
ఓ వైపు పిల్లల్ని చూసుకుంటూ, మరోవైపు కుటుంబాన్ని నడిపించడం అంటే తక్కువ సమయంలో ఎక్కువ బాధ్యతల్ని నిర్వర్తించడమే. ఇప్పటికే తల్లులుగా బాధ్యతల్ని మోస్తున్నవారికి కూడా ఇది కాస్త భారంగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూల్‌గా ఉండేందుకు ఈ టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ ఫాలో అవండి. సమయాన్ని చక్కగా నిర్వహించే తల్లిగా మీరు ఎలా ఉండొచ్చో తెలుసుకోండి
మీ మెదడులో రకరకాల పనుల గురించి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్‌గా ఉంచడం అవసరం. అందుకే ప్రతీది రాసుకోవాలి.
ఇందుకోసం మీరు నోట్‌బుక్ ఉపయోగించవచ్చు లేదా డిజిటల్ పద్దతిలో నోట్ చేసుకోవచ్చు. టూ డు లిస్ట్ ప్రిపేర్ చేసేందుకు అనేక యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్‌లో టెంప్లేట్స్ కూడా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరుగా మీ వివరాలను సార్ట్ చేసేందుకు ఈ టెంప్లేట్స్ ఉపయోగపడతాయి. ఒక పని పూర్తి కాగానే దాన్ని కొట్టేయడం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.
కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 విషయాలు
ఇతరులకు అప్పగించగలిగే పనులను తెలుసుకోగలిగితే మీకు చాలా సమయం ఆదా అవుతుంది. మీ భాగస్వామికి లేదా పనిమనిషికి ఈ పనులు అప్పగించవచ్చు:
ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కాదు అని చెప్పడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఓ విషయం గుర్తుంచుకోండి. ప్రతీసారి సరే అని చెప్పుకుంటూ పోతే, ఆ పని సరిగ్గా జరగనప్పుడు వారు అసంతృప్తికి గురవుతారు. అందుకే మీ ప్రియారిటీస్ తెలుసుకొని కాదు అని చెప్పడం నేర్చుకోండి.
కాబోయే తల్లులకు టైమ్ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఓ సవాల్. కానీ అసాధ్యమేమీ కాదు. పాజిటీవ్ మైండ్‌సెట్‌తో, చేయాల్సిందే అనే వైఖరితో ప్రారంభించాలి. ఆ రోజులో మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులను లిస్ట్‌లో టాప్‌లో పెట్టుకొని పూర్తి చేయాలి. వాటి కోసం రోజంతా సమయాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు సరైన సమయం కేటాయిస్తేనే ముఖ్యమైన పనులు పూర్తి చేయగలరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. మీరు సంతోషకరమైన తల్లి కావడానికి, అనుకున్నది సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
Time management for new moms in telugu, new mom life styel in telugu, how to manage things as new mom in telugu, new mom jobs in telugu, plan everything as new mom in telugu.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |