This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your ovulation on mylo app

వక్షోజాల చెమట నుంచి ఎలా బయటపడాలి | How to Survive Boob Sweat in Telugu

Women Specific Issues
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
వక్షోజాల చెమట నుంచి ఎలా బయటపడాలి | How to Survive Boob Sweat in Telugu
Read time7 min

చెమట అనేది మానవశరీరం యొక్క అతి ముఖ్యమైన విధుల్లో ఒకటి. ఇది శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసేందుకు సహాయపడుతుంది. అదనంగా చెమట వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వాసన మరియు తేమ అనేవి చెమట వల్ల వస్తాయి. ఇది ప్రజలను చికాకు పెడుతుంది. శరీరంలో చాలా భాగాలు చెమటను ఉత్పత్తి చేసినా కానీ.. వక్షోజాల చెమట అనేది మహిళలను ఎక్కువగా బాధిస్తుంది. ఈ ఆర్టికల్ వక్షోజాల చెమటకు గల కారణాలను మరియు దానిని ఎదుర్కొనే మార్గాలను గురించి వివరిస్తుంది.

రొమ్ము చెమటకు అర్థం (Breast Sweat Meaning in Telugu)

వక్షోజాల కింద చెమట పట్టడాన్ని రొమ్ము చెమట అని అంటారు. సాధారణంగా వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో ఇది జరుగుతుంది. అలాగే వ్యాయామం, మరియు శారీరక కార్యకలాపాల వంటివి కూడా వక్షోజాల చెమటకు కారణం అవుతాయి. ఇతర శరీర భాగాలకు పట్టిన చెమట తరచుగా బట్టల ద్వారా గ్రహించబడుతుంది. లేదా గాలి తగలడం వల్ల ఇది తగ్గిపోతుంది. ఇది చర్మం పొడిగా ఉండేందుకు సహాయపడుతుంది. అయినప్పటికీ స్త్రీలు బ్రాను ధరిస్తారు. అది వక్షోజాలకు పట్టిన చెమటను బట్టలు పీల్చుకునేలా చేస్తుంది లేదా లోపలే చెమట ఎండిపోయేలా చేస్తుంది. అధిక తేమ అనేది అసౌకర్యంగా అనిపిస్తుంది. మరియు తరచూ దద్దుర్లు మరియు ఎరుపునకు దారి తీస్తుంది.

మీ వక్షోజాలకు ఎందుకు చెమట పడుతుంది? (Why do Boobs Sweat in Telugu)

చెమట అనేది చాలా సాధారణ విషయం. మరియు ఇది చాలా అవసరం. ఉక్కపోతగా ఉన్నపుడు శరీరాన్ని చెమట చల్లబరుస్తుంది. వేడిగా ఉన్నపుడు చర్మం ఉపరితలం మీద చెమటను విడుదల చేయమని శరీరం మెదడుకు సంకేతాన్ని పంపుతుంది. తేమ అనేది ఆవిరైపోయిన తర్వాత శరీరం అనేది చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రతను మెయింటేన్ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. తరచూ శరీరంలోని ఇతర భాగాల నుంచి చెమట ఆవిరైపోతుంది. కానీ.. వక్షోజాల వద్ద ఉన్న మడతలు మరియు చీలికల వల్ల అక్కడి చెమట ఆవిరి కాదు. అధికంగా ఉన్న తేమ ఎక్కడికీ వెళ్లదు. స్త్రీలను చెమటతో తడిచిన బ్రాలు వదిలేసేలా చేస్తుంది.

నా రొమ్ముల మధ్య చెమట వాసన రావడానికి ఏదైనా కారణం ఉందా? (What causes my breasts smell like sweat in Telugu)

సాధారణంగా చెమట అనేది వాసన లేకుండా ఉంటుంది. అయితే ఇది చర్మం మీద ఉన్న బ్యాక్టీరియాతో కలిసి వాసనను కలిగిస్తుంది. అందువల్ల చెమట పట్టినపుడు ఎక్కువ ఉపరితల బ్యాక్టీరియా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ వాసన వస్తుంది. వీటిలో గజ్జలు, చంకలు, చనుమొనల చుట్టూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.

నా రొమ్ముల కింద వచ్చే చెమటను ఎలా ఆపగలను? (How Can I Stop the Sweat Under My Breasts in Telugu)

చెమట అనేది మానవ శరీరంలో సహజంగా వచ్చేది. దానిని ఆపడం కుదరదు. మనం ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు ఒకసారి శరీరం గుర్తిస్తే చాలు చెమట రావడం ప్రారంభం అవుతుంది. అయితే జీవనశైలిలో కొన్ని రకాల మార్పుల వల్ల దుర్వాసన వచ్చే వక్షోజాల చెమటను ఆపొచ్చు.

తన రొమ్ముల కింద చెమటను ఎలా ఆపాలో తెలుసుకోవాలనుకే మహిళలకు ఈ కింది చిట్కాలు ఉపయోగపడతాయి.

1. శరీరానికి అతుక్కుని ఉండే షర్టులను ధరించకుండా ఉండడం (Avoiding skin-tight shirts)

స్కిన్ టైట్ దుస్తులు (శరీరానికి అతుక్కుని ఉండే దుస్తులు) లోపలికి గాలిని రానివ్వవు. మీ చర్మం మరియు బట్టల మధ్య చెమట అనేది ఉంటుంది. బయటి గాలి తాకి చెమట తగ్గి శరీరం డ్రైగా ఉండేలా మహిళలు వదులుగా ఉండే దుస్తులను ధరించేందుకు ప్రయత్నించాలి. అంతే కాకుండా వేసవిలో ప్యాడెడ్ బ్రాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి దుర్వాసనతో కూడిన చెమటతో తడిచిన బ్రాలుగా మారి మరింత చికాకు తెప్పిస్తాయి.

2. యాంటీపెర్సిపిరెంట్​ను(చెమట నివారిణి) తెలివిగా వాడండి (Clever use of antiperspirant)

యాంటీపెర్సిపిరెంట్​లు (చెమట నివారిణి) కేవలం చంకలలో ఏర్పడ్డ చెమటను ఎదుర్కొనేందుకు మాత్రమే కాకుండా వక్షోజాల చెమటను ఎదుర్కొనేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి. అధిక చెమటను నివారించేందుకు దుర్వాసన రాకుండా ఉండేందుకు మహిళలు యాంటీపెర్సిపిరెంట్​ (చెమట నివారిణి) ను వక్షోజాలు మరియు చీలిక కింద అప్లై చేయొచ్చు.

3. కాటన్​ ఇన్సర్ట్​లు లేదా ప్యాంటీ లైనర్లను ఉపయోగించడం ద్వారా (Using cotton inserts or panty liners)

మేకప్​ను రిమూవ్ చేసేందుకు వాడే కాటన్ ప్యాడ్లను బ్రాలో అదనపు పొరలు ఏర్పాటు చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఇది మొత్తం చెమటను పీల్చుకోవడంలో సహాయం చేస్తుంది. ఇది మీకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుంది. వక్షోజాల చెమట నుంచి రోజంతా రక్షణ పొందాలని చూస్తున్న మహిళలు బ్రా లోపల ప్యాంటీ లైనర్లను అతికించవచ్చు. ఇది చెమట మరకలు కనిపించకుండా వక్షోజాలు చెమట రహితంగా ఉండేలా చేస్తుంది.

4. వ్యాయామం తర్వాత బ్రా మార్చడం (Changing bra after a workout)

వర్కౌట్ తర్వాత నేరుగా షాపింగ్ లేదా పనికి వెళ్లే మహిళలు ముందుగా బ్రా మార్చుకోవడం మంచిది. చెమట పట్టిన బ్రా మార్చుకుని కొత్తది ధరించడం వల్ల వక్షోజాలు తాజాగా మరియు దద్దుర్లు లేకుండా ఉంటాయి.

5. టాల్కమ్ పౌడర్ మిమ్మల్ని రక్షిస్తుంది (Absorbent talcum powder can be a saviour)

కొన్ని సార్లు సాధారణ నివారణలు ఉత్తమంగా పని చేస్తాయి. చెమట పట్టిన బ్రాలు ధరించిన స్త్రీలు పీల్చుకునే టాల్కమ్ పౌడర్​ వేసుకోవడం వల్ల వారు అసౌకర్యంగా లేకుండా చేసుకోవచ్చు. టాల్క్​లో ఉన్న కార్న్​టార్చ్ అనేది వక్షోజాల చెమటను పీల్చుకోవడం మాత్రమే కాకుండా ఘర్షణను కూడా తగ్గిస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడేందుకు గల అవకాశాలను తగ్గిస్తుంది.

6. స్కిన్ బారియర్స్ క్రీమ్స్ అప్లై చేయడం (Applying skin barrier creams)

దద్దుర్లు వచ్చే అవకాశాన్ని తగ్గించేందుకు స్కిన్ బారియర్ క్రీమ్స్ గొప్ప మార్గం. అధిక వక్షోజాల చెమటను ఎదుర్కొంటున్నమహిళలు వక్షోజాలు మరియు చీలిక కింద ఈ క్రీమ్స్​ను అధిక మొత్తంలో అప్లై చేయవచ్చు. ఇవి చెమటను నిరోధించలేకపోయినా కానీ అధిక చెమట వల్ల వచ్చే దద్దుర్లు మరియు చికాకు లేకుండా చూస్తాయి.

7. అధిక మరియు దుర్వాసనతో కూడిన చెమట ఉత్పత్తిని ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండడం (Avoiding foods that can trigger excess and smelly sweat production)

ఆల్కహాల్ మరియు కెఫిన్ వంటి కొన్ని రకాల పదార్థాలు శరీరంలో ఎక్కువ చెమట ఉత్పత్తికి కారణం అవుతాయి. వక్షోజాల చెమట కారణంగా ఇబ్బంది పడే మహిళలు వారి రోజూవారి ఆహారం నుంచి పైన పేర్కొన్న పదార్థాలను తొలగించాలి.

చాలా సందర్భాలలో వక్షోజాల చెమటను పైన పేర్కొన్న పద్ధతులతో పరిష్కరించవచ్చు. చల్లటి వాతావరణంలో ఉన్న కానీ ఎక్కువ మొత్తంలో చెమట వస్తే అది అంతర్లీనంగా ఉన్న ఏదైనా సమస్యను సూచిస్తుంది. అటువంటి సందర్భాలలో చర్మవ్యాధి నిపుణుడు విషయాలను క్లియర్ చేయడంలో మరియు సందేహాలను తీర్చడంలో సహాయపడతాడు.

References

1. Baker LB. (2019). Physiology of sweat gland function: The roles of sweating and sweat composition in human health. Temperature (Austin).

2. An JK, Woo JJ, Hong YO. (2019). Malignant sweat gland tumor of breast arising in pre-existing benign tumor: A case report. World J Clin Cases.

Tags
What is breast sweat in Telugu, Boob sweating in Telugu, What causes my breasts smell like sweat in Telugu, How to control the boob sweat in Telugu, How to Survive Boob Sweat in English, How to Survive Boob Sweat in Hindi, How to Survive Boob Sweat in Tamil, How to Survive Boob Sweat in Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Dhanlaxmi Rao
Dhanlaxmi Rao

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.