొప్పి నివారించేందుకు వీటిని ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఈ మాత్రలు తీసుకున్న తర్వాత సులభంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పదునైన వస్తువులను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చెవుల్లో ఏదైనా ధ్వనులు వినిపించినా, అసాధారణ రక్తస్రావం, వికారం లేదా వాంతులు అవడం ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Tags:

Ecosprin 150 tablets in telugu, uses of Ecosprin 150 in telugu, Ecosprin 150 during pregnancy in telugu, Ecosprin 150 tablet benefits in telugu, precautions to take Ecosprin 150 during pregnancy in telugu.

గర్భిణీ తల్లుల ఆరోగ్యానికి విశ్వసనీయ తోడు

డాక్టర్ సూచనలతో పాటు, మీ గర్భధారణ ప్రయాణాన్ని సురక్షితంగా చేసే సహాయక ఉత్పత్తులు మీ శ్రేయస్సుకు తోడుగా నిలుస్తాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.