
నిజానికి, ప్రతీ స్త్రీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో తనను తాను విలాసపర్చుకోవడానికి ఇష్టపడుతుంది. అయితే వారికి తాము ఎంచుకుంటున్న బ్యూటీ ట్రీట్మెంట్స్ గురించి అవగాహన ఉండటం అవసరం. ఎందుకంటే అది కడుపులో బిడ్డ ఎదుగుదలపై ప్రతికూలంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో ప్రెగ్నెన్సీ సమయంలో సురక్షితమైన బ్యూటీ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకొని ప్రయత్నించొచ్చు.
మీకు వెన్ను నొప్పిగా ఉన్నప్పుడు మసాజ్ చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. అనేక రకాల మసాజ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా కానీ, ఇలాంటి ట్రీట్‌మెంట్స్ ఎంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒకవేళ సరైన మసాజ్ ట్రీట్మెంట్ ఎంచుకోకపోతే మీపైన లేదా మీ బిడ్డపైన ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో సురక్షితంగా ప్రయత్నించదగ్గ బ్యూటీ ట్రీట్మెంట్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఇది మీకు, మీ బిడ్డకు మంచి ఓదార్పుగా, రిఫ్రెషింగ్ సెషన్‌గా ఉంటుంది. అయితే మ్యానిక్యురిస్ట్‌కు మీరు గర్భవతి అన్న విషయం తప్పనిసరిగా తెలియజేయాలి. ఎందుకంటే శరీరంలోని కొన్ని రిఫ్లెక్సాలజీ పాయింట్స్ ముందస్తు ప్రసవానికి దారితీయొచ్చు. దీంతో పాటు, కొన్ని నెయిల్ పాలిష్‌లు గర్భవతులకు వికారం కలిగించవచ్చు. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు సురక్షితమైన నెయిల్ పెయింట్స్ మాత్రమే ఎంచుకోవాలి.
గర్భవతిగా ఉన్న సమయంలో మీ హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీంతో మీ జుట్టు వేగంగా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. అంతేకాకుండా, వ్యాక్సింగ్ లాంటి సడెన్ షాక్ ట్రీట్‌మెంట్స్‌కు మీ చర్మం సున్నితంగా మారొచ్చు. అయినా, రేజర్లు, ఇతర పరికరాలతో షేవింగ్ కన్నా వ్యాక్సింగ్ సురక్షితమైనదిగా భావిస్తుంటారు. ఎందుకంటే వ్యాక్సింగ్ చేయిస్తే మీకు చర్మం కోసుకోవడం, గాయాలపాలవడం లాంటి సమస్యలు ఉండవు. దీని వల్ల ఇన్ఫెక్షన్లబారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ర్యాషెస్, ఇతర చర్మ సమస్యలు వస్తుంటాయి కాబట్టి మంచి నాణ్యత గల ప్రొడక్ట్స్‌తో ఫేషియల్ ట్రీట్మెంట్ చేయిస్తే మీ చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చెయించాలనుకుంటున్న ట్రీట్మెంట్ గురించి మీకు అవగాహన ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో అరోమాథెరపీ, ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్, కెమికల్ పీల్స్ లాంటివి ఉన్న ఫేషియల్ ట్రీట్మెంట్స్ నివారించడమే మంచిది. అంతేకాకుండా, వేడి స్టోన్స్‌తో చేసే ట్రీట్మెంట్స్‌కి కూడా దూరంగా ఉండాలి.
మీరు హెయిర్ డై చేయించాలనుకుంటున్నారా? అయితే మీ కడుపులో పెరుగుతున్న పిండానికి హాని కలిగించని ప్రొడక్ట్స్ మాత్రమే ఉపయోగించేలా జాగ్రత్తపడాలి. డై ప్రొడక్ట్స్‌లో సాధారణంగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి మీ బిడ్డ ఎదుగుదలకు హానికరంగా మారొచ్చు. చాలామంది ప్రసూతి వైద్యులు మొదటి ట్రైమిస్టర్ తర్వాత జుట్టుకు రంగు వేసుకోవచ్చని సూచిస్తుంటారు. కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ ఉపయోగించడం కన్నా, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మంచిది.
టాటూ వేయించుకోవడం బిడ్డకు లేదా తల్లికి ఎలాంటి ప్రమాదం కాకపోవచ్చు కానీ, అదనపు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అపరిశుభ్రంగా ఉండే టాటూ నీడిల్ వాడటం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ బీ లాంటి పలురకాల ఇన్ఫెక్షన్లు సులువుగా సోకే ప్రమాదాలు ఎక్కువ. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఈ బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోకపోవడమే మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో మసాజ్ మంచి రిలాక్సింగ్ ఆప్షన్ కావచ్చు. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ విషయంలో ముందుకు వెళ్లడం మంచిదే. మసాజ్‌తో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్ లాంటివాటి నుంచి రిలీఫ్ ఉంటుంది. అయితే మీరు గర్భవతి అన్న విషయం మసాజ్ చేసేవాళ్లకు చెప్పాలి. ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలోని కొన్ని భాగాలపై ఒత్తిడి పడకూడదు. కాబట్టి ఆ భాగాలపై ఒత్తిడి కలగకుండా మసాజ్ చేయించుకోవచ్చు. మసాజ్ సెషన్స్ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవడానికి, రిలాక్స్‌గా ఉండేందుకు బెల్లీ సపోర్ట్స్ అందిస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రీనేటల్ మసాజ్: అర్థం, ప్రయోజనాలు
కొంతవరకు ఈ పద్ధతులు సురక్షితం అయినప్పటికీ, ప్రెగ్నెన్సీ సమయంలో టీత్ వైటెనింగ్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు. దానికి బదులుగా సహజంగా, హోమ్ మేడ్ ట్రీట్మెంట్స్ ఫాలో కావొచ్చు. బేకింగ్ సోడా, స్ట్రాబెర్రీస్ లాంటి వాటిని మీ పళ్లు మెరిసేలా చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. టీత్ వైటెనింగ్‌తో పాటు ఇతర దంత చికిత్సలు కూడా చేయించుకోకపోవడం మంచిది. ఒకవేళ మీకు తెలియకపోతే, ఈ సమయంలో సురక్షితమైన చికిత్సల కోసం డెంటిస్ట్‌ను సంప్రదించాలి.
ఆవిరి స్నానం మంచిదే అయినా, మీరు ఎక్కువ సేపు గడపకూడదు. ఎందుకంటే అసాధారణంగా ఉండే అధిక ఉష్ణోగ్రతలు మీ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపించి, పుట్టుకతో వచ్చే వైకల్యాలకు కారణం అవుతుంది. దీంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు హైపర్‌థెర్మియాకు కారణం అవుతుంది. అందుకే స్టీమ్ రూమ్స్, జాసుజీ, హాట్ టబ్స్ లాంటివాటిని ప్రెగ్నెన్సీ సమయంలో నివారించాలి.
మీరు రెడీ అవడానికి ఎక్కువ సమయం పట్టకుండా ఉండేలా హెయిర్ కట్ చేయించుకోవచ్చు. హెయిర్ కలరింగ్, ఐరనింగ్, కర్లింగ్ లాంటివాటిని ప్రెగ్నెన్సీ సమయంలో చేయించుకోవచ్చు. అయితే ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నింటినీ మొదటి ట్రైమిస్టర్ తర్వాతే చేయించుకోవడం సురక్షితం.
ప్రెగ్నెన్సీ బ్యూటీ ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ సమయంలో బాగా నిద్రపోవడం అవసరం. ఇందుకోసం కావాల్సిన ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. రాత్రి సమయంలో మంచిగా నిద్రపోతే తర్వాతి రోజు రిఫ్రెష్‌గా, యాక్టీవ్‌గా ఉంటారు. దీంతో పాటు మీ లోపలి సౌందర్యం కూడా పెరుగుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో పైన వెల్లడించిన బ్యూటీ ట్రీట్మెంట్స్ ఫాలో కావొచ్చు. మీ జీవితంలో ఉత్తేజకరమైన కాలంలో మిమ్మల్ని మీరు ఉల్లాసపర్చుకునే సెషన్ ను ఎంచుకోవచ్చు. అయితే మీరు ప్రయత్నించాలనుకునే పద్ధతుల గురించి వైద్యులకు చెప్పి వారి సలహా తీసుకోవడం అవసరం. దీంతో పాటు అన్ని శరీరాలకు కొన్ని మెడికేషన్స్, బ్యూటీ ట్రీట్మెంట్స్ సరిపడకపోవచ్చు. అందుకే, మీరు ఎంచుకోవాలనుకుంటున్న బ్యూటీ ట్రీట్మెంట్స్, పద్ధతుల గురించి డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం!
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |