hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • 30 ఏళ్ళు దాటిన తర్వాత గర్భధారణ వల్ల కలిగే సమస్యలు మరియు ప్రయోజనాలు ఏమిటి? (Pregnancy After 30 Risks And Benefits in Telugu) arrow

In this Article

    30 ఏళ్ళు దాటిన తర్వాత గర్భధారణ వల్ల కలిగే సమస్యలు మరియు ప్రయోజనాలు ఏమిటి? (Pregnancy After 30 Risks And Benefits in Telugu)

    Pregnancy

    30 ఏళ్ళు దాటిన తర్వాత గర్భధారణ వల్ల కలిగే సమస్యలు మరియు ప్రయోజనాలు ఏమిటి? (Pregnancy After 30 Risks And Benefits in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    వయసు పైబడిన మహిళల్లో గర్భధారణ రేటు పెరుగుతోంది. కొందరు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు, మరికొందరు తమ రెండవ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. వయసు మీరిన తల్లులు చక్కని ఇంకా సురక్షితమైన ఆర్థిక పరిస్థితిలో ఉండవచ్చు లేదా మంచి ఉపాధిని పొంది ఉండవచ్చు. అంతేకాక, వారు తక్కువ వయసున్న యువతుల కంటే పిల్లల సంరక్షణ విషయంలో కాస్త ఎక్కువ అర్హత కలిగి ఉంటారు. అయినప్పటికీ, వయసు మీరిన మహిళలు ఇంకా వారి నవజాత శిశువులు ఏదైనా అధిక ప్రమాద అవకాశాలను కలిగి ఉంటారా? మహిళల 30 ఏళ్ల తర్వాత గర్భదారణ వల్ల సమస్యలు ఇంకా ప్రయోజనాల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం.

    30 ఏళ్ల తర్వాత గర్భధారణతో వచ్చే సమస్యలు (Risks of Pregnancy After 30 Years in Telugu)

    చాలా మంది మహిళలు జీవితంలో స్థిరపడే వరకు కుటుంబాన్ని ప్రారంభించడాన్ని వాయిదా వేస్తారు. 30 ఏళ్ల పడిలో స్త్రీలలో సంతానోత్పత్తి రేట్లు పెరుగుతున్నప్పటికీ, వయసు మీరిన తల్లులకు క్రింద చూపిన సమస్యలతో మరింత హాని కలుగుతుంది -

    • గర్భస్రావం.
    • పుట్టుకతో వచ్చే లోపాలు.
    • కవలలు.
    • పెరిగిన రక్తపోటు.
    • గర్భధారణలో వచ్చే మధుమేహం.
    • తీవ్రమైన ప్రసవ వేదన.

    కొన్ని పరిశోధనల ప్రకారం, వయసు మీరిన స్త్రీలు గర్భధారణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది, అయితే వారి నవజాత శిశువులు వారి కంటే తక్కువ వయసున్న స్త్రీలకు పుట్టిన పిల్లల కంటే ఎక్కువ ఇబ్బంది పడకపోవచ్చు. మహిళలు ప్రసవానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకొని, అధిక ప్రమాదం ఉన్న గర్భావధిని సంరక్షించే ఇంకా నవజాత శిశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే ఆసుపత్రిలో ప్రసవించినప్పుడు మంచి ఫలితం దక్కుతుంది. కింది విభాగాలలో వయస్సు చార్ట్ ద్వారా గర్భధారణ సమస్యలకు సమీక్షను అందిస్తాయి.

    క్రోమోజోమ్ సమస్యలు తలెత్తే అవకాశం (Possibility of Chromosomal Issues in Telugu)

    తల్లి వయసు ఎంత ఎక్కువైతే, క్రోమోజోమ్ సమస్యలు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. కాలక్రమేణా, పుట్టే బిడ్డ డౌన్ సిండ్రోమ్‌తో పుట్టే అవకాశం పెరుగుతుంది. అయితే, 25 సంవత్సరాల వయస్సులో గర్భవతులైన 1,250 స్త్రీలలో ఒక్కరికి ఈ ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. మహిళలు 40 సంవత్సరాల వయస్సులో గర్భం దాల్చినట్లయితే, ఈ అవకాశం దాదాపు 100 మందిలో ఒకరిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాక కలిగే ప్రమాదాలు మరింత తీవ్రమైనవి కావచ్చు. దీనికి కారణం చాలా గణాంకాలు ప్రత్యక్ష జననాలను మాత్రమే పొందుపరుస్తాయి. అవి గర్భస్రావానికి దారితీసే క్రోమోజోమ్-సమస్యలను నమోదు చేయవు. డౌన్ సిండ్రోమ్ ఉన్న రెండవ శిశువుకు ప్రసవించే అవకాశం ఇప్పటికే ఒక బిడ్డను కలిగి ఉన్నట్లయితే పెరిగే అవకాశముంది. అయితే, 40 ఏళ్ల తర్వాత ప్రసవ సమయంలో స్త్రీల వయస్సు, డౌన్ సిండ్రోమ్ పునరావృత సంభావ్యతను నిర్ణయిస్తుంది. చాలా మంది డౌన్ సిండ్రోమ్‌తో పుట్టిన పిల్లలు 35 ఏళ్లలోపు తల్లులకు జన్మిస్తారు. ఎందుకంటే, 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న స్త్రీలు 35 ఏళ్లు పైబడిన మహిళల కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటమే దీనికి కారణం.

    గర్భస్రావం కాగల ప్రమాదం (Risk of Miscarriage in Telugu)

    పరిశోధనల ప్రకారం, పెద్ద వయసులోని తల్లులకు గర్భస్రావమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావం అయ్యే మహిళలందరిలో, అందులో సగం గర్భస్రావాలకీ పుట్టబోయే బిడ్డలో క్రోమోజోమ్ సమస్యలే కారణమవుతాయి. తల్లి వయస్సు క్రోమోజోమ్ సమస్యల అవకాశాన్ని పెంచుతుంది. గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి.

    వైద్యులతో కలిసి పనిచేయడం (Working with a Healthcare Provider)

    30 ఏళ్ల తర్వాత గర్భధారణలో సంభవించే సమస్యలను నివారించడానికి, ఒకవేళ కాబోయే తల్లికి 30 ఏళ్లు పైబడినట్లయితే, వైద్యులతో వారి ఆరోగ్యం గురించి చర్చించడం మంచిది. ఇది కాబోయే తల్లికి ఇంకా పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం చేసే వైద్యపరమైన సన్నాహాల గురించి చర్చించడంలో సహాయపడుతుంది. అటువంటి సందర్భాలలో జన్యు సలహాదారు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. గర్భధారణలో సంభవించే అవకాశమున్న ప్రమాదాలు మరియు శిశువు పుట్టకముందే జన్యుపరమైన సమస్యలను గుర్తించగల కొన్ని రకాల పరీక్షల రకాలు ఉన్నాయి, అందువల్ల వారు క్రోమోజోమ్ పరీక్షల ఫలితాలను బిడ్డ పుట్టకముందే పూర్తిగా వివరించగలరు. క్రోమోజోమ్ సమస్యలు మరియు ఇతర శరీర సంబంధ జనన రుగ్మతలు ప్రినేటల్ టెస్టింగ్ సహాయంతో నిర్ధారణ చేయబడతాయి లేదా కనుగొనబడతాయి. అలాంటి పరీక్షలలో ఇవి ఉండవచ్చు -

    • రక్త పరీక్ష.
    • అల్ట్రాసౌండ్: ఈ ఇమేజింగ్ విధానంలో, శిశువు అవయవాలు ఇంకా ఇతర నిర్మాణాలను పరిశీలించడానికి ధ్వని తరంగాలు ఉపయోగించబడతాయి.
    • నమూనా కోరియోనిక్ విల్లస్ (CVS): ఈ పరీక్ష కోసం నవజాత శిశువు చుట్టూ ఉన్న కణజాలాల నమూనాను ఉపయోగించి పరీక్షలు చేస్తారు.
    • అమ్నియోసెంటెసిస్: ఈ పరీక్ష కోసం ఉమ్మనీరు నమూనా ఉపయోగించబడుతుంది.
    • పిండకణాల నుండి DNA వేరుచేయబడుతుంది: ఈ పరీక్ష తల్లి రక్తంలో క్రోమోజోమ్ సమస్యలను అన్వేషిస్తుంది.

    ఉత్తమ ప్రినేటల్ కేర్ (జనన పూర్వ సంరక్షణ) కోసం ఎలా సిద్ధపడాలి? (How to Prepare for Quality Prenatal Care?)

    స్త్రీలకు 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల కొన్ని సమస్యలు ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ 35 ఏళ్లు పైబడిన మహిళలు కూడా గర్భం దాల్చి చక్కటి బిడ్డను ప్రసవించే అవకాశాలున్నాయి. నేటి వైద్య సంరక్షణలో మెరుగుదలల కారణంగా తల్లి ఇంకా బిడ్డ ఎదుర్కొనే అనేక ప్రమాదాలను నివారించడమే కాకుండా చికిత్స కూడా చేయవచ్చు. ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి ముందస్తుగా ఇంకా నిరంతర ప్రినేటల్ కేర్ (జనన పూర్వ సంరక్షణ) అవసరం. కింది కారణాల వల్ల ప్రినేటల్ కేర్ ముఖ్యమైనది.

    • గర్భధారణకు ముందు ఇంకా గర్భదారణ సమయంలో ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడం.
    • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇంకా తేలికపాటి వ్యాయామం చేయడం.
    • మద్యం ఇంకా సిగరెట్లకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి.
    • పుట్టుకతో వచ్చే అవకాశమున్న లోపాలను, Tale 400 mcg ఫోలిక్ యాసిడ్ ప్రతిరోజూ గర్భధారణకు ముందు ఇంకా గర్భధారణ సమయంలో తీసుకోవడం వల్ల నివారించవచ్చు.
    • ప్రీఎక్లంప్సియా ప్రమాదాన్ని తగ్గించడానికి టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న మహిళలు మొదటి త్రైమాసికం చివరిలో తక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకోవాలి.

    మహిళలు 35 ఏళ్ల తర్వాత తల్లులు కావాలనుకొంటే, వయసు మీరిన తరువాత అవకాశమున్న గర్భధారణకు సంబంధించిన ప్రమాదాలు మరియు సమస్యలను అర్థం చేసుకోవడానికి వయస్సు చార్ట్ ప్రకారం గర్భధారణ సమస్యలను తెలుసుకొనేందుకు తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాలి. తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభవం. కాని 30 వయసు దాటిన తర్వాత గర్భధారణ సమస్యలు మరియు ప్రయోజనాల అవగాహన తర్వాత గర్భధారణ గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం, దానితో గర్భధారణ ఒక ఆనందకరమైన అనుభవమే కాక ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది.

    Tags:

    Pregnancy After 30 in telugu, Pregnancy After 30 benefits in telusu, Pregnancy After 30 risks in telugu, Can I get Pregnancy After 30 , What will happen if i get Pregnancy After 30 in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.