
సారాంశం
భారతీయ వివాహలు కలర్ఫుల్గా ఉండి, సంతోషంతో నిండి ఉంటాయి. మిమ్మల్ని ఒకరు పెళ్లికి ఆహ్వానిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఆ సమయంలో పెళ్లికి ఎటువంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలని మీరు ఆశ్చర్యపోవచ్చు. మరీ ముఖ్యంగా మీరు గర్భవతి అయితే ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తారు. ఈ రోజుల్లో పాశ్చాత్య వివాహ వస్త్రాలు చాలా సాధారణంగా మారిపోయినప్పటికీ.. భారతీయ వివాహాల్లో మాత్రం వస్త్రాలు ఇంకా ఫార్మల్‌గానే ఉన్నాయి. పెళ్లికి ఏ దుస్తులు ధరించాలని విషయంలో క్లారిటీ లేకపోతే.. మీరు ఏమీ చింతించకండి. భారతీయ పెళ్లిలో నిండు గర్భవతులు అయిన అతిథులు ఉన్నపుడు ఏమి ధరించాలో మేము మీకు ఈ బ్లాగ్‌లో వివరిస్తాం. సాంప్రదాయ చీరల నుంచి ఫ్లోవీ (గౌనులా టాప్ టూ బాటమ్ వరకు ఉండేది) వరకు ఏది ధరిస్తే ఎలా ఉంటుందో మేము మీకు వివరిస్తాం.
భారతీయ వివాహ ప్రెగ్నెన్సీ డ్రెసెస్ విషయంలో మీరు గర్తుకు ఉంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో మొదటిది కంఫర్ట్. మీరు కంఫర్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. మీరు చాలా సేపు నిలబడి ఉండే మరియు నడిచే అవకాశం ఉంది కాబట్టి మీ పాదాలకు ఎటువంటి హాని కలిగించని షూస్ ధరించండి.
దుస్తుల విషయానికొస్తే స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన వాటిని కనుక్కోవడం చాలా ముఖ్యం. ఫ్లోవీ (లూజ్‌గా ఉండి కింది నుంచి పైదాకా ఉండేది) లేదా ట్యూనిక్ (మోకాళ్ల వరకు ఉండే ఒక రకమైన టాప్) ఉత్తమ ఎంపికలు. మీరు సులభంగా చుట్టూ తిరిగేందుకు ఇది అనుమతిస్తుంది. మరియు శరీరానికి అతుక్కోదు.
చివరగా.. చెప్పొచ్చేదేంటంటే మీరు ధరించే యాక్సెసరీస్ (ఉపకరణాలు) గురించి మర్చిపోవద్దు. ఒక సింపుల్ నెక్లెస్, ఒక జత చెవి రింగులు మీ రూపానికి అదనపు ఆకర్షణను అందజేస్తాయి. మరియు మీ బేబీ బంప్ ఎక్కువగా కనిపిస్తోందని మీరు ఆందోళన చెందితే నడుము చుట్టూ దుప్పట్టా (స్కార్ఫ్) ధరించండి. ఇది మీ నడుము మడతలను ఇతరులకు చూపించేందుకు అనుమతించడంతో పాటుగా.. మీకు తక్కువ పొట్ట ఉందని ఇతరులకు భ్రమ కలిగేలా చేస్తుంది.
భారతీయ వివాహాల విషయానికి వస్తే.. మీరు గర్భవతిగా ఉన్నపుడు ధరించగలిగే వివిధ రకాల దుస్తులు ఇక్కడ ఉన్నాయి. మీరు గర్భంతో ఉన్నపుడు ఎత్నిక్ (సాంప్రదాయ దుస్తులు) వేర్ ధరించాలని అనుకుంటే మీరు చీరను ఎంచుకోవచ్చు. చీరలు చాలా గొప్ప ఆప్షన్. ఎందుకంటే ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మరియు మీ బేబీ బంప్‌ను చూపేందుకు అనుమతినిస్తాయి. మీరు మరింత మోడ్రన్‌గా కనిపించాలని అనుకుంటే మీరు లెహంగాను ట్రై చేయొచ్చు. లెహంగాలు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మరియు డిఫరెంట్ స్టైల్స్‌లో మీకు లభిస్తాయి. మీకు సౌకర్యవంతంగా అనిపిస్తే మీరు వెస్టర్న్ (పాశ్చాత్య) దుస్తులను కూడా ధరించొచ్చు.
అనార్కలీ సూట్స్ అనేవి ఎంతో ప్రసిద్ధి పొందిన గర్భవతుల పెళ్లి దుస్తులు. ఈ భారతీయ సాంప్రదాయ దుస్తులలో పొడవైన ఫిట్టెడ్ కోట్, వెడల్పు స్లీవ్లతో కూడిన భారీ స్కర్ట్ ఉంటుంది. ఇది చూసేందుకు చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. మీరు ఈ దుస్తులను ధరిస్తే రాణిలా ఉంటారు. అంతే కాకుండా అనార్కలీ సూట్ యొక్క అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ మరియు ఆకర్షణీయమైన రంగుల వలన ఏ గర్భవతి అయినా చాలా అందంగా రాణిలా కనిపిస్తుంది.
భారతీయ వివాహాలకు హాజరయ్యే గర్భిణీలకు మెటర్నటీ కఫ్తాన్లు తప్పనిసరిగా ఉండాలి. అవి వదులుగా సౌకర్యవంతంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు పెళ్లి దుస్తుల వలే ఉంటాయి. అంతే కాకుండా వారు స్టైలిష్‌గా కనిపిస్తారు. ఏ సందర్భానికైనా పర్ఫెక్ట్గా సూటయ్యేలా డ్రెస్ అప్ లేదా డ్రెస్ డౌన్ చేసుకోవచ్చు. మీరు సంప్రదాయ కఫ్తాన్ కోసం వెతుకుతున్నా లేదా మోడ్రన్ స్టైల్ కఫ్తాన్ కోసం వెతుకుతున్నా కానీ మీకు సరిగ్గా సూటయ్యేది తప్పనిసరిగా ఉంటుంది.
మీరు నిండు గర్భిణీగా ఉండి.. భారతీయ వివాహానికి హాజరవుతూ ఉంటే.. లెహంగాతో కూడిన మెటర్నటీ కుర్తీ సూట్ ఒక గొప్ప ఎంపిక. ఇది మిమ్మల్ని స్టైలిష్‌గా చూపించడంతో పాటుగా.. సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఈ కుర్తీ టాప్ పెరుగుతున్న మీ పొట్టకు కవరేజీని అందిస్తుంది. లెహంగా స్కర్ట్ మీరు స్వేచ్ఛగా కదిలేందుకు అనుమతిస్తుంది. మీకు ఈ డ్రెస్ మీద నగలు మరియు దుప్పట్టా (స్కార్ఫ్) కూడా ధరించొచ్చు.
సల్వార్ లేదా షెరారాతో కూడిన మెటర్నటీ కుర్తీని ధరించడం భారతీయ వివాహాల్లో గొప్ప ఎంపిక. కుర్తీలు చాలా వదులుగా ఉంటాయి. కావున మీ బేబీ బంప్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంతే కాకుండా సల్వార్ మరియు షెరారాలు ఇండియాలో ధరించే సాంప్రదాయ ప్యాంట్లు. ఈ దుస్తులు ధరిస్తే మీరు స్టైలిష్‌గా కనిపిస్తూనే చాలా సౌకర్యంగా మరియు చల్లగా ఉంటారు.
మీరు వధువు కాకపోతే పెళ్లిలో గర్భవతులు ధరించే వెడ్డింగ్ డ్రెస్‌లకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చీరలో సౌకర్యవంతంగా ఉంటే మీరు దానికోసం వెళ్లండి. లేకపోతే అందమైన లెహంగాలు మరియు కుర్తాలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. మీకు మరింత మోడ్రన్ లుక్‌లో కావాలని అనుకుంటే ఎంబ్రాయిడరీ, పూసలతో చేసిన మ్యాక్సీ మెటర్నటీ డ్రెస్ కూడా బాగానే ఉంటుంది. అదనంగా మీరు కంఫర్ట్ కోసం వీటిని మెటర్నటీ లెగ్గింగ్స్‌తో జత చేయవచ్చు. యాక్సెసరీస్ గురించి మర్చిపోవద్దు. మీరు ఇన్నాళ్లు దాచిపెట్టిన గాజులు మరియు చెవిదుద్దులను ప్రదర్శించేందుకు గర్భం సరైన సమయం.
భారతీయ వివాహాల కోసం పరిగణించాల్సిన గర్భధారణ దుస్తుల విషయానికొస్తే పరిగణించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు సాంప్రదాయబద్ధంగా చీర లేదా లెహంగాను ధరించాలని అనుకుంటే.. అది వదులుగా మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. మీరు మెటర్నటీ సారీని కూడా ధరించొచ్చు. ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటుంది. పొట్టమీద కప్పబడి ఉంటుంది. మీరు లెహంగాను ధరించాలని నిర్ణయించుకుంటే.. చోలీ (టాప్) మీకు సరిగ్గా సరిపోయేలా చూసుకోండి. అదనపు కవరేజ్ కోసం మీరు మీ పొట్ట మీద దుప్పట్టా (స్కార్ఫ్) కూడా ధరించొచ్చు.
భారతీయ వివాహాలు ఒక అందమైన పండుగ వలే ఉంటాయి. మీరు నిండు గర్భిణీ అయి భారతీయ వివాహానికి ఆహ్వానించబడితే మీకు అభినందనలు. వేడుకల సమయంలో కంఫర్ట్‌గా ఉంటూనే అందంగా కనిపించేందుకు పైన కొన్ని స్టైల్ చిట్కాలు ఉన్నాయి. భారతీయ వివాహాలు రంగుల వేడుకలా ఉంటాయి. కాబట్టి బోల్డ్‌గా ఉండే రంగులు స్వీకరించేందుకు వెనకడుగు వేయకండి. ఇక్కడ సౌలభ్యం కీలకం కాబట్టి మిమ్మల్ని చల్లగా ఉంచే మరియు మీకు చికాకు కలిగించని బట్టలను ఎంచుకోండి. ఈ విషయాలను మనసులో ఉంచుకుంటే మీరు అందంగా కనిపించడంతో పాటుగా వేడుకను కూడా ఆనందిస్తారు.




This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |