This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో ఎండు ద్రాక్ష (ప్రూనే) తినడం వలన కలిగే ప్రయోజనాలు మరియు ప్రమాదాలు!

Pregnancy Best Foods
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో ఎండు ద్రాక్ష (ప్రూనే) తినడం వలన కలిగే ప్రయోజనాలు మరియు ప్రమాదాలు!
Likes1 Likes|
Read time6 min

ఒక గర్భవతి ప్రసవ సమయం దగ్గర పడ్డపుడు తన ఆహారపు అలవాట్లు ఆటోమేటిగ్గా ఇంప్రూవ్ అవుతాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు మీ శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం మరిన్ని విటమిన్లు, మినరల్స్, ఇతర ముఖ్య పోషకాలు అవసరం అవుతాయి. మీ బిడ్డ సరైన విధంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేందుకు మీరు సమతుల్య ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎండు ద్రాక్ష(ప్రూనే) వంటి డ్రై ఫ్రూట్స్​ను మీరు మీ డైట్​లో చేర్చుకోవాలి. ఇవి పుట్టబోయే బిడ్డకు మరియు తల్లికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. గర్భవతిగా ఉన్నపుడు ప్రూనే తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు, ప్రమాదాలను గురించి మరింత తెలుసుకునేందుకు ఈ కథనం పూర్తిగా చదవండి.

అసలు ఎండుద్రాక్ష(ప్రూనే) అంటే ఏమిటి?

ముఖ్యంగా ఎండుద్రాక్ష(ప్రూనే) అనేది డ్రైడ్ ప్లమ్ పండు నుంచి వస్తుంది. (వివిధ ప్రాంతాలలో ఈ పండును వివిధ రకాల పేర్లతో పిలుస్తారు) ఇండియాలో అల్​బుఖారా అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇవి ఒకటి. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) తినాలని నిపుణులు సిఫారసు చేస్తారు. ఎందుకంటే ఇవి తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాల్ని కలిగిస్తాయి.

ఎండుద్రాక్ష (ప్రూనే)లో ఉండే పోషకాలు

ఎండుద్రాక్ష(ప్రూనే)లో పోషకాలు అధికంగా ఉన్నందున గర్భవతిగా ఉన్నపుడు తినడం సురక్షితం. ఎండుద్రాక్ష (ప్రూనే)లో ఐరన్, పొటాషియం, విటమిన్ C, మెగ్నీషియం, న్యాచురల్ షుగర్స్, విటమిన్ A, విటమిన్ E, అంతే కాకుండా డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కడుపులో పెరుగుతున్న పిండం పెరుగుదలతో పాటుగా తల్లి ఆరోగ్యం మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇవి గర్భాశయ ధృడత్వంలో సహాయపడతాయి. ఇవి లేబర్​ను మరియు ప్రసవాన్ని సులభతరం చేస్తాయి. మీ కడుపులో ఉన్న పిండం ఆరోగ్యంతో పాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునేందుకు గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(ప్రూనే) తినడం ఉత్తమ మార్గం.

గర్భవతిగా ఉన్నపుడు ఎండు ద్రాక్ష (ప్రూనే) తినడం సురక్షితమేనా?

గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(ప్రూనే) ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి(స్నాక్). ఇవి వెంటనే ఆకలిని తగ్గించడంతో పాటుగా.. వివిధ రకాల ఫైబర్​లు మరియు విటమిన్స్​ను కలిగి ఉంటాయి. ఫలితంగా గర్భవతులు తమ కండరాలను బలవంతంగా తయారు చేసుకుంటారు. ఇది డెలివరీ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

గర్భధారణ సమయంలో ఎండు ద్రాక్ష (ప్రూనే) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష(ప్రూనే) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి.

1. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధి కోసం గర్భధారణ సమయంలో శరీరం అధికంగా ఈస్ట్రోజెన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఎండుద్రాక్ష(ప్రూనే) గర్భధారణ సమయంలో బయటి గోడల కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) రసం మలబద్ధకం చికిత్సలో ఉపయోగపడుతుంది.

2. ఎనిమియా (రక్తహీనత) ను నివారిస్తుంది

గర్భధారణ సమయంలో తల్లి శరీరానికి అదనపు ఐరన్ అనేది చాలా అవసరం. మీరు ప్రతి రోజు తినే ఆహారం తీసుకుంటే వచ్చే ఐరన్ సరిపోదు. ఐరన్ కొరతను అధిగమించేందుకు గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(ప్రూనే) వంటి పండ్లు తినడం మంచిది. ఈ పండ్లలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది.

3. రక్తపోటును తగ్గిస్తుంది

ఎండుద్రాక్ష (ప్రూనే) లో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.

4. డిప్రెషన్​తో పోరాడుతుంది

గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష(ప్రూనే)ను తీసుకోవడం వల్ల అవి ఆందోళన, డిప్రెషన్​ను మేనేజ్ చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ ఆందోళన డిప్రెషన్ మేనేజ్​మెంట్​లో సహాయపడుతుంది.

5. వికారాన్ని తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో వికారాన్ని తగ్గించేందుకు ఎండుద్రాక్ష (ప్రూనే) తీసుకోవడం నేచురల్ మెథడ్. ఇందులో ఉండే ముఖ్యమైన విటమిన్స్ మరియు మినరల్స్ మోషన్​ సిక్​నెస్​ను నివారించి మీకు మంచి అనుభూతిని అందిస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో వికారం వాంతులు

గర్భవతిగా ఉన్నపుడు ఎండు ద్రాక్ష (ప్రూనే) తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

గర్భధారణలో ఎండుద్రాక్ష(ప్రూనే)ను ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, మరియు డయేరియా వంటి సమస్యలు కూడా ఉంటాయి. పైన పేర్కొన్న సమస్యలలో మీరు ఏదేనీ సమస్యను గుర్తించినట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష (ప్రూనే) ను రోజువారీగా ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుడి సలహా తీసుకోండి. గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) తినడం మంచిది కాదు.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

1. మీరు గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష తినడం వల్ల మీ పళ్లు పాడవుతాయా?

డ్రై ఫ్రూట్స్ వల్ల దంతాలు తరచుగా మరకలుగా తయారవుతాయి. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దంతాలు డ్యామేజ్ అవుతాయి. మీ దంతాలకు ఎప్పుడూ ఏమీ అంటకుండా చూసుకోండి.

2. ఎండుద్రాక్ష (ప్రూనే) పుట్టబోయే బిడ్డకు ప్రయోజనం చేకూరుస్తుందా?

అవును.. గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష (ప్రూనే) తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఎండుద్రాక్ష(ప్రూనే)లో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఈజీగా శరీరానికి అందుతుంది. తల్లి మరియు పిల్లల కళ్లు సరైన విధంగా ఉండడం, చర్మం, మరియు రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా ఎండుద్రాక్ష (ప్రూనే) మీద ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎండుద్రాక్ష (ప్రూనే) సరైన ఆహారం. మీ గర్భంలోపల అభివృద్ధి చెందుతున్న మీ పిల్లల ఆరోగ్యానికి కూడా ఇది దోహదపడుతుంది.

3. పోస్ట్​ పాట్రమ్ డిప్రెషన్ (ప్రసవానంతర డిప్రెషన్) ను తగ్గించడంలో ఎండుద్రాక్ష మీకు సహాయం చేస్తుందా?

అవును చేస్తుంది. ఎండుద్రాక్ష(ప్రూనే)లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో ఇది కీలకంగా పని చేస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర కాలం (ప్యూర్​పెరియం) దశలు ఏమిటి?

4. మార్నింగ్ సిక్​నెస్​ను తగ్గించడంలో ఎండుద్రాక్ష (ప్రూనే) ప్రయోజనకరంగా ఉంటుందా?

తగ్గిస్తాయి. ఇవి ఒక రకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి మోషన్ సిక్​నెస్​ను తగ్గించవచ్చు.

గర్భవతిగా ఉన్నపుడు పుట్టబోయే నా బిడ్డకు ఎండుద్రాక్ష (ప్రూనే) ప్రయోజనకరంగా ఉంటుందా?

ఎండు ద్రాక్ష (ప్రూనే)లో బెటా-కెరోటిన్ మరియు విటమిన్ A ఉన్నాయి. ఇవి పెరుగుతున్న పిండం కంటి అభివృద్ధికి సహాయపడతాయి. కడుపులో ఉన్నపుడు శిశువు ఆరోగ్యకరంగా పెరిగేందుకు ఇవి చాలా ముఖ్యం. ఎవరైతే గర్భవతులు డిప్రెషన్​లో ఉంటారో లేదా ఆతృతతో ఉంటారో వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.

గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష(ప్రూనే) దంతక్షయానికి కారణం అవుతుందా?

ఎండు ద్రాక్ష (ప్రూనే) దంతాలకు అంటుకునే అవకాశం ఉంది. కావున మీ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. ఎండుద్రాక్ష (ప్రూనే) నిస్సందేహంగా గర్భవతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర ఆహారాల మాదిరిగానే ఎండుద్రాక్ష(ప్రూనే)ను కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఈ పండ్లను తీసుకునే ముందు మీ వైద్యుడితో మాట్లాడి.. ప్రతిరోజు వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి. ప్రతి గర్భం వేరుగా ఉంటుంది కావున.. మీరు గర్భవతిగా ఉన్న పూర్తి కాలం వీటిని తీసుకోవడం వలన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. సురక్షితంగా ఉండేందుకు.. అనవసరమైన ఇబ్బందులను నివారించేందుకు గర్భవతిగా ఉన్న కాలంలో వీటిని మితంగా తీసుకోవడం మంచిది.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.