hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Maternity Fashion arrow
  • ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు? (When to Start Wearing Maternity Bra During Pregnancy in Telugu?) arrow

In this Article

    ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు? (When to Start Wearing Maternity Bra During Pregnancy in Telugu?)

    Maternity Fashion

    ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు? (When to Start Wearing Maternity Bra During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రతి స్త్రీకి తన ప్రెగ్నెన్సీ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. నిజానికి, ప్రెగ్నెన్సీ సమయంలో, మీ ఛాతీ పరిమాణం మరియు ఆకారంలో మార్పు ఉంటుందని మీరు గ్రహించవచ్చు. ఎందుకంటే మీ క్షీర గ్రంధులు మీ బిడ్డ రాక కోసం సిద్ధమవుతున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో, మీ రొమ్ములు ఊహించని విధంగా పరిమాణంలో పెరగవచ్చు, బహుశా దాదాపుగా నాలుగు కప్పుల పరిమాణంలో పెద్దవి కావచ్చు. చివరికి, మీరు కొత్త లైట్లీ ప్యాడెడ్ నర్సింగ్ బ్రా కొనడం చాలా అవసరంగా మారిపోవచ్చు.

    మీరు మీ మెటర్నిటీ బ్రా వేసుకోవడం ఎప్పుడు ప్రారంభించవచ్చు? (When to Start Wearing Maternity Bra During Pregnancy in Telugu?)

    కాబట్టి, ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం మొదలుపెట్టడానికి సరైన సమయం ఎప్పుడు అని.క్లుప్తంగా, సమాధానం ఏమిటంటే- మీ రొమ్ముల పరిమాణం పెరగడాన్ని మీరు గమనించిన క్షణం. మెటర్నిటీ బ్రాలు మీ ఛాతీ భాగాన్ని ఎటువంటి పరిమితి లేకుండా విస్తరించేలా సహాయపడతాయి. వాస్తవానికి, మీకు సౌకర్యంగా ఉండటం చాలా అవసరం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో. మీరు మొదటిసారి తల్లి అవుతున్నట్లయితే, ఈ దశలో మీ శరీరంలో జరిగే ప్రస్తుత మార్పుల గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుస్తకాలను చదవడానికి ప్రాముఖ్యతనివ్వండి. అంతే కాకుండా, మీ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మీ వైద్యుడిని కూడా సంప్రదించవచ్చు!

    ఎవరైనా ప్రెగ్నెన్సీలో తేలికగా ఉండే మెత్తని వైర్‌ఫ్రీ నర్సింగ్ బ్రాను ధరించవచ్చు. అంతే కాకుండా, ఈ బ్రా మీ ఛాతీ కణజాలంపై ఎటువంటి భారాన్ని కలిగించదు, అందువల్ల సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని సిఫార్సు చేస్తారు. తల్లి పాలిచ్చే సమయం వచ్చినప్పుడు, మీరు నర్సింగ్ బ్రా వేసుకోవడం మంచిది.

    మీరు మొదట్లో ఎన్ని మెటర్నిటీ బ్రాలు కొనాలి? (How Many Maternity Bra Need to Buy?)

    మీరు ఉత్తమమైన లైట్లీ ప్యాడెడ్ నర్సింగ్ బ్రాను కొనాలని ప్లాన్ చేస్తుంటే, సాధారణంగా రెండు నుండి మూడు మెటర్నిటీ బ్రాలను కొనడం ఒక అద్భుతమైన ఆలోచన. ప్రారంభ దశలో, ఊహించని విధంగా మీరు పాలు కారే సమస్యను ఎదుర్కోవచ్చు. అందువల్ల, మీరు ఊహించిన దానికంటే చాలా తరచుగా బ్రా మార్చవలసిరావచ్చు.

    మీ మెటర్నిటీ బ్రాలో నర్సింగ్ క్లిప్‌లు ఉంటే, అది పూర్తిగా మంచిది! కొన్నిసార్లు, ఈ క్లిప్‌లు గమనించదగినవి కావు. ఇవి మీ బ్రా మాదిరిగానే ఉంటాయి. నర్సింగ్ క్లిప్‌లతో సంబంధం లేకుండా, సౌకర్యవంతమైన,ఎక్కువ అనువైన, సపోర్టివ్, మరియు మీ చర్మాన్ని ఇబ్బంది పెట్టని తేలికపాటి ప్యాడెడ్ బ్రా ఉండటం చాలా ముఖ్యం. అందువలన, మాస్టిటిస్ వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ లేదా తల్లి పాలిచ్చే సమయంలో సరైన సైజు మరియు ఖచ్చితంగా ఫిట్ అయ్యే మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా పొందడానికి అనుసరించాల్సిన టాప్ 5 టిప్స్

    ప్రెగ్నెన్సీ సమయంలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం మానేయడం సరైనదేనా? (Is it Correct to Stop Wearing Maternity Bra During Pregnancy in Telugu?)

    మీరు బ్రా వేసుకోకపోతే, ముఖ్యంగా మీ ప్రెగ్నెన్సీ దశలో, మీ భారీ రొమ్ముల కారణంగా మీకు వెన్నునొప్పి రావచ్చు. చివరికి, మీ శిశువు రాక కోసం సిద్ధం కావడానికి మీ పక్కటెముకలు విస్తరించవలసి వస్తుంది.

    మీ గర్భధారణ యొక్క పూర్తి దశలో మీరు మీ మెటర్నిటీ బ్రాను ధరించడాన్ని మానేయకుడదని సిఫార్సు చేస్తారు. మీరు దాన్ని దాటవేస్తే, మీ డెలివరీ తర్వాత వెంటనే మీ ఛాతి కుంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, తేలికగా లైట్లీ ప్యాడెడ్ వైర్‌లెస్ బ్రాను ఎంచుకోండి, అది చాలా సౌకర్యవంతంగా ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఏ సైజ్‌ బ్రా కొనాలో మీకు తెలియకుంటే, మీరు ఈ మార్గదర్శకాలను అనుసరించవచ్చు. ముందుగా, మీ ఒరిజినల్ కంటే కనీసం ఒక కప్పు పరిమాణం పెద్దగా ఉండే మెటర్నిటీ బ్రాను కొనుక్కోవడం మంచిది. అంటే, మీ సైజు 32C అయితే, మీరు స్టార్టర్‌గా 34Dని తీసుకోవచ్చు. మీ రొమ్ముల పరిమాణం పెరిగేకొద్దీ, మీ శిశువు రాక కోసం సిద్ధం కావడానికి కావలసినంత స్థలం ఉంటుంది.

    ముగింపు (Conclusion)

    పూర్తిగా కవర్ చేసే తేలికపాటి ప్యాడెడ్ బ్రా ధరించవలసి వచ్చినప్పుడు, ఇదే సరైన సమయం అంటూ ఏమీ ఉండదు. మీకు ఎప్పుడు కావాలని అనిపిస్తే అప్పుడు మెటర్నిటీ బ్రాకి మారడం మీ నిర్ణయం. అయితే, సాధారణంగా మీ రెండవ త్రైమాసికం మొదలైనప్పుడు మెటర్నిటీ బ్రా కొనడం మంచిదని సిఫార్సు చేస్తారు. మీ మొదటి త్రైమాసికంలో, మీరు రెండు నుండి మూడు మెటర్నిటీ బ్రాలను కొనవచ్చు, ఎందుకంటే ఈ దశలో, మీ రొమ్ములు బరువుగా మారడం లేదా మీ ప్రస్తుత బ్రా కాస్త బిగుతుగా మారడం వంటివి మీరు గ్రహించవచ్చు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.