hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • శిశువు మెదడు అభివృద్ధి కోసం ఉత్తమ ఆహారాలు (Best Foods for Baby Brain Development in Telugu) arrow

In this Article

    శిశువు మెదడు అభివృద్ధి కోసం ఉత్తమ ఆహారాలు (Best Foods for Baby Brain Development in Telugu)

    Pregnancy Best Foods

    శిశువు మెదడు అభివృద్ధి కోసం ఉత్తమ ఆహారాలు (Best Foods for Baby Brain Development in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    చాలా మంది గర్భవతులు(తల్లి కావాలని ఆశించేవారు) తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం సహాయపడే ఆహారాల కోసం వెతుకుతున్నారు. శిశువు మొత్తం పెరుగుదల కోసం ఉద్దేశించబడిన వివిధ రకాల సప్లిమెంట్లు, మరియు విటమిన్లను కూడా వైద్యులు సిఫారసు చేస్తారు. ఏదేమైనప్పటికీ తల్లి కావాలని ఆశించే వారు తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం ఎటువంటి ఆహారం ఉపయోగపడుతుందనే విషయాన్ని డైట్ మార్చే ముందే తెలుసుకోవడం ఉత్తమమైనది.

    గర్భధారణ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? (What Goes on in the Brain During Pregnancy in Telugu?)

    శిశువు మెదడు అభివృద్ధి అనేది గర్భం దాల్చినప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది గర్భం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. జన్యువులు, పోషకాలు అనేవి శిశువు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. శిశువు మెదడు అభివృద్ధి అనేది సాధారణంగా గర్భధారణ 22వ వారంలో గమనించవచ్చు. గర్భధారణ 25వ వారం నాటికి మెదడు అనేది కాఫీ బీన్ పరిమాణంలోకి, గర్భధారణ 40వ వారం నాటికి మెదడు అనేది వాల్​నట్ పరిమాణంలోకి చేరుకుంటుంది.

    అధిక ప్రమాదం కలిగించే కారకాలు (Key Risk Factors in Telugu)

    ఈ కింద పేర్కొన్న కారకాలు శిశువు మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అవేంటంటే..

    • ధూమపానం
    • ఒత్తిడి
    • అధిక మొత్తంలో సీసం
    • సెరిబ్రల్ మలేరియా మరియు HIV వంటి తీవ్రమైన వ్యాధులు

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి?

    పోషకాహార ప్రమాద కారకాలు (Nutritional Risk Factors in Telugu)

    గర్భధారణ సమయంలో శిశువు మెదడుని ఎలా అభివృద్ధి పరచాలనే విషయంలో గర్భవతులు తరచుగా ఆశ్చర్యపోతారు. సరైన పోషకాహారం అనేది శిశువు మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో వారు సరిగ్గా అర్థం చేసుకోలేరు. గర్భవతులు శిశువు మొత్తం శరీర అభివృద్ధి కోసం సరైన సప్లిమెంట్లు మరియు పోషకాలు ఎక్కువ మోతాదులో ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

    మీరు గర్భవతిగా ఉన్నపుడు మీ శిశువు మెదడు అభివృద్ధికి ఊతం ఇచ్చే ఆహారాలు (Foods to Boost Your Baby's Brain Development While Pregnant in Telugu)

    శిశువు మెదడు అభివృద్ధికి పోషకాలు అవసరమని అర్థం చేసుకున్న తర్వాత ఎక్కువగా అడిగే ప్రశ్న ఏమిటంటే.. — నా బిడ్డ మెదడు అభివృద్ధి కోసం నేను ఏమి తినాలి?

    గర్భధారణ సమయంలో మెదడు అభివృద్ధి చెందేందుకు ఉత్తమ ఆహారాలు

    • తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాల వంటి సూక్ష్మపోషకాలు
    • సూక్ష్మపోషకాలు లేదా సప్లిమెంట్లు

    గర్భధారణ సమయంలో శిశువు మెదడుని అభివృద్ధి చేసే కొన్ని ఆహారాలు కింద ఇవ్వబడ్డాయి.

    1. రోజువారీ ప్రినేటల్ విటమిన్లను పండ్లు మరియు కూరగాయలతో కలిపి తీసుకోవాలి (Daily Prenatal Vitamins Should Be Taken Along with Fruits and Vegetables)

    గర్భిణీ స్త్రీలు వారి ప్రీనేటల్ విటమిన్లను వైద్యుడు సూచించిన విధంగా తీసుకోవాలి. సాధారణంగా విటమిన్లు ఉండే తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోమని సూచిస్తారు. ఈ విటమిన్లు అనేవి మనం తీసుకునే ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని ఆశించే తల్లులు అర్థం చేసుకునేందుకు ఈ సలహా సహాయపడుతుంది.

    2. Omega-3 లను పొందండి (Obtain Omega-3s)

    శిశువు మెదడు మరియు నాడీ వ్యవస్థ, కళ్లు సరైన విధంగా అభివృద్ధి చెందేందుకు ఒమేగా-3 కొవ్వుల ఆమ్లాలు అత్యంత అవసరం. ఇందుకోసం ప్రతిరోజు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో ఒక మూలకంగా ఉండే DHAను 200 mg తీసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తారు. ఒమేగా 3 అధికంగా ఉండే కొన్ని రకాల సహజ ఆహారాలు

    • అవిసె మరియు చియా గింజలు
    • బలవర్ధకమైన గుడ్లు
    • సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి సముద్ర ఆహారాలు

    3. కోలిన్ (ఒక రకమైన విటమిన్) (Choline)

    శిశువు మెదడు, వెన్నముక, న్యూరోట్రాన్స్​మిటర్స్ అభివృద్ధి చెందేందుకు కోలిన్ చాలా ముఖ్యం. ఇది శిశువులో సరైన విధంగా జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసేందుకు కూడా.. సహాయపడుతుంది. కోలిన్ విటమిన్ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు:

    • సాల్మన్
    • కోడిగుడ్లు
    • ఆలుగడ్డలు, కాలిఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలు
    • క్వినోనా
    • వేరుశనగకాయలు
    • లీన్ బీఫ్ (ప్రాసెస్ చేయబడిన గొడ్డు మాంసం)

    మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు మెదడును అభివృద్ధి చేసే ఆహారాలు ఏవో తెలుసా? ఓ లుక్ వేయండి!

    4. ప్రొటీన్ స్థాయిలను పెంచుకోండి (Increase Protein Levels)

    ప్రొటీన్లలోని అమైనో ఆమ్లాలు కణాల పునరుత్పత్తి మరియు మరమ్మతుకు అవసరం. ఈ ప్రొటీన్లు గర్భధారణ సమయంలో మెదడు కణాల పెరుగుదలకు మరియు మెదడు అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కూడా సహాయపడతాయి.

    గర్భవతులు తినాల్సిన కొన్ని ప్రొటీన్ రిచ్​ ఫుడ్స్..

    • పాలు మరియు గుడ్ల వంటి డెయిరీ ఉత్పత్తులు
    • స్ప్లిట్ బఠానీలు, బీన్స్, మరియు కాయధాన్యాలతో సహా చిక్కుళ్లు
    • తృణధాన్యాలు
    • పౌల్ట్రీ
    • క్యాషూ (జీడిపప్పు), వాల్​నట్స్, వేరుశనగలు, బాదం పప్పులతో కూడిన నట్స్ మరియు సీడ్స్
    • సాల్మన్ మరియు రొయ్యలు

    5. యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants)

    తాజా పండ్లు మరియు కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శిశువు మెదడు కణాలు దెబ్బ తినకుండా ఉండేందుకు ఇవి సహాయం చేస్తాయి. గర్భవతులు రోజుకు కనీసం ఏడు సార్లు తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు:

    • డార్క్ చాక్లెట్
    • స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీల వంటి బెర్రీలు
    • క్యారెట్, స్వ్కాష్ (తీగజాతికి చెందినవి), బ్రోకలీ, దుంపలు, బఠానీలు, బీన్స్ మరియు ఆస్పరాగస్ వంటి కూరగాయలు
    • పాలకూర, క్యాబేజీ వంటి ఆకుకూరలు
    • అవకాడో

    6. ఐరన్ తీసుకోవడాన్ని పెంచండి (Increase Your Iron Intake)

    హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐరన్ సహాయపడుతుంది. ఆక్సిజన్​ను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లేందుకు హిమోగ్లోబిన్ కీలకం. గర్భధారణ సమయంలో శిశువు యొక్క మెదడు అభివృద్ధి ఎక్కువగా ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది. కింద పేర్కొన్న కొన్ని ఆహారాలతో గర్భవతులు ఐరన్ తీసుకునే మొత్తాన్ని పెంచుకోవచ్చు.

    • ఐరన్ ఎక్కువగా ఉండే కార్న్​ఫ్లేక్స్ వంటి ఆహారం
    • Vవైట్ బీన్స్, కిడ్నీ బీన్స్(కిడ్నీల ఆకారంలో ఎరుపు రంగులో ఉండేవి), బఠానీలు, మరియు కాయధాన్యాల వంటి కూరగాయలు
    • ఆప్రికాట్లు, పీచెస్, మరియు ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్
    • పాలకూర మరియు బ్రోకలి వంటి ఆకుకూరలు

    7. అయోడిన్ (Iodine)

    గర్భిణీ స్త్రీ యొక్క థైరాయిడ్ గ్రంథి తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ కావాల్సిన హార్మోన్లను ఉత్పత్తి చేయాలి. గర్భం దాల్చిన 20 వారాల వరకు శిశువుకు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చెందకపోవడమే దీనికి కారణం. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు సప్లిమెంట్లు బిడ్డ మెదడు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. గర్భవతుల కోసం అయోడిన్ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు

    • ట్యూనా (ఒక రకమైన చేప), రొయ్యలు, సీవీడ్ వంటి సముద్ర ఆహారాలు
    • పాలు, చీజ్ (జున్ను), పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు
    • అయోడిన్ ఉన్న ఉప్పు

    8. జింక్ (Zinc)

    శిశువు మెదడు అభివృద్ధి కోసం జింక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మెదడు సెల్స్​ మరియు కణజాలాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కొన్ని జింక్ రిచ్​ ఫుడ్స్.. ఈ ఆహారాలలో జింక్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

    • లీన్ బీఫ్ (ప్రాసెస్ చేసిన గొడ్డు మాంసం) మరియు పౌల్ట్రీ
    • జీడిపప్పు, బాదం, వేరుశనగ వంటి గింజలు
    • కార్న్​ఫ్లేక్స్ మరియు తృణధాన్యాల వంటి బలవర్ధకమైన ఆహారాలు

    9. విటమిన్ B కాంప్లెక్స్ (Vitamin B Complex)

    శిశువు మెదడు పనితీరులో అవసరమైన వివిధ భాగాలను అభివృద్ధి చేయడంలో విటమిన్ B కాంప్లెక్స్ కీలకపాత్రను పోషిస్తుంది. DNA/RNA రిపేర్ మరియు సంశ్లేషణ, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ (అణువులు), మరియు శక్తి ఉత్పత్తి అనేవి సూక్ష్మపోషకాల కోసం అవసరమయ్యే శిశువు మెదడులోని కొన్ని అంశాలు.

    విటమిన్ B కాంప్లెక్స్ ఈ కింది ఆహారాలలో సహజంగా ఉంటుంది.

    • షిటకే పుట్టగొడుగులు, ఆలుగడ్డలు, బ్రోకలీ, మరియు పాలకూర వంటి తాజా కూరగాయలలో..
    • అవకాడో, బొప్పాయి పండు, అరటిపండు వంటి తాజా పండ్లలో
    • బ్రౌన్ రైస్, ఓట్స్, మరియు గోధుమల వంటి తృణధాన్యాలలో
    • చిక్ బఠానీలు, మరియు బీన్స్ వంటి చిక్కుళ్లలో..
    • ట్యూనా మరియు సాల్మన్ వంటి సముద్ర ఆహారాలలో

    చివరగా.. (Conclusion)

    గర్భధారణ సమయంలో తాజాగా ఉన్న బలవర్థకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా మహిళలు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శిశువు మెదడు అభివృద్ధి కొరకు సరైన వ్యాయామం మరియు ఒత్తిడిని నివారించడం కూడా అవసరం.

    Tags:

    Best foods for baby brain development in telugu, Best foods for pregnant ladies in Telugu, What foods pregnants need to eat for baby brain developement in telugu, List of foods for the development of baby brain during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.