


Pregnancy Journey
3 November 2023 న నవీకరించబడింది
మీరు ఇటీవల అసురక్షిత శృంగారంలో పాల్గొన్నారా? మీరు ఉపయోగించిన కండోమ్ పనిచేయకపోవచ్చు లేదా మీరు మార్నింగ్ ఆఫ్టర్ పిల్ (అత్యవసర గర్భ నిరోధక మాత్ర) తీసుకోవడం మర్చిపోవచ్చు. మీరు శృంగారం తర్వాత ప్రెగ్నెన్సీని ఎలా నిరోధించాలో ఇంటర్నెట్‌లో వెతుకుతుంటే.. భయపడకుండా నిశ్చింతగా ఉండండి. మీరు సరైన ప్రదేశంలోనే ఉన్నారు.
ముందుగా, అసురక్షిత శృంగారం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది శృంగారానికి ముందు, శృంగారం సమయంలో లేదా ఆ తర్వాత ఎలాంటి గర్భనిరోధకాలను వాడకుండా లైంగిక చర్యలో పాల్గొనడం. రుతుచక్రం రోజుతో సంబంధం లేకుండా, స్ఖలనం జరిగిందా లేదా అనేదాంతో సంబంధం లేకుండా, అసురక్షిత శృంగారం గర్భధారణకు దారి తీస్తుంది.
వాస్తవానికి, ఎవరూ అవాంఛిత గర్భాన్ని ఎదుర్కోవడం సరికాదు. అందుకే అసురక్షిత శృంగారం తర్వాత గర్భం దాల్చకుండా ఎలా ఉండాలో ఈ ఆర్టికల్ చెబుతుంది.
మీరు శృంగారానికి ముందు, ఆ తర్వాత మూత్ర విసర్జన చేయాలి. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే వీర్యం ఆనవాళ్లు లేకుండా చేయడమే కాదు UTI (మూత్రనాళ సంబంధిత వ్యాధులు) సంక్రమించకుండా నిరోధిస్తుంది. శృంగారం తర్వాత వాష్‌రూమ్ వాడిన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రంగా తుడుచుకోవాలనే విషయం గుర్తుంచుకోండి.
శృంగారం తర్వాత అత్యవసర గర్భనిరోధక మాత్ర (దీన్ని 'మార్నింగ్ ఆఫ్టర్' పిల్ లేదా ప్లాన్ బి అని కూడా పిలుస్తారు) తీసుకోవడం కూడా అవాంఛిత గర్భాన్ని నిరోధిస్తుంది. మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే, అసురక్షిత శృంగారంలో పాల్గొన్న 72 గంటల లోపు తీసుకునేలా చూడండి. ఈ సమయం దాటిన తర్వాత తీసుకుంటే పిల్ పూర్తిగా ప్రభావం చూపకపోవచ్చు.
స్పాటింగ్ (స్వల్ప రక్తస్రావం), వికారం, ఒళ్లు నొప్పులు మరియు ఉబ్బరం వంటి తేలికపాటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఇది మీ సాధారణ రుతు చక్రానికి కూడా అంతరాయం కలిగించొచ్చు. మీకు మీ తదుపరి రుతుస్రావం కొంచెం ముందే రావొచ్చు.
అయినప్పటికీ, ఇవి అత్యవసర గర్భనిరోధకాలు మాత్రమే. మీ రెగ్యులర్ గా వాడే గర్భనిరోధక మాత్రల (రోజువారీ తీసుకోవడం కోసం సూచించినవి) స్థానంలో ఉపయోగించొద్దని గుర్తుంచుకోండి.
గర్భాశయ పరికరం అనేది రాగి, ప్లాస్టిక్‌తో తయారైన చిన్న పరికరం. 'T' ఆకారంలో దీన్ని గర్భాశయం లోపల ఉంచుతారు. అవాంఛిత గర్భధారణను నిరోధించడంలో సహాయపడుతుంది. మీరు అసురక్షిత శృంగారం తర్వాత 5 రోజుల వరకు IUDని చొప్పించవచ్చు.
అత్యంత శక్తిమంతమైన గర్భనిరోధక పద్ధతుల్లో ఒకటి IUD. ఒకసారి చొప్పించిన తర్వాత నిరంతర గర్భనిరోధకంగా పనిచేస్తుంటుంది. అంటే మీరు కొంతకాలం వరకు అవాంఛిత గర్భం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే, ఫైబ్రాయిడ్, కాపర్ అలర్జీ, విల్సన్స్ వ్యాధి (ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టడం కష్టం అవుతుంది.) ఉన్న మహిళలకు IUDలు సరిపడవు. IUD మీకు మంచి ఎంపిక అవునో కాదో తెలుసుకునేందుకు మీ వైద్యుడిని సంప్రదించండి.
అవాంఛిత గర్భం అంటే చాలా భయం, ఆందోళన, అలాగే ఒత్తిడి కూడా ఉంటుంది. అందువల్ల, మీరు బాగా ఆలోచించుకోండి. మీ భాగస్వామితో భావోద్వేగాలను పంచుకుని ఆ మూడ్ నుంచి బయటకు రండి. ఈ విషయంలో మీరు ఒంటరి కాదనే విషయం గుర్తుంచుకోండి.
మరోసారి గుర్తుంచుకోవాల్సిన అంశాలు
pregnancy after sex in telugu, Unexpected pregnancy in telugu, Precautions to take before sex in telugu, Preventing pregnancy after sex in telugu.
Also Read In:
English: How To Prevent Pregnancy After Sex
Bengali: How To Prevent Pregnancy After Sex in Bengali
Tamil: How To Prevent Pregnancy After Sex in Tamil
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |